Posts

MAAKU SAUKHYAMU PRASAADIMPUMU SIVAA

Image
దీపావళి శుభాకాంక్షలను కొనసాగిస్తు ప్రియ మిత్రులారా,  సర్వము శివమయము-సమస్తము శివాధీనము అను విషయము నిర్వివాదాంశము.ధూర్జటి భావన ప్రకారము బాలుడు అరటిపండ్లు కావలెననగానే వాత్సల్యలక్ష్మీవిలాసముతో తెచ్చి ఇచ్చినట్లు  ఆ పరమదయార్ద్రహృదయుని అరటిపండ్లమాధుర్యమును అందించు అద్భుతకథలు కావాలని నాచే అడిగించి," నా ప్రయచ్చంతి సౌఖ్యం" మాకు సౌఖ్యమును ప్రసాదింపుము అను పేరు గల అద్భుత కథలనుపవిత్ర కార్తిక మాస కానుకగా అందించినాడు. సత్యాన్వేషణలో మునిగిన యాజ్ఞవల్క్యమహాముని శిష్యులు,సవినయముగా తమ గురువుగారికి పాదాభివందనమును చేసి,తమ సందేహమును వెలిబుచ్చినారట.గురుదేవా! దేనిని జపించుట వలన అమృతత్త్వము సిధ్ధించును? అని.వారి సత్యాన్వేషణకు సంతసించిన ఆచార్యుడు ఆనందముతో,నాయనలారా! " శతరుద్రీయ పారాయణము" నిస్సందేహముగా అమృతత్త్వప్రదాయిని అని అనుగ్రహించినారట.అపుడు వారు గురుదేవా శతరుద్రీయమును గురించి వివరించమని వేడుకొనగా,    రుద్రాధ్యాయము వైదికమగు స్తుతి.రుద్రార్చన వేదమంత్రమయము.కృష్ణయజుర్వేదమైన తైత్తరీయ సంహిత నమక-చమక విశిష్టతను ప్రస్తావించినది.11 అనువాకములు గల నమకము నమః అను శబ్దము పలుమార్లు ఆవృత...

DASA MAHAVIDYA PADYAMALA.

Image
  నమామి పరదేవతా   **************** శార్దూలం వృత్తం వ్యక్తావ్యక్త చిదంబరీమ్ త్రినయనీం వ్యాఘ్రామ్ మహోద్వేగినీం ముక్తా విద్రుమ హేమ నీల ధవళా మూర్తిం మనోల్లాసినీమ్ శక్తిమ్ స్త్రీ దశవర్గ శోభి కరుణా సంధాయినీమ్  శాంభవీమ్ భక్తిమ్ దేహి మదీయ హృత్కమల శోభాలంకృతాడంబరీమ్!  ఏవం రక్తి ముఖారవింద హిమజాం ఈశాని ఏకేశ్వరీం  దేవీ శక్తి విదారణా విదుషి తాం దేవేంద్ర సంపూజనీం  భావం భక్తి పరాపరోక్తి వరదాం భక్తాం భవేదంబికాం  జీవన్ముక్తి యదార్థ కీర్తి భవతీం స్థిత్యాత్మికా నర్తకీం. శార్దూలము-కాళి పాళీమ్ హార కపాలధారి రుధిరామ్ ప్రాముఖ్య మాలాన్వితాం కేళీమ్ జిహ్వ మహారుణారుచి భయక్రీడావచూడాస్ధి కం- గాళీ రాక్షస భంజనేన రణరంగాలింగనోత్సాహికామ్ కాళీమ్ కాలకలాప దంత ధవళా  కార్యానువర్తీమ్ శివమ్! శార్దూలము-తారాదేవి శ్రీరాముండట మూర్ఛ బోయె; రణమున్ సీతా మహాసాధ్వియే   స్వారీజేసెను కాళి రావణునికన్ సాహస్ర ఖండంబులున్ వీరావేశము శాంతినొందె  విధిగా  విశ్వాత్మ ధ్యానింపగన్ తారారూపము తానె దాల్చె సకలాధారాత్మికా  తత్వమై శార్దూలము... త్రిపుర సుందరి వర...

