Posts

PANDUGALU-SANKRANTI 2018

Image
 పరమ పావనము పన్నెండురాశులలో పగటిదొర పరిభ్రమణము  దినకరుడు మకర రాశితో జతకట్టుట మకర సంక్రమణము  పనికిమాలిన వాటిపనిపట్టేయాలంటు పౌరుషము  భోగి మంటలపై నునువెచ్చని సంతకమునుచేస్తున్నది  భోగిపళ్ళ లోగిళ్ళుగ  బోసినవ్వుల పరిణామము  దిష్టిని తీసివేస్తు స్పష్టమైన ప్రేమగా సాక్షాత్కరిస్తున్నవి  మా సరి ఎవరను వరికంకుల సరిగమల సంగీతము  శృతి కలుపుతు హరిదాసుతో  సంతోషము సాగుతోంది  అదరహొ  అనేలా చక్కని చక్కిలాలు-అరిశెలు-సున్నుండలు  అందలమెక్కి  తమను ఆస్వాదించమంటు  ఆహ్వానిస్తున్నాయి  అన్యాయం  ఆసాంతం అదృశ్యం  ఇక అంటు  వీరము  కోరమీసమై  కోళ్ళపందాలనే యుద్ధానికి సిద్ధమౌతోంది  పొంగుచున్న పొంగలితో- ముంగిట  గంగిరెద్దు మేళము.  రంగవల్లులు  ఆ రంగనాథునితో తారంగము ఆడుతున్నవి  రైతే రాజు అనే గాలిపటముతో  గర్విస్తున్నది  గగనము  ఆశీర్వదిస్తు అన్నదాత  కన్నుల్లో  ఆనందమై  కురుస్తోంది  బడుగు రైతుల నీటికొరతను  తరిమివేసేలా.

JAI SREEMANNAARAAYANA-30

Image
 వంగక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై  తింగళ్ తిరుముగత్తు చేయిడైయార్ శిన్రిరైంజి  అంగప్పఱై కొండవాత్తై అణిపుదువై  ప్పైంగమల త్తణ్డెరియల్ బట్టర్పిరాన్ కోదైశొన్న  శంగత్ తమిళ్మాలై ముప్పదుం తప్పామే  ఇంగిపరిశురై పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్  శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాత్  ఎంగుం తిరువరుళ్పెత్తు ఇంబురువ రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-30 అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది. శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము. పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్త్వమును అవగతమొనరించుకొను ...

JAI SREEMANNAARAAYANA-29

Image
 శిత్తం శిరుకాలే వందు ఉన్నై  చ్చేవిత్తు ఉన్  పొత్తామరై యడియే పోట్రుం  పొరుళ్ కేళాయ్  పెత్తం మెయ్ త్తుణుం కులత్తిల్ పిఱందు నీ  కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు  ఇత్తైపఱై కోళ్వాన్ అన్రుకాణ్ గోవిందా  ఎత్తెక్కుం ఏడేడ్ పిఱవిక్కుం ఉందన్నోడు  ఉత్తోమేయావోం ఉనక్కే నామాళ్ చెయివోం  మత్తైనం కామంగళ్ మాత్తు ఏలో రెంబావాయ్.  ఓం నమో నారాయణాయ-29 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది పశువులు మేసిన తరువాతనే తాము భుజించెడివారైన మన గోపికను కలుపుకొనిన శ్రీ విల్లిపుత్తూరు గోపికలలో పాలు-పెరుగు-వెన్న-నెయ్యి రూపు మారిన పాలైన కొద్ది కొద్దిగ తమ మనసును దిద్దుకొనుచున్న గోపికలలో తామర పూసల మాలికలు గళమున ధరించిన వాడైన తామర నేత్రును కొలిచిన నారాయణత్వములో "వంగక్కడల్ కడైంద" మాధవ-కేశవ చింతనమైన అటు-ఇటు ఏడుతరములను కూడమంటున్న గోపికలలో పరాన్ముఖము ప్రత్యన్ముఖమగు పడతులార రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె భావము సర్వేంద్రియములు భక్తిభావముతో నిండిపోయి, సర్వస్య శరణాగతి ప్రకటనమే గోప...

JAI SREEMANNAARAAYANA-28

Image
 కఱ్వైగళ్ పిన్ శెన్రుకానం శేరుందుప్బోం  అఱివొన్రు మిల్లాద ఆయుక్కులత్తు ఉందన్నై  ప్పిఱవి పిఱందనై పుణ్ణియం యాముడయోం  కుఱైవొన్ఱు మిల్లాద గోవిందా! ఉందన్నోడు  ఉఱవేల్ నమక్కు ఇంగొళిక్క ఒళియాదు  అఱియాద పిళ్ళైగళోం అంబినాల్ ఉందన్నై  చ్చిఱుపేరరైత్తనవుం  శీఱి యరుళాగే  ఇఱైవా ! నీ తారాయ్ పఱై యేలోరెంబావాయ్    ఓం నమో నారాయణాయ-28 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది నల్లనయ్య పుట్టిన గొల్ల వంశములో పుట్టినామన్న పున్నెమున్నవారైన కల్ల-కపటము తెలియని అల్లరి రేపల్లె గోపికలలో " కఱ వైగళ్ పిన్ శెన్ఱు కానం" అని అంటున్న వారైన "అంబినాల్" దూరముగానుంచుట కుదరదంటున్న గోపికలలో "గోవింద-గోపాల "అని చిన్న చిన్న పేర్లతో పిలుచుచున్న వారైన వీళ్ళా! అని చిన్న చూపు చూడకూడదంటున్న గోపికలలో "అనన్య శరణత్వం-ఉపాయత్వం-భోగత్వం" అకారత్రయమైన సర్వస్య శరణాగతినొందిన శుద్ధ సత్వ గోపికలలో రాసలీలలాడుదాము రమణులారా రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె. భావము గోపికలు శ్రీకృష్ణునితో గొల్ల కులములో పుట్టిన...

