Posts

Om nama sivaaya-81

Image
 ఓం నమః శివాయ-54  ***************  నీలిమేఘమే  నీవనుకొని నే చాతకమై చూశానురా  నీలిగరళము నన్ను చూసి గేలిచేసినదిరా  "సూర్యాయ-దక్షాధ్వర" అన విని చక్రవాకమై కదిలారా   మంచుకొండ నన్నుచూసి గేలి చేసినదిరా  చంద్రశేఖరుడవని నేను చకోరమై కదిలానురా  వెన్నెల్లిక్కడెక్కడిదని మూడోకన్ను గేలి చేసినదిరా  నటరాజువి నీవని నే నెమలిగా చేరానురా  భృంగి కన్ను నన్నుచూసి గేలిచేసినదిరా  శుభకరుడవు నీవని నే గరుడినిగా వాలానురా  కంచిగరుడ సేవకు సమయము మించిదన్నారురా  భ్రమలను తొలగించలేని భ్రమరాంబికాపతి,ఈ  ఇక్కట్లేమిటిరా నాకు ఓ తిక్కశంకరా  శివుడు తనదగ్గర మేఘము-వేడి-వెన్నెల-నాట్యము-ప్రభుతవము అన్నీ ఉన్నాయని,అవి తాను చెప్పినట్లు నడుచుకుంటాయని అంటాడు.కాని చాతకమునకు మేఘమునుండి వర్షమును ఇవ్వలేడు.చక్రవాకమునకు వేడిని ఇవ్వలేడు.చకోరమునకు వెన్నెలను అందించలేడు.నమలికి నాట్య మెలకువలను చెప్పలేడు.గరుడుని సేవలను స్వీకరించలేడు.-నింద.  చాతకి నమః శివాయ-చకోరి నమః శివాయ  ఎండ నమః శివాయ-వాన నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం ...

OM NAMA SIVAAYA-79

Image
 ఓం నమః శివాయ-56     *********   అవిముక్తము అంటాదు-అనురక్తము అంటాడు   అవసానము అంటాడు-ఆశ్రయము అంటాడు   చూస్తూనే ఉంటాడు-గస్తీ కాస్తుంటాడు   అదును చూసుకుంటాడు-అమ్మ ఒడిని ఇస్తాడు   పెద్దనిద్ర తెస్తాడు-వద్దనే కూర్చుంటాడు   మనిషి తోడు అంటాడు-మంత్రము వినిపిస్తాడు   ఉపచారము చేస్తాడు-ఉసురును తీసేస్తాడు   మరుజన్మలేదు అంటాడు-మమేకమే అంటాడు   పిసరంత దయలేనోడు-మసి చేసేస్తుంటాడు    మరుభూమిలో తిరుగుతాడు-మర్యాదస్తుడ వాడు  సదాచారమసలు లేని సంకర చేష్టల వాడంటే  కిక్కిరు మనవేమిరా ఓ తిక్కశంకరా.  శివుడు చెప్పేదొకటి చేసేదొకటి.కాశేఏక్షత్రము గొప్పదని నమ్మపలుకుతాడు.ఎవరు వస్తారా అని ఎదురుచూస్తుంటాడు.వచ్చిన వానిని(నమ్మి) తిన్నగా కాటికి పంపిస్తాడు దగ్గరుండి మరీను నిర్దాక్షిణ్యముగా.ఉపచారములు చేస్తున్నట్లు నటిస్తూ ఊపిరిని తీస్తాడు తన పేరు మృత్యుంజయుడని గొప్పలు చెప్పుకుంటూనే మృత్యువుకు జీవులను అప్పగిస్తుంటాడు.తల్లి చెప్పిందని ఎందరినో పునర్జ్జీవుతులను చేసాడు కాని ఇక్కడ మాత్రము కసిగా వారి పార్ధివశరీరములను కాటికాప...