10 sakti kamala

Image
 పదిశక్తుల పరమార్థము-కమలాత్మిక  ***************************** శార్దూలము.. ఆదిశక్తి స్తుతి.. ఏవంరక్తి ముఖారవింద హిమజామ్ ఈశాని ఏకేశ్వరీమ్ దేవీశక్తి విదారణా విదుషి తాం దేవేంద్ర సంపూజనీమ్ భావంభక్తి పరాపరోక్తి వరదామ్ భక్తామ్ భవేదంబికామ్ జీవన్ముక్తి యదార్థ కీర్తి భవతీమ్ స్థిత్యాత్మకా నర్తకీమ్! రక్తి..శక్తి..భక్తి..ముక్తి.. అంశములుగా... భావము: పాదము 1: ఈ ప్రకారము అనురాగానికి ఆలవాలమైన ముఖారవిందముగల పార్వతి పరమాత్మయే! పాదము 2: ఆమె శక్తి చీల్చుతూ (విదారణ) రాక్షసులను సంహరించుటలో విద్వాంసురాలు (విదుషి) ఆమె (తాం), ఆ కారణముగా దేవేంద్రునిచే ఎల్లప్పుడూ పూజనీయురాలు. పాదము 3: భక్తులకు భక్తి భావము, పర అపర భేదము నేర్పే (ఉక్తి, సరస్వతి) అంబిక ఆమె. పాదము 4: జీవన్ముక్తి, యదార్ధ మైన కీర్తి, ఉనికియే   (స్థితి) తానై నాట్యమాడే ప్రకాశము (భవతీ) ఆమె. ఆ ఆదిశక్తి నా మనః పూర్వక సాష్టాంగ నమస్కృతులు! Reply Forward ...

PADISAKTULA PARAMAARTHAMU-KAMALAATMIKA

Image
 పదిశక్తుల పరమార్థము-కమలాత్మిక  ****************************    తొమ్మిదిశక్తులు మనకు అందిస్తున్న అనుగ్రహముతో కమలాత్మిక తల్లిని తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.తల్లి శుధ్ధసత్వ ప్రకాశము.నలుపు గా ప్రయాణమునుమొదలుపెట్టి తెలుపుగా ముగిసినది.చీకట్లను పూర్తిగా తొలగించివేసినది..త్రిగుణతత్త్వమును దాటించి మనలకు తురీయము ( శాశ్వతమును) చూపిస్తున్నది.తిరిగి తనమూలస్థితిని పొందినది. పనిచేయుచున్నప్పుడు దారిచూపుతుంది.మిగిలిన తొమ్మిది తటస్థముగా ఉంటాయి.ఆ పని ఆ ఒక్క వేలు చేయగలదు.అదే మనము ఏదైన వస్తువును పట్టుకోవలసి వచ్చినపుడు ఇంకొక వేలు దానికి సహాయకారి అవుతుంది.మనము వ్రాయునపుడు మూడువేళ్ళు సహకరిస్తున్నాయి.పూలమాలలు అల్లునప్పుడు నాలుగువేళ్ళు కదులుతున్నాయి.ఇంక ఐదువేళ్ళు కలిస్తే అద్భుతాలేకదా.ఇదే విధముగా పదివేళ్ళు కలిసి ఒక రూపముగా మారిన అదే కద కైమోడ్పు.నమస్కారము.  నమస్కార ముద్ర నుండి దారిచూపు ఒక్క వేలుగా మారుట-ఒక్క వేలు మిగతాతొమ్మిది వేళ్ళ సహాయముతో కైదండగా  దశమహాశక్తుల పరమార్థము.ఇది నిర్వివాదము.నిత్యసత్యము.    నిర్మల మనసులో నీవు ఉన్నావన్న సత్యము తెలిసిన  వేళ శ...

