Posts

SREEMANNAGARA NAAYIKA-09

మాహేశ్వరి మనోసంకల్ప నిర్మిత మరకతమణి ప్రాకారము మహిమాద్భుతము.ఇందులో రెండు త్రికోణములు గలభవనము కలదు.పైవైపున నున్న త్రికోణ బిందువులలో త్రిమూర్తులు తేజరిల్లుచుంటారు.క్రిందివైపునకున్న త్రికోణ బిందువులలో వారు శక్తులతో ఉంటారు.గణపతి-కుబేరుడు-దక్షిణామూర్తి ఇంకా ఎందరెందరో దేవతలు అమ్మదయతో అధిష్ఠితులై ఉంటారు.పవిత్రత-ప్రశాంతత-ప్రావీణ్యత గల ఆ మరకతమణిప్రాకారమున నున్న నన్ను పరమేశ్వరి అనుగ్రహము తరింపచేయుచున్నట్లున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.  "పంచమీ-పంభూతేశి" తల్లిని సేవించునవి పంచభూతములు.అవి నీరు-నిప్పు-నింగి-నేల-గాలి.అవి తల్లి కనుసన్నలలో పంచభూతములను గమనించుచు,వాటి గమనమును నిర్దేశించుతు,ఋతువులననుసరించి,ప్రపంచ సౌభాగ్యమునకు సమతౌల్యతతో-సంస్కారముతో ఉండునట్లు చేయుశక్తులు పంచభూతస్వామినులు..అలాకాకుంటే ప్రళయమే కదా.    శ్రీమాత పూజా విధానములో సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహ విధానములలో,బిందురూప పూజ. (సృష్టి) స్థితిపూజలో అర్చించిన దేవతలు కాకుండా మిగిలిన దేవతలను (మంత్రపూరితమైన వారిని) ఆమ్నాయ దేవతలు అంటారు.వారు నాలుగు దిక్కుల పేర్లతో-ఊర్థ్వ-అథో స్థానములను ప...

SREE MANNAGARA NAAYIKA-08

Image
అమ్మకు నమస్కారములు.అదిగో ఇంద్రనీల ప్రాకారము.కాళి-కరాళి-ఉష-దుర్గ-సరస్వతి లక్ష్మి ఇత్యాది పదహారు శక్తులు పదహారు దళములుగా గల పది యోజన విస్తీర్ణ పద్మాకార భవనము. అష్టమాతృకాశక్తుల వైఢూర్య నిలయములను  దాటిన తరువాత,పదహారు ఇంద్రనీలమణి రేకులున్న పద్మాకార భవనము ప్రజ్ఞావైభవమై ప్రకాశిస్తోంది.పద్మము జ్ఞానమునకు సంకేతము.పద్మము సూర్యుని ఉషోదయ కిరణాలతో వికసిస్తుంది.బురదలో పుట్టి,బురదలోనే ఉంటున్నప్పటికిని దానిచే ఏ మాత్రము ప్రభావితము కాకుండా ప్రకాశతత్త్వముతో పరిమళిస్తుంటుంది.పద్మాకారా భవనములోని పదహారు రేకులు అమ్మచే సంకల్పమాత్ర సంభవములైన జ్ఞాన సంకేతములు.పద్మాసనే-పద్మకరే సర్వలోకైక పూజితే-నమో నమః.ఇంద్రనీలమణి ప్రాకారములో దయాసింధువైన పరాశక్తిని ధ్యానములో దర్శించుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు. ఎంత మధువును గ్రోలినను తనివితీరని నన్ను ముత్యాలప్రాకారము మురిపిస్తు పిలిచినది.  నిత్యకళ్యాణి మనోసంకల్పిత ముత్యాల ప్రాకారము స్వచ్చతకు-సత్యమునకు ప్రతీక అయిన తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుండి.అచ్చటి ఎనిమిది రేకులు పద్మము అనంగ మదనాది ఎనిమిది శక్తులుగ ,వారు అందించు సర్వజీ...

