Posts

NAH PRAYACHCHANTI SAUKHYAM-15

Image
      నః ప్రయచ్చంతి సౌఖ్యం-15      *******************************  భగవంతుడు-భక్తుడు ఇద్దరు వృక్షములను రక్షించువారే.   ' నమో వృక్షేభ్యో హరికేశభ్యః."    స్థితికారుడుగా పరమాత్మ విశ్వపాలన చేయుటే వృక్షరక్షణ.దానిని పోషించునవి హరికేశ్వములు.ఆకుపచ్చని కొమ్మలు-రెమ్మలు.పువ్వులు-పండ్లు.ఆచ్చాదనయే పరమాత్మ తత్త్వము.విజ్ఞానమనెడి వృక్షము రుద్రుడైనప్పుడు వేదములు-వేదాంగములు హరికేశములు.దానిఆకులు-కొమ్మలు.శ్రీసైల పర్వత ప్రాంతములో వృక్షములు జరుగుట ఎందరో మహానుభావులు దర్శించినారట." ఊర్థ్వమూలం అథః శాఖః" అని శ్రీక్రిష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించినాడు.మహాభారతములోను ధర్మరాజు ధర్మవృక్షముగాను,తమ్ముళ్ళు దాని శాఖలుగాను ,అదేవిధముగా దుర్యోధనుడు అధర్మ వృక్షముగాను వర్ణించబడినారు.పవిత్ర మర్రివృక్షము క్రింద స్వామి దక్షిణా మూర్తిగా దర్శనమిస్తున్నాడు.శ్రీశైలములో తెల్లమద్దివృక్షము శివస్వరూపమని నమ్ముతారు.మరియు త్రిగుణ్తీత వృక్షముగా బిల్వవృక్షము లక్ష్మీదేవిచే సృష్టించబడినదట.అమ్మవారు స్వామివారి గురించి చూతవృక్షము క్రింద ఆసీనురాలై అత్యంతశ్రధ్ధాభక్తులతో తపమును సలిపినదట.సంస...

NAH PRAYACHCHANTISAUKHYAM-14

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-14  ***************************  భగవంతుడు-భగవదంశ  ఇద్దరు క్షేత్రపాలకులే.  " నమో రుద్రాయ ఆతతాయినే క్షేత్రాణాం పతయే నమః." స్థలము దైవత్వముతో మేళవించిన క్షేత్రముగా భాసిల్లుతుంది.కాశము అనగా వెలుగు-ప్రకాశము అనగా ప్రకృష్టముగా తేజరిల్లునది.  " కాశంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం    విశ్వేశం దేవం ఆలోక్య ప్రీతివిస్తారితే క్షణా    సానురాగాచసా గౌరీ దద్యాత్ శుభపరంపరాం    వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణ పరాకృతీ    అన్నం జ్ఞానదదతీ సర్వాన్ రక్షతి నిత్యశః    త్వత్ ప్రసాదాన్ మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే."             గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రె...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-13

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-13.   నః ప్రయచ్చంతిసౌఖ్యం.-07   ************************   " ప్రళయ పయోధి జలే కేశవ ద్రుతవానసి వేదం    విహిత వహిత్ర కరిత్రమఖేదం    కేశవాద్రుత మీనశరీర జయజగదీశ హరే"  చేపరూపమును దాల్చి చేవతో సొమకుని నుంది వేదోధ్ధరణను గావించిన కేశవ నమస్కారములు.  భవసారమున పడి బయటకు రాలేని మాపై నీ కరుణాజాలమును విసిరి కడతేర్చు గొప్ప జాలరి వైన శివా ప్రణామములు.  నమో ప్రతరణేభ్యో ఉత్తరణేభ్యశ్చవ నమో నమః.  స్వామిని దర్శించిన సత్యవ్రతుడెంత ధన్యుడో స్వామికి మత్స్య నైవేద్యమును సమర్పించిన ఆదిపత్త నయనారు అంతే మహనీయుడు. చిన చేపను-పెద్ద చేప,చిన మాయను-పెనుమాయ  ఇది స్వాహా-అది స్వాహా అని అంటున్నాడు పెద్దజాలరి మనకు ఒక జాలరి కథ చెబుతూ,  విషయవాసనలనే ప్రవాహములో పడి,వల పట్టుకొని యున్నమాయ అనే ఆపదను గుర్తించలేని మనలను రక్షించుస్వామికి నమస్కారములు..శివోహం.  భ గవంతుడు-భక్తుడు ఇద్దరు జాలరులే  జలము-జలచరము-జాలరి ఈశ్వరచైతన్యమే.  " ఓం నిషాదేభ్యశ్చవ నమోనమః".  చేపలను సమూహముగ పట్టి చంపునట్టి ని...

