Posts

NAH PRAYACHCHAMTI SAUKHYAM-11

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-10   *****************************    భగవంతుడు-భక్తుడు ఇద్దరుసేనాపతులే-అన్నదానప్రియులే.  " నమో బభ్లుశాయనివ్యాధినే అన్నానాం పతయే నమః."   పరమేశ్వరుడు వృషభవాహనుడు.వృషభము ధర్మము.దుక్కిదున్ని దుర్భిక్షమును పోగొట్టును." నమో మేఘ్యాయచ" మేఘస్వరూపముగా స్వామి మారి వాని ద్వారా వర్షములను కురిపించును.హర్షమునందించును." నమో వర్షాయచ."  " అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః."   మరొకవిశేషము    తమసేనలకు అన్నమును అందించుటలో అతి విశాలహృదయులు. ప్రాణులు అన్నమువలన కలుగుచున్నవి.అన్నము మేఘము వలనకలుగుచున్నది.మేఘము జన్నము వలనకలుగుచున్నది.జన్నము సత్కర్మల వలన కలుగుచున్నది.సత్కర్మ వేదము వలనకలుగుచున్నది.వేదము అక్షర పరబ్రహ్మమైన సదాశివుని వలన కలుగుచున్నది సర్వలోక సేనాపతి సదాశివా నమో నమః.. భక్తుని విషయానికొస్తే,  తంజావూరు జిల్లాలోని తిరునట్టి యాట్టంగుడి నివాసియైన కోట్పులి నాయనారు.చోలరాజ్య సేనాధిపతి.అతి పరాక్రమ వంతుడగుటచే పెద్దపులి అను పేరుతో ప్రసిధ్ధిపొందాడు.పరాక్రమమునకు...

NAH PRAYACHCHANTI SAUKHYAM-10

Image
     నః ప్రయచ్చంతి సౌఖ్యం.-10      *************************   కైలాసపురి నుండి కాశికై-కాశికాపురి నుండి దరహాసివై   మా హృదయవాసిగా భాసిలుతు-నడిపించ ఎదురుగా   కనిపించుచున్నావుకరుణతో  శివశివా-హరహరా    భగవంతుడు-భక్తుడు ఇద్దరు బ్రాహ్మణులే-యజ్ఞోపవీతులే.    " నమో హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః." శివుడు హరికేశుడు అనగా నల్లని శిరోజములు కలవాడు.శివుని నల్లని కేశములు వార్ధక్యము లేని వాడని,కాల ప్రభావములను అధిగమించినవాడన్న విషయమును తెలియచేయుచున్నది.మరియు శివుడు ఉపవీతుడు.బంధము కలవాడు.ఉప అనగా దగ్గరగా నున్నవాడు.సాక్షాత్తు గాయత్రీమాతయే.శివుడు వేదమాత గాయత్రీదేవి సంకేతమును ధరించిన వేదమయుడు.అంతేకాదు తాను ధరించిన ఉపవీతము (జందెము) పుష్టులను (వాక్పుష్టి-జ్ఞానపుష్టి-ఇంద్రియపుష్టి -ధర్మపుష్టి) మొదలగు వానిని పరిపూర్ణముగా ప్రసాదించగలవాడను శివతత్త్వమును చాటుచున్నది.అదే భక్త రక్షణా ధర్మసంస్థాపన ధారణము.      ఇద్దరును మంగళము కొరకు ఉపవీతమును,గాయత్రీ కృపను ధరించినవారు.అనగా బ్రహ్మజ్ఞానమునందు నిష్ణాతులు.మరియును వాక్పుష్...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-09

