Posts

SARVARTHASADHAKACHAKRAMU

Image
    "తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త షితేనవై    అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"      ప్రాణసక్తికి నిలయమయిన వాయువ్యవస్థను వివరించు ఈ చక్రమును గురించి పరమేశ్వరుడు మాత పార్వతీదేవితో,  " శక్తిః ఏకాదశస్థానే స్థిత్వా సూతై జగత్రయం    విశ్వయోనిః ఇతిగ్యాతా సా విష్ణు దశరూపకం."    పరబ్రహ్మము తాను నిశ్చలముగానుండి తననుండి పది అద్భుతశక్తులను స్థితికార్య నిర్వహణకై ఉత్పత్తి చేసినది.వైష్ణవీ శక్తి శ్రీ లలితా రహస్య సహస్ర నామములోచెప్పినట్లు,  "కరాంగుళి నఖోత్పన్నా  నారాయణదశాకృతి" ని ప్రకటింపచేసినది.    ఈ ఆవరణములోనికి ప్రవేశించిన సాధకుడు తాను ఐదు ప్రధాన వాయువులు-ఐదు ఉపవాయువుల మధ్యన ఉన్నానని గ్రహించగలుగుతున్నాడు.   తనతోపాటుగా తన వెంట వశిత్వ సిద్ధిమాత-సర్వోన్మాదిని ముద్రాశక్తి మాత కనిపెట్టుకుని ఉన్నారన్న విషయమును గ్రహించగలుగుతున్నాడు.    సర్వసిద్ధిప్రదాదేవి    సర్వసంపత్ప్రదాదేవి    సర్వప్రియంకరీదేవి    సర్వమంగళకారిణీదేవి    సర్వకామప్రదాదేవి    సర్వ దుఃఖవిమోచనీ దే...

SARVA SAUBHAAGYADAAYAKA CHAKRAMU

Image
   " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై    అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."       అమ్మ కరుణతో సృష్టిచక్రత్రయమును దాటి,సాధకుడు స్థితిచక్రత్రయ మొదటిదైన,"సర్వసౌభాగ్యదాయక " చక్రములోనికి ప్రవేశించబోతున్నాడు.    16 దళములతో,8 దళములతోవృత్తాకారముగా నున్న చక్ర ఆవరనములను దాటి , 14 కోణములతో వృత్తాకారముగా నున్న మన్వస్త్రము లోనికి ప్రవేశించబోతున్నాడు.కోణములు సూక్ష్మత్వమునకు సంకేతములై,సాధకుని పరబ్రహ్మ తత్త్వమును తెలియచేయుటకు సంసిద్ధమగుచున్నవి.   పరమేశ్వరుడు గురువై పార్వతీదేవికి (గురుశిష్యసంప్రదాయానుసారముగా ) ఉపదేశిస్తున్నాడు.  " ఈకారస్తు మహామాయా భువనానిచతుర్దశా    పాలయంతు పరాతస్మాన్ చక్రకోణం భవేత్ ప్రియే"       సర్వ సంక్షోభిణీ-సర్వ విద్రావిణీ-సర్వాకర్షిణీ-సర్వాహ్లాదినీ-సర్వ సమ్మోహినీ-సర్వస్తంభినీ-సర్వజృంభిణీ-సర్వవశంకరీ-సర్వరంజనీ-సర్వోన్మాదినీ-సర్వార్థ సాధినీ-సర్వ సంపత్తి పూరిణీ-సర్వ మంత్రమయీ-సర్వ ద్వంద్వక్ష్యంకరీ అను గౌణనామములతో " సంప్రదాయయోగినులుగా కీర్తింపబడుతూ,పదునాలుగు కోణములుగా ప్రకటిమగుచున్నది ఈ ఆవరన...

SARVA SAMKSHOBHANA CHAKRAMU.

Image
   "  తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై     అష్టాదశ  మహాద్వీప0 సమ్రాడ్భోక్తా భవిష్యతి"   పూర్వభాగ పరిచయము   ***********************    "లకారః పృథ్వీబీజం తేన భూబింబముచ్యతే   సకారః చంద్రమా భద్రే కలా షోడశమాత్మకః"  అంటూ భూపురములో ప్ర్థ్వీ తత్త్వమును.సర్వాసా పరిపూరకములో జలతత్త్వమును సంకేతించిన పరమేశ్వరుడు,మూడవ ఆవరణమైన, సర్వసంక్షోభణచక్రమును 'హ కార బీజమైన " వ్యోమ తత్తముతో సంకేతిస్తూ పార్వతితో ,తన అష్టమూర్తి తత్త్వమే అష్టదళ పద్మని అనంగ శక్తులను ప్రస్తావిస్తున్నాడు.    సంక్షోభణము అనగా స్పందనము/కదలిక.స్పందనము ద్వారా /చైతన్య ప్రసరణమును గావించి పరిపాలించుట.త్రిపురసందరి చక్రేశ్వరిగా,ఎనిమిది అతిమహత్తర శక్తిస్వరూపములుగా , కుసుమా ఏఖలా మదనా  మదనాతురా  రేఖా  వేగినీ  అంకుశా/కుశా  మాలినీ అను     గౌణనామములతో,  అనంగాను ఉపసర్గను ముందు నిలుపుకుని సాధకునికి సహాయపడుతున్నాయి.    హ కారబీజపూరితమైన సర్వసంక్షోభణ చక్రములోని అనంగ శబ్దము ఆకాశతత్త్వమునకు ప్రతీకయైనది.  ఒక విధముగాచూస్తే ఆ అనంత ఆ...

