Posts

CHIDAANAMDAROOPAA-MURUGA NAAYANAARU

Image
   కలనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా    కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా   యోగుల స్వేదబిందువుల వేదపు పూలగా మారు   శివలీల చాటగ వేదికయైనది తిరువుకలూరు   చేతిలో పూలసజ్జ రమణీయము,చేయు జపము అనుసరణీయము   ఆనంద భాష్పాభిషేకము  తోడుగ శివునకు పుష్ప యాగము  తిరుజ్ఞానిని మురుగను  స్నేహము  బంధించినది  జ్ఞాని పాణిగ్రహణము ప్రాణ నిష్క్రమణ పరీక్షయైనది  నిశ్చింతగ అందరు జోతల జ్యోతిని  చేరినారుగా  శివసాయుజ్యమును పొందగ స్నేహము కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. 

CHIDAANAMDAROOPAA-TIRUNAALAIPOEVAAR NAAYANAARU

Image
   చిదానందరూపా-19  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  తిరునాలై పోవార్ నాయనారు  తిరిపమెత్తువాని  భక్తుడు  "గీతం సమర్పయామి" అంటు సంగీత సామాగ్రినిచ్చెడివాడు   తిరువంకూరల్ శివదర్శనమునకు అడ్డమైనది  నందివాహనము   శిరముని వంచి ఆదర్శమైనది  విడ్డూరముగ  నందనారుకు   తిరునాలైపోవార్  అనగా రేపువెళ్ళువాడు  అని అర్థము   శివయానై  వెళ్ళెను చిదంబరమునకు కనకమహాసభ దర్శనార్థము   చిన్నకులమువాడన్న వాదును చెరిపెను,శివ కులములోనికి చేర్చెను   అగ్నినేత్రుని  జ్యోతిగ కొలువగ  అగ్నిస్నానమె  కారణమాయెగ   చిత్రముగాక ఏమిటిది చిదానందుని  లీలలు గాక   చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు  తీర్చును గాక.  కులము అనే పదమునకు నాలుగుగా పనిని బట్టి విభజించిన విభాగము గాను,సమూహముగాను మనము అన్వయించుకుంటే మహాశివుడు అన్ని విభాగములలోను,అన్ని విభాగ సమూహములలోను స్థూల-సూక్ష్మ రూపములలో నిండియున్నాడనుటకు నిదర్శనమే కదా పరమ...

CHIDAANAMDAROOPAA-ERIPAATA NAAYANAARU

Image
"ప్రౌఢో‌உహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ దష్టో నష్టో‌உవివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః | శైవీచింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో"   చిదానందరూపా- ఎరిపాత నాయనారు  *********************************  కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  కనుగానక కమ్మిన మైకము హానిని చేయనీయక  పరశును చేతదాల్చి పరమేశుని భక్తుల సేవచేయు  తా చేసిన పాప-పుణ్యముల తడబడనీయక  చూసిన శివాపరాధమును చివాలున గొడ్డలి విసిరివేయు  ఏనుగు చేసిన ఘోరము ఎదకోయగ ఆ ఎరిపాతకు  ఏమరుపాటును సేయక ఆ కరినే తను హతమార్చెను  కామ సంహారుని కొలువగ తానును సంహారమునెంచు కొనియెగ  గజవదనుని తండ్రిని చేరగ  గజమే కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు  గాక  చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చు గాక   అంబరావతి నదీతీరమున కల కరువూరులోని పశుపతినాథుని కొలిచేవాడు ఎరిపాత నాయనారు. భక్తుని కథ అంటే భగవంతుని లీలను తెలియచేయు...

CHIDAANAMDAROOPAA-IYARVAGAI NAAYANAAR

Image
 చిదానందరూపా-17  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  శివుడు  బ్రాహ్మణ వేషములో ఇంటిముందు నిలిచాడు  ఇంగితమును విస్మరించి నాయనారు ఇల్లాలిని అడిగాడు  లేదనుమాట పలుకలేనివాడైన ఇయర్వగై నాయనారు  నివేదనమనుకున్నాడు, నిజపత్నిని  పంపించాడు  బ్రాహ్మణునకు-భార్యకు బాటలో  బాసట తానైనాడు  అడ్డువచ్చిన వారిని ఎదురొడ్డిన వాడయ్యాడు  శర్వునకు  నమస్కరించి నిశ్చయ భక్తితో వెనుదిరిగెనుగా  నిర్వాణమునందీయగ  భార్యయే  కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  శివోహం జపంబు  చింతలు తీర్చును గాక. కావేరి పట్టణ వాసుడైన ఇయర్వగై నాయనారు నరనరాల్లో దాతృత్వమును జీర్ణించుకొన్న గొప్పశివ భక్తుడు.శివ భక్తులను శివ స్వరూపముగాభావించి,అడిగిన దానిని దానమిచ్చి,వారి సంతోషమే పరమేశ్వర అనుగ్రహ విశేషముగా భావించి,సంతసించెడివాడు. జీవుడు దేవుడు కావాలంటే శివుడు ఎన్ని పావులు కదపాలో-ఎన్ని కథలను నడపాలో.ఆ రావణ బ్రహ్మకు ఆలినిచ్చి...

