Posts

TEACHERS DAY-2024

Image
  ఏకములో  అనేకమే గురువు-పూజిద్దాము.  *************************************** శ్రీ గురుభ్యో నమ: ************** భావి సౌభాగ్యమనే బలమైన సౌధమునకు కీలకమైన మూలధనము మీరు ఊపిరి అందిస్తున్న ఉపాధ్యాయులారా ప్రవాసాంధ్ర ప్రకాశిత ప్రాభవ జ్యోతుల్లారా వందనము- అభివందనము.  అసతోమా సర్గమయా. ------------------------- దేశాభివృద్ధి " నాది " అను బాధ్యత "పునాది" పై ఆటు పోటు తట్టుకునే దీటుతనపు " ఇటుకలను" పేర్చి ఈసు ఇసుమంతయు గానరాని ఇంగితపు "ఇసుక" చేర్చి ఐకమత్యమే బలము అను సెంటిమెంటు " సిమెంటు " తో వీడలేని దేశభక్తి" గోడలను" కట్టిస్తున్న శాస్త్రములు అందిస్తున్న " మహనీయ మేస్త్రీలు" వందనము- అభివందనము  తమసోమా .జ్యోతిర్గమయా ------------------------- కలకాలము కలపాలి అను భావపు "కలప"తో మంచి తలపులనే తలుపులను,కిటుకులనే కిటికీలను చెక్కు చెదరని ధైర్యమనే చెక్క పనిముట్లను కుసంస్కారపు" చెద" చేరకూడదనే తలపుతో చెక్క చక్కదనానికి చిత్రీలు పట్టిస్తున్న చాకచక్యము అందించే " వదాన్యపు వడ్రంగులు " వందనము-అభివందనము. -మృత్యోర్మా  అమృతంగమయా.----...

SREESUKTAM-10-MANASAH KAAMA VAAKUTI.

Image
  శ్లోకము  "మనసః కామం ఆకూతిం వాచః సత్యం  అసీమహి   పశూనాం రూపం అన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః"     క్షుప్తిపాసాం మలా జ్యేష్ఠాం  అలక్ష్మీ నాశయ అని ప్రార్థించిన సాధకుడు ప్రస్తుత శ్లోకములో పాడి-పంటలను అనుగ్రహించే "ధాన్యలక్ష్మి"ని తన దగ్గర స్థిరముగా ఉండునట్లు అహ్వానించమని జాతవేదుని  ప్రార్థించుచున్నాడు.   ఓ జాతవేద-శ్రియం అసీమహి.  శ్రేయోదాయకమైన  మహాలక్ష్మిని  నా దగ్గరకు చేర్చుం.ఆ తల్లి అనుగ్రహముతో,  నా త్రికరణములు సత్యమార్గమునూనుసరించగలుగుతాయి.   అదియే నా -ఆకూతి-సంకల్పము.  నామనసః-మనస్సు-వాచః-పలుకులు-తద్వారా నేను కోరుకునే కోరికలు/కామం సత్యసంపూర్ణములై సన్మార్గమును అవలంబిస్తాయి.    తద్వారా ,  అకూతిం-సంకల్పము సిద్ధించి  నేను సంతృప్తిని పొందుతాను.దృఢసంకల్పము నన్ను అమ్మ అనుగ్రహముతో సిద్ధిని పొందేటళుగా చేస్తుంది.    తత్ఫలితముగా , పాశూనాం-రూపం-అన్నస్య మయి  అసీమహి.   పశువుల ద్వారా పాడి,పంటలద్వారా అన్నము లభిస్తాయి.ఇదిఒక భావన.   ఇంతకుముందరి శ్లోకములో "కరీషిణీం" గోమయమును ప్రసాదించే త...

