Posts

MEEDUSHTAMA SIVATAMA-07

     మీడుష్టమ  శివతమ-07   ************************    న రుద్రోరుద్రమర్చయేత్-  రుద్రుడు కాని వాడు రుద్రుని అర్చించలేడు.అర్థము చేసుకొనలేడు.    కృత్స్న వీతాయ ధావతే సత్వానాం పతయే-అలవాటుమార్చుకోవటము అసాధ్యమేనంటూ ఇక్కడ సాధకుని వెనుక పరుగిడుతున్నాడు రుద్రుడు.పాపం వాడికి నా అవసరము వస్తుందేమో.అడుగుతాదేమో! అనుగ్రహిద్దాము అనుకుంటూ.     ఊరుకుంటాడా వానిని వెనుదిరిగి వరమును అడగనీయకుండా ఆ భద్రనిచ్చేవాడు.    ఇక్కడ మనమొక విషయమును గుర్తుచేసుకుందాము.అదియే లోహ ప్రాశస్త్యము.హితము రమణీయత ను కలిగించే బంగారము తన సింగారమును పొందే విధానము.అదేనండి అపరంజి ఆభరనముగా రూపుదిద్దుకొను విధానము.    ఈ మేలిమి బంగారమును కాసేపు మనము ఆత్మ తత్త్వముగా భావిద్దాము.అది కాసేపు తన సస్వరూపమునకు నామరూపములను ప్రకటించాలనుకుంది.అప్పుడు ఏమి చేస్తుంది? అగ్నికీలలు అనే చైతన్యము ద్వారా తన విస్తరనను ప్రారంభించి,తనతో పాటు రాగి అను మరొక లోహమును తనలో కలిపేసుకొని,తాను మరొక ఆకారమును సంతరించుకుంటుంది.ఆ రూపమునకొక మరొక అందమైన పేరుపెట్టుకుంటుంది.గాజులని-గొలుసులని.కొత్త రూపము...

ginjalu

Image
      మీడుష్టమ శివతమ-06     *********************   ' ఒకపరి జగముల వెలుపల "ఒకసారి ప్రత్యక్షము అవుతాడు.అంతలోనే అంతర్ధానమవుతాదు.చిత్రవిచిత్రములతో నన్ను చిత్తుగా మోసము చేసాడు.కనపడనీకడిగేస్తా ననుకొన్నాడు సాధకుడు.స్వామికి కావలిసినది కూడా అదేగా అదేనండి అభిషేకములు.క్షణములో ఎదురుపడ్డాడు.   ఊరకపోనీయడు కదా సాధకుని వాని సాధనను.ఊసుబోక అడుగుతున్నా అంతా సుభిక్షమే కదా అన్నాడు .ఊహించినదే జరిగింది.  ఉడుకుమోత్తనముతో చాల్లే సంబడం.అక్షుతుశ్చమ్మే అని అడిగాని.న క్షుత్తు చ మే నాకు ఆకలి లేకుండా ఉండాలి అని అడిగాను.అనుగ్రహించానన్నావు.ఆనందించాను.కాని,    కాని ఎక్కడిపోయింది ఆకలి.నా పక్కనే పొంచిఉండి,అదును చూసుకొని నాపై దాడిచేస్తున్నది.   ఇక నేను నిన్ను అడిగిందేమిటి? నువ్వు నాకు ఇచ్చిందేమిటి?ఏమి తెలియనట్లు అంతా సుభిక్షమేనా అంటూ కొంటె ప్రశ్నలు.    నువ్వే నాతో అన్నవు కదా ఒకటి వస్తే మరొకటి వెళ్ళిపోతుందని.ధాన్యరాశులను అనుగ్రహిస్తే దారి మళ్ళుతుందని ఆకలి.అందుకేగా,     నేను నీకు అందరిచేత ఇష్టముగా స్వీకరింపబడెడి వడ్లను ఇచ్చాను నువ్వు "వ్రీహాశ్చమే" అనగ...

