TIRUVEMBAVAY-18

 


  తిరువెంబావాయ్-18

  ****************

 "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం

  జటాధరం పార్వతీవామభాగం

  సదాశివం రుద్రం అనంతరూపం

  చిదంబరేశం హృది భావయామి."


   సందర్భము

   **********

 స్వామి పాదపద్మముల ప్రాభవించిన సౌభాగ్యశీలురు ఏ విధముగా విష్ణువు/బ్రహ్మ/తక్కిన దేవతలు స్వామి పాదార్చన కు జపతప/స్నాన-వ్రతాదులను ఆచరించుచున్నారో,అట్టి పాదార్చనమునకు స్వామి అవ్యాజకరుణతో తమకు అనుగ్రహించినాడు ఓ చెలీ! సీఘ్రమే మేల్కొని శివనోమునకు సిద్ధముకమ్మని చెబుతున్నారు.


   ప్రస్తుత పాశురములో స్వామి నిరాకార-నిర్గుణ-నిరంజన స్వరూపమును సంకీర్తిస్తున్నారు.


   పాశురము

   ********

అన్నా మలాయన్ అడిక్కమలం శెన్రి ఇరంజి

విణ్ణోర్ ముడియున్ మణిత్తోగై వీరు అట్రార్ పోల్


కణ్ణార్ ఇరవి కదిర్వందు కార్కరప్పన్

తణ్ణార్ ఒళి మళుంగి తారగైగల్ తామగల


పెణ్ణాణి ఆణాయ్ అళియాయ్ పిరంగొళిచేర్

విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయుం వేరాగి


కణ్ణార్ అముదముమాయ్ నిన్రన్ కళల్ పాడి

పిణ్ణే ఈం పూంపునల్ పాయిందాడేలో రెంబావాయ్.

.....



డానం శ్రీరామకవి తన దేవీ భాగవతములో చెప్పినట్లు,


" పురుషునకు నాకు భేదము పోరయదెందు

నరయనేకత్వమునకు హానిలేదు

వాడె నేనేనె వాడను వాడొకండె

ముక్తుడట్టుల గాకున్న మూఢుడతడె"


ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు పరమాత్మ ప్రక్షిత-నిక్షిత స్వేఛ్చాలీలను విశదపరుస్తున్నారు.

 కదిర్వంద-సూర్యుని వలె ఉదయిస్తూ

   స్వామి మన

కణ్ణాన్-కనులలో దాగియున్న/నిండియున్న

 ఇరవై -చీకట్లను

కార్పరప్పన్-తరిమివేస్తున్నాడు.

 కొండంత కరుణను నింపుకున్న మనస్వామి ఏ విధముగా దేవతలు పాదనమస్కారము చేయగానే వారి ముఖములోని సంతోషము, వారు ధరించిన కిరీట మణులకాంతులను వెలవెలబోవునట్లు చేసినదో,

 ఏ విధముగా అప్పటివరకు తళుకులు విరజిమ్మిన నక్షత్రములు మసకబారినవో అదే విధముగా ఐహికమోహములను చుక్కలు స్వామి అనుగ్రహ ఉషోదయము కాగానే(మనపై) మసకబారిపోతాయి.

  ఆ దివ్య అనుగ్రహమును పొందిన జీవులు స్వామి స్త్రీయా-పురుషుడా-లేక అర్థనారీశ్వరమా అను సందేహమును వీడి నిర్గుణ-నిరంజన-నిరాకార నిస్తుల శోభను 

దర్శిస్తూ,కన్నులనిండుగా ఆ అమృతదర్శనమును ఆస్వాదిస్తూ,అనవరత నామసంకీర్తన సేవనమును చవెస్తుంటాడు.ఓ చెలి!మేల్కాంచి నోమునకు సిద్ధముకమ్మని చెలిని వేడుకుంటున్నారు ఆ పరమహంసలు అయిన కన్నియలు.



   అంబే శివే దివ్య తిరువడిగళే పోత్రి

  ఏక బిల్వం శివార్పణం.



Comments

Popular posts from this blog

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI