Posts

SREECHAKRADHAARInI-03-SARVA SAMKSHOBHANA CHAKRAMU

Image
   శ్రీచక్రధారిణి-03-సర్వసంక్షోభణ చక్రము.   ****************************  ప్రార్థన  *********  " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితే నవై    అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా  భవిష్యసి"   ఇప్పటి వరకు   **********  అమ్మ దయతో సాధకుడు తన మూలాధారములో,స్వాధిష్ఠానములో కదలికలనుపొంది జాగ్రత్-స్వప్న అవస్థలను స్థూల-సూక్షదేహములతో అనుభవించి,మూడవ ఆవరణమైన "సర్వసంక్షోభణ చక్ర "ప్రవేశము చేస్తున్నాడు.తేజసుడు-ప్రజ్ఞ గా తన స్వభావ నామమును మార్చుకుంటున్నాడు.సుషుప్తి అవస్థను తన కారణ శరీరముతో అనుభవించబోతున్నాడు.దానికి కారణము ఆ జీవి చేసుకొనిన కర్మల ఫలితములను అందుకొనవలసిన ఆవశ్యకత.  ఇప్పుడు  *****  విచిత్రముగా దేహము   చలాకిగా లేదు.కలలు లేవు.ఇక్కడ త్రిగుణములు-త్రి అవస్థలు-త్రి శరీరములు ఒక్కటిగా  మారబోతున్నాయి.దేహము ఉంది కాని దేహాభిమానములేదు.మనసు ఉంది కాని మనోభావములు కావు.ఇప్పటివరకు సాధకునిలో దాగిన చైతన్యము అతనిని సాక్షీభూతముగా చూస్తున్నది నిమిత్తమాత్రముగా.ఏమి జరుగబోతున్నదో?      పరమేశ్వరుడు  పార్వతీదేవితో మహేశా...

SREECHAKRADHARINI-02-SARVASAPARIPURAKA CHAKRAMU

Image
     శ్రీచక్రధారిణి-02/సర్వాశాపరిపూరకచక్రము  ***************************   ' తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై     అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"    ఇప్పటి వరకు    ************  అణిమా సిద్ధిమాత+ సర్వ సంక్షోభిణి ముద్రామాత   నివాసమైన త్రైలోక్య మోహన చక్రములో "విశ్వన్" పేరుతో నున్న  సాధకుడు,    జాగ్రదావస్థలో నుండి తన మనసునునిద్రాణము చేస్తూ,తన ఇంద్రియములను మెలకువలోనుంచుతూ అనేక పనులతో సతమతమవుతుంటాడు.అలిసిన స్థూల శరీరము విశ్రాంతిని కోరుకుంటూ తదుపరి పనుల బాధ్యతను సూక్ష్మశరీరమునకు అప్పగిస్తుంది తనతో పాటుగా తన ఇంద్రియములను సైతము నిద్రలోనికి జార్చుతు,రెండవ ఆవరణమైన సర్వాశా చక్రములోని ప్రవేశింపచేస్తుంది.  ఇప్పుడు  *****  పరమేశ్వరుడు పార్వతీదేవికి ,  " స కారః చంద్రమా భద్రే కళా షోడశమాత్మకం" అని  చంద్రబీజమును కలిగి,షోడశకళలు షోడశదళ    పద్మముగా వృత్తాకారముగా నున్న ఆవరణము లోనికి "తైజసునిగా" తనపేరుని మార్చుకుని ప్రవేశిస్తాడు.   స్తోత్రము   *******     ...

