Posts

MADHAVAMASAMU-ARYAMA

Image
అదిగో మధుమాస సంరక్షణను దిగ్విజయముగా పూర్తిచెసుకొని,    పులహ మహాముని వంశాభివృధ్ధికి కారణమవుతు,వేదవేద్యునికి లాంఛనప్రాయముగా మార్గమును చూపిస్తూ,మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.అప్సరసాంగన పుంజికస్థలి తన దివ్యశక్తులతో నారద గానామృతమునకు అనుగుణముగా నర్తిస్తున్నది.కఛ్చనీరుడను సర్పము ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధపరుస్తున్నాడు ఒద్దికగా.అతౌజుడను యక్షుడు సలక్షణుడై స్వామిరథమునకు సప్తాశ్వములను అనుసంధిస్తూ,ఆనందిస్తున్నాడు.ప్రహేతి రాక్షసుడు పరాక్రమోపేతుడై రథమును ముందుకు జరుపుతున్నాడు.తన కిరణముల ద్వారా ఉష్ణోగ్రతల పెంచుతు,అవనీతలమును ఆనందమయము చేయుటకు మాధవమాస అధిపతియై "ఆర్యమ" నామాలంకృత శోభితుడై తరలు    వాయు తత్త్వ ప్రధాన స్వామీ.  " తం ఆర్యమ ప్రణమామ్యహం."

MADHUMAASAMU-DHAATA

Image
 మధుమాసము-ధాత  ******************  అదిగో! ఆనందోత్సాహము! ఆస్వాదించండి.  " మననాత్ త్రాయతే మంత్రః" మననము చేసే వారిని రక్షించేదే మంత్రము అను ఆర్యోక్తికి అద్దము పడుతూ,బ్రహ్మ మానసపుత్రుడు,సప్తర్షులలో ఒకరైన పులస్త్యుడు (ప్రథమముగ నుండువాడు),పురాణ సంపదను మానవాళికి చేరువ చేసిన మహనీయుడు వేదవేద్యుని కీర్తిస్తూ,లాంఛన ప్రాయముగా మార్గమును చూపిస్తు మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.క్షీరసాగర మథనానంతరము జలరసముగా ప్రకటింపబడిన/వెలువడిన( అపొ-నీటి-రస-సారము)కృతస్థలి అను అప్సరస అవనీతలమును చిగురింపచేయుటకు ఆడుతూ స్వామిని అనుసరిస్తున్నది.అసమాన సౌందర్యముతో,అప్రమేయ పరాక్రమముతో కోకిలమ్మకు కొత్త కూత నేర్పించుటకా యన్నట్లు,తుంబురుడు తన మధుర గానముతో పరమాత్మను తన్మయ పరుస్తూ,తరించిపోతున్నాడు.   నాగరాజైన వాసుకి ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధము చేస్తున్నాడు.  పర్వత పరిరక్షకుడు పరిశీలనా దక్షుడు అయిన రథకృత్ అను యక్షుడు జగములను తన శక్తిచే మాయామోహితులను చేయుటకు స్వామి రథమునకు సప్తాశ్వములకు అనుసంధానమును చేస్తూ, ఆనందిస్తున్నాడు.హేతి రాక్షసుడు రథమునకు వెనుక నిలబడి...

DVAADASAATMAN -NAMOSTUTE.

Image
 ద్వాదశాత్మన్ నమోస్తుతే  **********************   "బృహత్వాత్-బృమ్హణత్వాత్ ఇతి బ్రహ్మ."అన్నింటికంటె ఏదిఉత్కృష్టమైనదో అది,బృహతి.బృమ్హణము అంటే వ్యాపకత్వము.ఏది అన్నిటికంటె మహోత్కృష్టమైనదో,ఏది అన్నింటియందు వ్యాపించి యుందో అదియే "బ్రహ్మము." వేదము ఆదిత్యుని బ్రహ్మముగా కీర్తిస్తుంది.సర్వజీవుల యందలి ఆత్మయే బ్రహ్మము.అది జగతఃస్థుషః -తాను కదలకుండ ఉంటూ అన్నింటిని కదిలించే శక్తి గల స్థావర-జంగమాత్మకము.   ప్రత్యక్ష పరంజ్యోతి ఏడాది పొడవునా ఒకతే స్వరూప-స్వభావాలతో వెలుగులు-వేడి వెదజల్లుతుంటే మనము తట్టుకోగలమా? అసలు ఆ ఊహనే అమ్మో? మన పొట్ట నింపుకోగలమా?విద్య పై పట్టు సాధించగలమా?వైద్యరంగపు మెట్లు ఎక్కగలమా?కొన్ని రోజులు చిగురులు-మరి కొన్ని రోజులు గుబురులు.కొన్ని రోజులు ఎండలు-మరి కొన్ని రోజులు వానలు.కొన్ని రోజులు వెన్నెల-మరి కొన్నిరోజులు శిశిరము.కొన్ని జీవులు పుట్టుట-మరి కొన్ని జీవులు గిట్టుట.కొంత మందికి బాల్యము-మరి కొంత మందికి భారము.ఇవన్నీ కలిగించటానికే " ఏకం సత్ విప్రా బహుదా వదంతే" అన్నట్లు పన్నెడు రాశులలో పన్నెండు రూప -గుణములతో,తన నుండి ప్రకటింప బడిన ఆరు శక్తులతో కలిసి,...

