Posts

mahanyaasamu

నీ మహన్యాసము నన్ను అపహాస్యము చేస్తున్నది నీ అంగ కరన్యాసములు అర్థముగాకున్నవి నీ రుద్ర నమక-చమకములు నన్ను మొద్దు అంటున్నవి నీ సహస్రనామములు పలుకగ సహాయము గాకున్నవి నీ శత ఎనిమిది నమములు నన్ను సతమతము చేస్తున్నవి నీ దండకములు అసలు అండ కానేకానంటున్నవి నీ అష్టకములు నావాక్కు స్పష్టము కాదంటున్నవి నీ షడక్షరీ మంత్రము నన్ను నిర్లక్ష్యము చేస్తున్నది శివ ప్రబంధములు పెద్ద ప్రతిబంధకమగుచున్నవి నీ పంచాక్షరి మంత్రము మించిపోలేదు అంటున్నది గుక్కతిప్పుకోలేని నాకు "శివ" యను చక్కని ఒక్క మాట చాలనవేరస ఓ తిక్క శంకరా! శివుని భక్టుడు తనకు నమక-చమకములు,అంగన్యాస-కరన్యాసములు,పంచాక్షరి-అష్టకములు,అష్టొత్తర-సహస్రనామములు చదువలేనని,కనుక శివ నామ జపమును మాత్రమే చేస్తానని అంటుంటే శివుడు కిక్కురుమనుటలేదు.భక్తుని తికమక పెడుతున్నాడు.నింద. నమకం-నమఃశివాయ-చమకం నమః శివాయ న్యాసం నమః శివాయ-మహన్యాసం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " నా రుద్రో రుద్రమర్చయేత్" రుద్రుడు కాని వాడు రుద్రుని అర్చించలేడు. పంచభూత పంచేంద్రియ తత్త్వమే పరమేశ్వరత్వము అని తెలుపునది పంచాక్షరి.అష్టమూర్తి తత్త్...

87

ఓం నమః శివాయ-73   *****************  అసత్యమాడు బ్రహ్మపుర్రె అంతగా నచ్చిందా  ఆభరనముగా చేసి అలంకరించుకున్నావు  హింసకు గురిచూసే బోయకన్ను నచ్చిందా  రక్తాశ్రువులను కార్చ అనురక్తిని చూపావు  అమ్మ దగ్గర ఉండనన్న అర్భకుని వాక్కు నచ్చిందా  అమృతధారగ మారి ఆర్ద్రతనందించావు  స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా  ఉదారతను చూపిస్తు ఒదిగిఒదిగి పోయావు  పృష్టభాగమున పూజలందు ఆవుచెవి నచ్చిందా  లంకకు నేరానంటు గోకర్ణమున నిలిచావు  పెంపును అందించుతావో పంపు అని చంపుతావో  పెక్కుమాటలేలరా ఓ తిక్క శంకరా.

86

Image
ఓం నమ: శివాయ " అనిశము వశమగుతావు" పశునామములకు నీవు "పశుపతి" అని పిలువగానే పరవశమేగా నీకు "కాల భైరవుని" కాశికాపురపతిని చేసావు "శరభమువై" నరసిమ్హుని శాంతింప చేసావు మిక్కుటమగు ప్రేమగల "కుక్కుటేశ్వరుడివి" నీవు వ్యాళము మీద మోజుగల "కాళేశ్వరుడివి" నీవు "స్కంధోత్పత్తికి" వనమున లేడిగ క్రీడించావు వ్యాఘ్రమునకు మోక్షమిచ్చి "వ్యాఘ్రేశ్వరుడివి" అయ్యావు జంబుకమును అనుగ్రహించిన " జంబుకేశ్వరుడివి" శ్రీ,హస్తి,కాళములను దయ తలచిన "శ్రీ కాళ హస్తీశ్వరుడవు" " పాశమేసి" నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని "కప్పల తక్కెడ" అంటావురా ఓ తిక్క శంకరా. భావము శివుడు పశుపతి కనుక పశువులన్నా, పశునామములన్నా మిక్కిలి ఇష్టము.కనుక కోడిగానో,పాముగానో,నక్కగానో,కుక్కగానో, పులిగానో, శరభముగానో , దర్శనమిస్తుంటాడు.".శ్రీకాళ హస్తీశ్వరుడిగా" భక్తులను అనుగ్రహిస్తున్నాడు.కాని నర రూపమున నున్న భక్తుని, (నన్ను) అనుగ్రహించమంటే,నా భక్తి నిశ్చలమైనది కాదంటున్నాడని-నింద. పశువు అంటే జంతువులు,క్రిమి కీటకములు మాత్రమే కాదు....

