Posts

ALO REMBAAVAI-05

Image
 ఐదవ పాశురం *************** మాయనై మన్ను వడమదురై మైందనై తుయపెరునీర్ యమునై యరైవరై ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్.  ఓం నమో భగవతే వాసుదేవాయ.    ఎంపావాయై - మన వ్రతములో ఈ రోజు,    మనము దామోదరుని దగ్గరనుండి ఒక వరమును అడిగి అనుగ్రహించమని గట్టిగానే అడుగుదాము అంటున్నది గోదమ్మ గోపికలతో.  ఈ పాశురములో గోపికల వాక్చాతుర్యము-త్రికరణశుధ్ధి-గడుసుదనము కలగలిసి స్వామినే సెప్పు-గట్టిగా చెప్పు అని అడుగుతున్నవి.స్వామి వారికి ఏమని చెప్పాలో తెలుసుకొనే పయత్నమును చేద్దాము.     గోదమ్మ స్వామిని,  మైందనై-అని పిలుస్తున్నది.     బాహ్యమునకు ఓ బాలకా అని ధ్వనిస్తున్నప్పటికిని,  ఓ మూలమా/ ఓ పరబ్రహ్మమా/ ఓ నాయకా అని స్పష్టముగా ప్రతిధ్వనిస్తున్నది.   కనుకనే వెంటనే-మాయినై అని -స్వామి నీ యొక్క,  మన్ను-లీలా విభూతులు, వర్ణింపశక్యము  కానివి అంటున్నది.  ఏమి తెలియని వాడిలా...

ALO REMBAAVAI-04

Image
  నాల్గవ పాశురము ************* ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై  కరవేల్ ఆళియుల్  పుక్కు ముగందు కొడార్ త్తేరి ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్ ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్   నిన్రదిందు తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై  పోల్ వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై.  ఓం నమో భగవతే వాసుదేవాయ నమః *****************************    కణ్ణా! - ఓ శ్రీకృష్ణా!    నాం-గలం-మా అందరికి-గోపికా సమూహమునకు,       మళిందు-మహోత్సాహముతో,    మార్గళి నీరాడ-భగవత్గుణ వైభవమను యమునలో స్నానము చేయుటకు      (దయతో)   పెయిదిడాయ్-వర్షములను కురిపించుము.    అవి తడి-పొడి చినుకులు-అర-కొర వానలు,నీ ఔదార్యమునకు భంగమును కలిగించేవి కాకూడదు.   కనుక నీవు త్రేతాయుగములో శ్రీరాముడు ఏ విధముగా, తన,   శార్ఞ్గం -విల్లును ఎక్కుపెట్టి (శత్రువులపై)   ఉదైత్త-గురిచూసి కురిపించిన,   శరైమళై-బాణ వర్షము వంటి,   కుండపోత వర్షములను కురిపించుము.     ...

ALO REMBAAVAI-03

Image
 మూడవ పాశురం *************** ఓంగి ఉలిగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్ తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్ పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప తేంగాదే పుక్కిరుందు శీర్తములై పట్రి వాంగక్కుడం నిరక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్ నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.   ఓం నమో భగవతే వాసుదేవాయ.   నంబావైక్కు-మనము వ్రతమును   చ్చాత్తి-చేద్దాము.    దేనిని ముగించిన తరువాత?     నీరాడినాల్-యమునలో స్నానము చేసిన తరువాత.   ఏ విధముగా నోమును చేద్దాము అంటే,   అళంద-కొలిచిన. దేనిని కొలిచిన?   ఉలగం-లోకములను, ఏ విధముగా?   ఓంగి-తనకు తానే తనరూపమును విస్తరించుకొనిన,   ఉత్తమన్-పరమాత్మను,   పేర్పాడి-నామ సంకీర్తనముచేస్తుంటే,   గోదమ్మ నవవిధ భక్తులలోని నామసంకీర్తన ప్రాశస్త్యమును మనకు తెలియచేస్తున్నది.త్రేతా యుగములో రాముని కన్న రామనామము అత్యంత మహిమాన్వితమైనదని చాటాడుగా.    అద్భుతములు ఆవిష్కరింపబడుతాయి అంటున్నది గోదమ్మ-గోపకాంతలతో.  మొదటిది-    తీంగిన్ర...

ALO REMBAAVAI-02

Image
రెండవ పాశురము *************** వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్ పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి మై ఇట్టు ఎళుదోం మలరిట్టునాం ముడియోం శెయ్యదన్ శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం ఐయయుం పిచ్చైయుం ఆందనయుం కైకాట్టి ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్. తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో     కేళీరో-వినండి. ఎవరు వినాలి?    వైయత్తు వాళ్వీర్గాళ్-ప్రపంచములో నున్న జనులారా. ఏమి వినాలి?  పార్కడలుళ్-పాల కడలిలో    పైయెత్తు ఇన్రా-విలాసముగా పడుకొని ఉన్నవాడు. వాదే,   నాముం-మనలను, నం పావైక్కు-మనలను కరుణతో చూచేవాడు.                         వాడు,   పరమన్-పరమాత్మ. అంతేకాదు,కిరిశైగళ్ సెయ్యుం-మనలను రక్షించే పనులనే చేయువాడు.   వాడి,      అడిపాడి-పాదపద్మములను విడువద్దు.    మనము కొన్నింటిని పరిత్యజిద్దాము.మరి కొన్నింటిని పరిగ్రహిద్దాము.   మొదటగా     పరిత్యజించ  వలసిన వాటి గురించి,  నెయ...

