Posts

SAUNDARYA LAHARI-61

సౌందర్య లహరి-59 పరమ పావనమైన నీపాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము అమ్మ మహిమ గుర్తించని చిమ్మచీకట్లలలో విజ్ఞత వివరము తెలియని యజ్ఞ వాటికలలో అటు-ఇటు పరుగులిడు తలపులను ఇటుకలతో సంకల్ప-వికల్పములను సుక్కు-శ్రవములతో విచక్షణారహితమను సంప్రోక్షణలతో కుతంత్రాల తతులనే కుటిల మంత్రాలతో తమస్సులో తపస్సులను బహులెస్స హవిస్సులతో నా అజ్ఞానము సర్వము యజ్ఞముగా మారుచున్న వేళ నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా మానస విహారి! ఓ సౌందర్య లహరి. " యజ్ఞ ప్రియా-యజ్ఞ కర్తీ-యజమాన స్వరూపిణీ" అని శ్రీమాతను శ్రీ లలితా సహస్ర రహస్య నామావళి కీర్తించినది.యజ్ఞమును ఇష్టపడి-కావలిసినవి సమకూర్చి-యజమానిగా తల్లి వ్యవహరిస్తుందట.స్థితికారిణి యైన తల్లికి మనము కృతజ్ఞతను తెలియచేసుకొనుటకు తల్లి ఇచ్చిన అవకాశము యజ్ఞము.మనము అమ్మకు గోరుముద్దలు తినిపించి పులకరిమ్హిపోతున్నట్లు.ఎంతటి మహా భాగ్యము ! యజుర్వేద విధానముగా ,ఋగ్వేద మంత్రసహితముగా నిర్వర్తించు అగ్ని కార్యము "యజ్ఞము"." యజ్ఞాత్ అన్న సంభవ " అని భగవద్గీత ప్రశంసించుచున్నది.అగ్నికార్యము ద్వారా దేవతలు యజ్ఞ ద్రవ...

sSAUNDARYA LAHARI-60

   సౌందర్య లహరి-సకల శాస్త్రాలు   పరమపావనమైన  నీ పాదరజకణము   పతిత పాలకమైనపరమాత్మ స్వరూపము  శ్రీమాత జిహ్వ నుండి వెలువడిన సరస్వతీ రూపాలు  పలుకులు అనే కావ్య-నాటక- అలంకార రూపములు  మీమాంస -పురాణాదులు తల్లి కంఠపు  పై గీతగ  నడిమి గీతలేకద  ఆయుర్వేద -ధనుర్వేదములు  చతుషష్టి కళల సొంపు కంఠపు మూడవగీత  బాహువుల సంకల్పమే  తంత్ర రూపాదులుగా  శ్రీనాథుడు దర్శించగ "జయ జయ జనయిత్రిగ"  సరస్వతీ-శాస్త్రమయిగ నిన్నుచూచుచున్న వేళ  నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానసవిహారి! ఓ సౌందర్య లహరి.

SAUNDARYA LAHARI-59

Image
సందర్య లహరి-58  పరమపావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  వేదోచ్చరణనుతెలుపు శిక్ష అను శాస్త్రము  దోషరహిత పద సంస్కారమైనవ్యాకరణము  గణముల కలయిక మెళకువలు తెలుపు ఛందము  వేద మంత్ర ఉత్పత్తిని తెలియచేయు నిరుక్తము  కాల నియమ వివరణ విధానముగా జ్యోతిషము  యజ్ఞ-యాగ మాచరించ విధానమైన కల్పము  అమ్మ చుబుకమే తమకు పుట్టినిల్లనుచును  ఆమ్నాయముల అధ్యయమునకు ఆలంబనమైన వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సందర్య  లహరి.  ఛందోబద్ధమైన వేదమును ఋక్కులు అనుటచే దానికి సంబంధించినవేదమును"ఋగ్వేదము" అనియు,గద్యాత్మకమైన వేదమును యజస్సు గలది కనుక "యజుర్వేదము" అనియు,గీతాత్మకమైన వేదము సామం కనుక " సామవేదము" అంటారని,పద్య గద్యాత్మకమైన వేదమును "అధర్వణ వేదము" అని అలంకారికులు విశ్వసిస్తారు.వారుఈ విషమును,వేదమును"త్రయి" అనుటకు మూడు వేదములే అన్న వాదనసరికాదని,జ్ఞాన-కర్మ-ఉపాసన అను మూడు సంస్కారములను తెలియచేయునవి వేదములు అని కీర్తిస్తారు.అమ్మ చుబుకము (గడ్డము) నుండి ఆవిర్భవించిన ఆరు వేదాంగముల...

