Posts

SAUNDARYA LAHARI-37

సౌందర్య లహరి-75  పరమ పావనమైన నీ పాద రజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  సృష్టి పూర్వస్థితి "ధూమము" అను చీకటి,దానిని  తొలగించును ముకుళిత సంకోచిత "ఈక్షణ శక్తి"  అమ్మ కనుల వికసనము సృష్టి స్పష్టపు స్థితి  కన్నుల అవలోకనము స్థితికారక ఉద్ధతి  ముకుళిత నయనముల పని ముంచేసే ప్రళయము  క+అ+మ పర బ్రహ్మ వాచకము కామాక్షి  అనంత దర్శన శక్తి గల ఆదిశక్తి శతాక్షి  జగతి సమ్రక్షణ,పోషణ మీనాక్షిగ మారువేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి " కమలాంబ  సంరక్షతు మాం" నవావరణ కీర్తనలో " సుమనస రాజీవాక్ష ముఖి" అని ముత్తుస్వామి దీక్షితారు ఎలా చెప్పగలిగాడు.వారు బహుశానుభవించి,పదే పదే అనుభూతికి లోనై మనకు తెలియచేయాలనే సహృదయతో ప్రసాదించినారేమో.అమ్మ పాదములను బ్రహ్మాది దేవతలు సేవిస్తుంటే,సకలలోక నాయిక ఆశ్రిత కల్ప లతిక.ఆశ్రితులను ఆసర.ప్రళయానంతరము పునః సృష్టి పూర్వము అంతాచీకటియే అమ్మ ముకుళించిన తన నేత్రములను వికసింపచేయగనే జగతి ప్రకాశిస్తుంటుంది.స్థితికారిణిగా,సంరక్షిణిగా అమ్మ  అదే...

SAUNDARYA LAHARI-36

Image
సౌందర్య లహరి-35 పరమ పావనమైన నీ పాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము శాంతము మూర్తీభవించు శాంభవి నేత్రములు శివుని చూచుచున్న వేళ శృంగారభరితములు శివేతరుల పట్ల భీభత్స వేత్రములు శివ కథలను వినునపుడు విస్మయ పూరితములు గంగమ్మను రోషముతో,పద్మములను వీరముతో పాములను భయముతో,చెలికత్తెలను హాస్యముతో నాయందు కురిసేటి కరుణ జలపాతములు నీ అభినయ నవరసములు నేత్రోత్సవమగుచున్న వేళ నీ చెంతనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి. " కంజ దళాయతాక్షి-శ్రీ కామాక్షి","అన్నపూర్ణే విశాలాక్షి-అఖిల జగతి సాక్షి","దేవి మీనాక్షి ముదం దేహి" అని ముత్తుస్వామి దీక్షితారు,"సరోజ దళనేత్రి" అని శ్రీ శ్యామ శాస్త్రి,ఇంకా ఎందరో తల్లి నేత్ర మహిమను వర్ణించుతు తన్మయులై తరించినారు.అమ్మ వారి నేత్రములు అఖిల చరాచర జగతికి సాక్ష్యములు.అసుర సంహరణకు అగ్నిగోళములు.ఆశ్రితుల పాలిటి అమృతవృష్టులు.దుర్మార్గమునకు పారద్రోలు భయంకరమైనబెత్తములు.శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము "అరుణాం కరుణాంతరంగతాక్షిం".అని కీర్తించుచున్నది."వికచాంభోరుహాదళ లోచని"గా అష్టోత్తరము ...

