Posts

0004

అమ్మకు సభక్తి పూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-04 ********************* మాతా కూష్మాండా నమోనమః "సురాసుర సంపూర్ణ కలశం రుధిరా పుత్రమేవచ దధనా హస్త పద్మాభ్యాం కుష్మాండా శుభదాస్తుం " శైలపుత్రీ మాత మనకుబ్రహ్మచారిణి మాతను పరిచయము చేస్తే,బ్రహ్మచారిణి మాత మనకు చంద్రఘంట తల్లి పరిణయమను ప్రసాదగుణమును అందించింది.ఇల్లాలైన చంద్రఘంట తల్లి సూక్ష్మ-స్థూల రూపములతో అండరూపముగా ధరించు కూష్మాండ మాత కరుణరసామృత వర్షిలో మునిగితేలే మురెపమును అందించింది. కు అనగా చిన్న/సూక్ష్మ అను భావమును మనము గ్రహించగలిగితే,ఊష్మాండా అనగా సుందరతత్త్వము.అనగా తల్లి మనలో సూక్ష్మరూపములో నిండి స్థూలతత్త్వమును దర్శింపచేస్తుంది తల్లి.అందుకే ఆమ్మ అష్టసిధ్ధిస్వరూపిణి అయిన అష్టభుజి. పదునాలుగు భువనంబులు కుదురుగ తన కుక్షిలో నింపుకొని,దేవకీదేవి గర్భములో ఒదిగిన శ్రీకృష్ణుని వలె సూక్ష్మాతిసూక్ష్మము కాగలదు.అదే విధముగా ఇందుగలదందులేదని...ఎందెందు వెతికి చూసిన అందందేగలడు చక్రి అని ప్రహ్లాదుడు అన్న చందంబున విశ్వరూపియై విచ్చేయగలది కూష్మాండమాత. నమో పూర్వజాయచ-పరజాయచ" అని రుద్రములో చెప్పబడినట్లుగా,స...

003

అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-03 ********************* చంద్రఘంట మాతా నమోనమః " పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తమతేహ్యం చంద్రఘంటేతి విశ్రుతా". శైలపుత్రీ మాత మనలను బ్రహ్మచరిణి మాతకు అప్పగిస్తే తల్లి పరమేశుని అర్థాంగిగా పరిణయమాడు సమయమున తాను సౌమ్యరూపియై-తన నాథుని సౌమ్యరూపునిగా ప్రకటించుకొనమని అర్థించి,శివశక్త్యైకరూపిణియై,సౌభాగ్యచిహ్నముగా తానును నుదుటను ఘంటాకృతిలో నున్న చంద్రఘంటను ధరించి,వినూత్న శోభలతో విశ్వేశ్వరుని అర్థాంగి గా మారినది. తల్లి ధైర్యమునకు గంభీరతకు ప్రతీకయైన పెద్దపులినిగాని/సింహమును గాని వాహనము చేసుకొని శివునిశక్తియై శుభములనొసగుచున్నది. తల్లి నామములో చంద్ర-ఘంట అను రెండు పదములున్నవి.ఇవి రెండు విభిన్న స్వభావముల సంకేతములు.అమ్మ ఘోర/అఘోర రూపములను దుష్టశిక్షణకు-శిష్ట రక్షణకు ధరించు విధానమును పరిచయము చేస్తున్నవి. చంద్ర పదము చంచలత్వమును-ఘంట పదమును నిశ్చలత్వమును తెలియచేస్తున్నవి.ఇక్కడ చంద్రుని రూపమును గాక స్వభావములకు సంకేతములుగా పరిగణిస్తే రెండు పరస్పర విరుధ్ధభావములైన చంచలత్వమునకు-నిశ్చలత్వమునకు ప్రాతినిధ్...

