Posts

CHIDAANAMDAROOPAA-ANAYA NAAYANAARU.

Image
 చిదానందరూపా-అనయ నాయనారు  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  పశువుల కాపరి అనయ పశుపతి భక్తుడు  తిరుమంగళ సామవేదేశ్వర నామ సేవారక్తుడు  వేదవిహిత పద్ధతిని వేణువును మలచుకొనియె  బూదిపూతల ఉద్ధతిని మందల రక్షించుచునుండె  పున్నమి వెన్నెల నిండిన అమృత బిల్వ వనంబున  అద్భుత మురళీగానము అబ్బురపరచెను జగముల  జాత శతృత్వము పునీతమై జ్ఞానశ్రోతగ మారగ  జన్మరాహిత్యమును పొందగ వేణుపంచాక్షరి కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక. విభూతి అను శబ్దమునకు శివునకు ప్రీతియైన త్రిపుండ్రములు అను అర్థముతో పాటు,శివభక్తులను గౌరవించే సంస్కారము,సర్వ జీవులయందు సర్వేశ్వర దర్శనము,సామగాన సంకీర్తనము,సర్వ జీవులక్షేమమును కోరు స్వభావము,దానివలన లభించు మహిమలు అనికూడా చెప్పుకోవచ్చును.అటువంటి విభూతులు కల అనయ నాయనారు రూపము పశుపతిది.ప్రవృత్తి గోపాలునుది.వేణుగానముతో స్వామికి పంచాక్షరి,నమక-చమకములు వినిపించుచువివశుడయ్యేవాడు.పరశురాముని ప్రఖ్యా...

CHIDAANAMDAROOPAA-KOOTRUVA NAAYANAARU

Image
 చిదానందరూపా-కూట్రువ నాయనారు -15  కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  కూట్రువనాయనారు  ప్రధానాధికారిగ నుండెడి వాడు  పరమ పవిత్ర శివ పంచాక్షరీ జపమును చేయుచు నుండెడివాడు  తొర్రను దాగినవాడు నాయనారు బుర్రను చేరినాడు  తిల్లైలో మూర్ధాభిషిక్తపు  వెర్రిని గట్టిగ నాటినాడు  మూడువేలమంది విప్రులను కూట్రువ భక్తితో వేడు కొనియెగ  వీలుకానిరీతి మూడుకన్నులవాడు  వానితో ఆడుకొనియెగా  పట్టిన పరమేశ్వర పాదము, శిరమున శివరూపము నిలిపెగ  అర్థనారీశ్వరమును పొందగ  మూర్ధాభిషేకము కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది  చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక.     కూత్రువ నాయనారు కాలందై ప్రధానాధికారి.మహాశక్తివంతుడు.శ్రీమంతుడు.ఇది ఐహికము. శివ పంచాక్షరిని అనవరతము చేయు  అదృష్టవంతుడు.మహా దేవుని మనస్స్-వచసా-కర్మణా ఆరాధించు అనఘుడు.ఇది పారమార్థికము.    రెండు విభిన్న దారుఢ్యములు కలవాడు కూత్రువ నాయనారు.ఒకటి శారీరక...

CHIDAANAMDAROOPAA-KALAYA NAAYANAARU

Image
 చిదానందరూపా-13  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా  తైలపు వ్యాపారియైన ఆ కాలపు నాయనారు  జ్యోతుల ప్రజ్వలనమే పరంజ్యోతి సేవనమనుకొను  కాలపుతీరు మారి తైలము కొన పైకము లేకపోయె  కూలియు చేయబోవ అనుకూలము కాకయు పోయె  ఆలిని అమ్ముట చేతగాక ఆ పై చేయునదేమిలేక  కటకట శివపూజకు తైలము నేనెటు సేకరింతునని  రక్త తైల దీపారాధనమొనరించగ సిద్ధము గాగ  మహత్తును చూపించగ కత్తిరించు కుత్తుక కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.

NAAMINAMDI ADIGAL NAAYANAAR.

Image
 చిదానందరూపా-12  కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా నిటలాక్షుని వరమనుకొందునా  నామనంది అడిగళ్ అడ్డనామాలవాని  భక్తుడు  తిరురారూరు సామికి దొడ్డసేవానురక్తుడు  ఆరాధన భాగముగా ప్రదోష దీపారాధనమును తలిచాడు  ఆదిదేవుని దీపములకు ఊరివారిని ఆజ్యమును అడిగాడు  అది శాపమో-పాపమో శివ వ్యతిరేకులు  వారు  నెత్తిమీది గంగమ్మతో దీపాలు పెట్టమన్నారు  నీటిని-నిప్పును సమముగ నిక్షిప్తము చేసుకొన్నవాడు  నిర్వాణమునిచ్చుటకు  నీటిదీపములే కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక. కఠిన పరీక్ష-కరుణా కటాక్షము, కైవల్యమను నాణెమునకు రెండువైపులు.మనము ఏ భావమును స్వీకరించిన అదియేగోచరమగును.శివభక్తుల చరితలందు కటాక్షమునకు పొందుటకు ఎక్కవలసిన మెట్టు కఠిన పరీక్షయే. "సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ శుభావహం దీపం దానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ". దీపము సర్వజ్ఞాన దాయకము.సమస్త సంపత్ప్రదాయకము.శివ లీలగా రోజు ఏమాపెరూరు గ్రామము నుండి తిరువారూరుకు రెం...