SAUNDARYALAHARI-35

పరమ పావనమైన నీ పాదరజ కణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  మంచి పనులు చేయించుచున్న ఇంద్రియములు ఐదు  వానికి సంకేతములు ఇచ్చుచున్న ఇంద్రియములు ఐదు  సప్త ధాతువులు మనసు ఎనిమిది కలిసిన  అష్టాదశ పీఠముల నా హృదయ మందిరము  నిశ్చల భక్తిని నినుగొలువ నిష్ఠను చేరినదమ్మా  మనో వాక్కాయ కర్మలను ముగ్గురు మిత్రులతో  ఏమని వర్ణించను ఏ నోము ఫలితమో ఇది  నా శరీరము పావన శక్తి పీఠముగా మారుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.      భావము  నా మనసనే తోటలో విహరించే తల్లీ.చెవి,ముక్కు,కన్ను,నాలుక, చర్మము అను జ్ఞానేంద్రియములు,పాణి,పాద,పాయు ,ఉపస్థ,వాక్కు అను ఐదు కర్మేంద్రియములు,రస,రక్త,మాంస,మే ధ,అస్థి,నుజ్జు,శుక్ర అను ఏడు ధాతువులు,మనసు మొత్తము పద్దెనిమిది ఉన్న నా హృదయము మనస్సు,మాట,పని అను ముగ్గురు మిత్రులతో నిష్ఠగా నిన్ను సేవించుటకు బయలుదేరినవి.ఎంతటి అదృష్టము.ఈ శుభకర సమయములో నీ చెంతనేనున్న నా వేలిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.

SAUNDARYA LAHARI-34

సౌందర్య లహరి-9 పరమ పావనమైన నీ పాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము ధ్యానము,ధ్యాత,ధ్యేయము మూడు నీవేనని బాల్య,కౌమార,యవ్వన,వార్థక్యములు నాలుగు నీవేనని నీరు,నిప్పు,నింగి,నేల,గాలి ఐదు నీవేనని కామ క్రోధాది గుణదోషములు ఆరు నీవేనని సంగీత స్వరములు ఏడు నీవేనని సప్త ధాతువులు మనసు ఎనిమిది నీవేనని నవావరణములోని నవనవోన్మేషము నీవేనని నన్ను ఆవరించుకొనిన మాయ తాను మాయమగుచుండగా నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి. భావము నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.ఏది ధ్యానమో,ఎవరు ధ్యానించుచున్నారో,ఎవరిని ధ్యానించుచున్నారో మూడును పరమాత్మ స్వరూపములే.జీవితపు నాలుగు దశలు,పంచ భూతములు,అరిషడ్వర్గములు,సప్త ధాతువులు(రస,రక్త,మాంస,మేథ,అస్ తి,నుజ్జు అను ఏడు ధాతువులు,మనసు భగవంతుని స్వరూపములే.నవావరణము లోపల ప్రకాశించు పవిత్ర మూర్తివి నీవని నన్ను కమ్ముకొనిన మాయ తొలగిపోవు చుండుటచే గ్రహించి,నీ దయచే ,నీ చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

SAUNDARYA LAHARI-33

సౌందర్య లహరి-33 పరమ పావనమైన నీ పాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము కుండను తయారు చేయగ నిమిత్తము కుమ్మరి మన్ను ఉపాదానమైనది కుండ నిజము కాదంటు ఆభరణము తయారు చేయగ నిమిత్తము కంసాలి బంగారము ఉపాదానమైనది నగ నిజము కాదంటు నీ మూర్తిని తయారుచేయగ నిమిత్తము శిల్పి నీ మహత్తు ఉపాదానమైనది అన్నీ నీవే అంటూ ప్రథమము.ప్రధానము,ప్రకృష్టము "నీవే" కద తల్లీ! నా నికృష్టపుతనము, పరమోత్కృష్టముగ మారుచున్నవేళ నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి. భావము నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ నిన్ను నిశిత దృష్టితో చూసిన నిజము అర్థమగును.కుండలను చేయుచున్న కుమ్మరి నిమిత్తమాత్రుడు జీవులనే కుండలను చేయుచున్న బ్రహ్మ నీ అనుగ్రహపాత్రుడు.సాధారణముగా చూస్తే కుండ కనిపిస్తుంది కాని నిశితముగా చూస్తే అది మట్టి.కుండ పగిలిపోతుంది.మట్టి మిగిలిపోతుంది.ఇదే విధముగా నగలను చేయుచున్న కంసాలి,నీ మూర్తిని తయారుచేయుచున్న శిల్పి నిమిత్త మాత్రులు.అన్నిటిలో ఉన్నది నీ మహిమ.కుండ,కూజా,మూకుడు.ఇటుక,పొయ్యి,బాన ఇలా అనేక రూపములలో ఉన్నది మట్టి.అదే విధముగా నింగి,నేల,నదులు,సముద్రములు,వనములు,కొండలు,చ...

