Posts

DEVIKHADGAMALA-YOGINULU

Image
    దేవిఖడ్గమాల-యోగినులు    ****************  "అణిమాదిభిరావృతామ్మయూఖైః అహమిత్యేవ విభావయేత్ భవాని"  "యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా' అనికీర్త్స్తున్నది లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము ఆ జగజ్జననిని.   హ్రీంకారాసనల గర్భితానల శిఖ నుండి అనేకానేకములుగా ప్రకాశవంతముగా ప్రసరింపబడే కిరణములే యోగినులు.వీరిని "పరివార దేవతలు/శక్తులు"అనికూడా అంటారు.   నిరాకార-నిరంజన-నిర్గుణ మూలశక్తిని అర్థము చేసికొనుటకు సహాయపడు శక్తులు ఇవి.  ఒక విధముగా చేతనులకు యోగమునుకలిగించు శక్తులు.సాధకుడు ద్వంద్వమును వీడి తనలోని చైతన్యమునుగుర్తించుటకు ఆలంబనముగా ఈ సక్తుల సహాయమును తీసుకుంటాడు.  "దేహములో?ఉపాధిలో సూక్ష్మముగా దాగి దానినిచైతన్యవంతము చేయుచున్న మహాద్భుత శక్తిని తెలిసికొనుటయే "యోగము"   శ్రీదేవి ఖడ్గమాల అమ్మవారి యంత్ర స్వరూపమునకు సాకారమును దర్శింపచేయు స్తోత్రము.  ఈ యోగినులు ఒక్కొక్క ఆవరనములో నిర్దేశింపబడిన విధులను నిర్వర్తిస్తూ సాధకుని తరువాతి చక్రమును చేరుటకు సహాయపడుతుంటాయి.  నిర్దిష్ట పద్ధతిలో విస్తరించిన పరివార దేవతలు కొన్ని గుప్తముగాను,ఇంకొన్ని బాహాట...

DEVIKHADGAMALA INTRODUCTION-03

Image
   దేవిఖడ్గమాల-ఉపోద్ఘాతము-03  *********************  మహా మహిమాన్వితమైన దేవిఖడ్గమాలస్తోత్రము/శుద్ధసక్తి మాలా మహామంత్రముసనాతన సంప్రదాయమునూనుసరిస్తూ, 1.స్తోత్ర నామము 2.స్తోత్రమునూ అనుగ్రహించినఋషి 3.స్తోత్రములో నిక్షిప్తమైన దేవత/స్వభావము 4.స్తోత్రములో ప్రయోగించబడిన ఛందస్సు 5.స్తోత్ర సూక్ష్మరూపమైనబీజము 6.స్తోత్ర  బీజములో దాగిన శక్తి 7.స్తోత్ర మహాత్మ్యమును తెలియచేయు కీలకము/ఉపాయము 8.స్తోత్ర పారాయనమునుచేయూఅవశ్యకత/లక్ష్యము 9.మూలశక్తీనుగ్రహము అను తొమ్మిదీంసములతోనవనవ లావణ్య నిధి నవనవోన్మేషముగా విరాజిల్లుచున్నది అన్నమాట నిర్వివాదము.  కొంచము విశదముగా తెలుసుకునే ప్రయత్నముచేద్దాము.  శ్తోత్రము పేరు/స్తోత్రములో దాగిన మంత్రము పేరు,  "అస్య-శ్రీ-శుద్ధ-శక్తి-మాలా-మహామంత్రస్యా అని చెప్పబడినది.   స్తోత్రమునకు-పరమాత్మకు భేదములేదు. అస్య-ఈ పరమాద్భుత స్తోత్రము మూడు శుభలక్షనములను కలిగియున్నది.అవి, శ్రీ-శుభప్రదమైనది శుద్ధ-అతిపవిత్రమైనది. శక్తి-శక్తివంతమైనది. అమ్మతో పాటుగా తొమ్మిది  ఆవరనములలోనున్న పరివారదేవతా శక్తులను సైతము గుర్తించి,అర్చి,ంచే మంత్రముల సమూహముకనుక ఇది...