CHIDAANAMDA ROOPAA-SERUTTANNAI NAAYANAAR.

Image
" పుష్ప మూలే వసేత్ బ్రహ్మ మధ్యేచ కేశవ పుష్పాగ్రేచ మహాదేవ సర్వదేవ స్థితో దళే"     చిదానందరూపా-11  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా  స్థిరమగు భక్తియను తిరువిరులను మాలగ తాను అల్లు  సమర్పణమును చేసి ,సాష్టాంగము మోకరిల్లు  కామేశుని ఆన కాన కాదనలేని విధంబున  కదిలిరి రాజుయు-రాణియు  కథ నడిపించు పథంబున  లీలగ,పూమాలల సుగంధము బంధము వేయగ  హేలగ చేతబూని  వాసనచూసెను రాణి నాసిక  అపరాధము చేసెననుచు నాసిక కోసెను సెరుత్తనాయి  ముక్తిని పొందగ రాణి ముక్కును కోయుట కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తము చేయు శివోహం  జపంబు నా చింతలు తీర్చును గాక.  భగవంతుడు పుష్పములలో నిండి,కరుణతో వాటిని వికసింపచేయుచు,చూసి సంతసించుటను ఆధారము చేసుకొని పుష్పముల ద్వారా మనకు అర్థము-సౌఖ్యము-సాక్షాత్కారము అను మూడు దివ్య మహిమలకు శివుని చేతినున్న త్రిశూలములోని మూడు విభాగములను ప్రతీకగా కొలుస్తారు.భక్తులు.అతి స్వల్పకాలములో మనకు జగతి సృష్టి-స్థితి-లయములను ...

CHIDAANAMDA ROOPAA-MOORKHA NAAYANAAR

Image
 చిదానందరూపా-10  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  తొండైనాడులో నుండెను పరమమూర్ఖ నాయనారు  అన్నసంతర్పణములుచేసి అమితానందమునొందెడివాడు  ఆస్తి కరిగిపోయింది, ఏమి చేస్తావని అడిగింది  పస్తులు తానున్నా సంతర్పణ కొనసాగిస్తానన్నాడు  జూద సంపాదన ధనము ఈశ్వరసేవా ఇంధనమైనది  నిర్బంధ వ్యవహారమో,భవబంధ పరిహారమో ఇది   న్యాయము ఏమొ  కాని ఇది నారద ఉపదేశమునందించినది   శివసాయుజ్యమునొందగ జూదము కారణమాయెగ   చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక   చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక. మురుగ్గ నాయనారుతొండైనాడులోని తిరువెర్కాడులో జన్మించెను.చిన్నప్పటి నుండి శివ భక్తుడు.శివ భక్తులకు మధుర పదార్థములను వడ్డించి,వారు తృప్తిగా తినుటనుశివారాధనగా భావించెడివాడు. కపర్ది పరీక్ష అనగా కలిమిహరించుకుపోయినది.కాని కలిమి దూరమైనను శివ సంతర్పణల చెలిమిని వీడలేదు. శివభక్తులకు అన్నసంతర్పణలు ఆగిపోలేదు..మంచుకొండవానిమీద భక్తి ధనార్జనకు మంచిచెడుల విచక్షణను చేయనీయ...

CHIDAANAMDAROOPAA-TIRUMOOLANAAYANAR

Image
 చిదానంద రూపా-9  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  అగణిత భక్తితత్పరుడు అగస్త్యమహాముని దర్శనార్థము  అడుగులు వేయసాగె దక్షిణదిశగ,మార్గ మధ్యమున  కావేరి స్నానమాచరించి,దేవర సేవకు బోవుచుండగా  కాపరిలేడని గొల్లుమను గోవులమందను చూచె జాలిగా  సకలదేవతా సాధుజీవులకు  సంతసమును తానందీయగ  ప్రాణములేకయున్న మూలరు కాయము ప్రవేశించెగ  చెట్టున పెట్టిన సాధుకాయము కనికట్టుగ మాయమాయె  పరమపదంబును పొందగ పరకాయ ప్రవేశమె కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.  తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెల్లుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమందవిచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమై...