Posts

namoestu sooryaaya sahasra raSmayae

Image
నమోస్తు సూర్యాయ సహస్ర రశ్మయే *************************   *****************  కిరతి అనగా వెదజల్లుట.వెదజల్లుస్వభావము కలవి కిరణములు.కిరణములు అగ్ని కిరణములు-జలకిరణములు-హిమకిరణములుగా ఋతుచక్రమును నడిపించుచున్నవి.వస్తుజ్ఞాన లక్షణము కలిగించేవి కనుక కిరణములను "కేతవః" అంటారు.  సూర్య గమనము అంటే కిరణములద్వారా సూర్యకాంతి ప్రసరణము.కిరణాలే సూర్యునికి మనకు గల బాంధవ్యాలు. .  సూర్యుని వేయి కిరణములు చాలా గొప్పవి.అవి ఉషః కాలమునందు అంతవరకు కమ్మిన చీకటిని నశింపచేయును.ఆకాశమును విస్తరింపచేయును.దిక్కులను మరింత పొడవుగా గోచరించునట్లు చేయును.సముద్రమును దాని చెలియలి కట్టను జలప్రకాశ భరితముగా చేయును.ఆకాశాంతరాళము నుండి ప్రసరిస్తు అవనిని ఆనందభరితము చేయును.  లోపల-బయట వ్యాపించే లక్షణము కల కిరణములను "అంశువులు" అంటారు.సూర్య కిరణములలో ఉండే వికసన శక్తిని " పద్మిని" అంటారు.మద్యాహ్న కిరణములను మరీచులు అంటారు.   హంస-ప్లవంగ-కపి-వరాహం-సింహం-హరితశ్వం మొదలగునవి కొన్ని కిరణముల పేర్లు.వేదము కిరణముల స్వరూప-స్వభావములను-బట్టి వాటికి గౌణ నామములను చేసినది.  ఉదాహరణకు నవగ్రహకారక శక...

SURYA TANULEKHANAMU.

Image
 సూర్య తనూలేఖనము.  *********************  " న ఉదేతివా న అస్తమేతి" -ఐతరేయ బ్రాహ్మణము.   మన కంటితో నేరుగా చూడగలిగే పరమాత సూర్యభగవానుడు ఒక్కడే.ఉదయాస్తమానములు లేని పరమాద్భుతశక్తి.సూర్యుని భౌతికాంశమే మనకు కనబడే మండలము.చైతన్యాంశము మనము అనుభవిస్తున్న అనిర్వచనీయమూర్తి.తన నుండి వచ్చిన దేవతలను,సకలభువనభాండములను రక్షించుటకు అదితీగర్భ సంభూతుడైన అవ్యాజకరుణామూర్తి.  "ఆదిత్యాయ నమోనమః."  " అదితి" అను శబ్దమునకు "ఆకాశము-అఖండము" అను అర్థమును అనుసంధానము చేసుకుంటే అత్యంత సూక్ష్మమైన మహాశక్తి భరితము ఆకాశము.ఐతిహాసిక పరముగా దక్షప్రజాపతి కుమార్తె,కశ్యప ప్రజాపతి భార్య.ఆ మహాపతివ్రత అనుష్ఠాన ఫలితమే ఆదిత్యోద్భవము. అదితీ పుత్ర నమోస్తుతే.   పలు రకములుగా సృష్టి ప్రకటింపబడి సాగుతుండగా క్రమక్రమముగా రజో-తమో గుణముల ప్రాబల్యత గలవారు దైత్యులుగను,సత్త్వగుణ సంపన్నులు దేవతలుగను వారు గుణములను బట్టి నామరూపములకు సంకేతములైనారు.కర్మానుసారముగా కాలభ్రమణములో దానవులు వీజృంభించి దేవతలపై దెబ్బతీసారు.అంటే రజో-తమో గుణములు చెలరేగి విజృంభించి,సత్త్వగుణమును మరుగున పడేటట్లు చేసినది.   తమో...

PUNAATUMAAM TAT SAVITU@H VAREnYAM

Image
 పునాతుమాం తత్ సవితుః వరేణ్యం  ************************   " లోకంబులు లోకేశుడు     లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం     జీకటికవ్వలనెవ్వం     డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్".                -బమ్మెర పోతనామాత్యుడు.   అది అజ్ఞాన- అజ్ఞేయ తత్త్వపూరితమైన స్థితి.సృష్టికి పూర్వదశ.లోక త్రయములు పాతాళమునందలి బురదలో పడినవో లేక చీకటిలో కలిసినవో ,అసలున్నవో-లేవో తెలిసికొనలేని అయోమయ పరిస్థితి.జ్ఞానము లుప్తమైన/గుప్తమైన వేళ అజ్ఞానము అధిష్టించి,సమస్తమును అజ్ఞేయమను నిస్సారపు పొరతో కప్పివేసిన స్థితి.కదలికలేక కనుమమరుగైనవో లేక కాలరాయబడినవో కనుగొనలేని దుస్థితి.   సమస్తము అస్తవ్యస్తమై,మిక్కిలి చిక్కనిదై,అట్టడుగున చేరి,అచేతనమై,తననుతాను మరుగుపరచుకొనిన మర్మస్థితి.కర్మలకు దూరమైన దయనీయపరిస్థితి.  అట్టిస్థితిలో మనోవాక్కాయ కర్మలను త్రిశక్తులు,సత్వరజో తమో గుణములను మూడు గుణములు,స్థూల-సూక్ష-కారణమను మూడు శరీరములు,ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములు,కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములను ఆరు శత్రువులు అ...

