Posts

ఓం నమో నారాయణాయ-15

Image
" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే" ఓం నమో నారాయణాయ-15 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది. లేమ!" లేత చిలుకతో' పోల్చబడినదైన పరిణితముగ పలుకుచున్న "పదియవ గోపికలో" "నీంగళే-నీవల్లే" అను వాదోపవాదములైన కృష్ణమాయ కమ్ముకునిన " గోపికల సం శయములో" బంధింపబడిన తలుపు అటు-ఇటు వాక్చమక్కులైన చక్కని చుక్కల మక్కువ పరిహాసోక్తులలో " తిరు-పావై" అను వేదబీజ స్వరూపమైన పదిహేను రోజుల వ్రత పుణ్య పూర్వ భాగములో తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె. భావము అమ్మచే నిద్రలేపబడుతున్న చిన్ని చిలుకవలె పలుకుతున్న పదియవ గోపికలో,ఇదంతా నీవల్లే అంటే నీవల్లే అని నిందించుకొనుచున్న గోపికలలో,మూసిఉన్న తలుపునకు రెండువైపులనుండి పరిహాసపు మాటలాడుకొనుచున్న గోపికలలో,వ్రతములో సగభాగము పూర్తియైనదన్న విషయములో గోపిక మనసు లగ్నమైనది.(ఇది సామాన్యార్థము.) తెల్లవార వచ్చెను ...

ఓం నమో నారాయణాయ-16

Image
ఓం నమో నారాయణాయ-16 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది. "మాధవం-మణివణ్ణన్ సేవకు ఆటంకించుచున్న వారైన ద్వారకాపతి " ఆ"నందభవనపు ద్వారపాలకులలో "శిఱు మియరో ముక్కు " అనుభావము అనుభవైకవేద్యమైన చిన్నవారమని అన్న గోపికల ఉన్నత సంస్కారములో సంకల్పము సాధ్యపరచు భక్త కల్పతరువైన శిరమొడ్డిన పరవశమై విడిన అడ్డ గడియలో సిరిసంపదలను మించిన సౌభాగ్యప్రదమైన తులసిదళముతో స్వామిని తులతూచిన తక్కెడలో అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె " ఆముక్త మాల్యద" ఆండాళ్ అమ్మ వెంట నేడె. భావము నంద భవన ప్రవేశమునకు గోపికలను ద్వార పాలకులు అడ్దగించినారు.అప్పుడు గోపికలు తాము నియమ నిష్ఠలు లేనివారమని,ముక్కుపచ్చలారని చిన్నివారమని ఒక్కసారి స్వామిని దర్శించి మరలివెళ్ళెదమనితలుపుతీయమని,శిరసువంచి ద్వారపాలకులను అర్థించినారు.వంగిన వారి శిరము(లు) తగిలి,తలుపు గడియ విడినది.దానిని దగ్గరుండిచూసిన మన గోపికకు తులసిదళముతో స్వామిని తూచిన తక్కెడ గుర్తుకు వచ్చినది.(ఇది సామాన్యార్థము) "మా" మాయొక్క "ధవన్" వాడు/దేవుడు.శ్రీ...

ఓం నమో నారాయణాయ-17

Image
ఓం నమో నారాయణాయ-17 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామసంకీర్తనమే కోరుతోంది మోదపు ప్రదానముతో "దానపు నిధానమైన" ఆనంద గోపాలుని తండ్రి " ఆ నంద మహారాజులో" " నదీతీరముల మొలుచు" అతిసుకుమారములైన " ప్రబ్బలి" చిగురుబోడి గొబ్బెత "యశోదమ్మలో" "ఆదిశేషుడే" స్వయముగ స్వామికి" అన్నగారైన" హలాయుధుడు " బలరాముని కాలి కడియములో" స్థూల-సూక్ష్మములన్నింట్లో " మూలము" తానేయైన పంకేరుహలోచనుని " శంఖు-చక్ర పాదములలో" అతి" పవిత్రమైన వ్రతము " ఆచరింప రారె " ఆముక్తమాల్యద" ఆండాళ్ " అమ్మ వెంట" నేడె. భావము దాన యశోవిరాజితుడగు నంద మహారాజుని,ప్రబ్బలి సౌకుమార్యముగల యశోదమ్మను,బలరాముని కాలి కడియమును,శంఖు-చక్రములున్న స్వామి పాద పద్మములను,అమ్మ వెంటనున్న మన గోపిక భావించగలుగుతున్నది.(ఇది సామాన్యార్థము) స్వామి పాదములోని శంఖము సకల జీవుల నాద రూపమునకు ( ఓంకారము),చక్రము సకలజీవుల తేజో రూపములకు సంకేతములు.మన గోపిక,ఆండాళ్ తల్లిలో యశోద సౌకుమార్యమును,నం...

