Posts

ADITYAHRDAYAMU-05

Image
  ఆదిత్యహృదయము-05 **************** "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము స్తోత్ర పరిచయము-ఆత్మ స్వరూపము-అర్చనావిధానము-ఫలసిద్ధి మొదలగు విషయములను అగస్త్యమహర్షి రామ చంద్రునకు/మనకు వివరించినారు. ఒక సిద్ధాంతము ప్రకారము ప్రస్తుత శ్లోకమును, "ఆదిత్యహృదయ స్తోత్ర" ప్రారంభశ్లోకముగా పరిగణిస్తారు. నిజమునకు ప్రస్తుత శ్లోకము,"పరమాత్మకు-ప్రపంచమునకు వారథి వంటిది.దీనిని ఆలంబన శ్లోకముగా కూడా భావిస్తారు. ఖగోళ సౌరశక్తిని భూగోళమునకు చేర్చు సహాయకారులు "కిరణములు" వాటి ప్రసక్తి ఈ శ్లోకమునుండి ప్రారంభమవుతుంది. శ్లోకము ****** "రశ్మిమంతం-సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్య -వివశ్వంతం భాస్కరం-భువనేశ్వరం" తన కిరణములను పూర్తిగా విస్తరింపచేసి అంతకు ముందున్న చీకట్లను దాచివేసి దేవతలచే-అసురులచే నంస్కరింపబడుచున్న ,భువనేశ్వరుడైన భాస్కరుని , ఓ రామా!-పూజింపుము అని అగస్త్యుడు పలుకుచున్నారు. "స్వామి" వేటిద్వారా సర్వమును-సకలమును అనుగ్రహిస్తున్నాడో అవి "రశ్...

ADITYAHRDAYAMU-04

Image
  ఆదిత్యహృదయము-04 **************** "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** పరిశ్రాంతుడై-చింతాక్రాంతుడైయున్న రామచంద్రునికి తక్షణ కర్తవ్యమును సూచించుటకై, అభ్యాగతిగా వచ్చిన అగస్త్యమహాముని, రామా ద్రష్టుం/చూడు రామా-శృణుం-విను రామా -జపేత్-జపించు అంటూ కార్యోన్ముఖుని చేస్తున్నాడు. స్తోత్ర శీర్షికా సార్థకతను(ఫలశృతి) తెలియచేయునది ప్రస్తుత శ్లోకము. శ్లోకము ***** " ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాసనం జయావహం జపేత్ నిత్యం అక్షయం -పరమం-శివం." అదిత్యుడు అంటే ఎవరు? 1. "వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమపస్తు పారే" అని స్తుతిస్తున్నది పురుషసూక్తము. క్రియాశీలుడైన పరమాత్మ సమస్త నామరూపములను ప్రకటింపచేసి, తాను ప్రకాశిస్తూ వానియందు ప్రవేశించి,అరుణవర్ణముతో చీకట్లనుండి (పారే) దాటించివేస్తాడో వాడే ఆదిత్యుడు.అని నేను తెలుసుకుంటున్నాను అంటున్నది. రుద్ర నమకము సైతము, ధావతే సత్వానాం పథయే నమః అని తన భక్తుల ముందు తానుండి నడిపించువాడు,తన భక్తులను అనుసరిస్తూ ...

ADITYAHRDAYAMU-03

Image
  ఆదిత్యహృదయము-03 **************** "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి." శ్లోకము ****** "రామ రామ " మహాబాహో శృణు గుహ్యం-సనాతనం" యేన సర్వాన్ అరీన్ వత్స! సమరే విజయిష్యతి." పూర్వ రంగము. ************ సంఘర్షణతో నిండియున్న రామచంద్రునికి ధైర్యమును కలిగించుటకై/ఉపాయమును సూచించుటకై, "అభ్యాగతో స్వయం విష్ణుః" గా అగస్త్య మహాముని దేవతలతో కూడి వచ్చి,తానొక్కడే రామునికి దగ్గరగా వెళ్ళి,ఏదో సూచించబోతున్నాడు. "స్తోత్రమును ఉపదేశించుటకు ముందే స్తోత్ర ఫలసిద్ధిని అందించారు మహర్షి".స్తోత్ర లక్షణమును-రక్షణమును తెలియచేశారు. కురుక్షేత్ర యుద్ధములో గీతోపదేశము వలె ఈ సూర్యోపాసన స్తోత్రము సైతము అన్యులకు గోచరము కానిదని పెద్దలు చెబుతారు.ఇదియేకగా క్షిప్రప్రసాద లక్షణము. మహర్షి రామం ఉపాగమ్య అన్న పదములను గమనిస్తే, రామునికి మరింత దగ్గరగావచ్చి ఉపదేశించబోతున్న స్తోత్రము,రెండు శుభలక్షణములను కలిగి యున్నది. 1.గుహ్యత కలిగినదిగుహ్యం.ఏ విధముగాగమనమును కలిగినది గమ్యమో గుహ్యతను కల...

