Posts

ఓం నమ: శివాయ-107

Image
 శివ సంకల్పము-107  ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా  భక్తి మకరందమును చందనముగ పూయనా  ఆది అనాది లేదంటు బూదిని నే రాయనా  శాంతి సహన పుష్పాలతో పూజను నే చేయనా  పాపరహితము అనే దీపమునే వెలిగించనా  పొగడపూల వాసనలనే పొగలను నే వేయనా  లబ్బు డబ్బు శబ్దాలతో స్తొత్రములే చేయనా  ఉచ్చ్వాస నిశ్వాసలనే వింజామరమునే వీచనా  అరిషడ్వరగములు లేని ఆతిధ్యమును నేనియ్యనా  హర హర మహా దేవ అంటు హారతులనే ఇవ్వనా  దాసోహం దాసోహం అంటు ధన్యతనే పొందనా  నా పక్కనే ఉన్నావురా చూడ చక్కనైన శంకరా.

ఓం నమ: శివాయ-108

Image
" పునరపి జననం- పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే -బహు దుస్తారే కృపయా పారే -పాహి త్రిపురారే" ఓం నమ: శివాయ శివ కుటుంబములోని "చిన్ని శిశువును" నేను "ఆకలేస్తున్నదంటే" అన్నపూర్ణమ్మకు చెప్పు "అన్నము నే తిననంటే" ఆ జాబిలిని కిందకు దింపు "దాహమువేస్తున్నదంటే" ఆ గంగమ్మకు చెప్పు "నేను ఆడుకోవాలంటే" ఆ లేడిపిల్లను పంపు ఆటుపోటులన్నిటిని" ఆదరముతో" కప్పు కనురెప్పగ పిల్లలను" కాచుటయే ఒప్పు" కానిపనులు చేసినను" క్షమియించుటయే మెప్పు" "ఉప్పుబొమ్మ కరిగినది" కొత్త బొమ్మ మిగిలినది తప్పు తెలిసికొన్నది" తరియిస్తున్నది నీ ఒడిలో" లక్షణమగు ప్రేమతో" ఒక్క క్షణమైనను" నన్ను వీడక రక్షను అందీయరా తక్షణమే శంకరా ......కార్తీక మాసము శివ కేశవ మాసము.రెండు రూపములు ఒకే మనసు.ఈశ్వర హృదయస్య కేశవ-కేశవ హృదయస్య ఈశ్వర అనునది ఆర్యోక్తి.కాలాతీతమైన దేవుడు కనికరముతో ఎన్ని జన్మలందైనను మనలను తన ఒడిలోనికి తీసుకొని ఆదరిస్తూనే ఉంటాడు.మాయాతీతముకాని జీవుడు మరల మరల భగవంతుని ఎన్నో కోరికలు ...

sirivennelagaariki savinaya namaskaaramulatoe

Image
https://www.youtube.com/watch?v=j3cZQwh19bs

nee loena SivuDu kalaDu

Image
తనికెళ్ళ భరణిగారికి నమస్కృతులతో. నీలోన శివుడు గలడు-----దాగి నెనరు దీవించగలడు. 1."ఎందరో మహానుభావులు" నిన్ను, అందరిలో ఒకరిగా అందించాడు వందనీయ రామలింగేశ్వరుడు. 2."నక్షత్రము" నీవని,"నక్షత్ర దర్శనము"ను చేయిస్తావని "దశ భరణి" అని నామకరణమును చేశాడు ఆ నాగాభరణుడు. 3.మిక్కుటమగు ప్రేమతో చిక్కులను విడదీస్తు "కుక్కుటేశ్వరుడు" దాగి "కొక్కొరోకో" అన్నాడు. 4."శ్రీ రాళ్ళబండి" రూపములో రాళ్ళుతాకు బాట అను "గ్రహణము" విడిపించాడు అనుగ్రహము కలవాడు. 5."స్త్రీ దుస్తుల దర్జీ" గా "పరికిణి" నువు కుడుతున్నప్పుడు సున్నితపు సూదియైనాడు ఆ బూదిపూతలవాడు. 6."శివ" అని వినబడగానే శుభములు అందించుటకు ఘంటము తాను ఐనాడు కంట మంటలున్నవాడు. 7."అర్థనారీశ్వరపు ఒద్దిక" అను "మిథునము" నకు తోడై నడిపించాడు నిన్ను ఆ మూడుకన్నుల వాడు. 8."గార్దభ అండమును"కోరు మాయను మర్దింపచేసి ఆర్ద్రత నిలిపాడు నీలో "ఆట కదరా శివా" అని అంటూ 9."యాస" ఉన్న బాసలో "శభాష్ శంకరా...