AKHANDA MANDALAKARAM-VYAAPTAM YENA CHARACHARAM

Image
 అఖండ మండలాకారం-వ్యాప్తమ్యేన చరాచరం.  ************************************************   ఆద్యంతరహితమైన తత్త్వానికి సంకేతము మండలం.ఒక తేజో బిందువు విస్తరించి పెద్దగా వృత్తాకారములో గోచరమయితే అది మణ్డలము.అనంతత్త్వానికి ప్రతీక.    ఈ సృష్టి ఆవిర్భవించక ముందున్న పరంజ్యోతియే సృష్టి ఆవిర్భావం జరిగినపుడు సూర్య మండలం గా భాసిస్తోందని ఆర్యోక్తి.   సమూహములతో నిండినది అని మనము మండల శబ్దమును అన్వయించుకుంటే,ఆదిత్యులు,అప్సరసలు,మునులు,గ్రామణులు,యాతుధాన్యులు,గంధర్వులు,సర్పములు,వాలిఖ్యాది మునులు మొదలగు గణములతో సంసేవింపబడుచున్న అనంత తేజోరాశి,ఉత్తరాయణ పుణ్యకాలమున సంపూర్ణ మండల భాతితో లోకపాలన చేస్తుంది.   అంతటా వ్యాపిస్తూ దేనికి అంటని వాడు ఆ మండలములోని పరంజ్యోతి.స్వయం ప్రకాశకత్వము-సృష్టి-స్థితి-లయకారకత్వమును కలిగిన దివ్య తేజము.సూర్యుడంతేనే జాగ్రదావస్థ.సకల చరాచరములు చతనత్వమును పొందకలుగుటకు కారణమైనది ఆ మండల ద్వారము గుండా ప్రసరించుచున్న దివ్య కిరణములు.కనుకనే  " రశ్మిమంతం-సముద్యంతం" గా సంకీర్తింపబడుతున్నది.    సూర్య మండలము ఆనందమయము-విజ్ఞాన మయము-యజ్ఞమయమ...

SAPTASVA RATHA SAMARUDHAM-TAM SURYAM PRANAMAMYAHAM.

Image
   సప్తాశ్వ రథ సమారూఢము-తం సూర్యం ప్రణమామ్యహం    ******************************************** "అశువ్యాప్తో"అను ధాతువు నుండి "అశ్వ" అను పదము ఉత్పన్నమైనది.అశ్వము అనగా శీఘ్రముగా వ్యాపించు లక్షణము కల గౌణ నామము కలది.  " జయో జయశ్చ విజయో జితప్రాణోః జితశ్రమః    మనోజవో జితక్రోధో వాజినః సప్తకీర్తితః."   జయ-అజయ-విజయ-జితప్రాణ-జితశ్రమ-మనోజవ-జితక్రోధ అను సప్త సప్తికి నమస్కారములు.  కాల రూపముగా-కాంతి రూపముగా-వేద రూపముగా-నాదరూపముగా-గ్రహ రూపముగా-మన ఇంద్రియ రూపముగా-ధాతు రూపముగా -దేహ చక్ర రూపముగా ఇలా ఎన్నో-ఎన్నెన్నో రూపములుగా ప్రకటింపబడుతూ,ప్రాణశక్తులుగా ప్రస్తుతింప బడుతున్న ,   భాను మండల మధ్యస్థునికి మరి మరి నమస్కరిస్తూ,మచ్చునకు కొన్ని విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాను.విజ్ఞులు దోషములను సవరించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.  పరమాత్మ అనేక రూపములను ధరించి,ఒక్కొక్క రంగు-ఒక్కొక్క రూపు,ఒక్కొక్క విలక్షణతను ప్రకటింపచేచు విశ్వపాలనము చేస్తుంటాడు.  " కలయతి నియతి" - ఇతి కాలః. పరిణామం అనేది కాలము.ప్రతి రోజు సూర్యుని వలన ఏర్పడినది కనుక...

