Posts

TANOTU NAH SIVAH SIVAM-05@SIVATANDAVASTOTRAMU

Image
        తనోతు నః శివః శివం-05   *****************    " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"      "శివగంగ శివమెత్తి పొంగగా       నెలవంక సిగపూవు నవ్వగా       హరిహరాత్మకమగుచు       అఖిలప్రపంచమ్ము          ఆనందమయముగా       భవతిమిరహంశుదా        విశాలాక్షికై నిటాలాక్షుడే          " నటకా వతంసుడై"       తకధిమితక యని           నటనం  ఆడెనే.(శ్రీ  వేటూరి)      తన తాందవముతో తత్త్వదర్శనమును అనుగ్రహిస్తున్నాడు మహాదేవుడు.   కిశోర చంద్రుడు ముసిముసిగా నవ్వుకొనుచున్నాడు తన ప్రతిరూపమునుచూస్తూ.రెండవ కిశోరచంద్రుడు తనకు అండగా వస్తున్నాడని.     ఆ ప్రదేశమంతా వేయి వెన్నెలలతో వెలిగిపోతున్నది.   ఆదిశంకరులు దర్శించి,అత్యంత మనోహరముగా కీర్తించినట్లుగా,  " శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటా...

TANOTU NAH SIVAH SIVAM-05@ SIVATANDAVASTOTRAMU

Image
      తనోతు నః శివః శివం-05   *****************    " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"      తన తాందవముతో తత్త్వదర్శనమును అనుగ్రహిస్తున్నాడు మహాదేవుడు.   కిశోర చంద్రుడు ముసిముసిగా నవ్వుకొనుచున్నాడు తన ప్రతిరూపమునుచూస్తూ.రెండవ కిశోరచంద్రుడు తనకు అండగా వస్తున్నాడని.     ఆ ప్రదేశమంతా వేయి వెన్నెలలతో వెలిగిపోతున్నది.   ఆదిశంకరులు దర్శించి,అత్యంత మనోహరముగా కీర్తించినట్లుగా,  " శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం" గా ప్రవేశించిది నాట్యవేదికకు ఆ ఆనందదాయిని నందిని అద్భుత సహచరియై ఆనందతాందవమునకై.     ఆ అద్భుత సౌందర్యరాశీని వీక్షించగలగటం స్తుతించగలగటము సామాన్యురాలినైనా నా తరమా?    అమ్మ అనుగ్రహము దానికి మార్గమును చూపించింది  త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే కథమపి తులయితు.     తల్లీ నీ సౌందర్యమును వర్ణించుటకు బ్రహ్మాదులే సమర్థులు కామంటున్నప్పుడు నేనేంత? కాని నిన్ను దర్శించగల శక్తిగల  నేత్రము కేవలము సదాశివునిది మాత్రమే.కనుకనే ,ఏవిధము...

TANOTU NAH SIVAH SIVAM-04@SIVATANDAVASTOTRAMU

Image
        తనోతు నః శివః శివం-04       *********************  "వాగర్థావివ సంపృక్తౌ  వాగర్థ ప్రతిపత్తయే   జగతః  పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."                (మహాకవి కాళిదాసు)    మనలను తరింపచేయుటకు మహాదేవుడు మనోహరముగా తాండవమును ప్రారంభించాడు.తననుదుటి శోభలను మరింత శోభాయమానము చేస్తూ.     ఆ శోభలను తిలకించి పులకించిపోదాం. 1 జటా కటాహ సంభ్రమ భ్రమ న్నిలింప నిర్ఝరీ    ఎంతటి వాక్చమత్కారము.భ్రమ -సంభ్రమ అంటూ   భ్రమణము-తిరుగుతోందిట గంగమ్మ.కాని మామూలుగా తనకు నచ్చినట్లు కాదు.తాండవ ప్రారంభమునకు ముందు ప్రశాంతముగా ప్రవహించిన ఝరీ-నదీప్రవాహము/నిర్ఝరీ-జీవనదీప్రవాహము/నిలింప నిర్ఝరీ-దివ్యమైన జీవనదీ ప్రవాహమునకు,  సంభ్రమ-భయముతో కూడిన ఆశ్చర్యము కలిగినదట.    దానికి కారణము జటాటవి అనుకున్న స్వామి కేశపాశము "జటాకటాహము"గా తన రూపును సవరించుకున్నది.     ( నామిత్రులు ఇచ్చిన సలహామేరకు ఒక్కసారి గంగావతరణమును తలచుకుంటాను.) గంగమ్మ తానెటు పోవాలో తెలియక ఉన్నవేళ మహాదేవుడు తన జటలో...

