Posts

TIRUPALLIELUCHCHI-04

Image
    తిరుపళ్ళి  ఏలుచ్చి-04   ******************  "కృపాసముద్రం  సుముఖం  త్రినేత్రం   జటాధరం  పార్వతీ వామభాగం   సదాశివం  రుద్రం అనంతరూపం   చిదంబరేశం  హృది భావయామి."   సందర్భము   *********   శివనోమును ప్రారంభింపబోతున్న మన కన్నియలకు స్వామి నేత్ర పుండరీకములు,ముఖబింబము,స్వామిని సేవిస్తున్న నాదము అనుగ్రహించాయి .అసలు స్వామి నోము సంకల్పమే నోము సాఫల్యము.దానికి వారు చేయుచున్న సన్నాహములు-స్నానములు-సన్నుతులు స్వామి కటాక్షమే.ప్రతి అడుగు వారిని స్వామి పాదపద్మములకు చేర్చుచున్నదే.  నానారూపములకు భక్తి నర్తిస్తూ ఏ విధముగా నానారక అనుగ్రహపాత్రులను చేస్తుందో మనకు తిరు మాణిక్యవాచగరు వివరిస్తున్నారు.   ఎళుచ్చి.   *******  తిరుపళ్ళి ఎళుచ్చి-04 ******************* ఇన్నిశయై వీణయర్ యాళినుర్ ఒరుపాల్ ఇరుక్కొండుం తోత్తిరం ఇయంబినార్ ఒరుపాల్ తున్నియ పిణై మలర్ కయ్యనర్ ఒరుపాల్ తొళుకయ్యర్ అళుకయ్యర్ తునళ్కయ్యర్ ఒరుపాల్ సెన్నియల్ అంజలి కుప్పినార్ ఒరుపాల్ తిరుప్పెరుంతురై శివపెరుమానే ఎన్నయుం ఆండ్రుకొండుం ఇన్నరుళ్ పురియం ఎం పెరుమ...

TIRUPALLIELUCHCHI-03

Image
    తిరుపళ్ళి ఎళుచ్చి-03   *****************  "కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం  పార్వతీవామభాగం   సదాశివం  రుద్రం అనంతరూపం   చిదంబరేశం  హృది భావయామి."   సందర్భము   *********  చిదంబరేశుని అవ్యాజానుగ్రహముతో సూర్యోదయమును దర్శించిన కన్నియలకు పరమాత్మ చైతన్యము నాదచైతన్యముగా ఏ విధముగా ప్రకృతిని ప్రకటింపచేస్తున్నదో చూస్తూ,"నాదం  తనుమనిశం" అని సంకీర్తిస్తు,శివనోమునకు తరలుచున్నారు.   ఎళుచ్చి   *******కూవిన పుంకుయిల్ కూవిన కోళి కురుగుకళ్ ఇయంబిన ఇయంబిన శంగం ఓవినై తారకై ఒళి ఒళి ఉదయత్తు ఒరుప్పుడు కిన్రాడు విరొప్పుడు నమక్కు తేవన చెరికళల్ కాడినై కాట్టాయ్ తిరుంపెరుంతురై యురై శివపెరుమానే యాం వరుం అరివరియాయ్ యమక్కు అడియాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె. ........ ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినాం కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమోనమః" *********** ప్రస్తుత పాశురములో తిరుమాణిక్య వాచగరు బ్రాహ్మీముహూర్తము ఏ విధముగా పరమాత్మకు నాదార్చననో చేయుచున్నదో వివరిస్తున్నారు. పోట్రి-అరుణన్ పాశురములలో ఏ విధముగా పరమాత్మ ముఖ...

