SA SAKTI SIVA ASHTAKAM
స శక్తి శివ అష్టకము ************************ 1. చతుర్వేదముల నాదసారము కావ్యనాటక పాటవములు ఇతిహాసముల దరహాసములు మేలుబాణి పురాణములు సకలశాస్త్ర సమాహార సంపద సముపార్జనకు సాధనా విజ్ఞానము ప్రసాదింపుము శరణు శరణు శివ డమరుకం. 2.నాలుగు వేదములతో కూడినవిగ ఆరు వేదాంగములు నాలుగు ఉపాంగములు కలిసినవి, పదునాలుగు విద్యలు నాలుగు అరవై కళలలో ఆరితేరుటకు చేయు సాధనా చతురత ప్రసాదింపుము శరణశరణు శివ డమరుకం. 3. శంక నివారణోపాయములు మరియు శబ్దశాస్త్రపు రీతులు తడబడక సాగిపోవు బుధజనుల తర్క-మీమాంసాదులు ఆశుకవితా అద్భుతాలు అనవరత ఆస్వాదన సాధనా పటిమను ప్రసాదింపుము శరణు శరణు శివ డమరుకం 4. గణిత శాస్త్రము ఖగోళ భూగోళ వైజ్ఞానిక శాస్త్రములు అణిమ గరిమ అష్టసిద్ధులు లోక క్షేమ కారకములుగ సంపూర్ణజ్ఞాన సముపార్జనకు దృఢ సంకల్ప సాధనా శక్తి-యుక్తి ప్రసాదింపుము శరణు శరణు శివ డమరుకం. 5.పట్టిన పట్టువీడక కష్టసాధ్యపు క్లిష్టమార్గమునందున ...