Posts

ADITYAHRDAYAM-SLOKAM-23

Image
    ఆదిత్యహృదయము-శ్లోకము-23   **********************  ప్రార్థన  ***** " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణ సమిత పాప ద్వేష  దు@ఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం  ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం  నమామి."   పూర్వరంగము   **********  ఆదిత్యుని విశ్వాత్మకునిగా-విశ్వరక్షకునిగా-  అగ్నిహోత్రునిగా-అగ్నికార్యమైన క్రతువుగా సంభావించిన అగస్త్య భగవానుడు ,పూర్వ శ్లోకములలోని ప్రతిపదము ఫలశృతియే యైనప్పటికిని,ప్రస్తుత శ్లోకము నుండి తదుపరి శ్లోకములను "ఫలశృతిగా/ఫలసిద్ధిగా"పరిగణిస్తారు దైవజ్ఞులు.  ఇంకొక విశేషమేమిటంటే అగస్త్య భగవానుడు, "రామ రామమహాబాహో" అన్న శ్లోకములో రామచంద్రుని సంబోధనము తరువాత గుహ్యముగా చెప్పవలసినది పూర్తిచేసి,రాఘవ శబ్ద ప్రయోగముతో ప్రియతాత్మజ అని యుద్ధోన్ముఖుని చేసి యుద్ధరంగమును నిష్క్రమించినాడు.  పరమాత్మను విష్ణుస్వరూపునిగా భావించి,కొలిచేవారు,  "ఆర్తా విషణ్ణా-శిధిలాశ్చ భీతా   ఘోరేషుచ వ్యాధిషు వర్తమానా   సంకీర్త నారాయణ శబ్ద మాత్రం   విముక్త దుఃఖః సుఖినో భవంతు"  అని ఫ...

ADITYAHRDAYAM-SLOKAM-22

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము-22    *******************  ప్రార్థన  *****  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."    పూర్వరంగము    ***********  ఏషచైవాగ్ని హోత్రంచ-ఫలంచావైగ్నిహోత్రిణాం"  అంటూ,స్థూలము నిద్రాస్థితిలో నున్న వేళ సైతము తాను జాగరూకతతో నుండి,తన అగ్ని అను శక్తిచే సర్వ దోషములను /మలినములను శుద్ధిపరుస్తూ,ప్రకృతిని-ప్రజలను చైత్న్య వంతము చేస్తున్న సూర్యభగవానునకు నమస్కారములు.   ప్రకృతిలోని పంచభూతములలోను,ప్రజలలోని పంచేంద్రియములను నిరతరము దాగియున్న చైతన్యశక్తియే అగ్నిహోత్రము.   ప్రకృతిలో అదిలోపించనచేభూమండలము గడ్డకట్టి స్తంభించిపోతుంది.   మనలో అదిలోపించినచో మనుగడ స్తంభించిపోతుంది.  కనుకనే రుద్ర చమకము ప్రథమ అనువాక ప్రథమ శ్లోకము,  " ఓం అగ్నా విష్ణుం సజోషసేమా వర్థంతు.,"  అంటు మీరిద్దరు నా పట్ల సద్భావనను కలిగి యుండండి అని అర్థిస్తున్నది,  స్థితికార్యమునకు అగ్ని శక్తి యొక్క ...

ADITYAHRDAYAM-SLOKAM-21

Image
        ఆదిత్యహృదయం-శ్లోకము-21       *********************  ప్రార్థన  ******  "జయతు జయతు సూర్యం  సప్త లోకైక దీపం   తిమిరహిరణ పాప ద్వేషదుఃఖస్య నాసం   అరుణకిరన గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."     పూర్వ రంగము   ***********  పరమాత్మ నాశయత్వేవ  వైభూతం  తదేవ సృజతి అంటూ ప్రలయము తదుపరి సృష్టి,సృష్టి తదుపరి ప్రళయనిర్వహణమును ఏ విధముగా జరిపిస్తారో వివరించిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో రెండు ముఖ్య అనుగ్రహములను   1.సుషుప్తావస్థ నందు పరమాత్మ చైతన్యమును గురించి,అగ్నిహోత్రునిగా -అగ్నిహోత్ర ఫలముగా స్వామి ఉనికిని సంస్తుతిస్తున్నారు.    శ్లోకము  ******  "ఏష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠతః   ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవాగ్ని హోత్రిణాం."   అగస్త్యభగవానుడు సుషుప్తి-జాగ్రుతి అన్న రెండు అవస్థలను సూచిస్తున్నారు.   ఎవరు సుషుప్తిదశలో నున్నది?ఏది సుషుప్తి దశలోనున్న స్థూలములో జాగృతముగా సూక్షముగా నున్నది అన్నది ప్రస్తుతము.  ...