SREESUKTAM-09-GAMDHADVAARAAM

Image
     శ్లోకము  " గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం    ఈశ్వరీగ్0 సర్వభూతానాం తాం ఇహ ఉపహ్వయే  శ్రియం."      క్షుప్తి పాసా మలాం అన్న సమస్యకు పరిష్కారము ప్రస్తుత శ్లోకము.    శ్రేయమును కలిగించుటకు మహాలక్ష్మికి నాప్రార్థనను వినిపించు ఓ జాతవేద!    శ్రేయ స్వరూపిణీయిన మహాలక్ష్మిని,తన పరిమళము ద్వారా భూలక్ష్మిగా ప్రకటింపబడుతున్న భూలక్ష్మికి నేను తనను నా దగ్గరగా వచ్చి నిలిచియుండమని ప్రార్థించుచున్నానని చెప్పు.     ఆతల్లి,    ప్రథ్వీ తత్త్వముతో పచ్చిలకులుగా,సౌగంధికవనములుగా ,పండ్లతోటలుగా,పంట పొలములుగా,కొండ చరియలుగా వివిధ రూపములతో తన సుగంధమును  వెదజల్లుతూ మనకు దర్శనమిస్తున్నది.    ఆ భూలక్ష్మియే తన అనుగ్రహమును పాడి-పంటల రూపముతో ప్రకటింపచేయుచు "ధాన్యలక్ష్మి" గా  దర్శనమిస్తూ ధన్యతను అనుగ్రహిస్తున్నది.    ఆకలితో పాటు దప్పికను తీర్చుటకై ఆ భూలక్ష్మియే నదీమతల్లిగా మారి జలలక్ష్మిగా కీర్తింపబడుతున్నది.   ఆ మహాశక్తియే గోవులను తన ప్రతిరూపముగా సృష్టించి పుష్టిని ఇస్తున్నది.   ...

SREESUKTAM-08-KSHUPTIPASAAMALAAM

Image
   శ్లోకము   " క్షుప్తిపాసా మలాం  జ్యేష్ఠాం అలక్ష్మీం  నాశయామ్యహం     అభూతి అసమృద్ధించ సర్వానిర్ణుద మేగృహేత్"     తనతాను సంస్కరించుకొనబడుటకు లక్ష్మీ  అనుగ్రహమునకై జాతవేదుని సహాయమును అర్థించుచున్నసాధకుడు ఇంతవరకు వారు నాదగ్గరకు రావాలి.అతి సమీపముగా ఉండాలి.నన్ను వీడకుండా నాశ్వసలో శ్వాసగా ఉండాలని కోరుతూ వచ్చాడు.    కాని వారు వచ్చిన స్థిరముగానిలుచుటకు అవకాశము లేని కొన్ని అడ్డంకులు/ఆటంకములు తనలో  ఇంకా ఉన్నాయని,అవి తొలిగితే కాని వారిని స్థిరాసీనులను చేయలేనన్న విషయమును గ్రహించాడు.   కనుకనే ఓజాతవేద! నేనడిగిన వానిని నాదగ్గరకు చేర్చేముందుగా మూడు రకములైన దురవస్థలు నన్ను వీడక ఉన్నాయి.ముందు వాటిని పూర్తిగా,"నిర్ణుద" అమ్మ కరుణపూర్తిగా/సంపూర్తిగా తరిమివేయునట్లు అనుగ్రహించమని సహాయపడుము.   పునర్జన్మతో సంస్కరింపబడాలంటే,       నాలోని,  .క్షుత్తు-ఆకలి 2.పిపాస-దప్పిక 3మలము తొలగిపోవాలి.   క్షుత్తు-పిపాస అభూతినికలిగిస్తాయాఇ.   భూతి అనగా సంపద.న భూతి అభూతి-సంపదను చేరనీయని ఒక దురవస్థ.   సమృద్ధి-పుష్కలము.ఒక...

SREESUKTAM 07-UPAITU MAAM

Image
 శ్లోకము    "ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ   ప్రాతుర్భూతోస్మిన్ రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతుమే"    ప్రస్తుత శ్లోకములో సాధకుడు జాతవేదుని "ఉపైతుమాం" అనగా  మాం -నాదగ్గరకు,ఉప-దగ్గరగా,ఇతు-వచ్చియుండునట్లు సహాయము చేయుము అని ప్రార్థించుచున్నాడు.   అట్లు జరిగినచే నేను బాహ్యమునందును-అంతరంగమందును సంస్కరింపబడి "ప్రాతుర్భూతో"తిరిగి కొత్తజన్మను పొందుతాను,బ్రతికియుండగానే అమ్మ దదాతు మే" నన్ను అనుగ్రహిస్తుంది కనుక.   ఈ శ్లోకమునందు ప్రదానము చేయువారొకరైతే,దానిని భద్రపరచి అనుగ్రహించువారు వారి పరివారములోని  మరొకరు.  ఒకరు దేవ-మహాదేవుని సఖుడైన కుబేరుడు.  సంపదలకు మూలము ఈశ్వరత్వమును కలిగిన మహేశ్వరుడైతే భక్తులకు దానిని భద్రపరచి అందించునది ఈశ్వరవరప్రసాదితుడైన కుబేరుడు.   సంపదలకు మూలము మహాలక్ష్మి అయితే దానిని మనకు భద్రపరచి అందించు వరమును పొందిన "కీర్తి" అని శక్తి.   ఈమెను దక్షప్రజాపతి కుమార్తెగాను సతిదేవి అనుంగు సోదరిగాను కీర్తిస్తారు.  కనుక జాతవేద! దేవసఖుడైన కుబేరుని ఉపైతుని చేయుము.     చ అనగా మరియును,కుబేరుని ఒక్కనినే ...