JAI SREEMANNAARAAYANA- 27

Image
 కూడారై వెల్లుం శీర్ గోవిందా!ఉందన్నై  పాడిపఱై కొండు యాం పెరుసన్మానం  నాడు పుగళం పరిశినాళ్ నన్రాగ  శూడగమే తోళ్వళియే తోడై సెవిప్పువ్వే  పాడగమే ఎన్రనైయ పల్కలనుం యా మణివో  ఆడైయడు ప్పోం అదన్ పిన్నే పాల్ శోరు  మూడనెయ్ పెయ్దు  ముళంగై వళివార  కూడి ఇరుందు కుళిరుందు  ఏలో రెంబావాయ్.   ఓం నమో నారాయణాయ-27 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది గాజులు-కడియాలు చీరెలు-సారెలుయైన శ్రీహరి దీవించుచున్న దీర్ఘ సుమంగళములో కర్ణిక చుట్టిన రేకులు కన్నని గోపికలైన పెరుమాళ్ళుకు తినిపించే పెద్ద సన్మానములో వేళ్ళసందు నంజుడున్న "భ్రాజిష్ణు: భోజనం భోక్త" యైన ఎంగిలి భోజనాల కూడారై పాశురములో చల్దులారగింప వేగ చెలులారా రారె ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె భావము మన గోపికకు స్వామి కరుణతో పోతన భాగవత తత్త్వము ప్రసాదింపబడి కూడారై ప్రసాద-పాశుర విశిష్టతను వివరించగలుగుతోంది. "కమలాక్షునర్చించు కరములు-కరములు" రీతిలో మనగోపికలు స్వామిని ప్రసాదించమన్నవి సౌభాగ్యములు. స్వామిని పద్మమునకు కర్ణికగ...

JAI SREEMANNAARAAYANA-26

Image
  మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్  మేలైయార్ శెయ్వనగళ్ వేండువన కేట్టియేల్  ఞాలత్తై యెల్లాం నజుంగ మురల్వన  పాలన్న వణ్ణత్తు ఉన్ పాంచశన్నియమే  పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడై యనవే  శాలప్పెరుం పఱయై పల్లాండి శైప్పారే  కోలవిళక్కే కొడియే వితానమే  ఆలినివైయాం అరుళ్ ఏలోరెంబావాయ్  ఓం నమో నారాయణాయ-26 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది చెంతనున్న స్వామిసేవ చెదరని వ్యామోహమైన దాచలేని గోపికల "మాలే" అను పిలుపులో గాయకులు- శంఖములు మేలుకట్లు కోరుకున్న వారైన అర్థులు-దాతలు ఒక్కరైన అద్వైత భావములో పదునాలుగు భువనముల స్థూలము సూక్ష్మముయైన పదిలముగా పరుండిన వటపత్ర శాయిలో పరాత్పరుని కోరుతూ " పరను" వద్దన్నవారైన నల్లనయ్య సన్నిధిలో పాడుతున్న" పల్లాండ్లలో" సారసాక్షుని సన్నిహితపు సాహచర్యమునకు రారె ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె. భావము వ్యాపించిన మోహములో మునిగిన గోపికలు శ్రీ కృష్ణుని దాసోహభావముతో మాలే!(వీడలేని వ్యామోహమా!) అని సంభోదిస్తూ,వటపత్రశాయిగా (శయనించేస్వామి-శాయి) స్వామిని దర్శిం...

JAI SREEMANNAARAAYANA-25

Image
  ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరి రవిల్  ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళిర  తరిక్కిలా నాగిత్తాన్ కంజన్ వైత్తిల్  నెరుప్పెన్న నెన్ర నెడుమాలే! ఉన్నై  అరితిత్తి వందోం పఱై తరుదియాగిల్  తిరుత్తక్క శెల్వముం శేవగముం యాంపాడి  వరుత్తమాం తీరంద్ మగిళింద్ ఏలో రెంబావాయ్.  ఓం నమో నారాయణాయ- విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది ఒక్క రాత్రి సమయములో యశోదను రహస్యముగ చేరినవాడైన "ఒరుత్తి మగనాయ్ పిరందు" అని కీర్తించుచున్న గోపికలలో జాతక కర్మను రహస్యముగా జరిపించుకొనిన వాడైన ఆపదలతో ఆటలాడుకొనిన ఆ ఆపద్బాంధవునిలో కూడని గుణములకూడి కీడును తలపెట్టిన వాడైన ముడిబడనీయని కుంపటి ఆ కంసుని గుండెలలో అష్టాక్షరిలో పుట్టి ద్వయమంత్రములో పెరిగిన వాడైన "ఉన్నై తిరుత్తిత్తు వందోం" అంటున్న ముందుకాళ్ళ బంధములో నల్లనయ్యను కీర్తించగ నళినాక్షులు రారె ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె. భావము శ్రీ కృష్ణుడు పాపం! పుట్టిన వెంటనే దేవకీదేవిని వీడి రహస్యముగా యశోద బిడ్డడుగా వచ్చి చేరాడు.జాతక కర్మలను గర్గ మహామునిచే రహస్యముగానే చేయిం...