Posts

TIRUPPAVAI-13

Image
   తిరుప్పావై-పాశురం 13    ******************  మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం  విశ్వోప జీవ్యమమృతం మనసా దుహానాం  తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం  సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం."   పూర్వపాశుర ప్రస్తావనము.   **********************  తంగచ్చన్ చెల్వై /ఐశ్వర్య వంతమైన గోపికను ,స్వామి సేవనమునకై సమస్త సంపదలను లెక్కచేయని ఆమె అన్నను,ఆచార్యుల అవ్యాజానుగ్రహమును ,లంకాద్వీప పాలకుని తమో-రజోగుణములను తెలిపిన గోదమ్మ,   ప్రస్తుత పాశుర ప్రాభవము   ****************  ప్రస్తుత పాశురములో మానవ సహజమైన పోటీ ని గోపికలు రామావాతార-శృఈకృష్ణావతార విషయములలో వాదించుకొనుట అను కొత్త ఒరవడిని పరిచయము చేసినది.  అది జ్ఞానముకాదు/అజ్ఞానము కాదు.మిథ్యాజ్ఞానము. పరమాత్మ అవతారముల పరమార్థమును అర్థముచేసుకొనలేకపోవటము.  దానిని మరొక అనుభవ్చజ్ఞురాలైన మరొక గోపికచే సూక్ష్మమును/సమస్యాపరిష్కారమును సూచించినది.   మొదటి పాశురములో చెప్పిన నన్నానాళ్-పుణ్య సమయము అని,పుళ్ళుం శిలంబిన-ఆచార్యులు అనుగ్రహించుతకు సిద్ధముగానున్నారని,  కుళ్ళక్-కుళరళ్-కుడైందే-నీరాడ...

TIRUPAAVAI-PASURAM12

Image
     తిరుపావై-పాశురం 12    ****************  " మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం    విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం    తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం    సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం."   పూర్వ పాశుర ప్రస్తావనము   *******************  స్వధర్మానుచరణులైన,ధర్మ రక్షకులైన ఉత్తమవంశ సంజాత-వేద సంరక్షిణి,యోగీశ్వరి,వ్యతిరేకావస్థలో నున్న మహాజ్ఞాని యైన గోపికను మేల్కొలిపి,తమతో పాటుగా నోము స్థలికి తీసుకుని వెళ్ళుచున్నది అమ్మ.  ప్రస్తుత పాశుర ప్రాభవము  ******************  స్వధర్మము-స్వామి ధర్మము అను రెండింటిలో ,  1.స్వామి ధర్మమునకై/స్వామి సేవనమునకై తన స్వధర్మమైన గేదెల పాలుపితుకుటను సైతము విస్మరించిన గోపిక అన్న.  ఆవుపాలు దేవ భోజ్యములు.గేదెపాలు ఉపాధి భోజ్యములు.ఒకవిధముగా ఐహికము-ఆధ్యాత్మికము అనుకొనిన ఐహిక సంపదలకు ప్రాధాన్యతనీయక,అర్చనకై చనిన ధర్మ సంరక్షకుని చెల్లెలు.మన గోపిక.  2.గోపిక గోష్ఠములోని పశువులు,తమ దూదలు ఆకలితో దుఃఖిస్తున్నాయని,తమను పిలుస్తున్నాయని,భావించుకుని -కనైత్తు,  మాతృవాత్సల్యమ...

