Posts

NAH PRAYACHCHAMTI SAUKHYAM-29

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-29  ***********************  భగవంతుడు-భగవదంశ ఇద్దరును మార్గబంధువులే  " నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః."   లేత పచ్చిగడ్డివలె ఎరుపు-పసుపు వర్ణముల కలబోతతో ప్రకాశించు,మార్గములకు అధిపతి యైన రుద్రునకు నమస్కారములు.  జీవుల కర్మాచరణ ఫలితముగా వారిని,పునరావృత్తి సహిత,పునరావృత్తి రహిత,విదేహ ముక్తి మార్గములలోనడిపించ కరుణించు రుద్రస్వామికి నమస్కారములు.కొందరితో కఠినముగా ,మరి కొందరితో కరుణాసంద్రముగా కనికరిస్తూ వారి పాపకర్మలను భరింపచేస్తు,హరింపచేస్తు భవబంధవిముక్తులను చేయు శుభంకర! నమస్కారములు.   శంకరాచార్యులు 8వ శతాబ్దములో కాలడిలోఆర్యాంబ-శివగురువులకు శివాంశగా వైశాఖశుధ్ధ పంచమి,ఆరుద్రా నక్షత్ర సమయమున జన్మించారు.ప్రపంచలో రెండు అను తత్త్వము లేదని అంతా ఒకతే అను అద్వైత సిధ్ధాంతమును ప్రతిపాదించినారు.   " నమః సోభ్యాయచ-ప్రతిసర్యాయచ." " న ద్వైతం సమస్తం ఏకం" అని భావించు భగవదంశ పుణ్య-పాప మిళితమైన మర్త్యలోకమున సామాన్య మానవునిగా ,మార్గబంధువుగా జన్మించుటకు కారణము వైదిక ధర్మ పునరుధ్ధరణమే.  " నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ." జటాధ...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-28

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-28  ***********************  భగవంతుడు శరణాగత రక్షకుడు-భక్తుడు శరణుఘోషల ప్రియుడు.  " నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమః."   ఎక్కుపెట్టబడిన వింటిచే భక్తుల శత్రువులను దుష్టులను సంహరించు,శరణాగత స్వామియైన రుద్రునకు నమస్కారములు.   ఎందరో నర,కిన్నెర,యక్ష,గంధర్వ,సురాధిపులు మహేశుని శరణు కోరి,మాయామోహిత విముక్తులై,మాననీయులైనారు.శివుని మహిమలనువర్ణించుటకు వేయితలల ఆదిశేషునకే వశము కాలేదు,పిపీలకము వంటి నేనెంత? సకలదేవతా శివస్తుతి   **************** 1. దేవదేవ త్రినేత్రాయ  అందుకో వందనములు    జటామకుట కపర్ది అందుకో వందనములు. 2.భూత భేతాళ నాథాయ అందుకో వందనములు   రక్త పింగళ నేత్రాయ  అందుకో వందనములు. 3.భైరవ ఊర్థ్వకేశాయ  అందుకో  వందనములు   అగ్ని నేత్ర చంద్రమౌళి అందుకో  వందనములు. 4.బ్రహ్మ కపాల మాలాయ  అందుకో  వందనములు   బ్రహ్మాండ కాలాతీతాయ అందుకో వందనములు. 5.కరిగర్భ నివాసాయ  అందుకో  వందనములు   కరి మస్తక పూజ్యాయ అందుకో  వందనములు. 6.ప్రచండదందహస్త...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-27

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-27   *************************   భగవంతుడు ఆదియోగి-భక్తుడు ఋషభ యును యోగియే.  " యోగేశ్వరాయ మహాదేవాయ-త్రయంబకాయ త్రిపురాంతకాయ    వికలాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ    సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.'        ఈశ్వరుడు యోగి యోగమే  తానైన వాడు మహాదేవుడు.మూడుకన్నులతో ముజ్జగములను కాపాడువాడు.ప్రళయకాలమునజగములనులీనముచేసుకొనువాడు,యమునుజయించునవాడు,సర్వులను రక్షించు ప్రభువు,ఎల్లప్పుడు శుభములను వర్షించువాడు అయిన రుద్రునకు అనేకానేక నమస్కారములు.  హిమాలయములందు సంచరించు యోగి దేవుడని,తనకు తానే సృజించుకొని సంచరించువాడని కొందరు,కొందరు సామాన్య మానవుడని కైలాసము (కైవల్యమునకు నిలయము) నందు నిరంతర ధ్యానములో తనలో తాను రమించువాడని మరికొందరు అభిప్రాయ పడినను " దైవం మానుషరూపేణా" ధర్మమును పరిరక్షిస్తాడను వాదమును కాదనలేము కనుక పరమేశ్వరుడు అనగా పరమును ప్రసాదించువాడు ( ఇహముతో పాటు) ,శివుడు అనగా తాను తప్ప అన్యము లేనివాడు అయిన రుద్రుడు జగద్గురువు.   "మంగళాయతనం దేవం యువానమత...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-26

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-26   ******************************   భగవంతుడు భక్తికి బానిస   భక్తుడు భగవంతునికి బానిస-ఇద్దరు బానిసలే  " నమః శంగాయచ-పశుపతియేచ"   బ్రహ్మ నుండి చీమ వరకు గల సమస్త ప్రాణుల రోగములను భయములను పాపములను పోగొట్టుచు,సర్వ సుఖములను ప్రసాదించు రుద్రునకు నమస్కారములు.    విడిచిపెట్టలేనిది వ్యసనము.దానిని కలవాడు వ్యసనపరుడు.వాడికి వ్యసనము యజమాని.వాడు దాని బానిస.భక్తరక్షణమను వ్య్సనము యజమానియై భగవంతుని బానిసగా చేయుటయే శివలీలలు.ఎందుకంటే సివుడు భక్తికి పరవశుడై దానిని యజమానిని చేస్తూ,తాను దానికి బానిస అవుతాడు.  అందులకే ధూర్జటి మహాకవి,పరమేశ్వరా!  నిను నా వాకిలిఁ గావుమంటినొ? మరున్నీ లాలకభ్రాంతిఁ గుం టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చితిను, తింటేగాని కాదంటినో? నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ చే సిన నా విన్నపమేల చే కొనవయా? శ్రీకాళహస్తీశ్వరా!     16 ఈశ్వరా! బాణాసురునిలాగా నిన్ను నా గుమ్మము వద్ద కాపలా కాయమన్నానా? దేవతా స్త్రీలపై మోహపడి, వారివద్దకు రాయబారిగా వెళ్ళమన్నానా? తిన్నడు లాగా ఎంగిలి మాసం పెట్...

NAH PRAYACHCHAMTISAUKHYAM-25

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-25   ***********************   భగవంతుడు-భక్తుడు ఇద్దరు పండితులే  " నమః స్లోక్యాయచ-అవసాన్యాయచ."  వైదిక మంత్రములందును వర్దాంతసారమునందున్న మేథా దక్షిణామూరితి తత్త్వమైన రుద్రునకు నమస్కారములు.   " ఓం అక్షరాయ నమః-ఆద్యంతరహితాయ నమః. తిరుమురుక్కరు పాలై రచయిత మధుర తముళ కవి నక్కీరర్ నమ్మినసత్యమునకు నిలిచిన,పరమేశ్వరునే చర్చకు రప్పించెను తివిలై యడయల్ తెలియగ రానివి దేవుని-జీవుని ఆటలు ఆటకు నాందియైనది అమ్మ ఘనపూంగదై పరిమళ సందేహము పరిష్కారమునకై పసందుగ రాజుచే ప్రకటనము బహుమానము పరమేశుడు రాసిన పద్యము ప్రవేశించినది ధారుమి చదువగ నక్కీరుడు పట్టిన దోషము, నడిపించెను శివుని సభకు చర్చకు అతి మూర్ఖత్వమె ఆదిదేవుని అనుగ్రహమునకు కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.  " ఆపాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాందమావిస్పురత్    జ్యోతిః స్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః    అస్తోకాప్లుతమకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్     ధ్యాయేత్ ఈప్సితసి...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-24

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-24   *************************    భగవంతుడు భగవతికి మరియు భక్తునకు దూత.  " నమో దూతాయచ-ప్రహితాయచ."    శత్రువుల విషయములను తెలిసికొని తన యజమానికి నివేదించగల నేర్పరి దూత.హితమును ఒకచోటు నుండి మరొక చోటునకు తీసుకొని వెళ్ళగల సమర్థుడు దూత.  దూతను రాయబారి-వార్తాహరుడు-పురోసూచకుడు అనికూడా పిలుస్తారు.ఇతను చక్కని సమయస్పూర్తి-సంభాషణాచతురతను కలిగినవాదై యుండవలెను.జరుగబోవు పరిణామములను తెలియచేయగల సామర్థ్యమును కలిగియుండవలెను.మహా భారతములో శ్రీకృష్ణుడు,రామాయణములో హనుమంతుడు సమర్థవంతమైన దౌత్యమును చేసియున్నారు.సంధికి అంగీకరించని ఎడల కలుగు పరిణామములను తమను పంపినవారి శౌర్య పరాక్రమములను వివరించి పురోసూచకులుగా కూడ ప్రసిధ్ధిపొందారు.   " సృష్టి స్థితి లయాయస్య లీలా ఇవ మహేశితుః     తం వందే సచ్చిదానందం సర్వాశుభ నివృత్తయే"     సకల అశుభములను నివృత్తిచేయు సర్వమంగళాకార సదాశివ నమస్సులు.   శుంభ-నిశుంభులు యుక్తాయుక్తములను మరచి తల్లితో యుధ్ధమును కోరిరి.అంబిక అందులకు వారికడకు దూతగా పరమేశ్వరుని పంపెను.సప్తమాతృకలు తల్...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-23

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-23   *******************************    భగవంతుడు-భక్తుడు ఇద్దరు ప్రణవస్వరూపులే     భగవంతుడు ప్రణవబోధను పొందినవాడు   భక్తుడు ప్రణవ పరమార్థమును పొందినవాడు.   " పంచాక్షరీ శివపదేన విభాతి నిత్యం." ఓం నమః శివాయ.   అకరా-ఉకార-మకార సంగమము " ఓంకారము." ఓంకారమును సూక్ష్మ ప్రణవముగను,పంచాక్షరిని స్థూల ప్రణవముగను దైవజ్ఞులు భావిస్తారు.ప్రణవము స్వయంప్రకాశకము నిత్యము నిరంజనము.   " ఓంకార బిందు   యోగినాం     కామదం మోక్షదం వందేం ఓంకారాయ నమోనమః."   " వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యంతి వైయథా     శివే రుద్రే జపాత్ ప్రీతే ప్రెతా ఏవాన్యదేవతాః" సూథ సంహిత.     రుద్రాధ్యాయము వేదములలో ఉత్తమము.హోమాది కర్మలలో ప్రధానము.పాపమోచకము భుక్తిముక్తిప్రదము.ఆ రుద్రుడు తన కుమారుడైన షన్ముఖుని నోట ప్రణవమును -ప్రణవ పరమార్థమును శిష్యుడై తెలిసికొనుట లీలలు కాక ఇంకేమిటి.   " నమః స్లోక్యాయచ-అవసాన్యాయచ."వేదమంత్రములయందుండువాడు స్లోక్యుడు.వేదాంతముచే చెప్పబడువాడు అవసాన్యుడు.నమో నమః. ...