oo2

Image
ప్రసీద మమ సర్వదా-02 *********************** అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో, నవదుర్గ ప్రస్తావన వరాహపురాణములో వచ్చినదని,పురాణాలు ప్రణవము నుండి పుట్టినవని పెద్దలు చెబుతారు. సూర్యుడు కన్యారాశిలో నుండు సమయము కనుక పరమాత్మ తత్త్వమును స్త్రీమూర్తిగా భావించి-పూజించు సంప్రదాయమును అనుసరించేవారు ఉన్నారు. శరత్కాలముులోని నవరాత్రులను దేవిశరన్నవరాత్రులంటారని దీనినే బతుకమ్మాగా ప్రకృతిని కొలిచే సంప్రదాయమును మనము చూస్తూనే ఉన్నాము. నవ శబ్దమునకు నూతనత్వమును సంతరించుకొనిన అనగా కొత్త కొత్త నామరూపములతో ఏ ఆకారములేని తత్ అనేక ఆకారములై,నామరూపములతో అలరారుతూూ.అసుర సంహారమునుచేసి,ఆనందోత్సాహములనులను నింపిన సమయము ఇది.పురాణము అను పదమునకు పూర్వకాల కథా విశేషముగా అన్వయించుకుంటే ఇది సరిపోతుంది.తల్లి అనుగ్రహము మనలను అంతటితో ఆపేస్తుందా? అన్వేషణను కొనసాగిస్తుందా? అంటే రెండవది తథ్యము.సంఖ్యా పరముగా నవ అను శబ్దము తొమ్మిది"9" అను సంఖ్యను సూచిస్తుందికదా.తొమ్మిది అను సంఖ్యను హెచ్చవేస్తూ వచ్చినదానిని కూడుతుంటే మళ్ళీ తొమ్మిదే వస్తుంది.అంతే అమ్మ అనేక రూపాలను దర్శిస్తూ,దయను అన్వయము చేసుకుంటే అన్నిరూపాలలో...

01NAMONAMAHA

Image
నవదుర్గ మాతా నమో నమః ******************** ప్రసీద మమ సర్వదా ****************** "యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ" నిరాకార-నిరంజన నిర్గుణ నిత్య తత్త్వమే తత్.అంటే అది.అది అంటే అన్నింటా ఉన్నది.దానినే సా సావర్ణిగా ( సా అనే అక్షరముగా పెద్దలు చెబుతారు.ఇంకా సులభముగా మనకు అర్థమవాలంటే ఏకాతత్త్వమే-బహుముఖములుగా తనని తాను పరిచయము చేసుకొనుచు ఆదే చదరంగపు ఆట.ఇందులోని జీవులనే పావులలో కొన్నిటిని తనకు అనుకూలముగా మరి కొన్నింటిని తనను ధిక్కరించునవిగా మనలను భ్రమింపచేయుచు,ఎత్తుకు పైఎత్తులను ప్రదర్శింప చేయుచు,కొన్నిటికి రాజు అని,ఇంకొన్నిటికి మంత్రులని,అశ్వములని,బంటులని ఎల్లా ఎన్నో నామరూపములను నిర్ధారించి,ఆట ముగిసిన వెంటనే అన్ని పావులు చదరంగపు బల్లతో సహా పెట్టెలో కలిసిపోయి ఉండినట్లు తల్లి తన లీలగా అసురులు-సురలు అను రెండు వర్గములను మనము భావించునట్లు చేసి,మనకు అర్థము చేయవలెనను దయతో తానొక పక్క-వారినొక పక్క పెట్టి ఎత్తు...