ADITYAHRDAYAMU-02

Image
  ఆదిత్యహృదయము-02 *************** " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం హిరణసమిత పాపద్వేష దుఃఖస్య నాశం అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." దైవతైశ్చ సమాగమ్యాద్రష్టుమభ్యాగతో" రణం" ఉపగమ్యాత్ బ్రవీత్ రామం అగస్త్యో భగవాన్ ఋషిః." వివేక రాహిత్యము -విచక్షణాజ్ఞానముతో తలపడుటకు సిద్ధముగా నున్న సందర్భము. " జ్ఞాత్వా గృహీణ కర్మాని" అన్నది ఆర్యోక్తి. మనముచేసే పనుల యొక్క స్వభావము-ప్రయోజనము తెలిసికొని ఆచరించుట విధానము.సర్వోత్కృష్టము. ప్రస్తుత శ్లోకములో "రణమును" గమనించిన అగస్త్యుడు,విజయ ప్రేరేపణమును గావించుటకు,దేవతా శక్తులతో కూడి వచ్చెను. యుద్ధము-సమరము అన్న పదములను ప్రయోగించిన మహర్షి వాల్మికి,"రణము అన్న శబ్ద ప్రయోగమును చేశారు. ఘర్షణాపూరితమైనది "రణము" మనసునకు బలమైన తాకిడిని/రాపిడిని కలిగించు చిత్తవృత్తులు/చింతనములే "రణము. రామచంద్రుని మనసు సంఘర్షణముగానే యున్నది.రావణాసురుని చిత్తము సంఘర్షణముతోనే యున్నది. దానిని ద్రష్టుం-గమనించిన వ్యక్తి అగస్త్యుడు. దానిని తొలగించవలసిన బాధ్యత తనది గా భావించాడు. " సీతమ్మ సైత...

ADITYAHRDAYAMU-01

Image
  ఆదిత్యహృదయము-01 ***************** శ్లోకము-01 ********** ప్రార్థన ******* "జయతు జయతు సూర్యం-సప్తలోకైక దీపం హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి." శ్లోకము ******* "తతోయుద్ధ పరిశ్రాంతం-సమరేచింతయాశ్రితం రావణంచాగ్రతో దృష్ట్వా- యుద్ధాయ సముపాశ్రితం." పూర్వ రంగము ************ 'క్షిప్తాస్చాపి శరాస్తేన శస్త్రాణివివిధానిచ న రణాయ వర్తంతే మృత్యుకాలేభి వర్తతః" వానరసేనల రాతి దెబ్బలకును,రాముని శరాఘాతములకును రావణుడు వ్యాకులుడై యుద్ధము చేయలేక యుండెను.దానిని గమనించిన సారథి,రావణుని రథమును పక్కకు మరల్చెను.రావణుడును తన చేతిలోని ధనసును కిందపడవైచెను.తాత్కాలికముగా యుద్ధము ఆగినది. రజోతమోగుణ ప్రేరేపితుడైన రావణుడు రాముని క్షమా భిక్షనడుగక,సారథిని మందలించి,తన ప్రాణ ములను కాపాడినందులకు సారథికి కంకణములను బహూకరించి,తిరిగి రణభూమికి రథమును తరలించమని సూచించెను. రామచంద్రుడు సైతము ఆ మహాసంగ్రామములో, శ్రాంతం-అలిసిపోయెను. కాదు-కాదు పరిశ్రాంతం-పూర్తిగా అలిసిపోయెను. ఇది దేహపు పరిస్థితి. దానికి తోడుగా స్వామిమనసు సైతము చింత తో-శోకముతో న...