Posts

SAUNDARYA-SAANKARI-73

     సౌందర్య లహరి-శాంకరీదేవి-72  పరమపావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ  స్వరూపము  ఆది దంపతుల లీలయనగ అద్భుత సుందరభవనము  విస్తుబోవచేసె రావణుని విశ్వకర్మ నిర్మితము  బ్రహ్మగా మారి కోరె,దక్షిణగ దక్షిణ కైలాసము  అంబాసమేతముగా,షరతుతో అనుగ్రహించిరి కరుణను  ధర్మమునకు గ్లానియైన ధ్వంసము తప్పదని  పుడమి పుణ్యక్షేత్రమైన లంకా ద్వీపములో  మాయాసతి మొలభాగము మహిమాన్వితమూర్తిగ  శాంకరియై త్రికోణేశునితో కింకరులను బ్రోచువేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.  సంస్కృతములో లంక అంటే భవ్యమైనది,లంక అంటే తేజస్సుగల భూమి/ద్వీపము.శ్రీలంక జలావృత భూభాగము.దైవ మహిమచే భూమి పవిత్రతను సంతరించుకొని క్షేత్రముగా భాసిల్లుతుంది.దైవానుగ్రహముతో పుణ్యక్షేత్రమవుతుంది.ఈశ్వర సంకల్పముగా భవాని ఒక అందమైన భవనమును దక్షిణ భూభాగములో నిర్మింపహేయమని నాథుని కోరగా,సదాశివుడు విశ్వ కర్మచే లంకలో నిర్మింపచేసెను.దేవతలు విశ్వకర్మ,రాక్షసులకు మయుడు నిర్మించేవారు.గృహప్రవేశపూజను నిర్వహించిన రావణబ...

SAUNDARYA LAHARI-72

 సౌందర్య లహరి-రాజేరాజేశ్వరి   పరమపావనమైన నీపాద రజకణము   పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము   ఇచ్చా-క్రియా-జ్ఞాన  శక్తుల అనుగ్రహదాయిని   అష్టసిద్ధులను అనుగ్రహించు సిద్ధిదాత్రివి నీవు   అంబా తత్త్వము వెల్లివిరియ ఆనందదాయిని   రాజాధిరాజులను రక్షించే ఈశ్వరివి నీవు   రజో-తమో-సత్వ భక్తిని మించినదైన పరాభక్తితో   రాగాతీత ఉపాసనను ఉత్కృష్టము చేయుచు   తేజోమయమైన  నీ రాజరాజేశ్వరి  రూపము   అపరాజితగా నాలో విరాజమానమగుచున్నవేళ   నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా   మానస విహారి! ఓ సౌందర్య లహరి  "పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి-కృపాకరి శంకరి,పాహిమాం"  కోరి వచ్చిన వారికెల్లను కోర్కెలొసగె బిరుదు గల తల్లి రాజరాజేశ్వరి. " ఐశ్వర్య ప్రదాయినికనుక తల్లిని ఈశ్వరి అని కీర్తిస్తారు.సర్వ సమృద్ధియే ఐశ్వర్యము.ఐశ్వర్యము ఎనిమిది రూపములలో చెప్పబడినది.(అష్ట-ఐశ్వర్యములు.) అవి,   1.రాజ్యము-2.ధనము-3.ఇల్లాలు-4.పిల్లలు-5.ధైర్యము-6.స్థైర్యము-7.విద్య-8.వినయము.(మణి మాణిక్యముల...

