Posts

NAH PRAYACHCHAMTI SAUKHYAM-24

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-24   *************************    భగవంతుడు భగవతికి మరియు భక్తునకు దూత.  " నమో దూతాయచ-ప్రహితాయచ."    శత్రువుల విషయములను తెలిసికొని తన యజమానికి నివేదించగల నేర్పరి దూత.హితమును ఒకచోటు నుండి మరొక చోటునకు తీసుకొని వెళ్ళగల సమర్థుడు దూత.  దూతను రాయబారి-వార్తాహరుడు-పురోసూచకుడు అనికూడా పిలుస్తారు.ఇతను చక్కని సమయస్పూర్తి-సంభాషణాచతురతను కలిగినవాదై యుండవలెను.జరుగబోవు పరిణామములను తెలియచేయగల సామర్థ్యమును కలిగియుండవలెను.మహా భారతములో శ్రీకృష్ణుడు,రామాయణములో హనుమంతుడు సమర్థవంతమైన దౌత్యమును చేసియున్నారు.సంధికి అంగీకరించని ఎడల కలుగు పరిణామములను తమను పంపినవారి శౌర్య పరాక్రమములను వివరించి పురోసూచకులుగా కూడ ప్రసిధ్ధిపొందారు.   " సృష్టి స్థితి లయాయస్య లీలా ఇవ మహేశితుః     తం వందే సచ్చిదానందం సర్వాశుభ నివృత్తయే"     సకల అశుభములను నివృత్తిచేయు సర్వమంగళాకార సదాశివ నమస్సులు.   శుంభ-నిశుంభులు యుక్తాయుక్తములను మరచి తల్లితో యుధ్ధమును కోరిరి.అంబిక అందులకు వారికడకు దూతగా పరమేశ్వరుని పంపెను.సప్తమాతృకలు తల్...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-23

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-23   *******************************    భగవంతుడు-భక్తుడు ఇద్దరు ప్రణవస్వరూపులే     భగవంతుడు ప్రణవబోధను పొందినవాడు   భక్తుడు ప్రణవ పరమార్థమును పొందినవాడు.   " పంచాక్షరీ శివపదేన విభాతి నిత్యం." ఓం నమః శివాయ.   అకరా-ఉకార-మకార సంగమము " ఓంకారము." ఓంకారమును సూక్ష్మ ప్రణవముగను,పంచాక్షరిని స్థూల ప్రణవముగను దైవజ్ఞులు భావిస్తారు.ప్రణవము స్వయంప్రకాశకము నిత్యము నిరంజనము.   " ఓంకార బిందు   యోగినాం     కామదం మోక్షదం వందేం ఓంకారాయ నమోనమః."   " వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యంతి వైయథా     శివే రుద్రే జపాత్ ప్రీతే ప్రెతా ఏవాన్యదేవతాః" సూథ సంహిత.     రుద్రాధ్యాయము వేదములలో ఉత్తమము.హోమాది కర్మలలో ప్రధానము.పాపమోచకము భుక్తిముక్తిప్రదము.ఆ రుద్రుడు తన కుమారుడైన షన్ముఖుని నోట ప్రణవమును -ప్రణవ పరమార్థమును శిష్యుడై తెలిసికొనుట లీలలు కాక ఇంకేమిటి.   " నమః స్లోక్యాయచ-అవసాన్యాయచ."వేదమంత్రములయందుండువాడు స్లోక్యుడు.వేదాంతముచే చెప్పబడువాడు అవసాన్యుడు.నమో నమః. ...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-22