TIRUPPAAVAI-PAASURAM 11

Image
   తిరుప్పావై -పాశురము 11   ****************  " మాతః సముత్థితివయీ మది విష్ణుచిత్తం    విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం    తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం    సంతః పయోధిదుహితః సహజాంవిదుస్తాం."   పూర్వ పాశుర ప్రస్తావనము   ******************  కృతకృత్య యైన గోపిక తనను తాను మనోయజ్ఞ హవిస్సుగా మలచుకొని,స్వామిని భోక్తను చేసినది.తులసి సైతము తనను తాను పరిమళముగా మలచుకొని స్వామిచే అలంకరింపబడినది.  కుంభకరణ పదము అగస్త్యమహర్షిని సంకేతిస్తున్నదని భాష్యకారులు వివరించారు.  అసలు ఐదవ గోపికను అగస్త్యమహర్షి తో ఎందుకు పోల్చినది గోదమ్మ అన్న సందేహము తప్పక వస్తుంది.పరిహాసముగా 'కుంభకర్ణుని జయించి,నిద్దురను స్వాధీనము చేసికొనినది అన్నప్పటికిని ఆమెది సకలేంద్రియములను ఏకీకృతము చేసి స్వామి లీలాగుణవైభవములను అనుభవిస్తున్న ఉత్త అధికారిణి.  సత్వగుణ శోభితమైన ఉపాధి కలది శ్రీరామావతారము.శ్రీరాముడు జన్మించినప్పటినుండి అవతార పరిసమాఒతి వరకు ఎటువంతి మానవాతీత లీలలను ప్రకటించలేదు.తన అవతార పరిసమాప్తి సమయమున తన ఆయుధములను-పరివారమును సంకేతములుగా/సూక్ష్మరూపములలో...

TIRUPPAAVAAY-10 PAAsURAM

Image
      తిరుప్పావాయ్-పాశురము10    *******************  "మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం   విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం   సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం."     పూర్వ పాశుర ప్రస్తావనము   **********************  గోదమ్మ "కీళ్వానం వెళ్లెండ్రు" 8 వ పాశురములో,  మిక్కుళ్లిపిళ్లైగళుం-  'పోవాన్-పోగిన్రారై-పోగామళ్ అని వివిధ దశలలో నున్న చేతనులను ప్రస్తావించినది.   "తూమణి మాడత్తూ9వ పాశురములో గోపిక "పెరుం తుయిల్"యోగనిద్రను పరిచయముచేసినది.ఏకీకృతమైన ఇంద్రియావస్థ అది.స్వామి అనుగ్రహ సంకేతము.   ప్రస్తుత పాశుర ప్రాభవము.   **********************  గోదమ్మ మనకు,కృతకృత్య అయిన గోపిక /సిద్ధోపాయ/స్వామిని/యజమాని భగవదనుభవమను సదాత్వంకేశవ ప్రియగా తనను తాను మనోయజ్ఞములో హవిస్సుగా అర్పించుకుని స్వామిని భోక్తగా ప్రకాశింపచేయుచున్నది.దాని విశ్లేషణమే ఆమెను భగవదానుభవము నుండి మెల్ల-మెల్లగా బహిర్ముఖము కమ్మనుట.  1.పూర్వ  పుణ్య ఫలితము/పూర్వజన్మసుకృతము  2.పూర్వ యుగ (రామాయణ కుంభక...

TIRUPPAAVAI-PAASURAMU-09

Image
. తిరుప్పావై-పాశురం09 ******************* " మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్య మమృతం వచసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం." పూర్వపాశుర ప్రస్తావనము ******************* ఆశ్రయణము-ఆశీర్వచనము నకు నిదర్శనముగా త్రికరణ ములతో స్వామిని సంకీర్తించి-సంసేవించి,స్వామి ఇస్తానన్న "పఱ" ను తెచ్చుకుందామని గోదమ్మ వ్రతఫలమును ప్రస్తావించినది. ప్రస్తుత పాశురము పరమాద్భుతము.ఈపాశురములో మనకు నిదురిస్తున్న గోపికతో పాటుగా ,మేల్కొని యున్న గోపిక తల్లిని పరిచయము చేస్తుంది గోదమ్మ. ప్రస్తుత పాశురములోనిగోపిక పరిశుద్ధ మణులున్న (నవవిధ బంధములు స్వామితో నున్న మనసనే) మందిరములో,ప్రకాశిస్తున్న దీపములు- (జ్ఞానము) పరిమళిస్తున్న ధూపములతో (అంతర్ముఖ తాదాత్మ్యముతో) ,తన ఉపాధి సహజత్వమును మరచి,అంతర్ముఖియై,తనకు రక్షణము భగవంతుడే అన్న గట్టి నమ్మకముతో నున్న ప్రపన్న. గోపిక శయనమందిరములో శ్రీకృష్ణునికై దీపములు వెలుగుచున్నవి.ధూపపరిమళములు సైతము అస్వామికై ఎదురుచూచు చున్నవి.తల్పము సంగతి సరేసరి.స్వామి స్పర్శకై తహతహలాడ...

