Posts

TIRUPPAAVAI-19 PAASURAM.

Image
     తిరుప్పావై-పాశురం-19    *********************    " నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం      పారార్థం స్వశృతిశతశిరస్సిద్ధమధ్యాపయంతీ      స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే      గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తుభూయః."    పూర్వ పాశుర ప్రాభవము    ******************  పదిమంది గోపికలతో నందగోపభవనమునకు వచ్చి,వారిని నోమునకు రమ్మని వినతిచేసిన గోదమ్మ,నప్పిన్నాయ్ నీళాదేవిని మేల్కొలిపినది.బదులు రాలేదు వారికి.స్వామితో ఆమె ఏకాంతములో నున్నదని భావించినగోదమ్మ గోపికలతో పాటుగా వారిరువురిని మేల్కొలుటకు వచ్చినది.   ప్రస్తుత పాశుర ప్రాభవము.   ***********************    రహస్యమును సదస్యము చేయుచున్నట్లుగా చర్మచక్షువులను భ్రమింపచేసే పాశురము,వారి అనుగ్రహమైనవేళ అత్యంత ఆఢ్యాత్మికము.అమృతగుళిక.మనకు అమ్మ-అయ్యల 1.దివ్య మైథునము 2.వారి మంచపు కోళ్ళు 3.దానిపై నున్న పరుపు 4.చుట్టు వేలాడుచున్న దీపములు 5.పరిమళములు 6.తలుపుతీయుటకు వారి సంభాషనము 7.అనుగ్రహించుచున్న స్వామిని అడ్డుకొను...

TIRUPPAAVAI-PAASURAM-18

Image
  తిరుప్పావై-పాశురము-18 ****************** మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్య మమృతం మనసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం. పూర్వపాశుర ప్రస్తావనము **************** నందభవనమునకు వెళ్ళి,యశోదా నందులను,బలరామకృష్ణులను మేల్కొలిపిన గోపికలు,వారికి నందగోపాలుని అనుగ్రహముగా అంబరము-తన్నీరు-శోరు అర్థించిరి.దాన విశిష్టతను వివరించిన గోదమ్మ , ప్రస్తుత పాశుర ప్రాభవము ********************* ప్రస్తుత పాశురములో "పురుషకారత్వము" సిఫారసు అను అద్భుత మాతృ నాత్సల్యమును "నీళాదేవి " జగన్మాత ను పరిచయము చేస్తున్నది. పాలకడలి చిలుకుటకు ఎంతో కష్టబడిన తరువాత ప్రభవించిన క్షీరసాగర కన్య మనలను అనుగ్రహించుటకై, " మామేక శరనం వ్రజః"అను చరమ వాక్య స్వభావమై,అన్యథా శరనం నాస్తి-త్వమేవ శరణం మమ అనగానే అడ్డుపడి,మనకర్మఫలములకు ప్రాయశ్చిత్తమను ఉపాయమును సూచించి,అనన్య శరణత్వమనే ఆలంబనమును చూపించి ,స్వామి మనలను ఉద్ధరించునట్లు చేస్తున్న కరుణయే "నీళాదేవి." నీలమేఘశ్యాముడు పాప-పుణ్యముల చిట్టా ప్రకారమే ఫలితములు చేతనులకూని అంటే,అ...

TIRUPPAAVAI-PAAsURAM-17

Image
     తిరుప్పావై-పాశురం-17    *******************   మాతః సముత్థితవతీ  మదివిష్ణుచిత్తం   విశ్వోపజీవ్యమమృతం మనసా దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం    సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం.   పూర్వ పాశుర వైభవము.   *******************   జ్ఞానులను తమ నోమును నిర్వహించుటకు మేల్కొలిపి గోపికలు,అత్యంత యశోవిరాజితమైన నందగోపభవనమునకు స్వామిని సంసేవించుకొనుటకు బాహ్యప్రాకారమును ,ద్వారపాలకుల అనుమతితో దాటి,ఐహికములను విడిచి,లోపలి ద్వారమును చేరి,శయన మందిరము సమీపించుచున్నారు.    వాచకార్థము అదే అయినప్పటికిని,వారు విషయవాసనలను అధిగమించి,ఆచార్యుల సహకారముతో స్వామి సమాగమనమునకు సంసిద్ధిలగుచున్నారు.   ప్రస్తుత పాశుర ప్రాశస్త్యము   *****************   1.దానమును (సాత్విక-రాజస-తామస) దాని ప్రాముఖ్యతను -ఫలితములను గోదమ్మ వివరించినది.   ప్రతిఫలాపేక్షలేకుండా/శక్తికి లోపము రానీయకుండా అర్హులకు చేసే దానము సాత్త్విలము.   ప్రతిఫలమును కోరుతూ/ప్రయోజనము ఆశించి తన విభవము నలుగురికి తెలిసేలా ప్రకటించుకొనుచు ,చేసే దానము రాజస ...

TIRUPPAAVAI-PAASURAM-16

Image
    తిరుప్పావై-పాశురం-16   *****************   మాతః సముత్థితవతీ మదివిస్ణుచిత్తం   విశ్వోపజీవ్య మమృతం మనసా దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం   సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం.    పూర్వపాశుర ప్రస్తావనము    ************************   భాగవత సేవనము/దాస్యము యొక్క ఆవశ్యకతను తెలియచేస్తూ,గోపికలుగా భాసిల్లుచున్న వారిని మేల్కొలిపి,వారిని తోడ్కొని,వారి ఆధ్వర్యముతో తన తోటివారిచే నోమును ఆచరించుటకు గోదమ్మ బయలు దేరినది.   ప్రస్తుత పాశుర ప్రాభవము.   *********************  1.నందగోపుని/నందగోప భవన వైభవము  2.తాము సదాచారములేనివారమని,    స్వామిని సేవించుటకు తూయోమాయ్'పరిశుద్ధులమై వచ్చామని  3.ద్వారపాలకుల అనుగ్రహ అభ్యర్థనము  4.ప్రాకారము-ద్వారముల యొక్క సంకేతము  5.ద్వారము-గడియ యొక్క సంకేతము  6.నందభవన ప్రవేశమును,      దర్శింపచేసిన  ఆండాళ్ అమ్మకు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,ప్రస్తుత పాశురములోనికి ప్రవేశిద్దాము. పదహారవ పాశురము    ****************** ...