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-03  ************************ 'జ్ఞానానంద మయందేవం నిర్మలస్పటికాకృతిం  ఆధారం సర్వ విద్యానాం హయగ్రీమం ఉపాస్మహే."   నిర్మల స్పటిక ప్రకాశముతో సకల విద్యలకు ఆధారముగా ప్రకాశించుచున్న హయగ్రీవునికి (గుర్రము తల కలవానికి) సభక్తిపూర్వక నమస్కారములు చేయుచున్నాను.  అశ్వము-అశ్వపతి తానైన పశుపతికి నమస్కారము. *******************************************   అశ్వ సహాయమున స్వామి సరసన కూర్చొనగలిగిన మాణిక్యవాచగరు భక్తునకు నమస్కారము.   "నమః అసీనేభ్యః  నమః."  ఆసీనుడైన శివునికి నమస్కారము.  అశ్వము అను పదమునకు మనము వ్యవహరించు గుఱ్రములు అను అర్థము మాత్రమే కాకుండ  యోగులు,మననములో రమించు మునులు,భవిష్యత్తును దర్శించగల ఋషులను కూడా పేర్కొంటారు.  " క్షతృభ్యో-సంగ్రహీతభ్యశ్చ నమోనమః."   అశ్వములను సాకు క్షత్తలకు,వాటి పగ్గములను పట్టుకొని నడిపించు సంగ్రహీతులైన శివస్వరూపములకు నమస్కారములు.  అశ్వ ఉపాధిచేసికొనిన అదృష్టము అంతాఇంతాకాదు.ఆపూర్వము హయగ్రీవుడను రాక్షుడు దిదేవుడే తన రూపమును ధరింపచేసుకొనినది.పూర్వము హయగ్రీవ...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-08

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-08   ******************************  భళి భళి భళి మహదేవా-బహుబాగున్నదయా నీ మాయ  *******************************************  భగవంతుడు-భక్తుడు ఇద్దరు రథికులే   రథము-రథకారుడు-రథసారధి ముగ్గురు రుద్రుడే.  " నమో రథేభ్యో-రథపతిభ్యశ్చవో నమః."   భవిష్యత్ పురాణము ప్రకారము రుద్రుడు రథము మరియు రథపతి.చతుర్వేదములు చతురాశ్వములు.సూర్యచంద్రులు రథచక్రాలు.ముప్పదిమూడుకోట్ల దేవతలు రథభాగములు.చతుర్ముఖ బ్రహ్మ రథసారథి.స్వామి మేరుపర్వతమును ధనువుగా,వాసుకిని అల్లెత్రాడుగా,హరిని అస్త్రముగా చేసి త్రిపురాసర సంహారమును గావించి జగములను రక్షించినాడు .  ' ఓం తక్షభ్యః- రథకారేభ్యో నమోనమః " ( వడ్రంగి) రథకారునకు నమస్కారములు.  రంభణశీలత్వా రథః.కదిలే స్వభావము కలది రథము.ఈ విధముగా గమనిస్తే జగతిలో కదలిక కలిగిన ప్రతిజీవి రథమే.దానిని సృష్టించిన పరమాత్మ రథకారుదే.నడిపిస్తున్న పరమేశ్వరుడు రథసారథియే." నమో సూతేభ్యో-ఒకసారి అరుణాచలములో స్వామివారి రథము కదిలి గర్భగుడిని చేరుటకు మొరాయించినదని,కావ్యకంఠ గణపతి వారి తన దక్షిణహస్తముతో స్పర్శించగానే కదిలినద...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-07

Image
  నః ప్రయచ్చంతిసౌఖ్యం.-07   ************************   " ప్రళయ పయోధి జలే కేశవ ద్రుతవానసి వేదం    విహిత వహిత్ర కరిత్రమఖేదం    కేశవాద్రుత మీనశరీర జయజగదీశ హరే"  చేపరూపమును దాల్చి చేవతో సొమకుని నుంది వేదోధ్ధరణను గావించిన కేశవ నమస్కారములు.  భవసారమున పడి బయటకు రాలేని మాపై నీ కరుణాజాలమును విసిరి కడతేర్చు గొప్ప జాలరి వైన శివా ప్రణామములు.  నమో ప్రతరణేభ్యో ఉత్తరణేభ్యశ్చవ నమో నమః.  స్వామిని దర్శించిన సత్యవ్రతుడెంత ధన్యుడో స్వామికి మత్స్య నైవేద్యమును సమర్పించిన ఆదిపత్త నయనారు అంతే మహనీయుడు. చిన చేపను-పెద్ద చేప,చిన మాయను-పెనుమాయ  ఇది స్వాహా-అది స్వాహా అని అంటున్నాడు పెద్దజాలరి మనకు ఒక జాలరి కథ చెబుతూ,  విషయవాసనలనే ప్రవాహములో పడి,వల పట్టుకొని యున్నమాయ అనే ఆపదను గుర్తించలేని మనలను రక్షించుస్వామికి నమస్కారములు..శివోహం.  భ గవంతుడు-భక్తుడు ఇద్దరు జాలరులే  జలము-జలచరము-జాలరి ఈశ్వరచైతన్యమే.  " ఓం నిషాదేభ్యశ్చవ నమోనమః".  చేపలను సమూహముగ పట్టి చంపునట్టి నిషాదుల రూపమున నున్న రుద్రునకు నమస్కార...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-06