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-22  **************************  భగవంతుడు ఆనందతాండవ లోలుడు-భక్తురాలు దర్శించు పుణ్యశాలి.   " భరత వేదముగ నిరత నాట్యముగ కదిలెడు పదమిది ఈశా     .....................     నమకచమకముల నాదాన-యమకగమకముల యోగాన     ప్రణవనాద ప్రాణాన-ప్రణతులందుకొను ప్రమథనాథ"     పరమేశా పాహి పాహి పాహిమాం.   సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను నిర్వర్తిస్తూ స్వామి తాండవమ్ను చేస్తుంటాడు.స్వామి తాండవము సగుణ స్వరూపమునకు,సమాధి నిర్గుణ స్వరూపమునకు సంకేతములు.ఒక విధముగా చెప్పాలంటే    ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరాఘోరతరేభ్యః.స్వామి అఘోరుడై విశ్వచక్రమును నడిపిస్తాడు.ఘోరుడై సర్వమును జలమయము చేసి తానొక్కడే నిర్వికారుడై నిశ్చల సమాధిలో నిమీలిత నేత్రుడై నిండిపోతాడు.తిరిగి సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహములు.కనుకనే స్వామి కాలాతీతుడు.  " నటనం ఆడెనే -ఆ పరమశివుడు తిమిరసంహరుడు    నటనావతంసుడై తకధిమి తక యని అనురాగమయుడై"     ఆడెనే ఆ ఆదిదేవుడు అతిదయార్ద్రహృదయుడై" నమోనమః.  ఆనందత...

NAH PRAYACHCHANTI SAUKHYAM-21

  నః ప్రయచ్ఛంతి సౌఖ్యం   **********************   భక్తుడు-భగవంతుడు ఆయుధధారులే.  "యాతే హేతిర్మీడుష్టమ హస్తే బభూవతే ధనుః   తయాస్మాన్ విడ్వతస్తమ యక్ష్మయా పరిబృజ".   స్వామి మాకు శత్రువులు ఎవరులేరు.కర్మఫలితములనగా దుర్మార్గులై మాపై వచ్చు శత్రువులను దండించుటకు నీ ఆయుధములను ప్రయోగింపుము.రుద్రా! అనేక నమస్కారములు.   " నమః శూరాయచ అవబింధతేచ".   యుధ్ధరంగమున భయములేకుండ ధైర్యముగా నుండువాడు-తన భక్తుల శత్రువులను మర్దించు రుద్రా! నమస్కారములు.   బలిచక్రవర్తి పెద్దకుమారుడైన బాణాసురుడు బాల్యమునుండి భోలాశంకర భక్తుడు.అనవరతము ఆదిదేవుని తన అర్చనలతో ప్రసన్నుని చేసికొనిన బాణుడెంత అదృష్టవంతుడో!  " నమః కపర్దినేచ పులస్తయేచ." జటలతో జలమును బందించి,భక్తుల యెదుట ప్రత్యక్షమగు రుద్రా నమస్కారము.    భక్తికి మెచ్చిన భక్తసులభుడు బాణునికి శత్రుమర్దనులగు అనేకానేక సేనలను బహూకరించెను.వినయముతో బాణుడు స్వామి నీ సైన్యము మాత్రమే కాదు,నాకు ఆపద సంభవించినపుడు నీవుసైతము నా తరపున నిలబడవలెనని కోరెను.ఆర్త్రత్రాణ పరాయణుడు ఆర్ద్రతతో అంగీకరించెను.  " సౌమనసశ్...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-20

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-20   *******************************  భగవంతుడు చర్మధారుడు-భక్తుడు చర్మకారుడు   " గజచర్మావృత తనుం స్ఫురత్ ప్రహరణోజ్వలం     సర్వపాపహరం ధ్యాయేత్ దేవం కుంజర భేదినం."  పరమేశ్వరుడు గజచర్మమును ధరించి యుండెను.శత్రువులపై ప్రయోగించుటకై చేతిలో చేతిలో ఆయుధములతో ప్రకాశిస్తున్నాడు.భక్తుల సర్వపాపములను హరించుచున్న రుద్రునకు నమస్కారము.  లోకకళ్యాణమునకై త్రిలోక సంచారి-త్రిలోకవేది యైన నారద మహర్షి గజాసురుని సభకు వెళ్ళి,గజాసురా! నీవు అతిబలవంతుడవు కావున నీ తపోమహిమతో శివుని నీ ఉదరమునందు నివసించు వరము కోకోమనెను.ఉచితానుచితములను మరచిన గజాసురుడు అదేపని చేసెను.స్వామిని కైలాసమునకు తిరిగి తీసుకొనివెళ్ళుటకు గంగిరెద్దుల మేళముతో బ్రహ్మ-విషుణు ంతక్కిన సురలు విచిత్రవేషములతో గజాసురుని కొలువునకు వచ్చిరి.గంగిరెద్దుల మేళముపై అత్యంతాసక్తి గల అసురుడు వారు ఆడుటకు అనుమతినిచ్చెను.విష్ణువువు చేయుచున్న స్తుతులకు భోళా శంకరుడు అమితముగా పొంగిపోవుటచే,భరించుటకు గజాసురునికి కష్టమాయెను.మాయతొలగిన మనసు విషయమును గ్రహించినది.వినయముతో తలవంచినది.జాలిగుండె శివుడు వా...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-19