SAUNDARYA LAHARI-32

 పరమ పావనమైన నీ పాదరజ కణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  మంచి పనులు చేయించుచున్న ఇంద్రియములు ఐదు  వానికి సంకేతములు ఇచ్చుచున్న ఇంద్రియములు ఐదు  సప్త ధాతువులు మనసు ఎనిమిది కలిసిన  అష్టాదశ పీఠముల నా హృదయ మందిరము  నిశ్చల భక్తిని నినుగొలువ నిష్ఠను చేరినదమ్మా  మనో వాక్కాయ కర్మలను ముగ్గురు మిత్రులతో  ఏమని వర్ణించను ఏ నోము ఫలితమో ఇది  నా శరీరము పావన శక్తి పీఠముగా మారుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.      భావము  నా మనసనే తోటలో విహరించే తల్లీ.చెవి,ముక్కు,కన్ను,నాలుక, చర్మము అను జ్ఞానేంద్రియములు,పాణి,పాద,పాయు ,ఉపస్థ,వాక్కు అను ఐదు కర్మేంద్రియములు,రస,రక్త,మాంస,మే ధ,అస్థి,నుజ్జు,శుక్ర అను ఏడు ధాతువులు,మనసు మొత్తము పద్దెనిమిది ఉన్న నా హృదయము మనస్సు,మాట,పని అను ముగ్గురు మిత్రులతో నిష్ఠగా నిన్ను సేవించుటకు బయలుదేరినవి.ఎంతటి అదృష్టము.ఈ శుభకర సమయములో నీ చెంతనేనున్న నా వేలిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.

SAUNDARYA LAHARI-31

Image
సౌందర్య లహరి-31  పరమ పావనమైన నీ పాద రజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  అనంత కాల తత్వమే కాళికా మాతగా  సమయ పాలనా శాంతి బగళాముఖి తీరుగా  అణువణువు నిక్షిప్తత ఛిన్న మస్త రేణుకగా  క్రియా శక్తి రూపము భువనేశ్వరి ఆకృతిగా  చండాల కన్యకైన శివరాణి మాతంగిగా  తార,ధూమవతి,షోడశి ఆకాశ,పొగ,యవ్వన రూపాలుగా  త్రిపుర సుందరి,భైరవి తత్వ ప్రకాశములుగా  నీ దశ మహా విద్యలు నా దిశా నిర్దేశము చేయుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి. ఒకానొక సభలో దక్షునకు అల్లుడైన శివుడు గౌరవమునీయలేదను కోపముతో (రజోగుణముతో) తాను యజ్ఞముచేయ సంకల్పించినపుడు శివుని ఆహ్వానించలేదు దక్షుడు.సతీదేవి పుట్టింటి మీది ప్రేమతో పిలుపు లేనప్పటికిని యజ్ఞమును చూచుటకు వెళ్ళెదనన్న సందర్భములో శివుడు ఆమెకు కలుగుఇబ్బందులను సూచించగా,భర్త తనశక్తిని శంకించుచున్నాడని కోపించి,ఆగ్రహముతో తననుండి పది శక్తులను సృష్టించి,కైలాసమునకు కాపలగ ఉంచినదట.పరమేశుడు అమెను శాంతపరచిన తరువాత తల్లి ఆ సక్తులను ఉపసమ్హరించినదట.తనలో కలిపివేసుకొన్నదట....