DEVIKHADGAMALA-INTRODUCTION-02

Image
   దేవిఖద్గమాల-02  ****************** దేవిఖడ్గమాలా స్తోత్రమునే "శ్రీ శుద్ధశక్తి మహా మాలా మంత్రము"అనికూడా కీర్తిస్తారు.  మహిమాన్విత నాదమే మంత్రము.అంతే కాదు, "మననాత్ త్రాయతే మంత్రః" ఎవరు మననము చేస్తారో/మనసులోనిధిధ్యాసము చేసుకుంటారో వారిని రక్షించేది "మంత్రము"   మనము ఏ దేవతను/మూలశక్తిని సాకారముగాభావించి ఆ శక్తికిసంబంధించిన మంత్రమును మననము చేస్తామో అదిమహామంత్రము.   ఆ మూలశక్తి తో పాటుగా అనేక పరివార శక్తులను సైతము ఆరాధించగలిగితే అది"మాలా మహా మంత్రము."   దేవి ఖడ్గమాలా/శుద్ధశక్తి మాలా మహా మంత్రము, ప్రతి స్తోత్రము , 1 దేవత 2.ఋషి 3.ఛందస్సు 4.బీజము 5.శక్తి 6,కీలకమును  కలిగియుంటాయి.   దేవిఖడ్గమాలా మహా మత్రము, 1 మహా త్రిపుర సుందరి దేవతగా 2.వరుణ్-ఆదిత్యులను ఋషులుగా 3.దేవీ గాయత్రీ ఛందముగా 4,ఐం-బీజముగా 5.క్లీం-శక్తిగా 6.సౌః-కీలకముగా,   సర్వాభీష్ట సిద్ధిప్రదముగావిరాజిల్లుతున్నవి.  వీటి గురించి తదుపరి భాగములో వివరముగా తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము.   శ్రీ మాత్రే నమః.

DEVIKHADGAMAALA-INTRODUCTION

Image
     శ్రీ మాత్రే నమః      గం గణపతియే నమః     ****************  అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ దయతో,  'దేవు ఖడ్గమాల స్తోత్రము" శుద్ధసక్తి మహామాల" అంటే ఏమిటి?తెలుసుకోవాలనే జిజ్ఞాసను నాలో అంకురింపచేసిన ఆ అమ్మయే"అమ్మ దయ ఉంటేఅన్నె ఉన్నట్లే" అన్న నానుడిని మరొకసారినిరూపిస్తూ,నాచేతిని పట్టుకుని,నన్నొకకలముగా మలచుకొని తన దివ్యమహిమానుభవములను తానే తెలియచేస్తుందన్న ప్రగాఢ విశ్వాసముతో అమ్మను ప్రార్థిస్తూ,అడుగులను కదుపుదాము. "Yఆదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః"   ఖడ్గమాల అంటే ఏమిటి?  ఖండించగలిగే శక్తికల ఆయుధము ఖడ్గము.అజ్ఞానమును-అధర్మమును-అయోమయమును ఖండించకలిగేది.అదే అమ్మానుగ్రహము.అమ్మ అనుగ్రహమును వివరముగా తెలియచేయు స్తోత్రము " దేవిఖడ్గమాలస్తోత్రము.  మూలశక్తితో పాటుగా నున్న పరివారశక్తులను తెలిసికుని,వారిప్రాముఖ్యమును సైతము గుర్తించి,ఆరాధించు అర్చనావిధానమును తెలియచేయు స్తోత్రము"దేవిఖడ్గమాల స్తోత్రము."   మనము చర్మచక్షువులతో నేరుగా చూసి తెలిసికోలేని అపరిమిత అనుగ్రహ శక్తులను తెలిసికొను...
Image
    జై శ్రీరాం  **********  ఎంతటి చమత్కారి అగస్త్యభగవానుడు.రామచంద్రునకు 'తతో యుధ్ధమునా చింతా శోకములను తొలగించుటకై రాముని సమీపించి,స్తోత్రమును ఉపదేశించి నిజస్థానమునకు తరలినాడట.ఇంకాచమత్కారము రామచంద్రుడు భక్తి-శ్రధ్ధలతో ప్రార్థించగానే సూర్యనారయణుడు సంతుష్టుడై రామునిసమీపించి,రావణునికి మరనము ఆసన్నమైనదని కాల స్వరూపునిగా/యమునిగానిర్దేశించి,రాముని దీవించి,సంతసముతోనిజస్థానమునకు చేరినాడట.  అంటే అతి పవిత్రమైన ఆదిత్యహృదయస్తోత్రము కేవలము రామునికిసంబంధించినదా/లేక సకల చేతనులనూద్దేశించి,వెలుగు మార్గమును చూపించుటకు పరోక్షముగా ప్రసాదించినదా అన్న ఒక్కఆలోచన    మనకు నామికి-నామమునకు భేదము లేదని,సకలములో అంతర్యామిగా దాగిన పరమాత్మ తానొక మానవ ధర్మమును అనుసరిస్తూ,ధర్మసంస్థాపనమును ఏ విధముగా నిలిపినాడో విశదపరుస్తుంది.   నారాయణుడే రామచంద్రుడు/సూర్యనారాయణుడు/అగస్త్యభవ్గవానుడు,ఆంజనేయుడు/విభీషణుడు/యుధ్ధభూమి,సీతమ్మ,సర్వము/సకలము పరమాత్మే.  అయినప్పటికిని, " గోచరంబగు జగములోపలగోప్యమైనది రామనామము."  తాను గోప్యముగా ఉండి మనందరిచే,రాముడు యుధ్ధభూమిలో ఉన్నాడు/రాముడు చింతా-శోక...