SREECHAKRADHARINI-01-TRILOKAMOHANA CHAKRAMU

Image
  శ్రీచక్రధారిణి-త్రైలోక్య మోహన చక్రము-01 **************************** ప్రార్థన ******** " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి" తల్లి అనుగ్రహము/ఆరాధనము అనే ఖడ్గము చేతధరించినవారికి వర్తమానములోనే కాకుండాభవిష్యత్తు నందును సామ్రాజ్యాధికారము ఉంటుందట.ఆసామ్రాజ్యము అష్టాదశ మహాద్వీపమట.అంటే మన ఉపాధిలోని దశేంద్రియములు+సప్తధాతువులు+మనస్సు అను మహాద్వీపములు,నారాయణతత్త్వము అను జలముతోచుట్టివేయబడిఉన్నవి.వానిని సన్మార్గములో సంరక్షించుకోగల అనుగ్రహము/ఖడ్గము అమ్మ కరుణ మాత్రమే. పరమేశ్వరుడు పరమేశ్వరికి ప్రథమ ఆవరణమును ఈ విధముగా తెలియచేస్తున్నాడు. దేవీ! " చతురస్రం మాతృకార్ణైః మండితం సిద్ధిహేతవే ముక్తా మాణిక్యఘటితం "సమస్థల" విరాజితం త్రైలోక్య మోహనం నామ కల్పద్రుమ ఫలప్రదం" ఈ ఆవరణము కల్పవృక్షమునకు అనుగ్రహశక్తినిచ్చిన,.కోరినకోరికలను తీర్చేశక్తిని కలిగియున్నది.అంతే కాదు సమతల ప్రదేశముగా , ముత్య మణి-మాణిక్య సహితమై మోహనత్వముతో పాటుగా,త్రితత్త్వములను కలిగి "త్రైలోక్య మోహన చక్రముగా" కీర్తింపబడుచున్నది....

SREECHAKRADHAARINI-INTRO

Image
 శ్రీ క్రోధినామ శరన్నవరాత్రుల శుభకామనలు.  *************      అమ్మ అవ్యాజ అనుగ్రహమే కలముగా మారి,       సర్వ వర్ణాత్మికయై,        "శ్రీ చక్ర ధారిణి" అను చిన్న ప్రయత్నమునకు శ్రీకారము                        చుట్టింది.       ప్రకటిత ఊహారూపము మేరువైతే,దాని శబ్ద రూపమే ,    "  దేవీ ఖడ్గమాల స్తోత్రము"       ******  " తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై    అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"-    ఆదిశంకరులు భావించినట్లు,    " శివ ఏవ గురు సాక్షాత్-గురుః ఏవ శివః స్వయం" అన్న సూక్తికి ఉదాహరణముగా   పరమేశ్వరుడు గురువై "శ్రీచక్రధారిణి" యైన అమ్మ యొక్క ప్రకటిత మేరుస్వరూపము యొక్క స్వరూప-స్వభావములను పార్వతీదేవికి అనుగ్రహించిన స్తోత్రమే ,  " శ్రీ శుద్ధ శక్తి మహామాలా స్తోత్రము " అను దేవీ ఖడమాలా స్తోత్రము.   "ఖడ్గము అంటే స్తుతి" . వేద ఘోష.అనుగ్రహమనే ఆయుధము. అనేకానేక స్తుతుల /మంత్రమ...

SARVARTHASADHAKACHAKRAMU

Image
    "తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త షితేనవై    అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"      ప్రాణసక్తికి నిలయమయిన వాయువ్యవస్థను వివరించు ఈ చక్రమును గురించి పరమేశ్వరుడు మాత పార్వతీదేవితో,  " శక్తిః ఏకాదశస్థానే స్థిత్వా సూతై జగత్రయం    విశ్వయోనిః ఇతిగ్యాతా సా విష్ణు దశరూపకం."    పరబ్రహ్మము తాను నిశ్చలముగానుండి తననుండి పది అద్భుతశక్తులను స్థితికార్య నిర్వహణకై ఉత్పత్తి చేసినది.వైష్ణవీ శక్తి శ్రీ లలితా రహస్య సహస్ర నామములోచెప్పినట్లు,  "కరాంగుళి నఖోత్పన్నా  నారాయణదశాకృతి" ని ప్రకటింపచేసినది.    ఈ ఆవరణములోనికి ప్రవేశించిన సాధకుడు తాను ఐదు ప్రధాన వాయువులు-ఐదు ఉపవాయువుల మధ్యన ఉన్నానని గ్రహించగలుగుతున్నాడు.   తనతోపాటుగా తన వెంట వశిత్వ సిద్ధిమాత-సర్వోన్మాదిని ముద్రాశక్తి మాత కనిపెట్టుకుని ఉన్నారన్న విషయమును గ్రహించగలుగుతున్నాడు.    సర్వసిద్ధిప్రదాదేవి    సర్వసంపత్ప్రదాదేవి    సర్వప్రియంకరీదేవి    సర్వమంగళకారిణీదేవి    సర్వకామప్రదాదేవి    సర్వ దుఃఖవిమోచనీ దే...