PADISAKTULA PARAMAARTHAMU-MATANGI

Image
   పదిశక్తుల పరమార్థము-తొమ్మిదవ శక్తి -మాతంగి    ****************************************  అమ్మ దయతో ఈ రోజు మనము మాతంగి తత్త్వమును అర్థముచేసికొనుటకు ప్రయత్నిద్దాము.  జగన్మాత శరీరమునుండి ఉద్భవించినది కావున మాతంగి అని,ఆకుపచ్చని రంగుతో ఇంద్రనీలమణికాంతులతో ప్రకాశిస్తుంటుంది కనుక శ్యామలాదేవి అని కీర్తిస్తూ,మాతంగి నామమును ,శ్యామలానామములను మరింత సుస్పష్టము చేస్తు రాజ మాతంగి-రాజశ్యామల ఇలా ఎన్నో పేర్లతో ప్రార్థిస్తు0టారు.మాతంగి తల్లి కాళిమాత రూపురేఖలలోని తీవ్రతను తగ్గించిన రూపము-సరస్వతీ జ్ఞానశక్తులతో పరిపాలన చేస్తుంది.ఈ శక్తి ఎంత ప్రజ్ఞావంతురాలో ఆమె మంత్రి పదవి చెప్పక చెబుతూనే ఉంది.తల్లి కాళితత్త్వానుగ్రహము కాళిదాసు ఏడుజన్మల పాపములను ఏడుక్షణములలో తీసివేసి సంస్కరించగలిగినది.   పరిపూర్ణజ్ఞానస్వరూపిణి మాతంగి మాతానుగ్రహమే శబ్ద పరిణామము-శబ్దప్రయాణము-శబ్దార్థము అను వరములు.   శబ్ద పరిణామము    శబ్దము పర-పశ్యంతి-మధ్యమ-వైఖరి అను నాలుగు విధములుగా నినదిస్తుంటుంది.ఉదాహరణకు ఆకాశములోని మేఘ గర్జన-గాలికి కదులుతు చెట్ల ఆకులు చేయుచప్పుడు మొదటి ...
Image
 పదిశక్తుల పరమార్థము- ఎనిమిదవశక్తి-బగలముఖి  ****************************************    అమ్మ దయతో ఈరోజు మనము ఎనిమిదవ మహాశక్తియైన బగళాముఖి తత్త్వమును తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.తల్లిరూపములో మనము చూడగలిగిన పీతవర్ణము-ఎడమచేతిలోని అసురశిరము-తల్లి తాడుతో వాని వాగ్శక్తిని బంధించుట తల్లి మనకు అందిస్తున్న దృశ్య సహకారములుగా,ఎందరో జ్ఞానులు నొక్కివక్కాణించిన స్తోత్రనిధులు మరింత సహకార పరికరములుగా,పరమేశ్వరి ప్రసాదములుగా మనము స్వీకరించగలిగినపుడు అమ్ములోని మూడు ప్రత్యేకతలను మనము చూడకలుగుతాము.(మనసుతో)  అవి వాణిరూపమైన తల్లి వాగ్బంధనశక్తి.సిధ్ధిప్రదాత్వము ఆ రెండింటిద్వారా పరోక్షప్రీతికారిణిగా ప్రసిద్ధికెక్కుట.    వాక్బంధనము   దండనాథా పురస్కృతా గా తల్లి కీర్తింపబడుచున్నది.దండించినది దేనిని?   దేవీపురాణకథనము ప్రకారము దుర్గముని (అసురుడు) కుమారుడైన రురు తన సైన్యముతో తల్లిపై దండెత్తినాడు.ఇది బాహ్యము.ఉదాహరణకు అధిక వర్షముల వలన జలప్రవాహము హద్దులుదాటి ఉద్రిక్తతతో విలయమునకు కారణమవుతుంటే దానిని ఆపవలసినదే కదా.ఇక్కడ మన సమస్య జలముతో కాదు.ఆ సమయమున దానికున్న ఉద్రి...

CHINNAMASTA

  శార్దూలము... ఛిన్నమస్త వర్ణన యోగశ్రేష్టి శిరో స్వఖండనము సంయోగద్వయంబాసనమ్ రాగద్వేష సమాన దృక్పథమె ఘోరాఘోర సామ్యంబునున్ త్యాగంబా రుధిరత్రిధార సరళీ త్రాగేటి  శీర్షంబులున్ భోగాపేక్ష నియంత్ర సంస్కరణమే పూర్ణత్వమై శోభిలన్ భావము: ఖండ యోగాసన శ్రేష్టి ఛిన్నమస్త స్వయం శిరో ఖండనము చేసుకొన్నది. దైవీసంయోగము చేయువారు ఆమె ఆసనము. రాగ ద్వేషాలను, ఘోర అఘోరాలను సమానముగా చూస్తుంది. ఆమె త్యాగమే మూడు రక్త ధారలుగా తన మొండెము నుంచి ఎల్లప్పుడూ ప్రవహించి క్రమ పద్ధతిలో మూడు శీర్షాలలోకి ప్రసారమవుతుంది. కామ ఆపేక్ష నియంత్రించి సంస్కరించటమే ఆ అవతార పూర్ణత్వము.  " నాభౌ శుభ్రారవిందం తదుపరి విమలం మండలంచండరశ్మే   సంశారస్యైక రూపాం త్రిభువన జననీం ధర్మకామార్థధాత్రీం   తస్మిన్ మధ్యే త్రిమార్గే త్రితయ తనుధరాం ఛిన్నమస్తాం ప్రశాంతాం   తాం వందే జ్ఞానరూపాం మరణభయహరాం యోగినీం యోగముద్రాం. https://www.youtube.com/watch?v=Jr-ofIKMr-Q&feature=youtu.be  ఆవిర్భావకారణము-విధానము  *****************************  రజరప్ప అను రాజ దంపతులు ఛిన్నమస్తకను పరమభక్తితో ఆరాధించిరి.వారిని...