Posts

NA: PRAYACHCHAMTI SAUKHYAM-04

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-07   " ఓం తస్కరాణాం పతయే నమః"   ********************************  ఒక్కడే! దిక్కొక్కడే ! పెద్ద దొంగ ఒక్కడే  అదుపుతప్పుచున్న అరిషడ్వర్గములను దోచు  దొంగ ఒక్కడే  దేవుడు-జీవుడు ఒక్కడే  ధర్మము-మర్మము తానొక్కడే.  లోకాన దొరకాదు దొంగవని చాటాను  నా పాపరాశులన్నీ దొంగల్లే దోచేశావు  అని స్తుతింపబడిన మహేశ్వరుని చోరకళా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.ఓం నమః శివాయ.   చోరాన్  మారయ మారయ   ------------------------   " భగవంతుడు-భక్తుడు ఇద్దరు దొంగలే"      దొంగలరూపములో నున్న ఈశ్వరచైతన్యమునకు నమస్కారము.ఈశ్వర చైతన్యము చర్మచక్షువులకు కానరాకుండా,సకలచరాచర జీవరాశులయందు దాగియుండి వాటిని శక్తివంతముగా ప్రకటించు చున్నది.ఎందుకంటే , రుద్రుడు "స్తేనానం పతి". గుప్తచోరుడు.మనకు దొరకకుండ రహస్యముగా మనలోనే దాగియున్నాడు.నమో నమః.  ఏ వికారములేని పరమాత్మ అనేక చోరులరూపములలో ప్రకటింపబడుతు పాపములను దోచుకొనుచు ప్రాణులను సంస్కరిస్తుంటాడు.బహురూపములైన భగవత్తత్త్వమును భజించరాదే ఓ మనసా! 1....

NA: PRAYACHCHAMTI SAUKHYAM-03

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-04    *****************************   " ద్రాపే అంధసస్పతే దరిద్రన్ నీలలోహిత"    భగవంతుడు-భక్తుడు ఇద్దరు ఈశ్వరచైతన్యమే. అన్నాద్ భవంతి భూతాని-పర్జన్యాద్ అన్న సంభవః. అన్నము వలన జనులు మేఘముల వలన అన్నము ఉత్పత్తి అగుచున్నవి ( శ్రీమద్భగవద్గీత )   కరుణతో అన్నమును ప్రసాదించుచు ఆదిదేవుడు,భక్తితో అన్నమును ఆరగింపుచేయుచు అరివట్టాయ నయనారు పరమపూజ్యులు.హర హర మహాదేవ శంభో శంకర.  ద్రాపే-ఓ శివా నీవు అఘోరరూపివై భక్తుల అన్నమును పాలిస్తావు.అదేవిధముగా ద్రాపే ఓ శివా ఘోర రూపివై పాపులను శిక్షిస్తావు.పాపము-పుణ్యము అనునవి,ఘోర-అఘోర రూపములు మేము చేసిన -చేయుచున్న పనుల ఫలితములే కాని అన్యము కాదు అను తెలివిని మాకు అనుగ్రహించు తండ్రీ అని వేడుకొను,   అగస్త్య కమండలజలము నేలపై జారి,కావేరి నదిగా రూపాంతరమును పొంది, ప్రవహించుచున్న "గణమంగళ" పట్టణమున తాయినార్ అను సంపన్న గృహస్థుడు ధర్మపరాయణుడై యుండెను.  " యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతే జవాన్" " తే పథాం పథి రక్షయ ఐలబృదాయ వ్యుధః."    ఐలము అనగా అన్న సముదాయము అను అర్థ...

NAH PRAYACHCHAMTU SAUKHYAM-02

Image
  నః ప్రయచ్చంతు సౌఖ్యం.-5  **************************   "వణిగృహ్ నంతిపరే పశ్యతోహరః."  పశ్యతోహరులు అంటే మనము చూస్తుండగానే అపహరించేవాళ్ళు.వర్తకులు అను భావముతో వాడబడినది.  భగవంతుడు-భక్తుడు ఇద్దరు వర్తకులే.ఓం నమః శివాయ.   " మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః"    స్వామి మనకు కావలిసినవిమనకు అందచేయుట కొరకు,చొరలేని గుబురుపొదలలో నున్న వాటికొరకు ఆలోచనచేసి దానిని తెచ్చి విక్రయించు వ్యాపారి రుద్రుడు.ఈశ్వర చైతన్యమే వృత్త్తుల నైపుణ్యము.భక్తుల యోగము ద్వారా భగవత్తత్త్వము ప్రకటితమవుతుంది.శివజ్ఞానము,శి వభతి,శివ ధ్యానము,శివార్చన,శివవ్రతము అను ఐదు శివ యోగములు. " ఓం నమః శివాయ".          భగవంతుడు-భక్తుడు ఇద్దరు వర్తకులే   భక్తుడు     .శివనేస-జ్ఞానకళ దంపతులకు శ్వేతర్నయర్ నోముల పంట.తిరువెంగడర్ గా ప్రసిద్ధిచెందెను.చిన్నతనములోనే తండ్రిని కోల్పోయిన,ను,"మాతాచ పార్వతీదేవి-పితాదేవో మహేశ్వర" అను నమ్మకము. తన సంపదను శివభక్తులకై ఖర్చుచేసి అమితానందమును పొందెడివాడు. " నమో గణేభ్యో-గణపథిభ్యశ్చ వో ...