namoestu sooryaaya sahasra raSmayae

Image
నమోస్తు సూర్యాయ సహస్ర రశ్మయే *************************   *****************  కిరతి అనగా వెదజల్లుట.వెదజల్లుస్వభావము కలవి కిరణములు.కిరణములు అగ్ని కిరణములు-జలకిరణములు-హిమకిరణములుగా ఋతుచక్రమును నడిపించుచున్నవి.వస్తుజ్ఞాన లక్షణము కలిగించేవి కనుక కిరణములను "కేతవః" అంటారు.  సూర్య గమనము అంటే కిరణములద్వారా సూర్యకాంతి ప్రసరణము.కిరణాలే సూర్యునికి మనకు గల బాంధవ్యాలు. .  సూర్యుని వేయి కిరణములు చాలా గొప్పవి.అవి ఉషః కాలమునందు అంతవరకు కమ్మిన చీకటిని నశింపచేయును.ఆకాశమును విస్తరింపచేయును.దిక్కులను మరింత పొడవుగా గోచరించునట్లు చేయును.సముద్రమును దాని చెలియలి కట్టను జలప్రకాశ భరితముగా చేయును.ఆకాశాంతరాళము నుండి ప్రసరిస్తు అవనిని ఆనందభరితము చేయును.  లోపల-బయట వ్యాపించే లక్షణము కల కిరణములను "అంశువులు" అంటారు.సూర్య కిరణములలో ఉండే వికసన శక్తిని " పద్మిని" అంటారు.మద్యాహ్న కిరణములను మరీచులు అంటారు.   హంస-ప్లవంగ-కపి-వరాహం-సింహం-హరితశ్వం మొదలగునవి కొన్ని కిరణముల పేర్లు.వేదము కిరణముల స్వరూప-స్వభావములను-బట్టి వాటికి గౌణ నామములను చేసినది.  ఉదాహరణకు నవగ్రహకారక శక...

SURYA TANULEKHANAMU.

Image
 సూర్య తనూలేఖనము.  *********************  " న ఉదేతివా న అస్తమేతి" -ఐతరేయ బ్రాహ్మణము.   మన కంటితో నేరుగా చూడగలిగే పరమాత సూర్యభగవానుడు ఒక్కడే.ఉదయాస్తమానములు లేని పరమాద్భుతశక్తి.సూర్యుని భౌతికాంశమే మనకు కనబడే మండలము.చైతన్యాంశము మనము అనుభవిస్తున్న అనిర్వచనీయమూర్తి.తన నుండి వచ్చిన దేవతలను,సకలభువనభాండములను రక్షించుటకు అదితీగర్భ సంభూతుడైన అవ్యాజకరుణామూర్తి.  "ఆదిత్యాయ నమోనమః."  " అదితి" అను శబ్దమునకు "ఆకాశము-అఖండము" అను అర్థమును అనుసంధానము చేసుకుంటే అత్యంత సూక్ష్మమైన మహాశక్తి భరితము ఆకాశము.ఐతిహాసిక పరముగా దక్షప్రజాపతి కుమార్తె,కశ్యప ప్రజాపతి భార్య.ఆ మహాపతివ్రత అనుష్ఠాన ఫలితమే ఆదిత్యోద్భవము. అదితీ పుత్ర నమోస్తుతే.   పలు రకములుగా సృష్టి ప్రకటింపబడి సాగుతుండగా క్రమక్రమముగా రజో-తమో గుణముల ప్రాబల్యత గలవారు దైత్యులుగను,సత్త్వగుణ సంపన్నులు దేవతలుగను వారు గుణములను బట్టి నామరూపములకు సంకేతములైనారు.కర్మానుసారముగా కాలభ్రమణములో దానవులు వీజృంభించి దేవతలపై దెబ్బతీసారు.అంటే రజో-తమో గుణములు చెలరేగి విజృంభించి,సత్త్వగుణమును మరుగున పడేటట్లు చేసినది.   తమో...