SAUNDARYA LAHARI-58

Image
 సౌందర్య లహరి-57  పరమపావనమైన నీ పాదరజ కణము  పతితపాలకమైన పరమాత్మ స్వరూపము  ఎడమనేత్ర కాంతిమారె లక్ష్మితత్వముగ  ఎడతెగక నడిపించె స్థితికార్యపు మాతృకగ  కుడినేత్ర కాంతిమారె పార్వతితత్వముగ  విడనాడక కాపాడగ కరుణకు ప్రతిరూపముగ  మూడవ నేత్ర కాంతిమారె సరస్వతి తత్వముగ  మూఢత్వము తొలగించగ సారస్వత రూపముగ  ఉద్ధరింపగ మమ్ములను ముగ్గురమ్మలను అందించిన  నీ ఊపిరి నాలుగు వేదములైన వెలుగుచున్న వేళ  నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.  "విద్" అను ధాతువునకు తెలియుట అను అర్థమును మనము అన్వయించుకుంటే భగవంతునిద్వారా తెలుపబడినవి "వేదములు." వీనిని శృతులు-ఆమ్నాయములు-అపౌరుషేయములు అని కూడా కీర్తిస్తారు.కావలిసిన వాటినిచ్చి,అక్కరలేని వాటిని దగ్గరకు రానీయని శక్తిగలవి వేదములు.వేదము అనగా జ్ఞానము-నిజము అని కూడా అర్థముచేసుకోవచ్చును.వేదరాశి వ్యాసమహర్షిచే, నాలుగుగా క్రమబద్ధీకరించబడినవి.అవి ఋగ్వేదము-యజుర్వేదము-సామవేదము-అధర్వణవేదము. ఆది శంకరులు ప్రశంసించిన ఋగ్వేదము కామితార్థప్రదము.యాగ విధానమును తెలియచేయునది యజుర్...

saundarya lahari-57

 సౌందర్య లహరి-35   పరమపావనమైన  నీ పాదరజకణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము   అజ్ఞాన అంధకార సాగరములో  అనవరతము   మునకలే  ముచ్చటనే  మూఢులమైన  మేము   ఇడుములనే  ఉడుములే చేరెను మా సమీపము   నిస్సార సం సారము చేసెను మమ్ము సమ్మోహనము   చింతలతో చిన్నబోయి ఖిన్నులమై  ఉన్నారము   లోతైన లోయలో లేవలేక ఉన్నారము   నిఖిల జగము  వగచుచు  నీట మునిగియుండగా   నీ పాదరేణువు  ఆదివరాహపుకోరయైన వేళ   నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా   మానస విహారి! ఓ సౌందర్య లహరి.  జయవిజయులు సనకసనందనాది శాపగ్రస్తులై నారాయణ విరోధులుగా మారిరి.హిరణ్యాక్షుడు భూమాతను సముద్రములో దాచివైచినపుడు అమ్మపదిగోళ్ళనుండి సృష్టించిన పది అవతారములలో మూడవదైన వరాహమూర్తి భూమాతను రక్షించి,అసురునకు ముక్తిని ప్రసాదించెను.కలియుగములో పాపముల సంఖ్య మితిమీరి అశక్తులైన ఆర్తులను రక్షిచుటకు ,అమ్మ అనుగ్రహము ఆదివరాహపు కోరయై,ఆశ్రిత రక్షణమును చేయుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