ADITYAHRDAYAMU-SLOKAMU-31

    ఆదిత్యహృదయము-శ్లోకము-31   ***********************  ప్రార్థన  *******  "జయతుజయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణసమిత పాప ద్వేషదుఃఖస్యనాశం   అరుణకిరణ గమ్యం ఆదిమాదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  ***********  పరమాత్మ పన్నెండు నెలలు ఋతుచక్రమునకు అనుకూలముగా తనపరివారమును-తానుసైతము మలచుకుని,ద్వాదశాదిత్యులుగా దర్శనమిస్తున్నాడో,ఏ విధముగా సకలజగములను సకలగ్రహములను సంరక్షించుచున్నాడో,ఏ విధముగా సర్వపాపములను నశింపచేయుచున్నాడో వివరించిన అగస్త్యభగవానుడు,చివరి శ్లోకములో ,  మహేంద్రః ధనదః కాల యమ గా అలరారుతున్న పరమాత్మ సూర్యభగవానునిగా ప్రకటితమగుచు,రావణాసురునికి అంత్యకాలము సమీపించినదని తెలిపి,రాముని రణోన్ముఖుని చేస్తూ,ఆశీర్వదించి తరలినాడట.  శ్లోకము  ******  "అథ రవిరవదన్నిరీక్ష రామం   ముదిత మనాః పరమం ప్రహృష్యమాణః  నిశిచరపతి సంక్షయం విదిత్వా  సురగణ మధ్య గతో వచస్వరేతః"    ఇతి శ్రీమద్రామాయణే యుద్ధ్ధకాండే    ఆదిత్యహృదయ స్తోత్రం సంపూర్ణం."   ఎంతటి చమత్కారి ఈ అగస్త్యభగవ...

ADITYAHRDAYAM-SLOKAM-30

   ఆదిత్యహృదయము-శ్లోకము-30  ***********************  ప్రార్థన  ******* " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణసమిత పాపద్వేష దుఃఖస్యనాశం   అరుణ కిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం  భాస్కరం తం నమామి."    పూర్వ రంగము.    ***********     మనముఇప్పటివరకు సూర్యభగవానుని కరుణామృతవర్షమును గురించి తెలుసుకునే ప్రయత్నములో ఒక్కసారి 'పదకవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనను ప్రస్తావించుకుందాము.  " నీవొక్కడివే సర్వాధారము    నిన్నే ఎరిగిన అన్నియునెరుగుట   .....  నీ యందె బ్రహ్మయు రుద్రుడు ఇంద్రుడు   నీ యందె ఋషులు  నీయందె గరుడ గంధర్వులు  నీ వలననె కిన్నెర కింపురుషులు  నీ వలననె అచ్చరులు ఉరగులు    ఎంతటి అద్భుతము " నీ యందె ద్వాదశాదిత్యులు"    ఓ పరమాత్మ! ఓ పరంధామ  నీలోనె అన్నియును  నిన్నర్చించిన -నిఖిల తృప్తికరము అని ప్రత్యక్ష పరమాత్మ తత్త్వమును ప్రస్తుతించినాడు.  మరొకమహానుభావుడు,  నారాయణా! నారాయణా  నను కావుమో సూర్యనారాయణా ...