NAH PRAYACHCHAMTISAUKHYAM-12

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-12   ******************************   భగవంతుడు-భక్తుడు ఆలిని అర్థికిచ్చిన వారే.   " నమః సోమాయహ-రుద్రాయచ" ఉమా సమేతుదై యున్న రుద్రునకు నమస్కారములు.  ఉమ అనుపదములోని ఉ-ం-అ అను వర్నములను విలోమముగ చూసినచో అది ప్రణవస్వరూపమైన ఓంకారము.ఉమా సహితుదైన ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు సర్వ సమర్థుడు అని కేనోపనిషత్తు స్తుతించుచున్నది.  నమో మీడుష్తమాయచేషుమతేచ" ధారగా సంతోషములనువర్షింపచేయు రుద్రా నమస్కారములు.  భూకైలాసమును ప్రకటించుటకు భూతనాథుడు రావణభక్తిని రాణింప. చేసినాడు.తల్లి శివార్చన సమయమున సైకతలింగమును చెదరగొట్టించి,తనకథను మొదలుపెట్టాడు.కైలాసనాథుని దేశనమునకు కఠినతపమును కావింపచేసినాడు.అకుంఠిత దీక్షతో ఆ సదాశివుని హృదయకుహరమున ప్రవేశింప  కలిగినాడు పదితలలవాడు.ఓం నమో గహ్వరేష్ఠాయచ నమో నమః".భక్త సులభుడు భవానీ సమేతుడై ప్రత్యక్షమై ఏమి వరము కావలెనో కోరుకోమన్నాడు.ఆత్మలింగమును అర్థించుటను మరచినాడు ఆ అసురబ్రహ్మ.దీనికి కారణము నమః యామ్యాయచ-క్షేమ్యాయచ".దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ జరుపవలసిన వాని మాయ.కథను ముందుకు నడిపించ దలచినాడు గ్రుస్నుడు మరియు గ్ర...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-11

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-10   *****************************    భగవంతుడు-భక్తుడు ఇద్దరుసేనాపతులే-అన్నదానప్రియులే.  " నమో బభ్లుశాయనివ్యాధినే అన్నానాం పతయే నమః."   పరమేశ్వరుడు వృషభవాహనుడు.వృషభము ధర్మము.దుక్కిదున్ని దుర్భిక్షమును పోగొట్టును." నమో మేఘ్యాయచ" మేఘస్వరూపముగా స్వామి మారి వాని ద్వారా వర్షములను కురిపించును.హర్షమునందించును." నమో వర్షాయచ."  " అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః."   మరొకవిశేషము    తమసేనలకు అన్నమును అందించుటలో అతి విశాలహృదయులు. ప్రాణులు అన్నమువలన కలుగుచున్నవి.అన్నము మేఘము వలనకలుగుచున్నది.మేఘము జన్నము వలనకలుగుచున్నది.జన్నము సత్కర్మల వలన కలుగుచున్నది.సత్కర్మ వేదము వలనకలుగుచున్నది.వేదము అక్షర పరబ్రహ్మమైన సదాశివుని వలన కలుగుచున్నది సర్వలోక సేనాపతి సదాశివా నమో నమః.. భక్తుని విషయానికొస్తే,  తంజావూరు జిల్లాలోని తిరునట్టి యాట్టంగుడి నివాసియైన కోట్పులి నాయనారు.చోలరాజ్య సేనాధిపతి.అతి పరాక్రమ వంతుడగుటచే పెద్దపులి అను పేరుతో ప్రసిధ్ధిపొందాడు.పరాక్రమమునకు...

