Posts

ADITYAHRDAYAM-SLOKA-02

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము02   ******************* " దైవతైశ్చ సమాగమ్యాద్రష్టుమభ్యాగతో" రణం"   ఉపగమ్యాత్ బ్రవీత్ రామం అగస్త్యో భగవాన్ ఋషిః."    వివేక రాహిత్యము -విచక్షణాజ్ఞానముతో తలపడుటకు సిద్ధముగా నున్న సందర్భము.    " జ్ఞాత్వా గృహీణ కర్మాని" అన్నది ఆర్యోక్తి.  మనముచేసే పనుల యొక్క స్వభావము-ప్రయోజనము తెలిసికొని ఆచరించుట విధానము.సర్వోత్కృష్టము.   ప్రస్తుత శ్లోకములో "రణమును" గమనించిన అగస్త్యుడు,విజయ ప్రేరేపణమును గావించుటకు,దేవతా శక్తులతో కూడి వచ్చెను.   యుద్ధము-సమరము అన్న పదములను ప్రయోగించిన మహర్షి వాల్మికి,"రణము  అన్న శబ్ద ప్రయోగమును చేశారు.  ఘర్షణాపూరితమైనది "రణము" మనసునకు బలమైన తాకిడిని/రాపిడిని కలిగించు చిత్తవృత్తులు/చింతనములే "రణము.   రామచంద్రుని మనసు సంఘర్షణముగానే యున్నది.రావణాసురుని చిత్తము సంఘర్షణముతోనే యున్నది.   దానిని ద్రష్టుం-గమనించిన వ్యక్తి అగస్త్యుడు.   దానిని తొలగించవలసిన బాధ్యత తనది గా భావించాడు.  " సీతమ్మ సైతము" సరమతో సంభాషించు సమయమున ఆదిత్య ప్రేరేపితయై విజయమునకు ఆదిత్యస్తోత్ర పారాయణము...

ADITYAHRDAYAM-SLOKA01

Image
   ఆదిత్యహృదయము-01  *****************   శ్లోకము-01  **********  ప్రార్థన  *******  "జయతు జయతు సూర్యం-సప్తలోకైక దీపం   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."   శ్లోకము   *******  "తతోయుద్ధ పరిశ్రాంతం-సమరేచింతయాశ్రితం   రావణంచాగ్రతో దృష్ట్వా- యుద్ధాయ సముపాశ్రితం."   పూర్వ రంగము   ************  'క్షిప్తాస్చాపి శరాస్తేన శస్త్రాణివివిధానిచ   న రణాయ వర్తంతే మృత్యుకాలేభి వర్తతః"    వానరసేనల రాతి దెబ్బలకును,రాముని శరాఘాతములకును రావణుడు వ్యాకులుడై యుద్ధము చేయలేక యుండెను.దానిని గమనించిన సారథి,రావణుని రథమును పక్కకు మరల్చెను.రావణుడును తన చేతిలోని ధనసును కిందపడవైచెను.తాత్కాలికముగా యుద్ధము ఆగినది.   రజోతమోగుణ ప్రేరేపితుడైన రావణుడు రాముని క్షమా భిక్షనడుగక,సారథిని మందలించి,తన ప్రాణ ములను కాపాడినందులకు సారథికి  కంకణములను బహూకరించి,తిరిగి రణభూమికి రథమును తరలించమని సూచించెను.   రామచంద్రుడు సైతము ఆ మహాసంగ్రామములో,  శ...