TIRUPPAVAI-PASURAM-15

Image
    తిరుప్పావై-పాశురం-15    ****************  మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం  విశ్వోప జీవ్యమమృతం మనసా దుహానాం  తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం  సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం.  పూర్వపాశుర ప్రస్తావనము  ******************   శుద్ధి వ్రత ఐదు పాశురములను సేవించుకుని,భాగవత దాస్య విభాగములోని పదిమంది జ్ఞానుల దాస్యమును మనము ప్రస్తుతపాశురముతో ముగించుకొనబోతున్నాము.ఈ పదిమంది అదే సుగుణ సంపన్నుల,తేజో సంపన్నుల,ఐశ్వర్య సంపన్నుల,అవ్యాజ అనుగ్రహ సంపన్నుల,సంపూర్ణాధికారిక సంపన్నుల సామూహిక ప్రాతినిధ్యమునకు సమిష్టి సంకేతములు.వారు మన ముందు నిలిచి,మనచే శ్రీవ్రతము చేయించబోతున్న స్వామి స్వరూపములు.6 నుండి 15 పాశురములు మనలోని దశేంద్రియములను వ్రతమునకు   సిద్ధపరచు,       ఆచార్య అభ్యర్థనముగాను భావించవచ్చును.  ప్రస్తుత పాశుర ప్రాభవము.  *********************  మనము రెండవ పాశురములో,  "తీక్కరలై శెన్రుదో"   చెడు మాటలను ఇంకొకరి చెవికి చేర్చవద్దు-మన చెవికి రానీయ వద్దు అను ఒక నిబంధనమును గమనించాము.   దాన...

tTIRUPPAAVAI-PAASURAM-14

Image
   తిరుప్పావై-పాశురం-14   ******************  మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం  విశ్వోపజీవ్య మమృతం మనసా దుహానాం  తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం  సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం.    పూర్వపాశుర ప్రస్తావనము.    *********************  శ్రీ రామావతారము ఎటువంటి లీలను ప్రదర్శించక సామాన్య మానవధర్మములను చాటినది.శ్రెవ్కృష్ణావతారము తానొక ఉపాధిని ప్రకటించుకుని,గొల్లవారితో-గొల్లవానివలె ఆడుటు-పాడుతూ,అవసరమయిన వేళలో తనలీలావిభూతులను ప్రదర్శిస్తూ,ధర్మసంరక్షణమును చేసిన నారాయణుని అర్చామూర్తి యని,ఇరువురును ఒక్కటే అని తెలిపిన గోదమ్మ,      ప్రస్తుత పాశుర ప్రాభవము    ******************  1.తంగల్ ఇల్-తిరుమంత్రమును-ఓం నమో నారాయణాయ  2.తిరువిల్-ద్వయ మంత్రమును-హరి/కృష్ణ  3.కోయిల్-భగవన్నివాసము అను      రహస్య త్రయమును అందించినది.  2.ప్రత్యక్ష ప్రమాణం-అనుమాన ప్రమాణము-శబ్ద ప్రమాణము మనకు పరిచయము చేసినది      ఉంగళ్ తొటత్తు-అంటూ,  గోపికలు తాము వస్తున్న దారిలో వికసిస్తున్న ఎర్ర తా...

TIRUPPAVAI-13

Image
   తిరుప్పావై-పాశురం 13    ******************  మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం  విశ్వోప జీవ్యమమృతం మనసా దుహానాం  తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం  సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం."   పూర్వపాశుర ప్రస్తావనము.   **********************  తంగచ్చన్ చెల్వై /ఐశ్వర్య వంతమైన గోపికను ,స్వామి సేవనమునకై సమస్త సంపదలను లెక్కచేయని ఆమె అన్నను,ఆచార్యుల అవ్యాజానుగ్రహమును ,లంకాద్వీప పాలకుని తమో-రజోగుణములను తెలిపిన గోదమ్మ,   ప్రస్తుత పాశుర ప్రాభవము   ****************  ప్రస్తుత పాశురములో మానవ సహజమైన పోటీ ని గోపికలు రామావాతార-శృఈకృష్ణావతార విషయములలో వాదించుకొనుట అను కొత్త ఒరవడిని పరిచయము చేసినది.  అది జ్ఞానముకాదు/అజ్ఞానము కాదు.మిథ్యాజ్ఞానము. పరమాత్మ అవతారముల పరమార్థమును అర్థముచేసుకొనలేకపోవటము.  దానిని మరొక అనుభవ్చజ్ఞురాలైన మరొక గోపికచే సూక్ష్మమును/సమస్యాపరిష్కారమును సూచించినది.   మొదటి పాశురములో చెప్పిన నన్నానాళ్-పుణ్య సమయము అని,పుళ్ళుం శిలంబిన-ఆచార్యులు అనుగ్రహించుతకు సిద్ధముగానున్నారని,  కుళ్ళక్-కుళరళ్-కుడైందే-నీరాడ...