saraswati namoestutae

సరస్వతీ   నమోస్తుతే         *******************   జగమున శారద  నమోస్తుతే _ గగనపు  శారద నమోస్తుతే   సుత  నారద  నమోస్తుతే  -సిత  నీరద  నమోస్తుతే   ఇందిర  సఖి నమోస్తుతే  -ఇందు ముఖి  నమోస్తుతే   వేదసారమా నమోస్తుతే  - ఘనసారమా నమోస్తుతే   పటిమ  అనుపమ  నమోస్తుతే  - పటీర  ఉపమ  నమోస్తుతే   మాఘ శుక్ల పంచమి  నమోస్తుతే - మరాళ వాహన నమోస్తుతే   తల్లి  ఆకార  నమోస్తుతే  -మల్లికాహార  నమోస్తుతే   నిషాద ఏలిక నమోస్తుతే  - తుషార  పోలిక  నమోస్తుతే   చేత  కచ్చపి  నమోస్తుతే  - ఫేన  స్వచ్చత  నమోస్తుతే   అజుని  నాయికా  నమోస్తుతే - రజతాచలమా  నమోస్తుతే   కాంతి సంకాశ   నమోస్తుతే  -కాస  ప్రకాశ  నమోస్తుతే   పుష్ప కేశిని  నమోస్తుతే- పూజ్య ఫణీశ నమోస్తుతే   భక్త  మందార   నమోస్తుతే  - కుంద మందా...

nela nela telugu vennela-telugu Association of North america

https://www.youtube.com/watch?v=in5SNAEnFgA

tallee bailellinaadiroe

Image
బోనాలు శుభాకాంక్షలు .................. తల్లీ..బైలెల్లినాదరో సల్లంగ..సూసి నాదరో ................. జాతరల మోతలతో అసాడం..ఐతారం పిల్లగాళ్ళు..పైలమంటూ తల్లీ..బైలెల్లినాదిరో సల్లంగ..సూసినాదిరో .............. ఏ..పొద్దూ..కాపాడు మా..పెద్దతల్లి ముద్దైన..రూపాలు..ఇంగో..ఓ సద్దడి..చేస్తున్నయి తల్లీ..బైలెల్లినాదిరో సల్లంగ..సూసినాదిరో ........... పోచమ్మ,మైసమ్మ ఎల్లమ్మ,రేణుకమ్మ కొండలమ్మ,గాజులమ్మ అంకాలమ్మ,పోలేరమ్మ ముత్యాలమ్మ,సత్యాలమ్మ ఎన్నెన్ని.రూపాలతో తల్లీ..బైలెల్లినాదిరో సల్లంగ..సూసినాదిరో .......... పచ్చంగ..ఉండాలని పచ్చి కుండలను తెచ్చి అచ్చంగ..అమ్మరూపు ముచ్చటగ..దిద్ది ఘటనలను..తప్పింపగ ఘటములతో..మెప్పింపగ పచ్చన్నముతో..నీ..కాడికి వచ్చింది..పోచమ్మా ...... *ఊరడి* అందుకుని ఆరడులు..తోలేయి 11తల్లీ11 ......... దూకుడులను..తప్పించగ మూకుడులు..తెచ్చి ఆ..నాకము..దింపగ పానకము..పోసి బాగుకోరు..తల్లికి *సాకు* వార..బోయగ సాగింది..మైసమ్మ ..... *సాకు* నందుకుని మమ్ము సాకు తల్లీ 11తల్లీ11 ......... బండరాయి..మనసులను బండారుతో..మారిసి కొండేక్కని..దీపాలతో ఎండీ..కడియాలు..మోగ పాపాలను..తొలగించ ఏపాకులను..బట్టి శివశక్తి..రూపాలై...