SREEMANNAGARA NAAYIKA-07

Image
అమ్మకు నమస్కారములు.   ఉదయించుచున్న సహస్ర సూర్యకాంతిగల తల్లి సంకల్పిత గోమేధిక ప్రాకారము దశయోజన విస్తీర్ణము దండనా సామర్థ్యము కలది.ఇంద్రాణి-రుద్రాణి-నారాయణి ఇత్యాది ముప్పదిరెండు శక్తుల విలసితము.ఒక్కొక్క మహాశక్తికి పది అక్షౌహిణి సైన్యము కలదు. ( (అక్షౌహిణీ-21,870 రథములు,21,870 ఏనుగులు,65,610 అశ్వములు,1,09,360 కాలిబంట్లు.) విద్య-పుష్టి-సినీవాలి ప్రభ నందాది సకల సద్గుణ శోభితము. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా సంకల్పిత గోమేథిక ప్రాకారము మందారకుసుమ ఎర్రని రంగుతో తాపస మందారి కరుణ ప్రకాశిస్తుంటుంది.ఈ ప్రాకారములో తరువులు.ఆకులు,పండ్లు,భూమి.దేవతశక్తుల ఆభరణములు అన్ని గోమేథిక మణిమయమే.ఎర్రని వీరతిలకమా అన్నట్లు శక్తులు-వీరులు తేజోవంతులై ఉంటారు.ఇక్కడ బుద్ధి,జ్ఞానము,పుష్టి,విద్య సర్వజీవులను ఆదరిస్తూ-అనుగ్రహిస్తుంటారు..తల్లి తేజము నాలో ప్రచోదనమైనదేమో !పరాశక్తి ప్రణామములు. నా మనసు -బుద్ధి ఒకటికొకటై తల్లి తత్త్వముతో తన్మయమగు సమయమున,చెంతనేనున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.(సినీ వాలి-ఒక్కొ అమావాస్య యందు సన్నని రేఖలా కనిపించు చంద్ర రేఖ.) గోమేధిక ప్రాకారమును దాటగానే అత్యంత మనోహరమైన వజ...

SREEMANNAGARA NAAYIKA-06

 అమ్మకు నమస్కారములతో,    ఆరు ఋతువులను ,ధాతు ప్రాకారములను దాటిన నా మనసు ఆరు శతృవులను జయించినదా అన్నట్లు ప్రశాంతమై,పరమ పావన పాదసేవకు పరుగులు తీస్తున్న సమయమున,కనిపించిందొక అద్భుతము అమ్మ వరము. . " కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితా" సంకల్ప నిర్మితమైన పుష్యరాగ ప్రాకారమునకు సమిష్టి దిక్పాలకులు నాయకులు.ఇక్కడ తరువులు-పత్రములు-ఫలములు-పక్షు లు-సరోవరములు అన్ని ఎర్రని కాంతితో ఉంటాయి.ఉత్తరమున కుబేరుడు-పశ్చిమమున వరుణుడు-వాయవ్యమున వాయుదేవుడు-ఆగ్నేయమున అగ్నిదేవుడు ఈశాన్యమున రుద్రుడు మహాతేజోవంతులై వారివారి శక్తులను,ఆయుధములను ధరించి అమితోత్సాహముతో నున్నారు.ప్రమథగణ సంసేవితుడైన పరమేశుడు అష్టమూర్తియై,ఇష్టకామ్యములను తీర్చుచున్నాడు.అతి సుందర అమరావతి పట్టణమున అలౌకిక ఆనందముతో నున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.  ఇది నిజమా? కలా? అని ఇది ఇహ-పర వారధియా? నాలో ఇంత అద్భుత పరివర్తనను అందించిన అతీతశక్తికి అభివాదములిడుచుండగా అగుపించినది అత్యంత ప్రేమతో నన్ను ఆహ్వానిస్తు .    "అరుణాం కరుణాంతరంగతాక్షి" సంకల్పిత పద్మరాగ మణి ప్రాకారము రక్షక స్థాన...

SREE MANNAGARA NAAYIKA-05

Image
 అమ్మకు నమస్కారములతో,    వెండికొండపై బంగరు కాంతులీను చేతిని పట్టుకొని,చిత్ప్రకాశము వైపు పరుగులు తీస్తున్న నా మనసు మహోత్సాహముతో  ,రాకాచంద్ర కాంతిని తలదన్ను రజత ప్రాకారము లోనికి ప్రవేశించినది.   "కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా" సంకల్పిత స్వర్ణప్రాకారములోని వారి భక్తి సాధనకు ఇది తొలిమెట్టు.ఈ ప్రాకారమునకు నాయకుడు శిశిర ఋతువు.అతడు తన భార్యలైన తపశ్రీ-తపస్య శ్రీలతో ఇచటి కదంబ వన ఫలముల మద్యమును సేవిస్తూ,ఆత్మానందమును పొందుతుంటాడు.ఇది బాహ్యార్థము.పవిత్ర ప్రాకారములో మద్యపానమా? అని అనిపించినప్పటికిని,కొంచము నిశితముగా పరిశీలిస్తే.....కదంబ వనఫలములు అనగా అమ్మ కరుణతో అందించిన అనుగ్రహ ఫలితములు.వాని నుండి స్రవించు మద్యము అమ్మ కరుణాకటాక్షమను అమృతము.దానిని దర్శించి-భావించ గలుగుట పానము.దాని పరిణామమే ఆత్మానందము.ఇది అనుభవైవేద్యమే కాని ఈవిధముగా ఉంటుందని మనము చెప్పలేనిది.   మరొక విషయము ఇది చివరి ధాతు-ఋతు ప్రాకారము.శిశిరుని భార్యల నామములు వాటిలో దాగిన ప్రత్యేకతను సూచిస్తున్నవి.అవి తపము-తపోఫలితము.శిశిరములో చెట్లు తమ ఆకులను రాల్చివేసి,నిరాకారముగా,ఎండిన మోడులుగా కనిపించును.కాన...