SAUNDARYA LAHARI-71

Image
 సౌందర్య లహరి-మహిషాసుర మర్దిని  పరమపావనమైన నీ పాదరజ కణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  మధుకైటభులను సంహరించితివి మాధవ సోదరి  భండాసురుని వధించి భువన భాండము రక్షించితివి  రక్తబీజుని అంతమొందించిన శక్తిస్వరూపిణివి  విషంగ విశుక్రులం విషమును అరికట్టితివి  మహిషాసురుని మర్దించిన మహిమాన్వితవి  అవనీ పాలనకై ఎన్నో అవతారములెత్తితివి  అంతః-బహిర్ముఖములలో  చింతలను కలిగించు  అసుర సంహారమే నీకు అమితానందమైన వేళ  నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.  " జయజయహే మహిషాసుర మర్దిని"  పై వాక్యములో ధర్మమునకు ప్రతిరూపమైన అమ్మవారు-అధర్మమే ఊపిరి యైన రంబ పుత్రుడు మహిషుడు ,ధర్మమునకు లభించిన జయము దాగియున్నవి.   సకలదేవతా శక్తుల సమాహారమునకు-సకల దేవతలు అనుగ్రహించిన ఆయుధములు తోడై'రిపవోపి శస్త్రపూతా" (తల్లి ఆయుధముల స్పర్శ వలన శత్రువులు పునీతులగుదురు)  అన్నట్లు మహిషాసుర సంహారమునందు ఆయుధము-వాహనము అరివీర భయంకరములైనవి.  1.ఆయుధము.    మహిషునిలోని అజ్ఞానము అను చీక...

SAUNDARYA LAHARI-70

 సౌందర్య లహరి-కనకదుర్గ-67  పరమ పావనమైన  నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  సృష్టి -స్థితి  కార్యములకు  బ్రహ్మ-విష్ణువులను  సృష్టించెను వారికి శక్తులుగ వాణి-శీలక్ష్మిని  లయముచేయుటకుగాను  త్రినయనుని సృష్టించె  సగభాగముగ చేరగ పార్వతిని  పంపించె  ముగ్గురమ్మలకు  మూలముగా నీవున్నావమ్మా  దుర్గమము అను పదము ఎపుడో నిర్గమించినదమ్మా  పసుపు-కుంకుమలతో,పట్టుచీరలతో-గాజులతో  కనక దుర్గ మాతగా నీవు కనికరించుచున్నవేళ  నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా  మానస  విహారి ఓ సౌందర్య లహరి. " దుర్లభా-దుర్గమా-దుర్గా-దుఖఃహం త్రీ-సుఖప్రదా" శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రము దుర్గమ్మను కొనియాడుతున్నది.దుర్గమ్మ స్వభావము ఎటువంటిది? తెలుసుకోవాలనుకుంటే, దు:ఖమును తొలగించి సుఖము కలిగించునది కనికరమనే కనకము గల కనకదుర్గమ్మ.   దుర్గమ్మ పదమునకు ముందు దుర్లభా-దుర్గమా అను రెండు పదములు కలవు. ఇక్కడ ఒక దుర్గము (ఎత్తైన గోడలు కల కోట దుర్గము) మనది.అది అరిషడ్వర్గములత...

SAUNDARYA LAHARI-69

 సౌందర్య లహరి-గౌరీదేవి  పరమపావనమైన నీ పాదరజకణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  తారకాసుర సంహార తరుణమని  భావించి  పరమ శివునితో పరిణయ ప్రతినబూనె  పార్వతి  పంచాగ్నుల మధ్యనుండి ఘోరతపమునాచరించె  పర్ణగా-అపర్ణగా అకుంఠిత దీక్ష దక్షపుత్రి  అరుణకాంతి మాయమాతె-అసితామయమాయె  మేను  గురుతెరిగిన ప్రాణేశుడు  కాళిని గౌరిని చేసెను  అభయ-వరద ముద్రలతో,త్రిశూలము-డమరుకముతో  పెద్దతల్లి  గౌరమ్మ ఎద్దునెక్కి యున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.  స్కాంధపురాణము-మత్స్య పురాణము-శివ పురాణము గౌరి నామములో అమ్మ తత్త్వమును దర్శించింది.ఆహారమునకు దూరముగా-పంచేంద్రియ లోలత్వమునకు దూరముగా నుండి పరమేశుని భర్తగా పొందగలిగినది తల్లి.కనుక ప్రత్యాహార సమాధి సమాధి భాజాం అని కీర్తిస్తారు.నల్లనిఛాయతో ప్రకాశించే తల్లిని భర్త "కాళి" నల్లని దానా అని మేలమాడినాడని,అందులకు చిన్నబుచ్చుకొని తపమాచరించుటకు కైలాసమును వీడి వెళ్ళగా,ఆసమయమున ఆడి అను అసురుడు పాముగా కైలాస ప్రవేశమును చేసి(మాయా...