ADITYAHRDAYAM-INTRODUCTION

Image
     ఆదిత్యహృదయ స్తోత్ర పరిచయము     ************************  " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    హిరణసమిత పాపద్వేష దుఃఖస్య  నాశం    అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."     వేదము-వేదమునుండి ఇతిహాసము-ఇతిహాసములోని స్తోత్రము కథనము ద్వారా సామాన్యులకు సులభసాధ్యముగా,సౌరవిజ్ఞామునంతా రంగరించి,శబ్దగుళికగా మలచి,మనకు అనుగ్రహించిన స్తోత్రరాజము "ఆదిత్యహృదయము"  బ్రహ్మర్షి పరబ్రహ్మ నారదునకు స్పూర్తినీయగా,దేవర్షి నారదుడు వాల్మికి కి తారకమంత్రమును(రామ) ఉపదేశించగా,మహర్షి వాల్మికి ఆదికావ్యమైన రామాయనములో నిక్షిప్తపరచి స్తోత్రముగా అందించగా,రాజర్షి అగస్త్యుడు రామచంద్రునికి రణభూమిలో ఉపదేశించగా దానిని భక్తిశ్రద్ధలతో జపించి Fఅలసిద్ధిని పొందిన రాముని ఉదహరిస్తూ,సకల చరాచరములచే/చేతనులచే, " నమస్తే బ్రహ్మ రూపాయ   నమస్తే విష్ణురూపిణే   నమస్తే రుద్రరూపాయ   భాస్కరాయ నమోనమః" అని కీర్తించే అవకాశంచేతనులకు లభించినది.  స్తోత్రమును (సహేతుకముగా-సంప్రదాయముగా/తక్కువ వ్యవధిలో/అభ్యాగతియై/రావలిసిన సమ...

ADITYAHRDAYAM SLOKAM-05

    "సర్వమంగళ మాంగల్యం సర్వపాప ప్రణాశనం    చింతాశోక ప్రశమనం-ఆయుర్వర్ధనముత్తమం"    పద విభాగము    **********  సర్వమంగళం  సర్వపాప-ప్రణాశనం  ఆయుర్వర్ధనం  చింతాప్రశమనం  శోక ప్రశమనం  మంగళప్రదంకనుక   ఉత్తమం.    శ్లోకము యొక్క సార్థకతను-గౌణత్వమును వివరిస్తున్నది ఈ శ్లోకము.   ప్రారంభ శ్లోకములోని సమస్యకు పరిష్కారము ప్రస్తుత శ్లోకము.

ADITYAHRDAYAM-04

Image
   శ్లోకము-04   ********  "ఆదిత్యహృదయంపుణ్యం సర్వశత్రు వినాశనం   జయావహంజపేత్ నిత్యం అక్షయం పరం శివం."   పద విభాగము   ************   పుణ్యం   సర్వ శత్రువినాశనం   జయావహం   అక్షయం   పరమం/సర్వోత్కృష్టము     శివం/శుభం   అదిత్యహృదయం.    అగస్త్య మహాముని మొదటి శ్లోకములో దృష్ట్వా,అని,రెండవ శ్లోకములో శృణు అని,మూడవ శ్లోకములో జపేత్ చ్దర్శించు,శ్రవణము చేయి,జపించు అను సాధనావస్థలను తెలియచేసినారు.  స్తోత్ర ఫలసిద్ధినికూడా ముందుగనే ధృవీకరించినారు.  ప్రస్తుత శ్లోకములో సనాతనము-గుహ్యమైన ఆదిత్యహృదయ స్తోత్రము యొక్క శుభలక్షణ సమగ్రతను వివరిస్తున్నారు.   స్తోత్ర ఫలితము శాశ్వతముకనుక నిత్యం అన్నారు.నశించనికనుక అక్షయం అన్నారు.ఐహికాతీతము కనుక ఫలప్రదము కనుకపరమన్నారు.శుభప్రదమైనదికనుక శివం అన్నారు.జయ స్వరూపము కనుక జయం అన్నారు.   ఇంక "పుణ్యం" శబ్దమును పరిశీలిస్తే,  మందలస్తోత్రముకూడ, "పునాతు మాం తత్ సత్ వరేణ్యం"అనికీర్తిస్తున్నది.  "పునాతి అనేనపుణ్యం" అంటారుపెద్దలు.  దేని వలనపునీతులమవుతామో/ఏ మహాశక్తి పా...