OM NAMA sIVAAYA-78

Image
 ఓం నమః శివాయ-78  *******************  " ఊర్క్చమే-మసురాశ్చమే " అని చమకము అడుగుతోంది నిన్ను   నేలలోనున్న కలిని శూలముతో తరిమేయమని  చంద్రును అమృతధారలను చెలిమి కురిపించమని  చక్కని సాగుబడికి సలిలమును ప్రవహించమని  చరచర పాకుచు పాములను చేనును రక్షించమని  అగ్గివేడి హరితమై ఆహారముగా మార్చమని  ప్రమథగణమును ప్రమదముతో పంటలు పండించమని  ఆదరముతో అమ్మను అన్నపూర్నగా తరలమని  కలుపును అణిచివేసి పులును అందించమని  ఆకలి అనేమాట పలాయనము చిత్తగించమని  పనిపెట్తమని తనగిట్టలకు పరమేశా నీ ఎద్దుని  దుక్కిదున్నమనవేరా ఓ తిక్కశంకరా. రుద్రనమకములో శివుడు తననితాను "ఊర్యాయచ" భూమిని నేనే నని,దానినుండి ఉద్భవించిన శుష్కాయచ-హరిత్యాయచ  ఎండిన చెట్లు-పచ్చని చెట్లు కూడా తానేనని,అంతేకాకుండ వాటికి ఆ స్థితిని కల్పించుటకు కూడా తానే వర్షముగా కొన్నిసార్లు-వర్షపు కొరత గా కొన్నిసార్లు ప్రకటింపబడుట అని,వర్షాయచావర్షాయచ అంటూ చెప్పుకున్నాడు.అంతటితో ఆగలేదు.ఇరిణ్యాచ-చవిటినేలను నేనే అన్నాడు.కిగుం శిలాయచ రాళ్ళనేలను కూడా నేనే అని గొప్పలుచెప్పుకున్నాడు.అ...

OM NAMA SIVAAYA-77

Image
   ఓం నమః శివాయ-77    *********************   నిన్ని సొంతమని సేవిస్తే సుంతైనా కానరావు   ఎంతలేసి మాటలనిన సొంతమని అంటావు   నిన్నుచూడ తపియించగ నిరీక్షణే మిగుల్చుతావు   నెవ్వెంతవన్న ముందు ప్రత్యక్షము అవుతావు   కరుణించే వేళలలో కఠినముగా ఉంటావు   లెక్కలేదన్న వారిపై మక్కువ చూపుతావు   మనసును కట్టేయమంటే బెట్టెంతో చేస్తావు   కట్టుబాటు లేనివానిని కట్తిపడేస్తుంటావు   ముసలితనము వచ్చినా ముక్కిమూల్గమంటావు   పసికందుల హతమార్చి కసితీర్చుకుంటావు   నీ పనులప్రభావము నీకసలు తెలియదుగా   మక్కువలేదంటున్నారురా ఓ తిక్కశంకరా.   శివుడు నువ్వు లేవని,నిన్ను లెక్కచేయనని,మోసగాడివని,నీ అవసరము నాకు లేదని,నీకు ప్రీతికరమగు విధముగా నేనెందుకు ఉండాలని తర్కము చేసే వారిపై మక్కువ చూపిస్తాడు కాని భక్తితో కొలిచే వారికి,అనుగ్రహమునకై పరితపించే వారిపై నిర్లక్ష్యమును చూపుతు,సందభోచితము కాని పనులను చేస్తుంటాడునింద. ప్రత్యక్షము నమః శివాయ-పరోక్షము నమః శివాయ విరుధ్ధము నమః శివాయ-సన్నధ్ధము నమః శివాయ    నమః శివాయ నమః శివాయ...

OM NAMA SIVAAYA--76

Image
  ఓం నమః శివాయ-51   ********************  నగుమోముతో నగములు నిన్ను బంధువు అంటున్నవి  సాలెపురుగు పాలె దోమ దయాసింధువు అంటున్నది  తుమ్మెద అమ్మమ్మ నిన్ను కమ్మని చుట్టము అంది  కరిరాజు పరివారము తమ సరివాడవు అంటున్నవి  ఎద్దుతరపు పెద్ద నిన్ను పెద్దయ్య అంటాడట  లేడి చేడియ నిన్ను తనవాడివి అంటున్నది  వ్యాళపతి వాసుకి నిన్ను చుట్టమని చుట్టుకుంది  తిన్నని కన్న అడవి కన్నతండృఇ అంటున్నది  హరి సంగతి సరేసరి అసలుచుట్టమంటాడు  ఇందరి చుట్టమైన నీవు నన్ను చుట్టుకోకుంటేను " నరత్వం-దేవత్వం-నగవన మృగత్వం" అన్న లహరి   లెక్కలోకి రాదురా  ఓ తిక్కశంకరా.       శివునికి చుట్టములు కొండలు-కీటకములు-జంతువులుఅడవి మొదలైనవే కాని సరివారు ఎవరులేరు కనుక నేను స్తుతిచేస్తుంటే నన్ను కరుణించుట లేదు--నింద.   శిల్పం నమః శివాయ-శిల్పి నమః శివాయ   వేట నమః శివాయ-వేటు నమః శివాయ( దెబ్బ)   నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా   పశుత్వం కీటత్వం భవతు విహ...