SREESUKTAM-06-ADITYAVARNAAM

Image
   శ్లోకము  " ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిః తవ వృక్షోధ బిల్వః    తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మీః"    తపఃఫలము బిల్వవృక్షమై ఆదిత్యవర్నముతో ప్రకాశిస్త్యున్నది.లక్ష్మీదేవి తపఫలముగా ఉదయిస్తున్న భానుతేజముతో అనుగ్రహ సంకేతముగా బిల్వవృక్షము లక్ష్మీదేవిచే సృష్టించబడినది.    ఏవిధముగా సూర్యోదయము చీకట్లను తరిమివేసి అఖండకాంతితో ఉంటుందో అదేవిధముగా లక్ష్మీదేవికరుణకు ప్రతిరూపముగా "బిల్వవృక్షము"భానుతేజముతో విరాజిల్లుతు ప్రకటింపబడినది.   ఇక్కడ మనము వనస్పతి-బిల్వ వృక్షము గురించి తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము.    ఇక్కడనుదంతు/ఉదంతు అన్న శబ్దము ప్రయోగించబడినది.తల్లివనలక్ష్మియై పచ్చని వనములను సృష్టించింది.    లక్ష్మీదేవి వనస్పతి.వనః+పతి-ఋగ్వేద 9వ మడలములో ప్రస్తావించిన ప్రకారము అడవికి అధిపతిగా ఉండే దేవతామూర్తి "వనస్పతి".   ఇక్కడ లక్ష్మీదేవికి-బిల్వవృక్షమునకు అభేదము సూచింపబడినది.   చరక సంహిత/సుశ్రిత వృక్షములలో ఉన్నతమైనదానిగా బిల్వవృక్షమును పేర్కొనినవి.   వేయికొమ్మలతో వసివాడక నిత్యము బంగరు ఛాయతో ప్రకాశించేవృ...

SREESUKTAM-05-CHANDRAAM HIRANMAYEEM

Image
    శ్లోకము    చంద్రాం ప్రభాసా జ్వలంతీ శ్రియంలోకే  దేవజుష్టాముదారాం  తాం పద్మినీం శరణం  అహంప్రపద్యే అలక్ష్మీం నశ్యతాం త్వాం వృణే.    -ఓ జాతవేద అంటు,   లక్ష్మీ దేవి అనుగ్రహమునకై అగ్ని సహాయమును అర్థించుచున్న సాధకుడు, 1.మొదటి శ్లోకములో "మ ఆవహ" అంటూ అహ్వానించమని కోరాడు.     అహ్వానమును మన్నించి వచ్చుటయే కాదు, 2."అనపగామినీం' అంటూ  రెండవ శ్లోకములో వచ్చిన తరువాత తనను వీడక శాశ్వతముగా  ఉండునట్లు చేయుము.     అంతేకాదు,ఓజాతవేద 3"అశ్వపూర్వాం రథమధ్యాం" అంటూ ఆమె తన దగ్గరకు వచ్చు సన్నివేశమును,తన ఇంద్రియములనే ఆశ్వములను సరైన మార్గములోఉంచుతూ,తన గుణ్డెచప్పుడు చేయు ప్రణవనాదము  అనుసరించుచుండగా హ్రిదయరథ మధ్యమున ఆసీనమై తల్లి రావలెనన్న దర్శనాభిలాషను  కోరాడు. 4.నాల్గవ శ్లోకములో,  కాం  అనిర్వచనీయమైన  ఆ పరశక్తి నాకు అత్యమ్య విడదీయరాని సాన్నిహిత్యములో "ఉపహ్వయే" నా శ్వసగా మారిపోయి ఉండేలా చేయమని ప్రార్థిస్తున్నాడు.     ప్రస్తుత శ్లోకములో శరణాగతి,ప్రపద్యే శరణమహం" అంటూ,  బాహ్య-అంతర్ శుచికి సానుకూలతను క...