TANOTU NAH SIVAH SIVAM-03@SIVATANDAVA STOTRAMU

Image
          తనోతు నః శివః శివం-03    ******************    " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."        (మహాకవి కాళిదాసు)   మహాదేవుని కరుణ మాటలలో చెప్పలేనిది.మనసుతో ఆస్వాదించవలసినది.    గంగమ్మను-వాసుకిని-డమరకుమును ప్రపంచమునకు పరిచయము చేసిన విశ్వేశ్వరుడు తన విశ్వరచనమును మరింత విస్తృతము చేస్తున్నాడు.   "గంగాతరంగ కమనీయ జటాకలాపం-"   తనజటల స్వరూపమును మార్చివేస్తున్నాడు.  చిక్కులతో విడదీయరాని అటవి గమ్మత్తుగా పెద్ద గంగాళముగా తన రూపును సవరించుకుంటోంది.ఇది గంగమ్మకు ఒకపెద్ద సవాలు.తన పాటికి తాను ప్రశాంతముగా ప్రవహిస్తూ,స్వామి జటలను పావనముచేస్తూ,నాట్యవేదికను పవిత్రమొనరించానని తన సామర్థ్యమునకు పొంగిపోదా మనుకుంటే,           అబ్బే1  ఆ అవకాశమే లేకుండా చేస్తోంది స్వామి జట.ఎటువెళ్ళాలో తెలియక భయముతో కూడిన ఆశ్చర్యముతో సుడులుతిరగ తప్పదనుకుంటోంది పాపం.   మహాదేవుడు తన లలాటమును విష్ణుపాదముల నుండి ఆవిర్భవించిన గంగాతరంగ భ్రమణము యొక...

TANOTU NAH SIVAH SIVAM-02@ SIVATANDAVA STOTRAMU

Image
      తనోతు నః శివః శివం-02     *****************  " వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే    జగతః పితరం వందే "పార్వతీ పరమేశ్వరౌ".    వాక్కు+అర్థము ఏవిధముగా అవిభాజ్యములై పారవతీ పరమేశ్వర రూపములో ఉన్నాయో అట్టి పరమేశ్వర తత్త్వమునకు వాగర్థ ప్రసాదనమునకై నేను నమస్కరించుచుచున్నాను.(మహాకవి కాళిదాసు)  పూర్ణబిందువు ను పరమాత్మ తత్త్వముగా అన్వయించుకొను ఆగమశాస్త్రపండితులకు ,  శ్రీవిద్యారహస్యాన్వితమైన "శ్రీచక్రము"-ఉపనిషత్సమానమైన "శివ తాండవ స్తోత్రము" పరస్పరము బింబ-ప్రతిబింబములే.   చరణములోని నాలుగు పాదములు నాలుగు ప్రత్యేక విశవ్షములతో ప్రస్తావింపబడినవి. 1.ప్రపథమముగా గంగాజల ప్రవాహము నాట్య సభాస్థలిని పవిత్రమొనరించినది.    జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే.      స్థలే-ప్రదేశము-పావిత స్థలే-పునీతముచేయబడిన ప్రదేశము,గలత్-ప్రవహ జలే-ప్రవాహ జలముతో పునీతము చేయబడినది ఆ నాట్యస్థలి.ఆ ప్రవాహ జలము తన పయనమును,  జటాటవి-మహాదేవుని అటవి వంటి జడల మధ్యనుండి ప్రారంభించినది.    శ్రీ చక్ర పరముగా అన్వయించుకుంటే ఇది భూపు...