AKALILEKUNDA

   మీడుష్టమ శివతమ-05  **********************  ఈశ్వరా నా ఈ ఆకలి నన్ను వివశుణ్ణిచేస్తున్నది.అడిగే లోపే అంతర్ధానమవుతావు.అన్నీ ఇచ్చాగా అంటావు.కనికరించు-కనిపించు వేడుకుంటున్నాడు సాధకుడు.వేదనను తీర్చకుండా ఉండగలడా వేదమయుడు.వచ్చేశాడు వరములను ఇచ్చేయాలని.    స్వామి అక్షుతిశ్చమే-నాలోని ఆకలి లేకుండా పోవాలి.అది పోవాలంటే ,  అక్షితిశ్చమే-కూయవాశ్చమే--- తరిగిపోని ధాన్యరాశులు నాకు కావాలి.అలాగా.అంటే ?అర్థము కానట్లు నటించడం-సాధకుని విజ్ఞతను పరీక్షించడము అదొక ఆట .     నాకు ధాన్యము కావాలి.ఉండు-ఉండు ముందుగా నాకు ఏయే-ఏయే ధాన్యములు కావాలో చెబుతాను.వాటిని ప్రసాదించు అన్నాడు ఆర్తితో.అనుగ్రహిస్తానన్నాడు పరమాత్మ మనస్పూర్తితో.   ఆకలిని తీర్చు వడ్లు-యవలు-మినుములు-శనగలు-పెసలు-నువ్వులు-గోధుమలు-నీవరి ధాన్యములు కావాలీనగానే చిరునవ్వు నవ్వాడు రుద్రుడు అందుకేగా నేనున్నది అంటూ.    అంతలోనే ఆదుర్దా ఆ సాధకునికి.ఇదిగో నన్ను పూర్తిగా అడగనీ.తికమక పెట్టకు.ఇస్తానన్నా కదా అని అంతో-ఇంతో ఇచ్చి ఇచ్చేసాను అంటావేమో.నేను ససేమిరా ఒప్పుకోను.నేను ఎంతెంత కావాలో కూడా చెబుతాను అన్నాడు చ...

MEEDUSHTAMA SHIVA-04

     మీడుష్టమ శివతమ-04.   ***********************   సాక్షాత్కరించాడు రుద్రుడు సాధకుని శిష్యత్వమునకు చిన్ని జిలుగు దిద్దటానికి.ఏమయ్యా సాధకా! ఎలా ఉంది నీ గురువుగారిపాఠము? అంటు గుట్టువిప్పించాలనుకున్నాడు   క్షత్రాణాంపతయే నమోనమః అంటు కరములు జోడించాడు సాధకుడు.     క్షత్రమేమిటి?దానికి పతి ఏమిటి?దానికి నాకు ఉన్న సంబంధమేమిటి?ఎందుకు నన్ను అలా సంబోధించావు అంటూ అడిగాడు ఆశ్చర్యమునునటిస్తూ ఆ ఆటలాదేవాడు.     పరాత్పరా! కదిలేవి కథలు వాటిని కదిలించేది నీ కరుణ.కాదనకుందా నేను చెప్పేది పూర్తిగా విను.అవగాహనారాహిత్యమును అడ్డగించు.మా గురువులు సృష్టి రహస్యములను సులువుగా అర్థము చేయించారు.     ఏమిటా రహస్యములు? అన్నాడు ఆ ఎరుకలవాడు.     ఇప్పుడు మనము అనాత్మకముగా భావించే జగతి ఒకప్పుడు ఆత్మస్వరూపమే.అది అప్పుడు గుప్తముగా నున్నది.అందులో నేను నా సంసారము కూడా ఉంది.అయితే అది గుప్తముగా ఉంది.కాని నిజమునకు ఇప్పుడు జగము ఆత్మ స్వరూపమే-అప్పుడు ఆత్మస్వరూపమే.అప్పుడు గుప్తము.ఇప్పుడు ప్రకటనము అన్నాడు రుద్రునితో .   బాగున్నావయ్య! గుప్తమంటావు-ప్రకటనము అంట...

MEEDUSHTAMA SIVATAMA-03

   మీడుష్టమ శివతమ-03  *********************   " న రుద్రో రుద్రమర్చయేత్" రుద్రుడు కాని వాడు రుద్రును భజించలేడు.అని ఆర్యోక్తి. జీవుడు రుద్రుడు ఎలా అవుతాడు?అనే సందేహము మనకు రావచ్చును.సకలము వికలముగా మారుతున్నాప్పుడు విస్తృతరూపమును ప్రకటించుకొనునప్పుడు అందులోని చిన్న శకలమే జీవుడు.ఇది కాదనలేని నిజము .సాధకుడు రుద్రుని అనుగ్రహము వలన అన్నాదులను వాటి ఉపయోగములను తెలుసుకున్నాడు.తృప్తిచెదాడా వాటితో అని అంటేలేదనే చెప్పాలి.చ మే నాకు కావాలి.అది కావాలి-ఇది కావాలి-ఇంకా--ఇంకా అంటూ ఇబ్బంది పడుతున్నాడు.  ముసిముసి నవ్వులతో ముక్కలను కదిలిస్తున్నాడు ముక్కంటి.మరింక నేను వెళ్ళిరానా అంటూ ముక్తాయింపు పలికాడు.    ఆగవయ్యా ఆదిదేవా! అన్నీఅడుగు-అన్నీ అడుగు అంటూనే ఆలోచించుకోనీయక్యండా -అడుగనీయకుండా అయిపోయిందా అంటున్నావు.అమ్మో చమత్కారివే.   ద్రవిణంచమే-యంతాచమే అని కద నీచమకము చెబుతున్నది.నన్ను ఉధ్ధరించగలుగు మంచి గురువును అనుగ్రహించు అన్నాడు సాధకుడు సాగిలపడుతూ.   సరే అలాగే కానీ.గురువుద్వారా నీవు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నావు అన్నాడు రుద్రుడు అమాయకముగా.    సంవిచ్ఛమే శివా...