PRASEEDA MAMA SARVADAA-09

Image
ప్రసన్న మమ సర్వదా-09 మాత సిధ్ధిధాత్రి నమోనమః "సిధ్ధ గంధర్వ యక్షాద్యైః అసురైః అమరైరపిః సేవ్యమానా సదా భూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయినీ". ధాత్రీ అను శబ్దమునకు అనుగ్రహించునది-ప్రసాదించునది అని అర్థము.అమ్మ మనకు సిధ్ధులను ప్రసాదిస్తుంది కనుక సిధ్ధిధాత్రి నామముతో కీర్తింపబడుచున్నది.తల్లి మనతో పాటు ఉంటూ,మనలను చైతన్యవంతులను చేస్తూ,సన్మార్గమును చూపిస్తూ,దానికి కావలిసిన సిధ్ధులను అనుగ్రహిస్తుంటుంది. మనలోని సద్గుణాల సమ్మేలనమే సిధ్ధులు.కాని ముఖ్యముగా అష్టసిధ్ధులు మనకు అనేక విషయములను తెలియచేస్తాయి.వాటికి అనుగునముగా మన ఇతిహాస కథలు వాటి ఉపయోగవిధానమును మరింత వివరించినవి.ఉదాహరనకు సూక్ష్మావస్థలో కూడా భగవ్తత్త్వమును గ్రహించగలగటము అణిమ-భగవతత్త్వమును అన్నింటా దర్శించకలగటము మహిమ-అంటే సూక్షముగా -స్థూలముగా నున్న భగతత్త్వమును గుర్తించగలుగుట.గరిమ-లఘిమ మరొక రెండు సిధ్ధులు.అతి తేలికగా మారుట-అత్యంత బరువుగా (రూపములో ఏమార్పులేకుండ) మారుట.ప్రాప్తి-ప్రాకామ్యము మరొక రెండు శక్తులు.శూన్యముగా పైకి కనిపించేదానిలో శక్తిని గ్రహించగలుగుట ప్రాప్తి అయితే దానిని పొందగలుగుట ప్రాకామ్యము.ఈశిత్వము-వశిత్...

PRASEEDA MAMA SARVADAA-08

Image
ప్రసీద మమ సర్వదా-08 మహాగౌరి నమోస్తుతే శ్వేతవృషే సమారూఢా శ్వేతాంబర ధరా శుభాః మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా" అష్టవర్షా భవేద్గౌరీ మహా అత్యంత గౌరి తెల్లని శరీరకాంతి కలది.అత్యంత గౌరవ ప్రదాయిని. శుంభ-నిశుంభులను రాక్షసులు తమకు పార్వతీదేవి పుత్రికతో తప్ప అన్యులతో మరణమును పొందని వరము కలవారైరి.వరబల గర్వితులైన వారు యుక్తాయుక్తములను మరచి ధర్మమునకు గ్లానిని కలిగించసాగిరి. పరమేశ్వరి లీలలు పరమదాయార్ద్రశీలములు.ధర్మసంస్థాపనకు శుంభనిశుంభులు నిర్గమించాలి.దానికి తన సరీరమునుండి ఒక మహాశక్తి తన పుత్రికగా ఆవిర్భవించాలి.దానికొక బాహ్య కారణమును చూపించాలి(మనకు అర్థమగుటకు) కనుక తల్లి తన కాళి రూపము లోని నల్లని రంగును నెపముగా మలచుకొని,దానిని విడనాడుటకు మానససరోవములో మునిగినది.తల్లి తలచుకుంటే కానిది ఏముంది? మానస సరోవరము తన బాధ్యతగా తల్లి నల్లని చర్మమును తల్లి నుండి వేరుచేసి,మహాగౌరిగా అమ్మను ప్రకాశింపచేసినది. తల్లినుండి విడివడిన చర్మమునుండి మహాద్భుత శక్తి "కౌశికి" గా (కోశమునుండి వెలువడినది) ఆవిర్భవించి,అసురుని అస్తమింప చేసినది.తమస్సు ఉషస్సును చేరినది.ఎంతటి దయామయి...

PRASEEDA MAMA SARVADAA-INTRODUCTION

Image
ప్రసీద మమ సర్వదా నవదుర్గ మాతా నమో నమః యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది. 'ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాందేతి చతుర్థకం పంచమ...