SAUNDARYALAHARI-56

  సౌందర్య లహరి-82   పరమ పావనమైన  నీ  పాదరజకణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము   సకలశాస్త్ర సమూహముల  సారమైన నీ అందెలు   సామవేద సంగతుల  స్వరమైన నీ అందెలు   నీ పాదములు తాకలేని నీలకంఠ వదనుని   చిత్తరమైన కొత్త తత్తరపాటును చూసి   అవ్వ? ఇది ఏమి సోద్యము?   మేము చూసినామంటూ చేసే సవ్వడులు   చిత్తుగ ఓడిపోయి ఏమిచేయలేని  మన్మథుని   చిత్తపు పరిహాసముగ పకపక నవ్విన వేళ   నీ మ్రోలనే నున్న నా కేలు  విడనాడకమ్మా,నా   మానస విహారి! ఓ సౌందర్య లహరి.   అదిశంకరుల అద్భుతభావనా విన్యాసము.అనుపమాన లీలా విశేషములు ఉపమాలంకార విరచితములు.లలిత లలిత శృంగార ఉత్తుంగ తరంగాలు.లాస్యము చేయుచున్న అమ్మ ముగ్ధమనోహర పాద, మంజీరములను స్వామి ఒకసారి తాకవలెనను తలపుతో కొంచము వంగినపుడు,పరమ సాధ్విమతల్లి భంగిమను మార్చి స్వామికి అందకుండిన,ఎవరైనా చూసినారేమో అని తత్తర పాటుతో నున్న శివుని ముఖమును చూసినపుడు వచ్చిన మువ్వల సవ్వడి,మన్మథుని చిత్తములో నేను చూసినానులే అని నవ్వినట్లున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచి...

SAUNDARYA LAHARI-55

  సౌందర్యలహరి పరమపావనమైన నీపాదరజకణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము తల్లి గర్భములో నేనుండగా సహస్రారముద్వారా క్రిందకు పయనమై, మూలాధారముచేరి,పైకి వస్తూ దేహేంద్రియాదుల కన్నా ఇతరములేవి లేవను అజ్ఞానపు బ్రహ్మగ్రంధి ముడిని,నీ దయతో విడదీస్తూ సూక్ష్మ శరీరము నాదికాదను బోధద్వారా విష్ణుగ్రంథి ముడిని విడదీస్తూ,సాగుతూ శరీర భ్రాంతియైన రుద్రగ్రంధిని చేదిస్తూ నన్ను కట్టివేసిన ముడులను నీ కరుణ విప్పుచున్నవేళ నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా, నా మానస విహారి ఓ సౌందర్య లహరి "సహస్రాంబుజారూఢా సుధాసారాబ్ధి వర్షిణి" సహస్రారములో జగన్మాత అమృతవర్షిణిగా మనలను అనుగ్రహిస్తుంది. జీవుడు స్థూల-సూక్ష్మ-కారణ శరీరములను కలిగియుంటాడు. సాధకుని కుండలినీశక్తి మూలాధారమునుండి సహస్రారము చేరుటకు మధ్యలో మూడు అవరోధములను ఎదుర్కొనవలసి వచ్చును.అందులో మొదటి అవరోధమును "బ్రహ్మ గ్రంధి" అంటారు.మనకున్న ప్రాపంచిక బంధములు దట్టమై చిక్కుముడిగా మారి స్వాధిష్ఠానమును దాటి పైకి వెళ్ళనీయక అడ్డుపడుతుంటాయి.తల్లి అనుగ్రహముతో చిక్కు ముడిని విడదీసి మార్గమును సుగమము చేయుటచే,సాధకునికి తనకు స్థూల శరీరమున...