85

  ఓం నమః శివాయ-32     ******************   కంటి నీటిపూసలు కలిమిని అందీయగలవ   సిగపూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలద   కట్టుకున్న గజచర్మము పట్టుపుట్టమీయగలద   నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను ఈయగలద   కరముననున్న శూలము వరములనందీయగలద   పట్టుకున్న పాములు పసిడిని అందీయగలవ   కరుగుచున్న నగము తరగని సంపదనీయగలద   కదలలేని చందమామ ఇంద్రపదవినీయగలడ   కాల్చుతున్న కన్ను కాసులనందీయగలద   ఆదిశక్తి అండనున్న ఆదిభిక్షువైన నిన్ను   "దారిద్రదుఖః దహనాయ-నమః శివాయ" గ    ఒక్కరైన నమ్మరురా ఓ తిక్కశంకరా.

paalutaagi

Image
ఓం నమః శివాయ-78  *********************  పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో  పాలకడలి విషము మింగ పావుగా మారావు  పచ్చి అబధ్ధాల పుర్రెలమీది మోజుతో  పరమేష్టి పలుకులలో దొంగగా మారావు  సూర్య-చంద్ర-అగ్నుల ముక్కంటిని నేననే టెక్కుతో  అగ్గికన్ను తెరువలేని అసహాయుడవయ్యావు  గంగను బంధించిన వాడిననే గర్వముతో  కొంచమైన దించలేని నంగనాచివయ్యావు  పదహారవ చంద్రకళమీది పరమప్రీతితో  గ్రహణము తొలగించలేని ఘనుడవు నీవయ్యావు  గొప్పపనులు నావంటూ పప్పులో కాలేస్తావురా  ఒక్కసారి గమనించరా ఓ తిక్కశంకరా. శివునికి పాములనుఆభరణములు గ ధరించుటపైగల ప్రీతి విషభక్షకునిగ మార్చినది.తుంచిన బ్రహ్మ పుర్రెలపైగల మోహము బ్రహ్మచే దొంగగా నిరూపింపచేసినది.వాటిని కనపడేటట్టుగా ఉంచుతాడేకాని దాచిపెట్టడము తెలియనివాడు.వృధ్ధిక్షయము అతీతమైన పదహారవ చంద్రకళను ధరించాననుకుంటాడే కాని గ్రహణమును ఆపలేని అసమర్థుడనుకుంటునారనుకోడు.గంగను బంధించిన మొనగాడను నేనేనను నంగనాచి కబుర్లు చెబుతాడు కాని కొంచము సైపైన దానిని కిందకు దించలేనని చెప్పడు.గొప్పపనులు తనవని అనుకుంటూ దోషిగా నిరూపించబ...

chinmayamudra-81

Image
 నీ చిన్మయముద్రను నేను అనురక్తితోచూస్తుంటే   నీ తలపని గంగమ్మ నన్ను తుంగతొక్కుతానంటున్నది   నీ జటాజూటము నన్ను దక్షుడు అనుకుంటున్నది   నీ శిరమున శశి  గ్రహణము నాకేనని అంటున్నది   నీ కంఠములోని విషము నన్ను కబళించాలనుకుంటున్నది   నీ చేతి డమరుకము నా వివరము అడుగుతున్నది   నీ నడుము పులితోలు కలవరమేఅంటున్నది   నీ వాహనమైన ఎద్దు నన్ను గద్దిస్తోంది   నీ మంజీరమైన పాము నాపై బుసలు కొట్టుతున్నది   వేడుకొనుట దేవుడెరుగు నిన్ను చూడనీయకున్నవి  నీ వైనము ఏమిటి? నావైపు చూడవు భయముతో  ఉక్కిరిబిక్కిరి అవుతున్నానురా ఓ తిక్క శంకరా!  శివ దర్శనమునకై వెళ్ళిన భక్తుని శివుని గంగ-జటాజూటము-చంద్రుడు-విషము-డమరుకము-పులితోలు-మంజీరము ఎద్దు ఎద్దేవా చేస్తూస్వామి దగ్గరకు వెళ్ళనీయకున్నవి.శివుడు వాటిని మందలించలేని అసమర్థతతో,కళ్ళుమూసుకొని ధ్యానముద్రలో నున్నట్లు నటిస్తున్నాడు. వైనము నమః శివాయ-ధ్యానము నమః శివాయ భయము నమః శివాయ-అభయము నమః శివాయ  నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ " జటాభిర్లంబమానాభిరృత్యంత  మభయప్రదం   ...

deepamu-90

  ఓం నమః శివాయ-65    ********************   సుగంధిపుష్టి కర్తకు సుప్రభాత దీపములు నిటలాగ్ని హోత్రునికి నిత్య ధూప దీపములు పాషాణపు దేవునికి ప్రభల వెలుగు దీపములు కందర్ప దర్పునికి కర్పూర దీపములు పరంజ్యోతి రూపునికి ప్రమిదలలో దీపములు జలజాక్షునికి వేడుకగా జలములోన దీపములు ప్రమథ గణాధిపతికి ప్రదోషవేళ దీపములు ఆశాపాశ రహితునికి ఆకాశదీపములు మా ఆర్తిని తొలగించే కార్తీక దీపములు దీపములను పేర వెలుగు నీ నామ రూపములు జాణతనము తోడుకాక జ్వాలాతోరణములో చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా. .............................................................................................................................................................................................................................సుగంధ భరితుడు,పోషకుడు,వృద్ధికారుడు అని చెబుతు శివుడు పొద్దున్నే వెలిగించే దీపాలకై ఎదురుచూస్తుంటాడు.కామ దహనము చేసానంటు కర్పూర దీపాలను కోరతాడు.లింగము రాయి కనుక దీపాలను చూడలేదు. పద్మములు జలములో నున్న దీపాల వేడిని తట్టుకోలేవు.మన ఆశలన్నిటిని దూరము చేస్తానంటు శివుడు ఆకాశదీపాలకై తేరిపారి చూస్తుంటా...