Image
    నః ప్రయచ్చంతి సౌఖ్యం-06     ************************  భగవంతుడు-భక్తుడు ఇద్దరు వేటగాళ్ళే. ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారె తాను ఎరుకతగా  ఎరుక కలిగిన-జ్ఞాని.....ఎరుకగా..వేటగానిగా  మారుటయే  శివలీల.  ఎనలేని వాత్సల్యము ఎరుకరూపమును దాల్చినది.ఎదురుదాడికి దిగినది.  వేట నాది-వేటునాది-వేటాడే చోటు నాది-ఏటి తగవు ? అని మాటలాడినది.కరుణతో కరిగి పశుపతమును ప్రసాదించినది.ఏలినవాని లీలలను ఏమని వర్ణించగలను?మాట కరుకు-మనసు చెరుకు మన శివయ్య.  పరమేశ్వరుని వేట జీవుల పాపకర్మములను చేయించు అరిషడ్వర్గములు.వానిని అరికట్టుటకు వేసిన దెబ్బ యే వేటు.వేటాదే చోటు ఎక్కడ వేటాడ వలెనో ఆ ప్రదేశము.అదే మన మనస్సులు.అతి చంచలమై బుధ్ధినివిస్మరింపచేసి మూఢులను చేస్తుంది.అదే జరీఅది ఈ కిరాతార్జునీయములో .అర్జునుని అహంకారము అను వేట.దానిపై పడిన వేటుయే పినాకము శిరమును ముద్దాడుట.ఎంతటి చమత్కారమో మనవేటూరిగారిది.వేట ఫలితమేఅహంకారము తొలగి స్వామీనుగ్రహమునకుపాత్రతను కలిగించి,పాశుపతాస్త్రమును ప్రసాదించినది.నమోనమః.  |" నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే ...

NA: PRAYACHCHAMTI SAUKHYAM-05

Image
 నః ప్రయచ్చంతి  సౌఖ్యం-08  ************************* " గో" శబ్దమునకు పవిత్రము-ధర్మము అను అర్థములను పెద్దలు చెబుతారు.ధర్మమును రక్షించు పరమేశ్వరుని గోపాలునిగా,ధర్మ సంరక్షకునిగా భావిస్తే ,శివుడు-శివుని కొలిచే భక్తులు గోపబాలురే కదా.శివోహం.  కార్తిక సోమవార శుభకామనలతో నేటి కథను ప్రారంభిద్దాము పరమేశ్వరానుగ్రముతో.  భగవంతుడు-భక్తులు ఇద్దరు గోపబాలురే  " నమః శంగాయచ-పశుపతయే నమో నమః"   "శం" అనగా సృష్టించి,సృష్టించిన దానియందు జీవులకు తాదాత్మ్యమును కలిగించి,అన్యము ఏదియును లేదనిపించి,ఆత్మార్పణను చేయించే శక్తి.ఆ శక్తియే " ఈశ్వర చైతన్యము." నమోవాకములు.   సస్వరూపమును తెలిసికొనలేని జీవులు పశువులు.వారిని పాలించే ఏకైక నాయకుడు పశుపతి.ఓం పశూనాం పతయే నమః."  పశుపాలకులు ఈశ్వరతత్త్వమును గ్రహించిన ధన్యులు.కనుకనే వారు పశువుల కొట్టములో పశుపతిని దర్శించగలిగారు." ఓం నమో గోష్ఠాయచ."వారికా దివ్యత్వము లభించుటకుకారణము రుద్రుడే సుమా.ఇది చదివితే కాదనగలరా?  సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం.   " ఉతైనం గోపా అదృశ నదృశ నుదాహార్యః" తన కిరణముల...