EMtaTi ADBHUTA CHITRAKAARUDO

Image
 ఎంతటి అద్భుత చిత్రకారుడో-                ఏమని వర్ణించగలను?               *******************     భూమండలమును గిరగిర తిప్పిస్తూ,తాను నిశ్చలముగా నున్నప్పటికిని,భూమి నిశ్చలము,తాను తిరుగుతున్నాను అనే భ్రమను మనకు కలిగించే అద్భుత చిత్రకారుడు.  అవ్యక్తము వ్యక్తము కావాలంటే అంతర్మథనము జరగాలి.అవరోధాలను అడ్డుకోకలగాలి.అస్పష్టత తొలగాలి. ఏ విధముగా సినీమా తెర నిశ్చలముగా ఉండి,అనేక చిత్ర కదలికలను మనకు అందిస్తుందో అదేవిధముగా మూలతత్త్వము అనేక రూపములలో వ్యక్తమగుతు మనకు అవగాహనను అందిస్తుంది.ఖండించలేని-కాదనలేని నగ్నసత్యము.నమ్ముదాము-నమస్కరిద్దాము. " కిరతి" అనగావెదజల్లు స్వభావము కలది.వెదజల్లు స్వభావము గలవి కిరణములు. 1. సహస్ర కిరణములతో సప్తవర్ణములను గగనమున ఇండ్రధనుస్సుగా,భువనమున బహుమేధతో చిత్రిస్తున్నప్పటికిని,తన చేతులను మనకు కనిపించనీయడు. 2.ఆకాసము శబ్దవాచకము అని పెద్దలు చెబుతారు.గాయత్రి-బృహతి-ఉష్ణిక్-జగతి-త్రిష్ణుప్-అనుష్టుప్-పంక్తి అను ఏడు ఛందస్సుల ఉత్పత్తికి కారణమైనప్పటికిని,మనతో మౌనముగానే ఉంటాడు. ...

PARICHAYAMU

Image
     శ్రీగోదాం అనన్య శరణం శరణం ప్రపద్యే    ********************************* " శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే".    శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారము "ఆళ్వారులు" అనగా దైవభక్తిలో అనవరతము మునిగియున్న జ్ఞానగనులు.బధ్ధజీవులను తమతో పాటు తిప్పుకొనుచు,భగవత్తత్త్వము అను సముద్రములో అనవరతము మునకలను వేయిస్తు,ప్రకృతిలోని ప్రతివస్తువులోను-ప్రతిచర్య లోను పరమాత్మను దర్శింపచేస్తూ,బ్రహ్మానందమును చేర్చువారు.మార్గదర్శకులుగా సామాన్యుల వలె కనిపిస్తూ సర్వమును అర్థముచేయించగల దైవాంశ సంభూతులు.దివ్య నమస్కారములు .  " భూతం నరస్య మహదహ్వయ భట్టనాథ   శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్   భకాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్   శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం."   ఆళ్వారులులలో ఒకరైన ఆండాళ్ తల్లి (సాక్షాత్తు భూదేవియే) తనను తాను ఒక సామాన్య గోపిక వలె భావించుకొని,వివిధ స్వభావములు కలిగిన గోపికలను ఎంతో ఓర్పుతో-నేర్పుతో తనతో కలుపుకొనుచు,అందరు కలిసి పర ...

00

 జై శ్రీమన్నారాయణ. ***************** భగవత్ బంధువులారా!సవినయ నమస్కారములు.   సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించు సమయము ధనుర్మాసము. మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి.   క్షమాపణ నమస్కారములతో నేను ఆండాళ్ తల్లి విరచిత తిరు-పావై దివ్య వ్రతమును మీతో పంచుకొనుటకు ప్రయత్నిస్తాను.ఎందుకంటే పరమాత్ముని గుణవైభవ సంకీర్తనమును పదిమందితో కలిసి చేసి,పరమానందమును పంచుకొనుట ఈ వ్రత లక్ష్యము కనుక.పరమాద్భుతమైన ఈ ద్రవిడ ప్రబంధము నవవిధభక్తి సమ్మేళనము.నవనీతచోరుని దివ్యలీలా తరంగము.  మార్గళి మాలను సంస్కరించి,సుగంధభరితము చేయుట పెద్దసన్మానముగా భావించి పెరుమాళ్ స్వరూపులు నన్ను ఆశీర్వదించెదరు గాక. ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందర...

PRARTHANA

Image
  ప్రార్థన  **********  శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం  యతీంద్ర ప్రణవం వందే రమ్యజా మాతరం మునిం  లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమా  అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం  యోనిత్యమచ్యుత  పదాంబుజ యుగ్మరుక్మ  వ్యామోహతస్తత్ ఇతరాణి తృణాయమానే  అస్మద్గురో భగవతోస్య దయైక సింధో    రామానుజస్య చరం శరణం ప్రపద్యే.  సంభవామి యుగేయుగే  సాక్ష్యము హరి కళత్రము  ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన ఆండాళ్ తల్లి అనుగ్రహము.  శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తీయుని పుణ్యముగా  పసిపాపగ  ప్రకటించబడినది తులసివనములో  విష్ణుకథాశ్రవణము-పుష్పమాలాలం కరణములు  వివాహమాడదలచినది స్వామిని స్థిరచిత్తముతో  గోపకన్యగా మారినది-గోపికలను పిలిచినది  తిరు పాశురములు వ్రాసినది-వ్రతములు చేసినది  చూడికొడిత్తాల్ మనకు మోక్షమార్గము చూపించినది  రంగనాథుని దేవేరిగా  శ్రీరంగమున కొలువైనది  నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని  పరమార్థము...