TIRUPALLI ELUCHCHI-02

Image
     తిరుపళ్ళి ఎళుచ్చి-02    ***************  "కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం  రుద్రం  అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."     స్వామి పుండరీకనేత్రములను దర్శించిన మన భాగ్యశాలురు వాటీని వికశింపచేసిన స్వామిదయను ప్రసరింపచేసిన సూర్యబింబము వైపునకు మరలినవి.వారి మనోనేత్రము సూర్యబింబమును స్వామి ముఖబింబముగా దర్శింపచేస్తున్నది.  తిరుపళ్ళి ఎళుచ్చి-02 ****************** అరుణన్ ఇందిరన్ దిశై అణుగినన్ ఇరుళ్పోల్ అగండ్రదు ఉదయం మలత్తిరు ముగత్తిన్ కరుణన్ శూరియన్ యలయళ నయన కడిమలర్ మలరమర్క అణ్ణవన్ కణ్ణా తిరన్ నిరై అరుపదం మురల్వన్ ఇవైయోం తిరుపెరుంతురై శివపెరుమానే అరుళిరి తరవరం ఆనందమలయే అలకడలే పళ్ళి ఎళుందరుళాయె ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్యపాంపతిః ********** పోట్రి పదముతో ప్రారంభమయిన తిరుపళ్ళి ఎళుచ్చి లో స్వామి ముఖక మలముల -పాదపద్మముల కాంతిని కెందామరలు తంతో వెంట తెచ్చుకొని,సూర్య కిరణముల స్పర్శానుగ్రహముచే వికసనమును పొంది ప్రకాశిస్తున్నట్లుగా వివరించారు తిరుమా...

TIRUPALLI ELUCHCHI-01

Image
       తిరుపళ్ళి ఎళుచ్చి-01       ****************  "కృపాసముద్రం  సుముఖం  త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి.   సందర్భము.   ********  సాక్షాత్తుగా రుద్రరూపమే అయిన-స్వామి జన్మనక్షత్ర భాగ్యమును పొందిన-స్వామిచే పాలింపబడుచున్న "ఆరుద్ర" నక్షత్ర దర్శనము తరువాత పునీతులైన మన చెలులు శివనోమును తిరుపళ్ళి ఏళుచ్చితో ప్రారంభిస్తూ, స్వామి పుండరీక నేత్ర శోభను సంకీర్తిస్తూ తరిస్తున్నారు.       తిరుపళ్ళి ఎళుచ్చి-01 ********************* పోట్రియన్ వాళ్ముదల్ ఆగియ పొరుళె పులందదు పూంకళత్తు ఇనైతునై మలర్కొండు ఏట్రు ఇన్ తిరుముగత్తు ఎమక్ అరుళ్ మలరుం ఎడిల్నడై కొండు ఇన్ తిరువడి తొళుకోం శేట్రిదళ్ కమలంగళ్ మలరుంగన్ వయల్సోల్ తిరుపెరుత్తురైయురై శివపెరుమానే ఏట్రియార్కొడి ఉడయాయ్ ఎన్నై ఉడయాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందు అరుళాయె. ...... జన్మదుఃఖం జరా దుఃఖం జాయాత్ దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత. ********* పోట్రి అను మంగళాశాసనముతో ప్రారంభింపబడిన మొదటి పద...

TIRUVEMBAAVAAY-20

Image
     తిరువెంబావాయ్-20    ***************  "కృపాసముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం పార్వతీవామభాగం   సదాశివం రుద్రం  అనంతరూపం   చిదంబరేశం  హృది భావయామి"   సందర్భము    ********   స్వామి మీద భక్తి వాత్సల్యముగా పరిణామము చెంది స్వామి పాదములకు మంగళాశాసనములను పలికింపచేస్తున్నది.   పాశురము   ******** పోట్రి అరుళగనిల్ ఆదియుం పాదమలర్ పోట్రి అరుళగనిల్ అందమాశెందరిగళ్ పోట్రి ఎల్లా ఉయర్కుం తోట్రమాం పొర్పాదం పోట్రి ఎల్లా ఉయర్కు బోగమాం పుణ్ కళల్గళ్ పోట్రి ఎల్లా ఉయర్కు ఈరా ఇలై అడిగళ్ పోట్రిముం నాన్ముగమునుం కాణాద పుండరీకం పోట్రియాం ఉయ్యాన్ కొండరుళం పొన్మలర్గళ్ పోట్రియాం మార్గళినీర్ ఆడేలో రెంబావాయ్. సర్వైశ్చ పూర్వైః ఆచార్యై ః సత్కృతాయాశ్చ మంగళం ******************* సనాతన సంప్రదాయములోని మంగళాశాసన విశిష్టతను ప్రస్తుత పాశురములో మనకు తిరుమాణిక్యవాచగరు మనకు అందిస్తున్నారు. భక్తులు /జీవులు/చేతనులు పరమాత్మకు మంగళాశాసనములను అందించుట భావ్యమేనా అన్న సందేహము మనకు కలుగ వచ్చును. అసలు ఈ పోట్రి పాశురములోని ఆంతర్యమును కనుక మనము పరిశీ...