ADITYAHRDAYAM SLOKA-04

Image
  శ్లోకము-03  *********  "రామ రామమహాబాహో శృణు గుహ్యం సనాతనం   ఎన సర్వాన్ అరీన్ "వత్స" సమరేవిజయష్యసి"  పదవిభాగము  **********  వత్స-వాత్సల్య సంబోధనము.   అగస్త్యునిచే పలుకబడినది రాముని ఉద్దేశించి  రామ-ఓ అంతర్యామి  రామ-దశరథ నందన రామ   మహాబాహో.  అజానుబాహో-స్వరూపము  మహాబాహో-సామర్థ్యము   ఇప్పుడు స్తోత్రఫలితము చెప్పబడుతోంది.   ఎందుకంటే "ఆదిత్యహృదయ స్తోత్రము"  గుహ్యత-సనాతనత అను రెండు శుభలక్షణములను కలిగియున్నది.  శృణు-దీనిని విని-ఆచరిస్తే  సర్వాన్+అరీన్-సర్వశత్రువులను   బాహ్య శత్రువులను-అంతః శత్రువులను,   రావణాసురుడు-బాహ్యశత్రువు   చింత-శోకమును కలిగించు అంతః శత్రువు  వీటిమధ్యన జరుగుచున్న సమరములో  సమరే విజయష్యసి-నీవు విజయమును పొందెదవు.  ఈ శ్లోకమును స్తోత్ర ఫలశృతిగా పెద్దలు భావిస్తారు.   విశేషపదములు   ***********  వత్స-ఆవుదూడ    ఆవు శాఖాహారి అయినప్పటికిని తన సంతతిమీదిప్రేమతో దాని మాయను నాకితీసివేస్తుంది.తపోసంపన్నుడైన అగస్త్య మహాముని సైతము "మంత్రోపదేశము" రా...

ADITYAHRDAYAM-02

Image
  శ్లోకము-02  ********  " దైవతైశ్చ సమాగమ్య "ద్రష్టుం" అభ్యాగతో రణం   ఉపగమ్యాబ్ర విద్రామ అగస్త్యో "భగవాన్-ఋషిః"   పద విభాగము   ***********  రణం-ద్రష్టుం-యుద్ధమును వీక్షించుటకు  దైవతైశ్చ్య-సమాగమ్య-దేవతలతో సహా  భగవాం-ఋషి-విశేషపదములు  అగస్త్యో-అగస్త్యమహాముని  గమ్యా-రణస్థలికి వచ్చెను.  విదామ-ఉపగమ్యబ్ర-తాను ఒక్కడే రామునికి దగ్గరగా వెళ్ళెను.  భావము  ******  భగవానుడు-ఋషి అయిన అగస్త్యుడు దేవతలతో కలిసి యుద్ధమును వీక్షించుతకు వచ్చి,తానొక్కడు మాత్రమే రామునికి అతిదగ్గరగా వెళ్ళెను.(కర్తవ్యబోధనమునకై)   ఇప్పుడు విశేష శబ్దములను ప్రస్తావించుకుందాము.  కథనము ప్రకారము అగస్త్యభగవానుడు దేవతాసక్తులతో యుద్ధమును వీక్షించుటకు వచ్చి,తానొక్కడే రాముని సమీపించినాడు.అనగా ఇది అత్యంత గోప్యము.వాల్మికి మహర్షి అగస్త్యునకు భగవాన్-ఋషి అను రెండు విశేష గుణములను ప్రస్తావించినాడు.కనుకనే "ద్రష్టుం" అన్న పదమును అగస్త్యునకు అన్వయిస్తే యుద్ధము-దాని పరిణామములను ముందే దర్శించగలిగిన మహాజ్ఞాని.  విష్ణు పురానములోనిర్వచించినట్లు,  "ఉత్పత్తి-ప్రళ...