ఓం నమో నారాయణాయ-18

Image
Seen by 10 Comments Write a comment... Nimmagadda Subbalakshmi January 1 " శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే". ఓం నమో నారాయణాయ-18 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణిచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది. "భక్తాంఘ్రిరేణుం- భగవంతుమీడే" అని కీర్తించుచున్నవైన తొండరడిప్పొడి ఆళ్వార్ విరచిత " తిరుప్పళ్ళి యళుచ్చి"లో ముదితలార! ముచ్చటగ "మదమును స్రవించుచున్నవైన" మాతంగములను "మర్దించు " మదన గోపాలునిలో పోటీ పడుచు చేరుచున్న " మళ్లలేని నోళ్ళవైన" కోళ్ళ కొక్కొరోకో అను " కోటి కోటి పిలుపులలో" "మాధవీలత"" పందిరిపై " గుంపులుగా కూర్చున్నవైన గోపికమ్మలను నిద్రలేపు" కోకిలమ్మ గానములలో" అతి" పవిత్రమైన వ్రతము " ఆచరింప రారె " ఆముక్త...

ఓం నమో నారాయణాయ-18

Image
" నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిర స్సిద్ధమధ్యాసయంతీ స్వాచ్చిష్టాయాం స్రజినిగళితం యా బలాత్ కృత్యభుఙ్క్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ:"-శ్రీ పరాశర్ భట్టర్. ఓం నమో నారాయణాయ-19 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది అమ్మ యదపై నిదురించు అచ్యుతుడు అందించుచున్న "అంబరమే-తన్నీరే-శిఱే" మరియు పఱ వాయిద్యములో గోపికలు మేల్కొలుపుతునున్న తాను మౌనముగానున్నదైన "నప్పిన్నాయ్ వాయ్ తాల్తిరవాయ్" తల్లి పలుకే బంగారములో శ్రీ పరాశర భట్టు స్తుతించు యశోద మేనకోడలైన పూబంతి చేతనున్న నీళ ముఖ యశోకాంతులలో అమ్మ పుట్టినింట ఏడుగురు అసురులు నిక్షిప్తమైన ఆబోతుల స్వామి హతమార్చెనన్న ఆ పోతన స్తుతులలో అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె. భావము మన గోపిక పర ఇస్తానని చెప్పి నీలాదేవి ఎదపై నిదురిస్తున్న స్వామిని,అమ్మ ఎంత పిలిచినా తలుపుతీయక పోగా,వస్తున్నా!తీస్తున్నా అని పలుకైనా పలికని నీలాదేవిని,శ్రీ పరాశర భట్టర్ చే చేతిలో పూబంతి ధరించి చిద...

ఓం నమో నారాయణాయ-19

Image
" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే". ఓం నమో నారాయణాయ-19 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది "ముప్పదిమూడుకోట్ల దేవతల" ధర్మ సం స్థాపనమైన శిష్ట రక్షణమను కృష్ణుని " భుజ పరాక్రమములో" శరణాగత రక్షణమున " శత్రువులను వణికించినదైన" సర సరా పాకుతున్న " భయము తెచ్చు వెప్పంలో" మండుచున్న కట్టెలు " చిగురించుచున్నవైన" "వేణుగానమును ఆపమన్న" బువ్వ వండు తల్లిలో గోపాలునితో గోపికలు " స్నానమాడుటకు కోరినవైన" " విసనకర్ర-అద్దమును" అమ్మను ప్రసాదించమనుటలో అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె. భావము ముప్పదిమూడు కోట్ల దేవతలనిశ్చింతను,శ్రీ కృష్ణుని శరణార్థుల శత్రువులకు భయముతో వచ్చిన జ్వరమును (తెప్పం) వేణుగానమును ఆపమని స్వామిని ప్రార్థించిన తల్లిని,స్వామితో కలిసి స్నానమాచరించుటకు విసనకర్రను-అద్దమును అ...

ఓం నమో నారాయణాయ-20

Image
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది "విష్ణు పాద లక్ష్మీ సంకేతముగ" ఊర్థ్వ పుండ్రమైన ఫాలభాగ ప్రకాశిత "తిరుమాన్ శ్రీ చరణములో" " ధారకము-పోషకము భోగము" తానేయైన మందస్మిత వదనుని " బృందావనములో" "కోదై" అను నామముతో " కొంగు బంగారమైన" పెరియాళ్వార కూతురు " పెద్ద ముత్తైదువలో" "'క్రిష్' అపరిమితమైన "ణ" ఆనందము" నామరూపములైన భక్తజన రంజనుడు " ఆ నిత్య నిరంజనునిలో" అతి" పవిత్రమైన వ్రతము" ఆచరింప రారె " ఆముక్త మాల్యద" ఆండాళ్ అమ్మ వెంట నేడె. భావము విష్ణుపాదములను,లక్ష్మీ ముద్రగా భావించే స్వామివారి తిరునామమును,కర్త-కర్మ-క్రియ మూడు తానేయైన శ్రీకృష్ణుని బృందావనమును,పెద్ద ముత్తైదువును గోదాదేవిని మన గోపిక చూచినది. తిరునామ పవిత్ర విశేషములను చతుర్ముఖుడైన బ్రహ్మకు,వేయి పడగల ఆదిశేషునకు శక్యముకాదు.యథాశక్తి ప్రయత్నిస్తాను.మథ్వాచార్యులవారు ఈ పవిత్ర సంప్రదాయమును పరిచయము చేసిరి.పరాశర స్మృతి దీని విశేషతను వివరిస్తుంది.వ...