Posts

MEEDHUSHTAMA SIVATAMA-29

Image
    మీఢుష్టమ  శివతమ-29   ***********************   ముక్కనులను సాగరమును కానగలేను   ముక్కాలముల గనుము మూఢుని నన్ను   దిక్కైన సుగుణ సుగంధాభరణ   చక్కని చంద్రుని సిగను దాల్చిన సోమ.    రుద్రా!  స్థూల-సూక్ష్మ-కారణ శారీరనేత్రములతో  ఈ సంసార నిజస్వరూపమును నేను చూడలేని అసహాయుడను.  ఎందుకని?  అని అంటావేమో  ఎదలోని స్థాణువును ఎరుగుటయే మోక్షము,  అన్న విషయమును నేను గ్రహించుటకు,  అంటే ఏమిటి? సాధకా అడిగాడు రుద్రుడు.   అంటే -సర్వము-సమస్తము గుణమయమై అదనముగా ఏది కనబడకుండా,దానికదే కనబడే ఆత్మసాక్షాత్కారము-ఆత్మసాక్షాత్కారము అంటు అర్థిస్తున్నాడు.    అప్పుడే వారికి నలుగురు దివ్యపురుషులు  అహమన్నం-అహమన్నం-అహమన్నం  అహమన్నాద-అహమన్నాద-అహమన్నాద    అనుకుంటూ అటుగా వెళుతున్నారు.వారు బాహ్యమునకు అతీతముగా బ్రహ్మమును శోధించుచు-సాధించుటకు-సమగ్రమగుటకు సాగుతున్నారు.    సాధకా! అర్థమగుతున్నదా? వారు ఏమంటున్నారో?    అన్నము నేనే అంటున్నారు.అన్నము తినేవాడను నేనే అంటున్నారు.    ఆశ్చర్యముగా ...

MEEDHUSHTAMA SIVATAMA-28

Image
    మీఢుష్టమ శివతమ-28   *******************     శివయేవ గతిర్మమ-శివయేవ గతిర్మమ     స్వాంతకుహర చిద్జ్యోతి సాంత్వన సుఖదాయకః     శివయేవ   గతిర్మమ.....    దర్శనశక్తి దేనిద్వారా ప్రసారమగుతున్నదో అది మనము అనుకునే చక్షువు.శక్తి దాగి ఉప్పొంగి ప్రకటితమగుచున్నదో అది అసలైన చక్షువు.అంతేనా రుద్రా అనుకుంటూ సముద్రతీరములో ముచ్చటిస్తూ నడుస్తున్నారిద్దరు.   నమః శివాయచ-శివతరాయచ.    సాధకుని రుద్రుడు అంటే అమితమైన,అచంచలమైన,అద్వితీయమైన,అమోఘమైన,ఆనందదాయకమైన గురుభావము ఏర్పడినది.అది 'యన్ తాచమే" అని గురువుగా అడిగినప్పుడు అనిపించనిది.ఆర్ద్రతతో నిండినది.   సరిసమానముగా నడవలేకపోతున్నాడు.వినయంగా రుద్రుని పాదపు ఆనవాళ్ళకు నమస్కరించుకుంటు వెనక-వెనకగా నడుస్తున్నాడు.అంతా గమనిస్తూనే ఉన్నాడు రుద్రుడు సహస్రాక్షుడు కదా.    ఏమైనది సాధకా? వెనకబడ్డావు అన్నాడు కొంటెగా.     రుద్రా! నేనొకటి చెబుతాను.నవ్వకుండా వింటావా అన్నాడు.రుద్రుడు తలపంకించగానే సముద్రమును చూపిస్తూ,  ఆ సముద్రగర్భ జలము వలె లోపలి కన్ను నిశ్చలముగా ఉంటుందిఉవ్వెత్...