SAUNDARYA LAHARI-68

 సౌందర్య లహరి-లలిత పరాభట్టారిక  పరమ పావనమైననీ పాదరజ కణము  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము  బ్రహ్మా0ణడ పురాణంతర్గత  బ్రహ్మాండరూపిణి  ప్రాతఃకాల స్మరణము పరమ రమణీయము  హయగ్రీవ-అగస్థ్య సంవాద సుందరి  ప్రాతఃకాల భజనముసర్వ పాప భంజనము  చిదగ్నికుండ ప్రకటితమైన చిద్విలాసిని  ప్రాతఃకాల వందనము  ఆనందనందనము  వశిన్యాది-వాగ్దేవతా సేవిత శ్రీమన్నగర నాయకి  లలితా పరా భట్టారికగా కొలువుతీరియున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి.  "లాలనాత్ ఇతి లలితా".లాలనతో మనలను అనుగ్రహించు తల్లి లలితాదేవి.జ్ఞాన శాస్త్రమయమైన శ్రీ లలితోపాఖ్యానము,శ్రీ లలిత సహస్ర రహస్యనామ స్తోత్రములు,త్రిశతి,పంచరత్మ్న స్తొత్రము అనేకానేక విధములుగ జగములను ఉద్ధరించుచున్నవి.భక్తుల హృదయములలో క్రీడించు పరాశక్తియే లలిత.అనాది-అఖిలాధారయైన తల్లి,జ్ఞానముచే మాత్రమే దర్శనమును అనుగ్రహించు తల్లి, "లలిత-లలిత-శ్రీ లలిత-విశ్వ మోహిన శ్రీమాతగా భజింపబడుతు,నామ రూపములను అధిగమించి,తత్త్వ ప్రకాశినిగా అవగతమగు...

SAUNDARYA LAHARI-67

Image
8:00 AM (1 hour ago)   సౌందర్యలహరి-సరస్వతి  పరమపావనమైన  నీ పాద రజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  జిహ్వాగ్రమున వసించు సరస్వతి జ్ఞానశక్తిగా  పలుకులే కావ్య-నాటక-అలంకారములుగా  మీమాంస-పురాణములు తల్లి కంఠపు పైగీతగ  ఆయుర్వేద-ధనుర్వేదములు కంఠపు నడిమి గీతగా  చతుషష్టి కళల చతురత క్రిందనున్న గీతగా  బాహువుల సంకల్పమే తంత్రాది రూపములుగా  అంతర్వాహినిగా  మా ఆపాద మస్తకము బ్రహ్మజ్ఞానముగా   సురపూజిత  భాసురముగ ప్రవహించుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి! ఓ సౌందర్య లహరి. "కేయూరాని న  భూషయంతి పురుషం హారాన చంద్రోజ్జ్వలా  న స్నానం విలేపనం  న కుసుమం న అలంకృత మూర్ధజాః  వాణ్యేక సమలం కరోతిపురుషం య  సంస్కృత ధార్యతే  క్షీయంతే ఖలు భూషణని సతతం వాగ్భూషణం భూషణం"  ఆభరణముల అలంకరించుకున్నను,విలేపనములు అలదుకొన్నను,పన్నీటి స్నానములు చేసినను,సుగంధ పుష్పమాలములను అలంకరించుకొన్నను విద్యావిహీనుడు వ...