SARVAASAA PARIPURAKA CHAKRAMU

Image
   "  తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై     అష్టాదశ  మహాద్వీపాం సమ్రాడ్భోక్తా భవిష్యతి"   పూర్వభాగ పరిచయము   ***********************  " లకారః పృథ్వీ బీజం తేనభూబింబముచ్యతే"    ఫ్పార్వతీ ల కారము  ప్ర్ఠ్వీతత్త్వమునకు మూలబీజముగానున్నది.విశ్వములో త్రైలోకమోహన చక్రముగాను,జీవుల ఉపాథులలో  మూలాధారచక్రముగాను అమరియున్నది.  విద్య-అవిద్యా స్వరూపిణి అయిన జగన్మాత ,  అవిద్య గా చేతనులలోను,విద్యా స్వరూపిణిగా ప్రకటయోగినులు-చక్రేశ్వరి గా విరాజిల్లుతు సాధకుని తమోగుణమును మాయా మలమును దూరము చేసి గమనమును సుగమము చేస్తున్నది.   " సర్వాశా పరిపూరక చక్రము"     *******************  అమ్మ అనుగ్రహముతో ఒక్క మెట్టు ఎక్కి రెండవ ప్రాంగనములోనికి ప్రవేశించిన సాధకుడు,వికసిస్తున్న పదహారు రేకులతో వృత్తాకారముగా నున్న ఆవరణములోనికి ప్రవేశించాడు.    విశ్వములో "సర్వాశా పరిపూరక చక్రము"అని ఉపాధిలో "మణిపూరక చక్రము అని పిలుస్తారట.   "షోడశ కళానిధికి షోడశోపచారములు" అను నాదము నినదిస్తుండగా,పదహారుగురు మాతృమూర్తులు సాధకుని సాదరముగ...

SREECHAKRADHAARINI-01

Image
  శ్రీచక్రధారిణి-త్రైలోక్య మోహన చక్రము-01   ****************************    ప్రార్థన    ********    " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై     అష్టాదశ మహాద్వీపం  సమ్రాడ్భోక్తా  భవిష్యతి"     తల్లి అనుగ్రహము/ఆరాధనము అనే ఖడ్గము చేతధరించినవారికి వర్తమానములోనే కాకుండాభవిష్యత్తు నందును సామ్రాజ్యాధికారము ఉంటుందట.ఆసామ్రాజ్యము అష్టాదశ మహాద్వీపమట.అంటే మన ఉపాధిలోని దశేంద్రియములు+సప్తధాతువులు+మనస్సు అను మహాద్వీపములు,నారాయణతత్త్వము అను జలముతోచుట్టివేయబడిఉన్నవి.వానిని సన్మార్గములో సంరక్షించుకోగల  అనుగ్రహము/ఖడ్గము అమ్మ కరుణ మాత్రమే.    పరమేశ్వరుడు పరమేశ్వరికి ప్రథమ ఆవరణమును ఈ విధముగా తెలియచేస్తున్నాడు.  దేవీ!  " చతురస్రం మాతృకార్ణైః మండితం సిద్ధిహేతవే    ముక్తా మాణిక్యఘటితం "సమస్థల" విరాజితం    త్రైలోక్య మోహనం నామ కల్పద్రుమ ఫలప్రదం"     ఈ ఆవరణము కల్పవృక్షమునకు అనుగ్రహశక్తినిచ్చిన,.కోరినకోరికలను తీర్చేశక్తిని కలిగియున్నది.అంతే కాదు సమతల ప్రదేశముగా , ముత్య మణి-మాణిక్య సహితమై మోహ...

SREECHAKRADHAARINI-INTRO

Image
     "  దేవీ ఖడ్గమాల స్తోత్రము"       ******************  " తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై    అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"-    ఆదిశంకరులు భావించినట్లు,    " శివ ఏవ గురు సాక్షాత్-గురుః ఏవ శివః స్వయం" అన్న సూక్తికి ఊఅహరనముగా సక్షాత్ పరమేశ్వరుడు గురువై "శ్రీచక్రధారిణి" యైన అమ్మ యొక్క ప్రకటిత మేరుస్వరూపము యొక్క స్వరూప-స్వభావములను పార్వతీదేవికి అనుగ్రహించిన స్తోత్రమే ,  " శ్రీ శుద్ధ శక్తి మహామాలా స్తోత్రము " అను దేవీ ఖడమాలా స్తోత్రము.   ఖడ్గము అంటే స్తుతి.స్తుతిమాల.పరివారదేవతా సమేత స్తుతి మహా మాల.శక్తివంతమైనది కనుక శక్తి మహా మంత్ర మాల.సత్-చిత్ స్వరూపము కనుక  శుద్ధశక్తి మాల మహామంత్రము.  శుభప్రదమైనది కనుక     శ్రీ శుద్ధశక్తి మహా మాల మంత్రము.     శాక్తేయ సంప్రదాయానుసారముగా దేవీ అర్చనావిధానము, మంత్ర-యంత్ర-తంత్ర విధానములలో కొనసాగుతున్నది.   శక్తివంతమైన శబ్దము మంత్రమైతే-దానిని ఒకచోట నిలుపగలిగేది యంత్రము.ఇక తంత్రము,  ఒక అద్భుతమైన అల్లిక/నేత.ఆత్మ-పరమాత్మలు...

SREESUKTAM-12-AAPAHA SRUJAMTU SNIGDHAANI

Image
   శ్లోకము  "ఆపసృజంతు స్నిగ్ధానీచిక్లీత వసతు మే గృహే  నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే"