DASAMAHAVIDYA-BHAIRAVI
శ్రీమాత్రే నమః ************** " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః." నమామి భైరవీదేవి మహాశక్తిం నిరంతరం. శార్దూలము.. భైరవి వర్ణన. లీలారూపము కొమ్ముకోరలును కేళీ లోల ఘీంకారమున్ జ్వాలాకాంతి శరీరవర్ణ గరిమన్ జాగ్రత్త నిద్రాస్థితిన్ ప్రాలేయాచల భైరవీమ్ దశ మహా ప్రాకృత్ సుసంపన్నమున్ మూలాధార విశేష చాలన కరీమ్ మూర్తీమ్ మహామోహినీమ్ ! భావము: కొమ్ములు కోరలతో ఘీంకరించెడి, అగ్నిపర్వతజ్వాల రంగుగల శరీరము, జాగృతి, సుషుప్త స్థితులను స్పందింప చేయుచూ, హిమవత్పర్వతంపై భైరవుని సహచారిణిగా ప్రకృతిలోని మార్పులను నియంత్రించుచూ, మూలాధార చక్రములో సంచరించే మోహిని ఆ భైరవి! శ్రీమాత్రే నమః ************ " సుధాంశు సూర్య వహ్ని లోచనత్రయాన్వితాం నరాంతకాంతక ప్రభూతి సర్వ దత్త దక్షిణాం ...