NA: PRAYACHCHAMTI SAUKHYAM.

Image
 నః ప్రయచ్చంతుంసౌఖ్యం-09        ***********************       ఓం కులాలేభ్యః నమోనమః.   _____________________________  మృత్తిక-కుమ్మరి చక్రము-మట్టిపాత్రలు-కుమ్మరి అన్ని తానైన పెద్ద కుమ్మరికి నమస్కారములు.  ముజ్జగములను మృత్తికను,కాలభ్రమణమనే చక్రమున బంధించి,తన హిరణ్య బాహువులతో బహు సుందర పాత్రధారులుగా మలచి,ప్రాణశక్తి అను అగ్నితో దానిని కాల్చి,లీలా వినోదమును తిలకించు గొప్ప కుమ్మరి ఆ గౌరీపతి.ఏ కుండకు ఎంత జీవనమో తెలిసినను ఏమితెలియనట్లుండు బహు చమత్కారి.ఏ జీవి రూపము ఎన్నేళ్ళో,ఏ కుండ పనితనము ఎన్నాళ్ళో.ఎవరు చెప్పగలరు?  క్షీరసాగర మథనంబున జనించెను హాలహలము అతి భీకరమై  క్షీర లింగేశ్వరుడు తన గళమున ధరించెను అది శ్రీకరమై.  గరళ ధరుని కరకమలములు కొలిచిన వారి కరతలామలకములు.  అని నిరంతర నామస్మరణతో సంతుష్టుడై ఉండెడివాడు.   చిదంబర ప్రాంతములో ఒక కుమ్మరి శివభక్తుడు ఉండేవాడు.నిరంతర శివనామ స్మరణము పలుకుచు,స్వామి హాలాహల భక్షణము గురించి,తన్మయత్వముతో తనతోటి వారికి వివరించుచు తరించుచుండెడివాడు ...

VIKAARI UGAADI

Image
   వికారి నామ సంవత్సరాది శుభకామనలు.    ***********************************   అరవై ఏళ్ళ పిదప వాత్సల్యముతో అరుదెంచుచున్నావా   "విలంబికి" వీడ్కోలుగా ఓ " వికారి" వత్సరమా! స్వాగతం.    తెలుగు సంవత్సరములు అరవై.కారణము పెద్దలు ఇలా చెబుతారు.  అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల  సమయము పడుతుంది " శని గ్రహమునకు"   పన్నెండు రాశులు చుట్టిరావడానికి.  మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల  సమయము పడుతుంది " గురు గ్రహమునకు"  పన్నెండు రాశులు చుట్టిరావడానికి.   30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజం "60" కాగా   వీటిని అన్నారు,    జాబిలి కూతురులని కొందరు.    నారద కుమారులని మరి కొందరు.   వాటికి నామకరణము చేశాడు," వరాహ మిహిరుడు" తన    "భృగుసంహిత" లో " ప్రభవ నుండి అక్షయ" అని.   వానిలోని 33వ సంవత్సరమే "వికారి" స్వాగతం-సుస్వాగతం.   వసుధైక కుటుంబమనే పసిడి పాత్రలో మనము,    వెంటాడుతున్న సమస్యలనే వేపపువ్వును వేసి,    ముప్పులను తప్పించే ఉప్పును కొంచ...

SIVA MAHIMNA STUTI-PUSHPADAMTA

Image
 మహిమల సామి నీదయతో మారెనుగ శాపము  అహమును పారద్రోలి అపురూపపు వరముగ  పాహి పాహి,నీ స్మరణము ఇహపరసాధనంబు  మహదేవ స్వీకరించు "శివ మహిమ్నా స్తోత్రము". 1. మీరిన భక్తి నిను కొలువ మితిమీరిన ఆశతో తోటలోని  పూలను తస్కరించ-బిల్వములపై నడిచిన నేను పాపిగ  కూరిమి శాపమిచ్చి అహంకారము సంహరించిన పాదము  చేరినవి పశ్చాత్తాప పలుకులు పుష్పమాలలుగ నిన్ను కొల్వగన్ 2.సగుణమా-నిర్గుణమా,అది-ఇదికాదు గోచరమవదు   అను సందిగ్ధములోనున్నవి మూడు వేదములు ఓ చరాచర   స్వరూప భేదములతో స్వభావ భేదము లేని పాదములు   చేరినవి పశ్చాత్తాప పలుకులు పుష్పములుగ నిన్ను గొలువగన్. 3.ప్రవహించగ పశుపతికృత వేదమరందము ,గ్రహియింపగ   పరికించగ బృహస్పతి ప్రస్తుతి వింతకాదు,గమనార్హము   తరియింపగ జిహ్వను ,తరలినవి జంగమ పాదము చెంతకు    పరిణిత పలుకులు పరుగున, పుష్పములై నిన్ను కొలువగన్. 4. ఖండించెదరు, వాదనలు  సలుపుదురు మూర్ఖులు    అఖండమూర్తి నీ త్రిగుణాత్మకత నెరుగని మర్త్యులు    వివరము వేగమె విన్నవించగ, వరప్రదాత పాదములు   ...