TANOTU NAH SIVAH SIVAM-01@ SIVATANDAVA STTOTRAMU

Image
    తనోతు నః శివః శివం-01   *******************  " కైలాసగిరి  నుండి కాశికై    కాశికాపురి  నుండి దాసికై    దాసికై ఈ దక్షవాటికై    దయచేసినావయా హరహర హరహర."    లోక కళ్యానమునకై ఈశ్వరచైతన్యము సూత్రధారియై కొందరిని పాత్రధారులుగా మలుస్తుంది.వారిని అంటిపెట్టుకుని ఉండమని ఇంద్రియములను పిలుస్తుంది.వాటిని అరిషడ్వర్గములతో ఆటలాడుకొమ్మంటుంది.అయ్యో పాపం అంటూ అక్కునచేర్చుకుంటుంది.దానికిఉదాహరణమే,  నిరాకారము-నిరంజనము-నిర్గుణమైన ఈశ్వరచైతన్యము సాకారమై,తనతో పాటు మరికొన్నింటిని,మరికొందరినితాను ఆడుచున్న ఆటలో భాగస్వాములనుచేస్తుంది.తానొకవైపు-తన చైతన్య ప్రకటనము మరొకవైపు ఉండేటట్లు చేస్తుంది.          పరమాత్మతత్త్వము మనకు ఒకాద్భుత స్తోత్రరాజమును అందించాలనుకుంది.దానికి మరొకరిని కర్త అనుకునేటట్లుగా చేసి సంఘటనలను పొందుపరిచినది.వాటితే మనకేమి సంబంధము లేదు అనుకుంటే మనము పప్పులో కాలేసినట్లే.  ప్రతి ఒక్కరి బదులుగా ఆ పాత్రలు భక్తిభావముతో స్వామిని సేవించుకుంటూ మనకు మార్గదర్శకముగా మారతాయి.మంచి-చెడు విచక్షణను కలిగించటానికి రె...

TANOTU NAH SIVAH SIVAM-INTRODUCTION.@ SIVA TANDAVA STOTRAMU

Image
     ప్రియ మిత్రులారా!        " తనోతు నః శివః శివం."      *****************     అణువణువు శివమే.అడుగడుగు శివమే.  శివానుగ్రహము అర్థముకానిది.అయినప్పటికిని అద్భుతమైనది.అది అట్టడుగున నున్నవారినిసైతము గట్టిగా పట్టుకుంటుంది.మత్తుకళ్ళనుతెరిపిస్తుంది.కొత్తదనమునుచూపిస్తుంది.స్వామికరుణ మనలను సందర్శింప చేస్తుంది.సంభాషిస్తుంటుంది.సన్నుతింపచేస్తుంది.సన్మార్గము చూపిస్తుంది .   కాని చమత్కారము.లీలగా,   మనలను మాయలో ముంచేస్తుంది.శివమును నిందింపచేస్తుంది.నిలదీస్తుంటుంది.నిష్టూరమాడుతుంది.   నేనే వ్రాస్తున్నానను భ్రమలో ముంచివేస్తూ,  "తనోతు నః శివః శివం" అను   శివమును విస్తరింపచేయు శివుని కీర్తించుటకు ప్రయత్నిస్తుంది.            శివునికి దాసోహమనాలన్న నన్ను తనకు దాసోహము చేసుకుని నా అజ్ఞానము కొసమెరుపులు దిద్దుతానంటూ,ముసిముసిగానవ్వుతూ,కొసరి కొసరి తప్పులను వడ్డిస్తుంటుంది.శివస్వరూపులు పెద్దమనసుతో నా దోషములను మన్నించి,నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకముతో,ఈ నా చిన్నిప్రయత్నమును మీతో పంచుకుంటున్నాను. ...