TIRUVEMBAVAY-19

Image
  తిరువెంబావాయ్-19  *************  "కృపా సముద్రం సుముఖం  త్రినేత్రం   జటాధరం  పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి"      సందర్భము    ***********  చిదంబరేశుని దివ్య పాదసేవనము తక్క అన్యము కోరక "శివనోమునకు" ప్రాతః కాలమున     మేల్కొని,దివ్యగుణవైభవమనే మడుగులో మునకలు వేస్తూ,ఆడుతూ-పాడుతూ,వారి భక్తిని సామీప్యమునకు చేర్చిన వీరు, పుణ్యవతులు ,సాలోక్యమును కోరుచున్నారు.  ఇంతవరకు తమలో తామే మాట్లాడుకొనిన వీరు మహాచతురులు.సమయస్పూర్తితో స్వామినే మూడు వరములను అనుగ్రహించమని వేడుకుంటున్నారు.అవి,శివభక్తునితో మాత్రమే వారి కళ్యాణము,శివార్చనమునకే వారి చేతులు,శివదర్శనమునకే వారి నయనములు.బాహ్యమును అధిగమించి తేజోమయమైన వారి త్రికరణములకు ఇప్పుడు సూర్యోదయ-సూర్యస్తమయములతో పనిలేదు.   పాశురము   ******** ఉన్ కయ్యర్ పిళ్ళై ఉనక్కే అడిక్కలం ఎన్రు అంగ పళంసోల్ పుదుక్కు ఎం అచ్చ్చత్తాల్ ఇంగళ్ పెరుమాన్ ఉనక్కొండ్రు ఉరేయ్ పోంగే ఎం కొంగై నిన్ అంబర్ అల్లార్ తోళ్ శేరక్క ఎంగై ఉన కళ్ళాదు ఎప్పడియుం శేయర్క కంగు...

TIRUVEMBAVAY-18

Image
    తిరువెంబావాయ్-18   ****************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీవామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."    సందర్భము    **********  స్వామి పాదపద్మముల ప్రాభవించిన సౌభాగ్యశీలురు ఏ విధముగా విష్ణువు/బ్రహ్మ/తక్కిన దేవతలు స్వామి పాదార్చన కు జపతప/స్నాన-వ్రతాదులను ఆచరించుచున్నారో,అట్టి పాదార్చనమునకు స్వామి అవ్యాజకరుణతో తమకు అనుగ్రహించినాడు ఓ చెలీ! సీఘ్రమే మేల్కొని శివనోమునకు సిద్ధముకమ్మని చెబుతున్నారు.    ప్రస్తుత పాశురములో స్వామి నిరాకార-నిర్గుణ-నిరంజన స్వరూపమును సంకీర్తిస్తున్నారు.    పాశురము    ******** అన్నా మలాయన్ అడిక్కమలం శెన్రి ఇరంజి విణ్ణోర్ ముడియున్ మణిత్తోగై వీరు అట్రార్ పోల్ కణ్ణార్ ఇరవి కదిర్వందు కార్కరప్పన్ తణ్ణార్ ఒళి మళుంగి తారగైగల్ తామగల పెణ్ణాణి ఆణాయ్ అళియాయ్ పిరంగొళిచేర్ విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయుం వేరాగి కణ్ణార్ అముదముమాయ్ నిన్రన్ కళల్ పాడి పిణ్ణే ఈం పూంపునల్ పాయిందాడేలో రెంబావాయ్. ..... డానం శ్రీరామకవి తన దేవీ భాగవతములో చెప్పినట్లు, " పురుషునకు...