SREE MANNAGARA NAAYIKA-04

 అమ్మకు నమస్కారములతో,    నన్ను వశము చేసుకొన్న సీస ప్రాకారము ఇంకా ముందు ముందు ఏమి వింతలను వైభవములను చూడబోతున్నానో అను కుతూహలమును కలిగిస్తుంటే,రానే వచ్చింది మరో సౌందర్య నిధి నన్ను మురిపిస్తూ,  దయార్ద్ర-నిష్కళంక- నిర్విరామ అమృతాధారా ప్రవాహ మయము, ఏడు యోజనముల విస్తీర్ణముగల ఇత్తడి ప్రాకారము.స్థలము-సమయము-సందర్భములను గమనిస్తూ,మేఘవాహనుడు (శ్రావణ-భాద్రపదములైన) నభశ్రీ-నభస్య శ్రీ అను తన రాణులతో పాటు ,సర్వస్య-రస్య మాలిని-నితంతి-భ్రమయంతి-వర్షయంతి-వారిధార-మేఘయంతిక -వారిధార-చిపుణిక-మదవిహ్వల అను శక్తులను కూడి,తల్లి సంకేతానుసారముగా( నిమిత్తమాత్రుడై) వర్షిస్తూ.బాధాతప్త హృదయాలకు చలివేంద్రమై వర్షిస్తుంటాడు.జయహో  జగదీశ్వరి.అక్కడచిత్ప్రకాశ ధారలలో చిత్తుగా నేను తడుస్తున్నను.నాతో బాటుగా   అనేకానేక సిద్ధులు-దేవతలు ఉల్లాస భరితులై సతీ సమేతులై ఆ పవిత్రధారలలో పునీతులగుచున్న సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారము    నన్ను  చిత్తు చేస్తున్న ఇత్తడి ప్రాకారమును వదలలేక సాగుచున్న నాకు వరమై కనిపించింది పంచలోహ ప్రాకారము.పరమాద్భుతము. " ...

SREEMANNAGARA NAAYIKA-03

Image
 అమ్మకు నమస్కారములతో, ఏ మాత్రము అర్హత లేని నన్ను, అమ్మ తన అమృత హస్తపు వేలితో నాచేతిని పట్టుకొని నడిపించుచున్నదన్న విషయము అర్థమై ఆనందభాష్పములు జాలువారుచున్న వేళ నేను,మరొక దివ్య ప్రాకారములోనికి  అడుగిడబోవుచున్నానన్నమాట.ఆ  ప్రాకారము అద్భుతము. చదరపు ఆకారములో సప్తయోజన విస్తీర్ణ గోడలతో రాగి ప్రాకారము ప్రకాశిస్తుంటుంది.కల్పక వృక్ష వాటికలు బంగారు ఆకులతో,రతనాల పండ్లతో,వజ్రాల గింజలతో అమృత మధువును స్రవిస్తూ,పది యోజనములకు వరకు పరిమళములను వ్యాపింప చేస్తుంటాయి.గాన ప్రియులైన గంధర్వ యువతీ-యువకులు మధువును సేవిస్తూ,మదన పరవశులై ఉంటారు.అందులో పుష్ప బాణుడు పువ్వుల గొడుగు క్రింద,పువ్వుల సింహాసనముపై ,పువ్వుల మాలలను అలంకరించుకొని,తన భార్యలతో పువ్వుల మథువును త్రాగుతూ పూబంతులాడుచున్న సమయమున, వారిచెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.  అమ్మ అనురాగముతో ఆర్ద్రమైన నా మనసు రాగిప్రాకారమును దాటి సీసప్రాకారములోనికి ప్రవేశిస్తున్నది. సీస ప్రాకారము సప్తయోజన విస్తీర్ణముతో,మథుర రస ఫలములు గల సంతానవాటికతో శోభిల్లుతుంటుంది.గ్రీష్మ నాయకుని భార్యలైన (జ్యేష్ఠ-ఆషాఢ మాసములు) శుక్...