MEEDHUSHTAMA SIVATAMA-27

Image
       మీఢుష్టమ  శివతమ-27      ****************  చెలగి చేతలు నడత శివార్చన విధులు  వెలిగె సర్వము హరుడె  వేరేది లేదిక.   సాధకునికి సాంత్వన నీయాలనుకుంటున్నాడు రుద్రుడు.ఎంతైన స్వాంత కుహరుడు కదా. మది యనె గుహలోపదిలముగా నున్నవాడు.       స్తుహి శ్రుతం గర్తసదం యువానాం.    గర్తసదం-పల్లము యైన హృదయమునందున్నవానిని,    స్తుహి-ఓ మనసా! స్తుతింపుము.మెచ్చుకొనుము.       ఏదో అడుగుటకు సంశయిస్తున్నట్లుగా పెదవులు తెరుస్తూ-మూస్తూ ఏదో అడగటానికి తటపటాయిస్తున్నటుగా,    గమనించిన సాధకుడు నన్ను అడగటానికి ఎందుకు సంశయిస్తున్నావు అన్నాడు కథను ముందుకు పోనిస్తూ.    అదే ఈ రోజు మైదానములో కారునడిపే పోటీలున్నాయట కద.ఎంత అల్పసంతోషి ఈ రుద్రుడు అనుకుంటూ,   సరేలే అలాగే వెళదాం అన్నాడు సాధకుడు.     చుట్టు ఆసీనులైనారు జనాలు ఆసక్తితో.   చుట్టుకొచ్చాడు వాహనచోదకుల చిట్టాను రుద్రుడు.ఆశక్తితో.      డెందములో అందెల సందడులు మోగిస్తూ ప్రారంభమైనది పోటి.    పోటి...

MEEDHUSHTAMA SIVATAMA-26

Image
    మీఢుష్టమ శివతమ-26   *******************    "నటనం ఆడెనే ఆ భవతిమిర హరుడు     నటకా వతంసుడై తకధిమి తకయన     నటనం ఆడెనే.......      రుద్రుడు పాటను వింటూ,తలను పంకిస్తూ,అడుగులను లయబధ్ధంగా కదిలిస్తున్నాడు.     రుద్రా! ఈ రోజు అద్భుత నృత్యప్రదర్శన ఉంది.మాతోపాటు నువ్వుకూడ రా అన్నాడు సాధకుడు.    తబ్బిబ్బైపోతున్నాడు ఉబ్బులింగడు.   నాట్యము ప్రారంభమైనది.మంచి నిష్ణాతురాలేమో ఆ నర్తకి,మంత్రించివేసిందిచూస్తున్నవారిని.    ముగ్ధగా ఒకసారి క్రీగంట చూస్తున్నది.మరుక్షణమే విరహోత్కంఠగా విచారదృక్కులను విసురుతున్నది.ఆలస్యమును క్షమించనంటు కన్నెర్ర చేస్తున్నది.సమీపిస్తున్న నాధుని సరసిజేక్షణ స్వాగతిస్తూ సౌరభములను వెదజల్లుతున్నది.    అందరిని బహిర్ముఖులను చేస్తూ తెరజారినది.   కాని సాధకునికి నర్తకిస్థానములో రుద్రుడు వేదికమీదనర్తిస్తున్నాడు.నివ్వెరపరుస్తున్నాడు.  " కన్నార కననీయుమా శివా-కన్నార కననీయుమా    చెన్నుమీరెడి కళల చిన్మయపు రూపము    కమనీయమైన నీ ఘనతేజము    కన్నార కననీయరా...

MEEDHUSHTAMA SIVATAMA-25

Image
   మీఢుష్టమ శీతమ-25  *******************   శివుడొక్కడే తలపు-శివుడొక్కడే పలుకు   శివుడె సర్వము మాకు చిత్తమంతయు శివుడె.       మనశ్చమే-చక్షుశ్చమే-శ్రోత్రంచమే అని ఆలయములో నుండి చమకము చెవులలో పడుతోంది సాధకుని.అలిసిపోయిన శరీరమో అది అలసత్వముతో నిండినదో కాని లేవాలనిపించటములేదు.చమక స్తోత్రము కొనసాగుతోంది .  " చక్షుః యజ్ఞేన కల్పతాం" అంటు, తట్టిలేపేసింది ఇట్టే.    అగ్నా-విష్ణో సజోష సేమా వర్ధంతు వాంగిరః" అని అభ్యర్థించి,వారిదయచే,   కన్నులతో చూడగలుగుచూ,,చెవులతో వినగలుగు  భక్తాగ్రేసరులు                                    . అదేచమకములో,  చక్షుః యజ్ఞేన కల్పతాం- అని అంటున్నారు.   యజ్ఞము వలన కన్నులు సమర్థవంతములగుతాయని అంటున్నారు.అవి వినగానే సాధకుని నిద్రమత్తు తనతో పాటు స్థిమితమును కూడా వెంట తీసుకెళ్ళీపోయింది.     రుద్రుడు వెళ్ళిపోవడానికి సిధ్ధమవుతున్నాడు.   సాధకుని చూస్తూ,నిన్న పూజ చాలా దివ్యముగా జరిగింది.మీ అందరు మీ బంధుమిత్రుల...