SARVA SAUBHAAGYADAAYAKA CHAKRAMU

Image
   " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై    అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."       అమ్మ కరుణతో సృష్టిచక్రత్రయమును దాటి,సాధకుడు స్థితిచక్రత్రయ మొదటిదైన,"సర్వసౌభాగ్యదాయక " చక్రములోనికి ప్రవేశించబోతున్నాడు.    16 దళములతో,8 దళములతోవృత్తాకారముగా నున్న చక్ర ఆవరనములను దాటి , 14 కోణములతో వృత్తాకారముగా నున్న మన్వస్త్రము లోనికి ప్రవేశించబోతున్నాడు.కోణములు సూక్ష్మత్వమునకు సంకేతములై,సాధకుని పరబ్రహ్మ తత్త్వమును తెలియచేయుటకు సంసిద్ధమగుచున్నవి.   పరమేశ్వరుడు గురువై పార్వతీదేవికి (గురుశిష్యసంప్రదాయానుసారముగా ) ఉపదేశిస్తున్నాడు.  " ఈకారస్తు మహామాయా భువనానిచతుర్దశా    పాలయంతు పరాతస్మాన్ చక్రకోణం భవేత్ ప్రియే"       సర్వ సంక్షోభిణీ-సర్వ విద్రావిణీ-సర్వాకర్షిణీ-సర్వాహ్లాదినీ-సర్వ సమ్మోహినీ-సర్వస్తంభినీ-సర్వజృంభిణీ-సర్వవశంకరీ-సర్వరంజనీ-సర్వోన్మాదినీ-సర్వార్థ సాధినీ-సర్వ సంపత్తి పూరిణీ-సర్వ మంత్రమయీ-సర్వ ద్వంద్వక్ష్యంకరీ అను గౌణనామములతో " సంప్రదాయయోగినులుగా కీర్తింపబడుతూ,పదునాలుగు కోణములుగా ప్రకటిమగుచున్నది ఈ ఆవరన...

SARVA SAMKSHOBHANA CHAKRAMU.

Image
   "  తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై     అష్టాదశ  మహాద్వీప0 సమ్రాడ్భోక్తా భవిష్యతి"   పూర్వభాగ పరిచయము   ***********************    "లకారః పృథ్వీబీజం తేన భూబింబముచ్యతే   సకారః చంద్రమా భద్రే కలా షోడశమాత్మకః"  అంటూ భూపురములో ప్ర్థ్వీ తత్త్వమును.సర్వాసా పరిపూరకములో జలతత్త్వమును సంకేతించిన పరమేశ్వరుడు,మూడవ ఆవరణమైన, సర్వసంక్షోభణచక్రమును 'హ కార బీజమైన " వ్యోమ తత్తముతో సంకేతిస్తూ పార్వతితో ,తన అష్టమూర్తి తత్త్వమే అష్టదళ పద్మని అనంగ శక్తులను ప్రస్తావిస్తున్నాడు.    సంక్షోభణము అనగా స్పందనము/కదలిక.స్పందనము ద్వారా /చైతన్య ప్రసరణమును గావించి పరిపాలించుట.త్రిపురసందరి చక్రేశ్వరిగా,ఎనిమిది అతిమహత్తర శక్తిస్వరూపములుగా , కుసుమా ఏఖలా మదనా  మదనాతురా  రేఖా  వేగినీ  అంకుశా/కుశా  మాలినీ అను     గౌణనామములతో,  అనంగాను ఉపసర్గను ముందు నిలుపుకుని సాధకునికి సహాయపడుతున్నాయి.    హ కారబీజపూరితమైన సర్వసంక్షోభణ చక్రములోని అనంగ శబ్దము ఆకాశతత్త్వమునకు ప్రతీకయైనది.  ఒక విధముగాచూస్తే ఆ అనంత ఆ...