NAH PRAYACHCHANTI SAUKHYAM-10

Image
     నః ప్రయచ్చంతి సౌఖ్యం.-10      *************************   కైలాసపురి నుండి కాశికై-కాశికాపురి నుండి దరహాసివై   మా హృదయవాసిగా భాసిలుతు-నడిపించ ఎదురుగా   కనిపించుచున్నావుకరుణతో  శివశివా-హరహరా    భగవంతుడు-భక్తుడు ఇద్దరు బ్రాహ్మణులే-యజ్ఞోపవీతులే.    " నమో హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః." శివుడు హరికేశుడు అనగా నల్లని శిరోజములు కలవాడు.శివుని నల్లని కేశములు వార్ధక్యము లేని వాడని,కాల ప్రభావములను అధిగమించినవాడన్న విషయమును తెలియచేయుచున్నది.మరియు శివుడు ఉపవీతుడు.బంధము కలవాడు.ఉప అనగా దగ్గరగా నున్నవాడు.సాక్షాత్తు గాయత్రీమాతయే.శివుడు వేదమాత గాయత్రీదేవి సంకేతమును ధరించిన వేదమయుడు.అంతేకాదు తాను ధరించిన ఉపవీతము (జందెము) పుష్టులను (వాక్పుష్టి-జ్ఞానపుష్టి-ఇంద్రియపుష్టి -ధర్మపుష్టి) మొదలగు వానిని పరిపూర్ణముగా ప్రసాదించగలవాడను శివతత్త్వమును చాటుచున్నది.అదే భక్త రక్షణా ధర్మసంస్థాపన ధారణము.      ఇద్దరును మంగళము కొరకు ఉపవీతమును,గాయత్రీ కృపను ధరించినవారు.అనగా బ్రహ్మజ్ఞానమునందు నిష్ణాతులు.మరియును వాక్పుష్...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-09

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-03  ************************ 'జ్ఞానానంద మయందేవం నిర్మలస్పటికాకృతిం  ఆధారం సర్వ విద్యానాం హయగ్రీమం ఉపాస్మహే."   నిర్మల స్పటిక ప్రకాశముతో సకల విద్యలకు ఆధారముగా ప్రకాశించుచున్న హయగ్రీవునికి (గుర్రము తల కలవానికి) సభక్తిపూర్వక నమస్కారములు చేయుచున్నాను.  అశ్వము-అశ్వపతి తానైన పశుపతికి నమస్కారము. *******************************************   అశ్వ సహాయమున స్వామి సరసన కూర్చొనగలిగిన మాణిక్యవాచగరు భక్తునకు నమస్కారము.   "నమః అసీనేభ్యః  నమః."  ఆసీనుడైన శివునికి నమస్కారము.  అశ్వము అను పదమునకు మనము వ్యవహరించు గుఱ్రములు అను అర్థము మాత్రమే కాకుండ  యోగులు,మననములో రమించు మునులు,భవిష్యత్తును దర్శించగల ఋషులను కూడా పేర్కొంటారు.  " క్షతృభ్యో-సంగ్రహీతభ్యశ్చ నమోనమః."   అశ్వములను సాకు క్షత్తలకు,వాటి పగ్గములను పట్టుకొని నడిపించు సంగ్రహీతులైన శివస్వరూపములకు నమస్కారములు.  అశ్వ ఉపాధిచేసికొనిన అదృష్టము అంతాఇంతాకాదు.ఆపూర్వము హయగ్రీవుడను రాక్షుడు దిదేవుడే తన రూపమును ధరింపచేసుకొనినది.పూర్వము హయగ్రీవ...