Posts

dakshayajnam20

Image
    నః ప్రయచ్చంతి సౌఖ్యం-20     ******************************   భగవంతుడు-భక్తుడు మేకను గౌరవించిన వారే   " ఇమాగం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం     యథాసశ్శమసత్ ద్విపదే చతుర్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం."     రుద్రదేవా! మా పుత్రులు-పౌత్రులు-బంధువులు,గోవులు,మిగిలిన పశు సమూహములకు సుఖము కలిగించుము,అందరిని పుష్టిగా ఉంచుము.ఎట్టి ఆపద రానీయకము.స్వామి నీకు అభిషేకము పూజలతో ఆరాధించి,ఆనందించెదము.    " ఏకాదశ మహారుద్రైః అతిరుద్రః ప్రకీర్తితః  అతిపాప హరో యస్మాత్ దృష్ట్వాన్యానైవ నిష్కృతిః."     రుద్రముల పారాయణ-అభిషేకము-హోమము ఏదయినను పాపక్షయము,పరమశివుని అనుగ్రహమును,ఐహిక-ఆముష్మిక శ్రేయస్సును-శుభమును-సుఖములను-ఇన్ని మాటలేల ముక్తిని కలిగించుననుట నిర్వివాదము. యజ్ఞో యజ్ఞపతిః యజ్వా యజ్ఞాంగా యజ్ఞభూషణః నమోవాకములు.     అగ్నినేత్రుని అగ్నికార్యముతో అర్చించు మహానుభావులెందరో అగ్నిహోత్రుని ద్వారా.హవిస్సును అందించి ఆశీస్సులను అందుకొను అదృష్టవంతులు అసంఖ్...

doota

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-18   *************************    భగవంతుడు భగవతికి మరియు భక్తునకు దూత.  " నమో దూతాయచ-ప్రహితాయచ."    శత్రువుల విషయములను తెలిసికొని తన యజమానికి నివేదించగల నేర్పరి దూత.హితమును ఒకచోటు నుండి మరొక చోటునకు తీసుకొని వెళ్ళగల సమర్థుడు దూత.  దూతను రాయబారి-వార్తాహరుడు-పురోసూచకుడు అనికూడా పిలుస్తారు.ఇతను చక్కని సమయస్పూర్తి-సంభాషణాచతురతను కలిగినవాదై యుండవలెను.జరుగబోవు పరిణామములను తెలియచేయగల సామర్థ్యమును కలిగియుండవలెను.మహా భారతములో శ్రీకృష్ణుడు,రామాయణములో హనుమంతుడు సమర్థవంతమైన దౌత్యమును చేసియున్నారు.సంధికి అంగీకరించని ఎడల కలుగు పరిణామములను తమను పంపినవారి శౌర్య పరాక్రమములను వివరించి పురోసూచకులుగా కూడ ప్రసిధ్ధిపొందారు.   " సృష్టి స్థితి లయాయస్య లీలా ఇవ మహేశితుః     తం వందే సచ్చిదానందం సర్వాశుభ నివృత్తయే"     సకల అశుభములను నివృత్తిచేయు సర్వమంగళాకార సదాశివ నమస్సులు.     " నమ అమీవత్కేభ్యః"    అంతతను విజృభించువారును,అందరిని హింసించువారిని చేరినాడు నలదమయంతులకు హం...

bhakta rakshakulae

Image
  నః ప్రయచ్ఛంతి సౌఖ్యం   **********************   భక్తుడు-భగవంతుడు  భక్త రక్షకులే.  "యాతే హేతిర్మీడుష్టమ హస్తే బభూవతే ధనుః   తయాస్మాన్ విడ్వతస్తమ యక్ష్మయా పరిబృజ".   స్వామి మాకు శత్రువులు ఎవరులేరు.కర్మఫలితములనగా దుర్మార్గులై మాపై వచ్చు శత్రువులను దండించుటకు నీ ఆయుధములను ప్రయోగింపుము.రుద్రా! అనేక నమస్కారములు.   " నమః శూరాయచ అవబింధతేచ".   యుధ్ధరంగమున భయములేకుండ ధైర్యముగా నుండువాడు-తన భక్తుల శత్రువులను మర్దించు రుద్రా! నమస్కారములు.   బలిచక్రవర్తి పెద్దకుమారుడైన బాణాసురుడు బాల్యమునుండి భోలాశంకర భక్తుడు.అనవరతము ఆదిదేవుని తన అర్చనలతో గంగను తన జటాజూటమునందు బంధించిన వానిని తన భక్తికి బందీని చేసెను.ఎల్ల వేళలను తన రాజ్యమునకు అంగరక్షకునిగానుండి తనను తన ప్రజలను కాపాడునట్లు వరమును పొందెను.    కాలాతీతుని లీలగా కాలము తన మాయాజాలమును విసురుతూ,మలుపులు తిప్పుతోంది బాణుని జీవితములో.అదే ఉషాపరిణయ ఘట్తమునకు వేసిన పునాది.అనివార్యము యుధ్ధము ఆ హరిహరులకు.అది యొక అద్వైత లీల.   .వినయముతో బాణుడు స్వామి నీ సైన్య...

16-svamimala

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-22  **************************  భగవంతుడు ఆనందతాండవ లోలుడు-భక్తురాలు దర్శించు పుణ్యశాలి.   " భరత వేదముగ నిరత నాట్యముగ కదిలెడు పదమిది ఈశా     .....................     నమకచమకముల నాదాన-యమకగమకముల యోగాన     ప్రణవనాద ప్రాణాన-ప్రణతులందుకొను ప్రమథనాథ"     పరమేశా పాహి పాహి పాహిమాం.   సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను నిర్వర్తిస్తూ స్వామి తాండవమ్ను చేస్తుంటాడు.స్వామి తాండవము సగుణ స్వరూపమునకు,సమాధి నిర్గుణ స్వరూపమునకు సంకేతములు.ఒక విధముగా చెప్పాలంటే    ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరాఘోరతరేభ్యః.స్వామి అఘోరుడై విశ్వచక్రమును నడిపిస్తాడు.ఘోరుడై సర్వమును జలమయము చేసి తానొక్కడే నిర్వికారుడై నిశ్చల సమాధిలో నిమీలిత నేత్రుడై నిండిపోతాడు.తిరిగి సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహములు.కనుకనే స్వామి కాలాతీతుడు.  " నటనం ఆడెనే -ఆ పరమశివుడు తిమిరసంహరుడు    నటనావతంసుడై తకధిమి తక యని అనురాగమయుడై"     ఆడెనే ఆ ఆదిదేవుడు అతిదయార్ద్రహృదయుడై" నమోనమః...