CHIDAANAMDAROOPAA-ANAYA NAAYANAARU.

Image
 చిదానందరూపా-అనయ నాయనారు  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  పశువుల కాపరి అనయ పశుపతి భక్తుడు  తిరుమంగళ సామవేదేశ్వర నామ సేవారక్తుడు  వేదవిహిత పద్ధతిని వేణువును మలచుకొనియె  బూదిపూతల ఉద్ధతిని మందల రక్షించుచునుండె  పున్నమి వెన్నెల నిండిన అమృత బిల్వ వనంబున  అద్భుత మురళీగానము అబ్బురపరచెను జగముల  జాత శతృత్వము పునీతమై జ్ఞానశ్రోతగ మారగ  జన్మరాహిత్యమును పొందగ వేణుపంచాక్షరి కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక. విభూతి అను శబ్దమునకు శివునకు ప్రీతియైన త్రిపుండ్రములు అను అర్థముతో పాటు,శివభక్తులను గౌరవించే సంస్కారము,సర్వ జీవులయందు సర్వేశ్వర దర్శనము,సామగాన సంకీర్తనము,సర్వ జీవులక్షేమమును కోరు స్వభావము,దానివలన లభించు మహిమలు అనికూడా చెప్పుకోవచ్చును.అటువంటి విభూతులు కల అనయ నాయనారు రూపము పశుపతిది.ప్రవృత్తి గోపాలునుది.వేణుగానముతో స్వామికి పంచాక్షరి,నమక-చమకములు వినిపించుచువివశుడయ్యేవాడు.పరశురాముని ప్రఖ్యా...

CHIDAANAMDAROOPAA-KOOTRUVA NAAYANAARU

Image
 చిదానందరూపా-కూట్రువ నాయనారు -15  కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  కూట్రువనాయనారు  ప్రధానాధికారిగ నుండెడి వాడు  పరమ పవిత్ర శివ పంచాక్షరీ జపమును చేయుచు నుండెడివాడు  తొర్రను దాగినవాడు నాయనారు బుర్రను చేరినాడు  తిల్లైలో మూర్ధాభిషిక్తపు  వెర్రిని గట్టిగ నాటినాడు  మూడువేలమంది విప్రులను కూట్రువ భక్తితో వేడు కొనియెగ  వీలుకానిరీతి మూడుకన్నులవాడు  వానితో ఆడుకొనియెగా  పట్టిన పరమేశ్వర పాదము, శిరమున శివరూపము నిలిపెగ  అర్థనారీశ్వరమును పొందగ  మూర్ధాభిషేకము కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది  చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక.     కూత్రువ నాయనారు కాలందై ప్రధానాధికారి.మహాశక్తివంతుడు.శ్రీమంతుడు.ఇది ఐహికము. శివ పంచాక్షరిని అనవరతము చేయు  అదృష్టవంతుడు.మహా దేవుని మనస్స్-వచసా-కర్మణా ఆరాధించు అనఘుడు.ఇది పారమార్థికము.    రెండు విభిన్న దారుఢ్యములు కలవాడు కూత్రువ నాయనారు.ఒకటి శారీరక...

CHIDAANAMDAROOPAA-KALAYA NAAYANAARU

Image
 చిదానందరూపా-13  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా  తైలపు వ్యాపారియైన ఆ కాలపు నాయనారు  జ్యోతుల ప్రజ్వలనమే పరంజ్యోతి సేవనమనుకొను  కాలపుతీరు మారి తైలము కొన పైకము లేకపోయె  కూలియు చేయబోవ అనుకూలము కాకయు పోయె  ఆలిని అమ్ముట చేతగాక ఆ పై చేయునదేమిలేక  కటకట శివపూజకు తైలము నేనెటు సేకరింతునని  రక్త తైల దీపారాధనమొనరించగ సిద్ధము గాగ  మహత్తును చూపించగ కత్తిరించు కుత్తుక కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.