ADITYAHRDAYAM-SLOKAM-20

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము-20  ***********************  ప్రార్థన  *******  "జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్య మూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం  తం నమామి."   పూర్వరంగము   ***********  పూర్వ శ్లోకమును "తప్త-చామీకరాభాయ వహ్నియేవిశ్వకర్మిణే"అంటూ పరమాత్మను ప్రస్తుతిస్తుంది.  చామీ కరము-బంగారు కిరణము.ఆ బంగారు కిరణము మేరుపర్వతమును పరమాత్మ స్పృశించుటచే ఏర్పడినది. .ఆ బం గారు కిరణము స్వామి అనుగ్రహమే.  వేడిచే-వెలుగుచే తప్తమైనది/కాల్చబడినది.అంటే ఇతర లోహ ధాతువులను సైతము విడదీయలేంతగా తనలో కలుపుకొనిన బంగారపుకొండ స్వామి స్పర్శచే దోషములను ఆవిరిరూపములో/ద్రవరూపములో కరిగించుకుని/తొలగించుకుని,తప్తము చేసికొని,పుటమై,మేలిమిముద్దగా ప్రకాశిస్తున్నది.ఇది వాచకము.   జీవుల ఉపాధి/దేహము మేరుపర్వతమే..అది మంచి-చెడులను విడదీయలేనంతగా తనలో కలుపుకుని సందిగ్ధములో ఉంది.స్వామి తన కరుణ  అనే అగ్నితో దానికి పుటము వేసి శాశ్వతమైన-ఆత్మను-అశాశ్వతమైన ఉపాధిని వేరుచేసి  ప్రకాశింపచే...

ADITYAHRDAYAM-SLOKAM-19

Image
    ఆదిత్యహృదయం-శ్లోకము-19  ********************  ప్రార్థన  ****  "జయతు జయతు సూర్యం సప్త లోకైకదీపం   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాసం   అరుణకిరణ గంయం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వ రంగము  **********  పరంజ్యోతి  యైన పరమాత్మ తమమును-హిమమును-శత్రువులను-కృతఘ్నతను  సంపూర్ణముగా నాశనము చేసి ,నిర్ద్వంద్వ స్థితిని ప్రకటించినాడు అని చెప్పిన అగస్త్యభగవానుడు పునః సృష్టిని చేయుచు,నిరంజనుదైన స్వామి సర్వమలినములను హరించివేసి,రోచిష్ముడై,  పుటము వేసిన అగ్నివంటి వర్ణముతో ,కన్నులముందు కనపడుతూ,కిరణములనే కరములతో ,పంచకృత్య భారమును వహించు వహ్ని వలె, "తప్తంచకర-తప్తచామీకరుడై-ఆ భా-సమస్తమును ప్రకాశవంతము చేస్తున్నాడు అంటూ,అగ్నిద్యోతక స్వరూప సూర్యనారాయణుని సంకీర్తిస్తున్నాడు.  శ్లోకము  *****  "తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే   నమః తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే"    విఘ్నేశ్వరనుగా విశ్లేషింపబడిన పరమాత్మ వటపత్రసాయియై, తదుపరి పునః సృష్టిని ప్రారంభిస్తున్నాడు.జలమయములైన జగములు తిర...

ADITYAHRDAYAM-SLOKAM-18

Image
       ఆదిత్యహృదయం-శ్లోకము-18    ************************   ప్రార్థన   *******  " జయతు జయతు సూర్యం  సప్తలోకైకదీపం    హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం    సకలభువనవంద్యం  భాస్కరం తం నమామి."   పూర్వరంగము   ***********  "మమయోనిః మహత్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం   సంభవః సర్వభూతానాం-అంటూ ,  ఇక్కడ యోని శబ్దము మూలకారణముగా అన్వయించుకోవాలి.  ఇది స్థూల విశ్వరచనకు మూలకారణము పరమాత్మ.   ఆ పరమాత్మ సూక్ష్మముగా ,  "సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే-ఇది ఉపాధికి సంకేతము అన్న భగవద్గీతా  సారమును తెలియచేసిన అగస్త్యభగవానుడు,త్రిగుణముల ప్రభావమును ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు.   ఒకవిధముగా చెప్పాలంటే పరమాత్మ "విఘ్నేశ్వర " కరుణావిశేషములే ప్రస్తుత శ్లోకము.  శ్లోకము  ******  " తమోఘ్నాయ-హిమఘ్నాయ-శత్రుఘ్నాయ-అమితాత్మనే    కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః"     శ్లోక భావమును గ్రహించుటకు  సహ...

ADITYAHRDAYAM-SLOKAM-17

Image
    ఆదిత్యహృదయం-శ్లోకము-17   *********************  ప్రార్థన  ******  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  *********    పరమాత్మ తన ఉగ్రత్వ-వీరత్వ సారంగత్వముతో సమస్తమును జాగృత పరచుచున్నాడన్న అగస్త్య భగవానుడు,   ప్రస్తుత శ్లోకములో అదే ఉగ్రత్వ-వీరత్వ స్వభావమును మరింత తెలియచేస్తూ,  "నిత్య-అనిత్య,సత్య-అసత్య జ్ఞానమును అందించుచున్నాడు." పరమార్థ ప్రకాశత్వ పరమార్థమే మనము తెలుసుకొనబోవు శ్లోక మర్మము.  శ్లోకము  *******  "బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చశే   "భాస్వతే" సర్వభక్షాయ" రౌద్రాయ వపుషే నమః ."   భాస్వతే-వర్చసే అను పదములప్రయోగము  పరమాత్మ   ప్రకాశత్వక పరమార్థ విశేషణములు.తేజసామపి తేజస్వి అనుగ్రహమే భాస్వత్వము-వివశ్వంతము.విస్తారముగా కాంతిని వ్యాపింపచేయుట.  1. ప్రస్తుత శ్లోక భావగ్రహణమునకు ముందుగా మనము ఒక్కసారి,స్తోత్రములోని ఇంతకుముందు చెప్పుకొనిన,  " ఏష...