Posts

NAH PRAYACHCHANTI SAUKHYAM-13

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-13 **************************     " రావయ్యా రావయ్యా రా కూడల జంగమదేవా రా       శరణు శరణు సంగమదేవ కరుణను కావుము సంగమదేవ"    అనుచు భక్తులు స్వామి దర్శనమునకు ఎదురుచూచుచు,భక్తి పారవశ్యముతో మునితేలు తుంటారు.  " నమః తీర్థాయచ కూల్యాయచ"  తీర్థములందున్న వానికి,తీర్థపు గట్టుల నందున్న రుద్రునికి నమస్కారములు.   కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలములో తుంగ-భద్ర-కృష్ణ-వేణి-భీవిలి-మలాపహారి-భవనాశి అను ఏడు నదుల సంగమ కూడలిలో స్వామి సంగమేశ్వరుడు.  నీ దయ గౌతము గంగా చేరగ నీ పాదము కడుగంగ ఈశా,  నివృత్తి సంగమేశ్వరుడు,రూపాల సంగమేశ్వరుడు,కూడలి సంగమేశ్వరుడు అను బహు రూపములతో భాసించు స్వామి,ఏడాడిలో ఎనిమిది ఎలలు ఈటిలో ఉండి,కేవలము నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడటభక్తుల పాపములతో మలిన మైఅగంగమ్మ తల్లి ఈ ఏడునదుల సంగమములో స్నానమాచరించి పాపప్రక్షాళనమును చేసుకుంటుందట.  మరికొందరి అభిప్రాయము ప్రకారము సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రదేశము కనుక నివృత్తి సంగమేశ్వరముగా కీర్తిస్తారు.అమ్మవారైన అయ్యవారైన అర్థనారీశ్వరమే...

nah prayachchanti saukhyam-vaidyulu.

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-12   ************************ "అచికిత్స -చికిత్సాయ ఆద్యంత రహితాయచ   సర్వలోకై వంద్యాయ వైద్యనాథయతే నమః"   దేగడ్ లోని జ్యోతిర్లింగముతో సమానముగా మహారాష్ట్ర పర్లీ జ్యోతిర్లింగము ప్రశస్తమైనది."లీనతే గమ్యతే ఇతి లింగం".జగత్తు దేనియందు జనించి-దేనియందు లయమవుతుందో ఆ పరమాద్భుత శక్తిస్వరూపమే లింగము.ప్రతిదేహములోను ఆత్మ అనే లింగము ప్రకాశిస్తుంటుంది. వైద్యభ్యం పూజితం సర్వం.నమోనమః.   స్వామి కొలువైన ప్రాంతమునకు చుట్టునున్న కొండకోనలు,దట్టమైన అరణ్యములు,నదీ ప్రవాహక ప్రాంతములు స్వామి ప్రసాదములైన అనేక ఔషధములతో అలరారుచుండును కనుక వైద్యనాధునిగా స్వామి కీర్తింపబడుచున్నాడు. "నమ ఊర్వాయచ సూర్మ్యాయచ" భూమియందున్న వానిలోను,మంచి తరంగములున్న వానియందుండు శివా నమస్కారములు.ఆ శివస్వరూపమే ఔషధములనందించి,మనలను తిరిగి రోగములను దరిచేరనీయక సంపూర్ణ శారీరక-మానసిక ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించుచున్నది. " అకాల మృత్యు హరణం-సర్వవ్యాధి నివారణం-సమస్త పాపక్షయకరం." శివానుగ్రహం.ఎంత మంచివాడవురా సాంబశివ-నిన్నేమని కీర్తించగలను సదాశివా.పాహి-పాహి " ఓం భువంతయే...

nah prayachchanti saukhyam-jaalari.

Image
  నః ప్రయచ్చంతిసౌఖ్యం.-07   ************************   " ప్రళయ పయోధి జలే కేశవ ద్రుతవానసి వేదం    విహిత వహిత్ర కరిత్రమఖేదం    కేశవాద్రుత మీనశరీర జయజగదీశ హరే"  చేపరూపమును దాల్చి చేవతో సొమకుని నుంది వేదోధ్ధరణను గావించిన కేశవ నమస్కారములు.  భవసారమున పడి బయటకు రాలేని మాపై నీ కరుణాజాలమును విసిరి కడతేర్చు గొప్ప జాలరి వైన శివా ప్రణామములు.  నమో ప్రతరణేభ్యో ఉత్తరణేభ్యశ్చవ నమో నమః.  స్వామిని దర్శించిన సత్యవ్రతుడెంత ధన్యుడో స్వామికి మత్స్య నైవేద్యమును సమర్పించిన ఆదిపత్త నయనారు అంతే మహనీయుడు. చిన చేపను-పెద్ద చేప,చిన మాయను-పెనుమాయ  ఇది స్వాహా-అది స్వాహా అని అంటున్నాడు పెద్దజాలరి మనకు ఒక జాలరి కథ చెబుతూ,  విషయవాసనలనే ప్రవాహములో పడి,వల పట్టుకొని యున్నమాయ అనే ఆపదను గుర్తించలేని మనలను రక్షించుస్వామికి నమస్కారములు..శివోహం.  భ గవంతుడు-భక్తుడు ఇద్దరు జాలరులే  జలము-జలచరము-జాలరి ఈశ్వరచైతన్యమే.  " ఓం నిషాదేభ్యశ్చవ నమోనమః".  చేపలను సమూహముగ పట్టి చంపునట్టి నిషాదుల రూపమున నున్న రుద్రునకు నమస్కార...

