Posts

nah prayachchanti saukhyam-vaidyulu.

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-12   ************************ "అచికిత్స -చికిత్సాయ ఆద్యంత రహితాయచ   సర్వలోకై వంద్యాయ వైద్యనాథయతే నమః"   దేగడ్ లోని జ్యోతిర్లింగముతో సమానముగా మహారాష్ట్ర పర్లీ జ్యోతిర్లింగము ప్రశస్తమైనది."లీనతే గమ్యతే ఇతి లింగం".జగత్తు దేనియందు జనించి-దేనియందు లయమవుతుందో ఆ పరమాద్భుత శక్తిస్వరూపమే లింగము.ప్రతిదేహములోను ఆత్మ అనే లింగము ప్రకాశిస్తుంటుంది. వైద్యభ్యం పూజితం సర్వం.నమోనమః.   స్వామి కొలువైన ప్రాంతమునకు చుట్టునున్న కొండకోనలు,దట్టమైన అరణ్యములు,నదీ ప్రవాహక ప్రాంతములు స్వామి ప్రసాదములైన అనేక ఔషధములతో అలరారుచుండును కనుక వైద్యనాధునిగా స్వామి కీర్తింపబడుచున్నాడు. "నమ ఊర్వాయచ సూర్మ్యాయచ" భూమియందున్న వానిలోను,మంచి తరంగములున్న వానియందుండు శివా నమస్కారములు.ఆ శివస్వరూపమే ఔషధములనందించి,మనలను తిరిగి రోగములను దరిచేరనీయక సంపూర్ణ శారీరక-మానసిక ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించుచున్నది. " అకాల మృత్యు హరణం-సర్వవ్యాధి నివారణం-సమస్త పాపక్షయకరం." శివానుగ్రహం.ఎంత మంచివాడవురా సాంబశివ-నిన్నేమని కీర్తించగలను సదాశివా.పాహి-పాహి " ఓం భువంతయే...

nah prayachchanti saukhyam-jaalari.

Image
  నః ప్రయచ్చంతిసౌఖ్యం.-07   ************************   " ప్రళయ పయోధి జలే కేశవ ద్రుతవానసి వేదం    విహిత వహిత్ర కరిత్రమఖేదం    కేశవాద్రుత మీనశరీర జయజగదీశ హరే"  చేపరూపమును దాల్చి చేవతో సొమకుని నుంది వేదోధ్ధరణను గావించిన కేశవ నమస్కారములు.  భవసారమున పడి బయటకు రాలేని మాపై నీ కరుణాజాలమును విసిరి కడతేర్చు గొప్ప జాలరి వైన శివా ప్రణామములు.  నమో ప్రతరణేభ్యో ఉత్తరణేభ్యశ్చవ నమో నమః.  స్వామిని దర్శించిన సత్యవ్రతుడెంత ధన్యుడో స్వామికి మత్స్య నైవేద్యమును సమర్పించిన ఆదిపత్త నయనారు అంతే మహనీయుడు. చిన చేపను-పెద్ద చేప,చిన మాయను-పెనుమాయ  ఇది స్వాహా-అది స్వాహా అని అంటున్నాడు పెద్దజాలరి మనకు ఒక జాలరి కథ చెబుతూ,  విషయవాసనలనే ప్రవాహములో పడి,వల పట్టుకొని యున్నమాయ అనే ఆపదను గుర్తించలేని మనలను రక్షించుస్వామికి నమస్కారములు..శివోహం.  భ గవంతుడు-భక్తుడు ఇద్దరు జాలరులే  జలము-జలచరము-జాలరి ఈశ్వరచైతన్యమే.  " ఓం నిషాదేభ్యశ్చవ నమోనమః".  చేపలను సమూహముగ పట్టి చంపునట్టి నిషాదుల రూపమున నున్న రుద్రునకు నమస్కార...

Eka bilvam SivaarpaNam

నః ప్రయచ్చంతి సౌఖ్యం-07 " ఓం తస్కరాణాం పతయే నమః" ******************************** అదుపుతప్పుచున్న అరిషడ్వర్గములను దోచు పెద్ద దొంగ ఒక్కడే! దిక్కొక్కడే. దొంగ ఒక్కడే దేవుడు-జీవుడు ఒక్కడే ధర్మము-మర్మము తానొక్కడే. లోకాన దొర కాదు దొంగవని చాటాను నా పాపరాశులన్నీ దొంగల్లే దోచేశావు అని స్తుతింపబడిన మహేశ్వరుని చోరకళా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము. " భగవంతుడు-భక్తుడు ఇద్దరు దొంగలే" దొంగలరూపములో నున్న ఈశ్వరచైతన్యమునకు నమస్కారము.ఈశ్వర చైతన్యము చర్మచక్షువులకు కానరాకుండా,సకలచరాచర జీవరాశులయందు దాగియుండి వాటిని శక్తివంతముగా ప్రకటించుచున్నది కనుక ఈశ్వరుడు గుప్తచోరుడు. రుద్రుడు "స్తేనానం పతి". గుప్తచోరుడు.మనకు దొరకకుండ రహస్యముగా మనలోనే దాగియున్నాడు.నమో నమః. " కకుభాయ విహంగినే స్తేనానాం పతయే నమః." ఉభయ నమస్కార గ్రహీత అయిన మన స్తేనాపతికి అనగా రహస్యపు దొంగలకు నాయకుడైన వానికి స్వజాతీయాభిమానము ఎక్కువే. ఏ వికారములేని పరమాత్మ ...