TIRUPPAAVAI-PASURAMU-08

Image
      తిరుప్పావై-పాశురం 08     *****************  " మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం    విశ్వోప జీవ్యమమృతం వచసా దుహానాం    తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం    సంతః పయోధి దుహితః సహకాం విదుస్త్వాం".   పూర్వ పాశుర ప్రస్తావనము   *******************  శబ్దము-శ్రవనము అను అంశములతో పక్షులను-భారధ్వాజ పక్షులను సంకేతించి,తెల్లవారుచున్నదనుచు,ఇద్దరు జ్ఞానమూర్తులను తన వెంట తీసుకుని,మూడవ గోపికను నిదుర లేపుటకై,ప్రస్తుత పాశురములో  "దృశ్యము-నయనము" ను తూరుపు దిక్కు-తెల్లదనమును సూచిస్తున్నది గోదమ్మ.   ప్రస్తుత పాశుర ప్రాభవము   *****************  ప్రస్తుత పాశురము బయటనున్న గోపికలు తమతో మాట్లాడుతున్నట్లు భావిస్తూ,సంభాషణా చతురతతో సాగుతుంది.   మూడవ గోపిక-నోముపై కుతూహలము కలది-కోగులం ఉడయ.    స్వామిని త్రికరన శుద్ధిగా ఆశ్రయించుట-స్వామి అనుగ్రహించుట అను రెండు విషములను ప్రస్తావించినది గోదమ్మ అరుళ్ అన్న పదముతో.   శబ్దము-శ్రవనము అన్న అంశముతో పక్షులు-భారధ్వాజ పక్షులను స్తోత్రములను,శంఖనాదములను సంకేతిస్తూ శ్ర...

TIRUPPAAVAI-07 PAASURAM

Image
     తిరుప్పావై-పాశురము07    ******************  "మాతః సముత్థైతవతీ మదివిష్ణుచిత్తం   విశ్వోపజీవమమృతం వచస దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం   సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం"   పూర్వపాశుర ప్రస్తావనము   *********************   మనము శుద్ధి వ్రతమును పూర్తి చేసుకుని,ఆందాళమ్మచేతిని పట్టుకుని రెండవ భాగమైన 'మేల్కొలుపు వ్రత భాగములో మొదటి గోపికను మనతో కలుపుకుని,రెండవ గోపిక ఇంటికి వెళ్ళుచున్నాము"  ప్రస్తుత పాశురములో శబ్దమును మరింత స్పష్టము చేస్తూ,భారధ్వాజ పక్షుల "కృష్ణ నామ సంకీర్తనమును" గొల్ల భామల చల్ల చిలుకు శబ్దములను,కేశి అను రక్కసుని సంహరించిన కేశవ నామ సంకీర్తనమును శబ్దమును-అందులో దాగిన పరమార్థమును తెలిసికొనుటకు శ్రవనమును సాధనములుగా నోము సాధనకు వివరించుచున్నది గోదమ్మ.  ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,మనము పాశురములోనికి ప్రవేశిద్దాము. ఏడవ పాశురము **************** కీశు కీశెన్రెంగుం ఆనైచ్చాత్తు కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు వాశ నరుం కుళ...