Eka bilvam SivaarpaNam

నః ప్రయచ్చంతి సౌఖ్యం-07 " ఓం తస్కరాణాం పతయే నమః" ******************************** అదుపుతప్పుచున్న అరిషడ్వర్గములను దోచు పెద్ద దొంగ ఒక్కడే! దిక్కొక్కడే. దొంగ ఒక్కడే దేవుడు-జీవుడు ఒక్కడే ధర్మము-మర్మము తానొక్కడే. లోకాన దొర కాదు దొంగవని చాటాను నా పాపరాశులన్నీ దొంగల్లే దోచేశావు అని స్తుతింపబడిన మహేశ్వరుని చోరకళా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము. " భగవంతుడు-భక్తుడు ఇద్దరు దొంగలే" దొంగలరూపములో నున్న ఈశ్వరచైతన్యమునకు నమస్కారము.ఈశ్వర చైతన్యము చర్మచక్షువులకు కానరాకుండా,సకలచరాచర జీవరాశులయందు దాగియుండి వాటిని శక్తివంతముగా ప్రకటించుచున్నది కనుక ఈశ్వరుడు గుప్తచోరుడు. రుద్రుడు "స్తేనానం పతి". గుప్తచోరుడు.మనకు దొరకకుండ రహస్యముగా మనలోనే దాగియున్నాడు.నమో నమః. " కకుభాయ విహంగినే స్తేనానాం పతయే నమః." ఉభయ నమస్కార గ్రహీత అయిన మన స్తేనాపతికి అనగా రహస్యపు దొంగలకు నాయకుడైన వానికి స్వజాతీయాభిమానము ఎక్కువే. ఏ వికారములేని పరమాత్మ ...

sambho tavaaraadhanamu-by prasad nimmagadda,

Image
  శంభో తవారాధనము-ప్రసాద్ నిమ్మగడ్డ. 1.ఆదిగురు.. ఆదియోగి.. శ్రీ చిదానందరూపా శివోహం.. జ్ఞానోపార్జన జేసి సప్త ఋషులున్ జ్ఞాతవ్య కామ్యార్థులై ధ్యానధ్యేయ ధురంధరున్  త్రిభువనాధారాత్మకుండెవ్వడా నానాయోగ విశారదా విభవమా నాగేంద్ర హారుండనెన్ మౌనాంతర్ముఖ ముద్ర నిద్ర మహిమే మార్గాంతరమ్ ముక్తికిన్ !! 2. గంగా జీవనదీ ప్రవాహ వరదాం  కాంతార్ధ దేహస్థితామ్   భృంగస్వాంత విజృంభినీం రిపుహరీం భాండారి భార్యామణీమ్ సాంగోపాంగ సమస్త సృష్టి దమనాం సంవర్తకం  వర్తకామ్ శృంగశ్రేణి హిమాలయాలయకరాం  శాంతిప్రియాం శంకరమ్! 3. పూర్తింగొల్వ సుషుప్తి తృప్తి సుఖముల్ పూర్ణానురాగంబులున్   మూర్తీ రూపముదాల్చి ముందు నిలిచెన్ ముక్తిన్ సదా జూపుచున్   కార్తికంబునకామితార్థఫలముల్ కాత్యాయనీ నాథులున్   ఆర్తిం దీర్చెడి ఆదిదంపతులనే యాచించి నే వేడెదన్. 4.4.ఆస్తుల్ దెచ్చు సమస్త బంధుజనముల్ ఆదంబరాలున్!గతిర్   నాస్తిన్ నీ పదసేవతప్ప  గిరిజా నాథేశ్వరా! శంకరా   మస్తిష్కంబును మీదుగట్టి మదిలో మంత్రంబుగా మార్చితిన్   స్వస్తిశ్రీ శశిభూషణా త్రినయనా సర్వజ్ఞ సర్వ...