sambho tavaaraadhanamu-by prasad nimmagadda,

Image
  శంభో తవారాధనము-ప్రసాద్ నిమ్మగడ్డ. 1.ఆదిగురు.. ఆదియోగి.. శ్రీ చిదానందరూపా శివోహం.. జ్ఞానోపార్జన జేసి సప్త ఋషులున్ జ్ఞాతవ్య కామ్యార్థులై ధ్యానధ్యేయ ధురంధరున్  త్రిభువనాధారాత్మకుండెవ్వడా నానాయోగ విశారదా విభవమా నాగేంద్ర హారుండనెన్ మౌనాంతర్ముఖ ముద్ర నిద్ర మహిమే మార్గాంతరమ్ ముక్తికిన్ !! 2. గంగా జీవనదీ ప్రవాహ వరదాం  కాంతార్ధ దేహస్థితామ్   భృంగస్వాంత విజృంభినీం రిపుహరీం భాండారి భార్యామణీమ్ సాంగోపాంగ సమస్త సృష్టి దమనాం సంవర్తకం  వర్తకామ్ శృంగశ్రేణి హిమాలయాలయకరాం  శాంతిప్రియాం శంకరమ్! 3. పూర్తింగొల్వ సుషుప్తి తృప్తి సుఖముల్ పూర్ణానురాగంబులున్   మూర్తీ రూపముదాల్చి ముందు నిలిచెన్ ముక్తిన్ సదా జూపుచున్   కార్తికంబునకామితార్థఫలముల్ కాత్యాయనీ నాథులున్   ఆర్తిం దీర్చెడి ఆదిదంపతులనే యాచించి నే వేడెదన్. 4.4.ఆస్తుల్ దెచ్చు సమస్త బంధుజనముల్ ఆదంబరాలున్!గతిర్   నాస్తిన్ నీ పదసేవతప్ప  గిరిజా నాథేశ్వరా! శంకరా   మస్తిష్కంబును మీదుగట్టి మదిలో మంత్రంబుగా మార్చితిన్   స్వస్తిశ్రీ శశిభూషణా త్రినయనా సర్వజ్ఞ సర్వ...

MAAKU SAUKHYAMU PRASAADIMPUMU SIVAA

Image
దీపావళి శుభాకాంక్షలను కొనసాగిస్తు ప్రియ మిత్రులారా,  సర్వము శివమయము-సమస్తము శివాధీనము అను విషయము నిర్వివాదాంశము.ధూర్జటి భావన ప్రకారము బాలుడు అరటిపండ్లు కావలెననగానే వాత్సల్యలక్ష్మీవిలాసముతో తెచ్చి ఇచ్చినట్లు  ఆ పరమదయార్ద్రహృదయుని అరటిపండ్లమాధుర్యమును అందించు అద్భుతకథలు కావాలని నాచే అడిగించి," నా ప్రయచ్చంతి సౌఖ్యం" మాకు సౌఖ్యమును ప్రసాదింపుము అను పేరు గల అద్భుత కథలనుపవిత్ర కార్తిక మాస కానుకగా అందించినాడు. సత్యాన్వేషణలో మునిగిన యాజ్ఞవల్క్యమహాముని శిష్యులు,సవినయముగా తమ గురువుగారికి పాదాభివందనమును చేసి,తమ సందేహమును వెలిబుచ్చినారట.గురుదేవా! దేనిని జపించుట వలన అమృతత్త్వము సిధ్ధించును? అని.వారి సత్యాన్వేషణకు సంతసించిన ఆచార్యుడు ఆనందముతో,నాయనలారా! " శతరుద్రీయ పారాయణము" నిస్సందేహముగా అమృతత్త్వప్రదాయిని అని అనుగ్రహించినారట.అపుడు వారు గురుదేవా శతరుద్రీయమును గురించి వివరించమని వేడుకొనగా,    రుద్రాధ్యాయము వైదికమగు స్తుతి.రుద్రార్చన వేదమంత్రమయము.కృష్ణయజుర్వేదమైన తైత్తరీయ సంహిత నమక-చమక విశిష్టతను ప్రస్తావించినది.11 అనువాకములు గల నమకము నమః అను శబ్దము పలుమార్లు ఆవృత...