Image
    నః ప్రయచ్చంతి సౌఖ్యం-19     ******************************   భగవంతుడు-భక్తుడు మేకను గౌరవించిన వారే   " ఇమాగం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం     యథాసశ్శమసత్ ద్విపదే చతుర్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం."     రుద్రదేవా! మా పుత్రులు-పౌత్రులు-బంధువులు,గోవులు,మిగిలిన పశు సమూహములకు సుఖము కలిగించుము,అందరిని పుష్టిగా ఉంచుము.ఎట్టి ఆపద రానీయకము.స్వామి నీకు అభిషేకము పూజలతో ఆరాధించి,ఆనందించెదము.    " ఏకాదశ మహారుద్రైః అతిరుద్రః ప్రకీర్తితః      అతిపాప హరో యస్మాత్ దృష్ట్వాన్యానైవ నిష్కృతిః."     రుద్రముల పారాయణ-అభిషేకము-హోమము ఏదీయినను పాపక్షయము,పరమశివుని అనుగ్రహమును,ఐహిక-ఆముష్మిక శ్రేయస్సును-శుభమును-సుఖములను-ఇన్ని మాటలేల ముక్తిని కలిగించుననుట నిర్వివాదము.    అగ్నినేత్రుని అగ్నికార్యముతో అర్చించు మహానుభావులెందరో .హవిస్సును అందించి ఆశీస్సులను అందుకొను అదృష్టవంతులు అసంఖ్యాకులు.అదే విధముగా ఒకసారి బ్రహ్మగారు చేయుచున్న యజ్ఞమునకు పరమేశ్వరుడు ప్రత్యక్షముగా విచ్చేసి యున...

NAH PRAYACHCHANTI SAUKHYAM-18

Image
     నః ప్రయచ్చంతి సౌఖ్యం-18     **************************   భగవంతుడు-భక్తుడు నాదమయులే-నాద ప్రియులే    " నాదతనుం అనిశం శంకరం-నమామి మనసా-శిరసా"  త్యాగరాజులవారు.   ప్రణవమే పరమేశ్వరుని శరీరము.అనిశము ఎల్లప్పుడు ప్రణవమును స్మరిస్తుంటుంది.ప్రణవము "ఓం" సూక్ష్మము,"ఓం నమః శివాయ" స్థూలము.అంతేకాదు స్వామి డమరుకము సైతము పంచాక్షరిని శబ్దిస్తూనే ఉంటుంది.( అక్షరాభ్యాస సమయమున)ఓ పరమేశా నీ అనుగ్రహ నాదమును మా పిల్లలపై వర్షించమని ప్రార్థిస్తుంటారు.   " బ్రహ్మ మురారి సురార్చిత లింగం -నిర్మల భాసిత శోభిత లింగం "మొదటి సారిగా పరమేశ్వర తత్త్వమును గ్రహించిన బ్రహ్మ-విష్ణులు అగ్నిస్తంభము నుండి వెలువడినస్వామిని దర్శించి స్తుతించినవి. ఆదిదేవుడు,తన సద్యోజాత-వామదేవ-అఘోర-తత్పురుష-ఈశానాది ఐదు ముఖముల నుండి పంచాక్షరిని-సప్తస్వరములను ప్రకటించి నాదమయముగా మలిచాడట.   " ఓం నమో శ్రవాయచ-ప్రతిశ్రవాయచ" ధ్వని-ప్రతిధ్వని రెండును తానైన పరమేశ్వరా ప్రణామములు.త్రికరణశుద్ధిగా చేయుచున్నాను అంటున్నాడు త్యాగయ్య.మనసా-వచసా-శిరసా.స్వామి పాదముల వద్ద శరణాగతి కోర...