ALO REMBAAVAI-01

Image
  ఓం నమో నారాయణాయ.   *****************  ద్రవిడ సంప్రదాయము పరమాత్మను గుర్తిస్తూ-కీర్తిస్తూ-తరిస్తూ-తరింపచేసే సాహిత్య గాన ప్రక్రియను పాశురముగా పరిగణిస్తారు.     పన్నెండు మంది ఆళ్వారులు అనుభవించి,అందించిన పాశురముల సమాహారమును నాలాయిరం అని కీర్తిస్తారు.     ద్వాదశాళ్వారులలో పరమ పునీత ఆండాళ్ తల్లి అవ్యాజకరుణతో అనుగ్రహించినది ఈ ముప్పది పాశురముల ముక్తిమాలిక.       ఇంకొక విషయము ఏమిటంటే పరమాత్మ యొక్కడేపురుషుడు.మనమందరము జీవులము.  అమ్మ దయతో పరమాత్మ తత్త్వమును అర్థముచేసుకుంటూ, ఆచరిస్తూ,ఆస్వాదిస్తూ,అనుభవిస్తూ, అడుగులను కదుపుదాము.        ఏలో రెంబావై-01      *****************    మొదటి పాశురం. ***************  "మార్గళిత్తింగళ్ మది నిరైంద నన్నాళాల్   నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్   శీర్మల్లుం ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్కాళ్   కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపన్ కుమరన్   ఏరారంద కణ్ణి యశోదై ఇళం సింగం   కార్మేని చ్చెంగణ్ కదిర్ మదియంపోల్   ముగత్తాన్  ...

ALO REMBAAVAI-INTRODUCTION.

Image
      ఏలో రెంబావై-         వ్రతమునకు రండు.   *************************  శ్రీగోదాం అనన్య శరణం శరణం ప్రపద్యే ********************************* " శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే". శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారము "ఆళ్వారులు" అనగా దైవభక్తిలో అనవరతము మునిగియున్న జ్ఞానగనులు/ఘనులు.              .బధ్ధజీవులను తమతో పాటు తిప్పుకొనుచు,భగవత్తత్త్వము అను సముద్రములో అనవరతము మునకలను వేయిస్తు,ప్రకృతిలోని ప్రతివస్తువులోను-ప్రతిచర్య లోను పరమాత్మను దర్శింపచేస్తూ,బ్రహ్మానందమును చేర్చువారు.మార్గదర్శకులుగా సామాన్యుల వలె కనిపిస్తూ సర్వమును అర్థముచేయించగల దైవాంశ సంభూతులు.దివ్య నమస్కారములు . " భూతం నరస్య మహదహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భకాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం." ఆళ్వారులులలో ఒకరైన ఆండాళ్ తల్లి (సాక్షాత్తు భూదేవియే) తనను తాను ఒక సామాన్య గోపిక వలె భావించుకొని,వివిధ స్వభా...

MEEDHUSHTAMA SIVATAMA-30

Image
    మీఢుష్టమ శివతమ-30  ************************     " ఓం"      హంస హంస పరమహంస సోహం      హంసః సోహం హంసః      హంస హంసాయ విద్మహే      పరమ హంసాయ ధీమతి--      తన్నో రుద్రః ప్రచోదయాత్.   శబ్దము-శివము మమేకమవుతున్న మంగళవాచకము.  ఇంతకాలం సాధకుడు రుద్రుడు పరస్పరము ఆడుకున్నారు దాగుడుమూతలు.అవునన్నాడు-కాదన్నాడు-అవునేమో అన్నాడు-నిందించాడు.స్పందించాడు సాధకుడు.  ప్రశ్నించాడు.పరిచర్యలు చేసాడు.పశ్చాత్తాపపడేట్లు చేసాడు. పరమావధిని చూపిస్తున్నాడు.రుద్రుడు    ఎంతటి భాగ్యశాలి ఆ సాధకుడు.   రుద్రుని అనుగ్రహముతో ,రుద్రుని ఎదురుగా కూర్చుని,రుద్రుని అర్చించుటకు-అభిషేకించుటకు-అగ్నికార్యమును సలుపుటకు,అఖిలమై పోవుటకు,ఆత్మసాక్షాత్కారమును పొందుతకు, తనలో దాగిన రుద్రశక్తిని  ప్రచోదనము చేయమని,మహన్యాసము చేస్తున్నాడు. అది అర్హతయో/అధికారమో/అనుగ్రహమో వారికే తెలియాలి.  ఓం నమో భగవతే రుద్రాయ.   మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం.   మహా పాపహరం వందే మకారాయ నమో నమః.    తనూశ్చమే-వ...