MEEDHUSHTAMA SIVATAMA-24

Image
   మీఢుష్టమ శివతమ-24   ***********************    మనసున మసలుము సదాశివా    మాయాతీత మహాదేవ నా    మనసున మసలుము సదాశివా.    ఏమిటీ వేళాకోళం రుద్రా.  మల్లయ్యను పిలువమంటే,మల్లయ్యతో,  మీరు శ్రమపడి రావద్దు.మీదగ్గరున్న కరంటును తెప్పించే శక్తిని మాత్రమే రమ్మన్నావు. వాడు రాలేదు.చీకటి పోలేదు.   విషయము అర్థమవ్వటములేదు నీకు.ఎవరిని పిలవాలో,ఎలా పిలవాలో, ఎలా పనులు చేయించుకోవాలో తెలియనట్లుంది నీకు అన్నాడు సాధకుడు చిరాకుగా.   అంతలోనే నాన్నా! తలుపు రెక్క విరిగింది.మూయటానికి రావటములేదు అంటూ వచ్చాడు పదేళ్ళ కొడుకు.  ఈసారైనా మర్యాదగా వచ్చి తలుపు బిగించివెళ్ళమని వడ్రంగికి చెప్పు.వాడిపేరు కూడా మల్లన్నే.     రుద్రుడు,   అసలేమి జరగనట్లు ఫోను తీసుకుని చేసాడు.కలిసింది.  అయ్యా ఇవతల రుద్రుడు మాట్లాడుతున్నాడు.అవతల మీరు.? .నా  పేరు మల్లన్న.వడ్రంగిని.  సాధకుని గారింట్లో తలుపురెక్క విరిగింది.మీరు మాత్రమే..నేను మళ్ళీ చెబుతున్నాను  వినండి.సామానులు-సంచీలు వద్దు.మీరు మాత్రమే వచ్చి తలుపు బిగించి వెళ్ళండి అన్నా...

MEEDHUSHTAMA SIVATAMA-23

    మీఢుష్టమ శివతమ-23  ********************* ఈ రోజు నుండి పరమాత్మ బ్రహ్మశ్రీ సామవేదం వారి అమృతగుళికలతో మనలను ఆశీర్వదిస్తారు.  వారికి సభక్తిపూర్వక నమస్కారములు.  "హరిహరులకు ప్రియమైనది కార్తికమాసం  సరిలేని వ్రతపూజలు సలుపుటకవకాశం."   శ్రీ ఆకెళ్ళ విభీషణశర్మగారికి నమస్కారములతో.     రుద్రా! రేపు పూజచేసుకోవాలంటు ఇంట్లో ఒకటే పోరు.తప్పించుకోలేని హోరు.నేను పూజను పీటలమీదనుండి లేవకుండ కూర్చుని ముగించాలంట.పిల్లలు నిర్వహిస్తారన్న నమ్మకం లేదు.    పోనీ మానేద్దాం అంటే నాభార్య ససేమిరా వీల్లేదంటున్నది.ఏమి చేయాలో పాలుపోవటంలేదు అనగానే,   పాలుపంచుకోవటానికి నేనున్నానుగా సాధకా! ఇంకెందుకు దిగులు అన్నాడు   అసలది ఈశ్వర సంకల్పమేకదా సంకల్ప-వికల్పములను తొలగించుటకు జరుపబోవుచున్నది-జరుపుచున్నది.   రుద్రా! పీటలు.  రుద్రా!దీపములు.  రుద్రా! గంగాజలము.  రుద్రా! పుష్పములు.  రుద్రా! పంచామృతములు.  రుద్రా ఇది.రుద్రా అది  .రుద్రా! రుద్రా! రుద్రా!..చిరునవ్వుతో అందిస్తున్నాడు రుద్రుడు   " అనుక్షణము శివనామమే అనుచు శివుని కానరే ...