MEEDUSHTAMA SIVATAMA-02

      మీడుషటమ శివ-02    ***********************    న రుద్రో రుద్ర మర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రునితో సంభాషించలేడు-అర్చించలేడు.   సాధకుని మాటకు మయశ్చమే అంతే అని అమాయకముగా అడిగాడు ఆదిదేవుడు అమాయకముగా.ఎంత చతురుడవయ్యా చంద్రశేఖరా! శాపగ్రస్థౌడైన చంద్రుని నీ చాతుర్యముతో శిరోభూషనముగా చేసికొనినావు.ఆ అవ్యాజప్రేమ అటుగా వెళుచున్న నాపై కొంచము ప్రసరించినదేమో.నా నోటినుండి వినాలనుకున్న నీ కోరికను నా అదృషముగా స్వీకరిస్తాను.    నాకు ఇల్లుకావాలి అన్నానుకదా.నీవు సరే అన్నావు.నా ఈ ఉపాధియే ఇల్లు  వస్యశ్చమే అని అడిగాను.  .గూటిలో కూర్చుని ఉన్న నాకు నీ అనుగ్రహముతో ఈ ఉపాధి ఉపయోగమేమిటి? అనే ప్రశ్న ఉదయించింది.ఇదియే నాకు నా ఆధ్యాత్మిక అంచులను చూపించే సాధనము అని అనిపించింది.ఇట్టి విశిష్టగల పరికరమును నేను సమర్థవంతము చేసుకోవాలి కద.అందుకే ఆధ్యాత్మికముగా తృప్తిని కలిగించే భావములను అహారముగా ఇమ్మనమని "ప్రియంచమే" అని అర్థించాను.సంకల్ప వికల్పములు నా మనసును కుదిపివేస్తూ ప్రశాంతతకు అడ్డుపడుతున్నాయి.వాటిని తొలగించి,నా మనో క్షత్రమును చదును చేయుటకు నాగలిని "సీరంచమే" అ...

MEEDUSHTAMA SIVATAMA-01

      మీడుస్టమ శివ-వరములను వర్షించు-01     ***********************************   శం చ మే-    మే నాకు చ కుడా కావాలి ఏది కావాలి?  శం అనగా ఐహిక సుఖము.    ఐహిక సుఖమును పొందవలెనన్న శరీరమునకు ఆహారము-మనసునకు ఆహ్లాదము కావాలి.   తలదాచుకొనటానికి ఇల్లుకావాలి.కనుక -వస్యశ్చమే.      గూటిలోనికి చేరిన తరువాత కూటిపై తాపత్రయము సహజమే కదా-కనక సీరంచమే-వ్యవసాయము చేసుకొనుటకు కావలిసిన నాగలి-ఎద్దులు-ఇతర పరికరములు కావాలి.కనుక సీరంచమే.    ఆహారముతో పాటు నీరు కూడ కావాలి-అంబశ్చమే.  మనకు కావలిసిన అన్ని వస్తువులను పండించుకోలేము కదా! కనూ మిగిలినవి కొనుగోలు చేయవలసినదే.కనుక ద్రవిణశ్చమే.    కూడు-గూడు ఇచ్చావు.మేము వాటిని ఆస్వాదిస్తూ,అనుభవించాలికదా.కూరిమితో వాటిని అనుభవిస్తున్న సమయములో చిన్న చిన్న జలుబు-దగ్గు-జ్వరము వంటి శరీర రుగ్మతలు రావచ్చును.వాటిని దూరముగా నెట్టివేయి-అనామయశ్చమే.    నువ్వు చిన్నచిన్న వాటిని నెట్టివేస్తున్న సమయములో క్షయ మొదలగు పెద్దపెద్ద వ్యాధులు మమ్ములను సమీపించుటకు సాహసము చేయవచ్చును.వాటిని కూడ మా...