OM NAMA SIVAAYA-75

Image
  ఓం నమః శివాయ-75   *******************  అగ్నికార్యఫలితములు అన్నీ ఇంద్రునికైతే  బృహస్పతి చేరాడు బుధ్ధితో ఇంద్రుని  సరస్వతి చేరింది బృహస్పతిని చూసి  వరుణుడు చేరాడు ఆదరణకై ఆ ఇంద్రుని  భూమికూడ చేరింది ఈవి కోరి ఆ ఇంద్రుని  గాలివీచసాగింది నేరుగా ఆ ఇంద్రుని  అవకాశము ఇది అని ఆకాశము చేరింది  ఆశ్వనీదేవతలు ఆశ్రయించారు ఇంద్రుని  పంచభూతములు కలిసి నిన్ను వంచించేస్తుంటే  పంచాల్సిన ఫలితమును అంతా దోచేస్తుంటే  స్వార్థమంత గుమికూడి అర్థేంద్రముగా మారింది  నిన్నొక్కడినే వేరుచేసి ఓ తిక్కశంకరా.  వేదశాస్త్ర ప్రకారము దేవతలు యజ్ఞకృత హవిస్సును ఆహారముగా స్వీకరిస్తారు.వారికి ఆ అవకాశమును  అనుశివుడేగ్రహించాడు.కాని వారు శివుని లెక్కచేయక,శివునికి తెలియకుండా,చెప్పకుండా,తామందరు కుమ్మక్కై ,శివుని యజ్ఞ హవిస్సులో సగభాగమును ఈయకుండా,తామే స్వీకరించాలని వెళ్ళిన శివుడు వారినేమి అనకుండా మౌనముగా చేతకాని వలె నున్నాడు-నింద.  యజ్ఞం నమః శివాయ-యజ్వ నమః శివాయ  కర్త నమః శివాయ-భోక్త నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం న...

OM NAMA SIVAAYA-74

Image
  ఓం నమః శివాయ-74   ***************  వెండికొండ దేవుడవని వెండికొరకు నే వస్తే  దండిగా ఉన్న మంచు వెండివెండి నవ్వింది  మేరుకొండ విల్లుందని మేరువుకై నేవస్తే  చాటుగా ఉన్న విల్లు చిలిపిగా నవ్వింది  రాగిజటాజూటమని రాగికొరకు నేవస్తే  విరాగియైన జట మరీ విచిత్రముగా నవ్వింది  నీలలోహితుడవని ఇనుముకొరకు నేవస్తే  చాల్లే అంటూ విషము గేలిగా నవ్వింది  కుబేరుడు ముందున్నాడని ధనమునకై నేవస్తే  చేతులు కట్టుకున్నానని చేతకాక నవ్వాడు   ఎండమావులను నీళ్ళనుకుని కుండపట్టుకు వచ్చిన,    నా ఎక్కిళ్ళని ఆపవేర ఓ తిక్కశంకరా. ' రుద్రచమకములో శివుడు "హిరణ్యంచమే-సీసంచమే-త్రపుశ్చమే-శ్యామంచమే-లోహంచే ' అన్ని లోహములను పొందినవాడును-అనుగ్రహించగలిగిన వాడును అని చెప్పుకున్నాడని,భక్తుడు వాటికొరకు శివుని సమీపించి,ఘోరముగా పరాభవింపబడినను శివుడు చేతకాని వాడిలా కదలక మెదలక ఉన్నాడు.-నింద.   పసిడి నమః శివాయ-వెండి నమః శివాయ   రాగి నమః శివాయ -సీసము నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.   రుద్రనమక-చమకముల అంతరార్థము అర్...