Posts

TIRUVEMBAVAY-30

Image
      తిరువెంబావాయ్-30  *************   బువనయిర్ పోయ్ ప్పెర వామైయిన్ నాళాం   పోక్కుకిన్రోం అవమే ఇంద బూమి బూమి   శివన్ ఉయ్యర్ కొల్కిన్ర వారెన్రు నోక్కిత్   తిరుపెరుం తురైయురై వాయ్ తిరుమాలాం   అవన్ విరుప్ పెయిదవుం మలర్వన ఆశై   పాడవుం ఇన్ అలర్దామయె కరుణయు నీయుం   అవనియర్ పుగుందెమ్మై ఆట్కోళ్ళ వల్లాయ్   ఆరముదే  పళ్ళి ఎరుందరుళాయ్  పరంజ్యోతియే పోట్రి  *********************   మహాదేవుని సాన్నిధ్యమును పొందుటకు మానవజన్మను మించిన మార్గములేదని తెలుసుకున్నాము.దీనిని వ్యర్థము చేయకుండా.ఆరముదే-అసలైన పరమార్థమునకు పాదదాసులమగుదాము.బ్రహ్మ-విష్ణులకు సైతము లభించలేని భాగ్యమును మనకందించుటకై స్వామి పెరుంతురైకు విచ్చేసి కరుణామృత వర్షముతో మనలను అనుగ్రహించుచున్నాడు.దేవతలు సైతము స్వామిని సేవించుకొనుటకు   భూలోకమునకు పయనమగుచున్నారు.తరలి రండి స్వామి సేవకు.తరించండి స్వామి కృపాకటాక్షములో.  తిరు అవుడియార్ అరుళ ఇది  యోగాంబ తిరువడిగలే పోట్రి.    ప్రియ మిత్రులారా! మీరందించినప్రోత్సాహమే "తిరువెంబాయ్" అను దివ్య స్తోత్ర...

TIRUVEMBAVAY -29

Image
   తిరువెంబావాయ్-29  ****************  విణ్ణక తేవరు నన్నవు మాట్టా  విళుప్పొరుళె ఉన్ తొళుంబు అడియోగళ్  మణ్ణగ తేవందు వాళచేదోనే  వం తిరు పెరుంతురై యాయ్ వళి అడియోం  కణ్ణగ తేనిన్రు కళిదరు తేనే  కడలముదే కరుంబే విరంబు అడియాల్  ఎణ్ణగతాయె ఉలగిత్తు  ఉయిరాయ్  ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె.  పరంపర శివానుగ్రహదాయా పోట్రి  ******************************  తిరుమాణిక్యవాచగరు,  1. కనులారా స్వామిని దర్శించారు.  2.నోరారా స్వామిని కీర్తించారు.  3.మనసారా స్వామిని అర్చించారు.  వారి స్మరణమే శుభప్రదము.వారి ఔన్నత్యమును ఈ పాశురము చెప్పకనే చెబుతుంది.  మనముఇప్పుడు స్వామి సంస్మరణా సౌభాగ్యవంతులమగుటకు మూలకారణము తిరు మాణిక్యవాచగరే.వారు స్వామిని ప్రసన్నులు చేసుకొని,సమర్పించిన సవినయ విన్నపమే.   1.కణ్ణగతే నిన్రు కళిదరో తేనే,    కన్నుల పండుగగా నేను నీ దర్శన సౌభాగ్యమును ఆస్వాదించగలుగుతున్నాను.     2.చేదోనేవం,   మా మీది అనుగ్రహముతో తిరుపెరుంతురైకు విచ్చేసి,మీ దివ్యపాదసేవా భాగ్యమును అందించిన,  ...

TIRUVEMBAVAY-28

Image
    తిరువెంబావాయ్-28  ************** ముందియ ముదలనాడ్ ఇరుదియుం మాణా మూవరం అరికిలార్ యువర్మట్రు అరివార్ పందనై విరిళియుం నీయుం  నిన్ అడియార్ పలంకుడి తోరుమెళుందు అళురియ పరనే శెందలై పురైతిరు మేనియుం కాట్టి తిరుపెరుం తురైయురై కోయిల కాట్టి  అందణున్ అవదుం కాట్టివందు ఆండాయ్  ఆరముదె పళ్ళి ఎళుందళురాయె.  అశ్వనాథ/గుదుర స్వామియే పోట్రి  ***************************  ఎంతటి అద్భుతమీ అనుగ్రహ పాశురము.స్వామికి మనమీదకల అవ్యాజకరుణా ప్రకటనమును తిరుమాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు.    స్వామి కుడిపార్శ్వమై-ఎడమపార్శ్వముగా భూగోలములతో బంతులాడు భవానితో కన్నుల పండుగ గా కనిపించుచున్నారు.    "పందనై విరళియుం" స్వామి నీవు నీ పరివారముతో,మా పూర్వపుణ్యఫలమేమో కాని మాముందు సాక్షాత్కరించి,మమ్ములను ఆశీరదించుచున్నావు.  స్వామి నీవు,  ముందల ముదల్నాడ్-ఆదివి.అంతేకాదు,  ఇరుడియాం-ఇప్పుడు నీవే.  భూతకాలము-వర్తమాన కాలము-భవిష్యత్తు మూడును నీవైన కాలపురుషుడివి.అంతేకాదు, మూవరుం-త్రిమూర్తులు నీ ఉనికిని గుర్తించలేకపోయి,నీ పాద దాసులుగా శరణు జొచ్చిరి.  స...

TIRUVEMBAVAY-27

Image
      తిరువెంబావాయ్-27   *****************  అదుపళ చువయన అముదెన అరిదర్కు  అరిదెన ఎళిదెన అమరరుం అరియార్  ఇదు అవన్ తిరువురు ఇవర్ అవన్ ఎనవే  ఎంగళై ఆండుకొండు ఇంగెళుందు  అరుళుం  మధువళల్పొళి     తిరుఉత్తరకోశ   ముగైయుల్ ఉళ్ళాయ్ తిరప్ పెరుంతురై మన్నర్  ఎదుఎమ్మై పణికుళం మారదుకేట్పం  ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందళురాయ్.  మధువన విరాజితాయ పోట్రి  **********************   తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో స్వామి అనుగ్రహము ఏ విధముగా మనచే ఆస్వాదింపబడుతున్నదో ఆత్మీయముగా ఆవిష్కరించారు.   స్వామి నామ-రూప-గుణ వైభవాస్వాదనము మూడు మధురపదార్థములను గ్రోలుటతో పోల్చినారు.అవి,  మొదటిది, 1.అదుపళ అరిదర్కు,  పండ్ల మాధుర్యమును ఆస్వాదించినట్లు.  ఇక్కడ మనకొక భక్తుని భావప్రకటనము అనిపిస్తుంది.  కంచర్ల గోపన్న శ్రీనామ స్మరణమును ఆస్వాదిస్తు అన్న పలుకులు అవి.  శ్రీ రామ నీనామమేమి రుచిరా  ఓ రామ నీనామ మెంత రుచిరా అంటు,   కదలీ-ఖర్జూరాది ఫలములకధికమౌ కమ్మన,  అయిన సంతృప్తిగా అనిపించక,   ...

TIRUVEMBAVAY-26

Image
        తిరువెంబావాయ్-26   *****************  పప్పర విట్టిరుం దుణరుం నిన్ అడియార్  పందనై వందరు దా అవరుం పలరుం  మైపురు కణ్ణియ మానుడత్తి    ఇయల్బి  వణంగు కిరార్ అనంగిన్ మణవాళా  శెప్పొరు కమలంగళ్ మలరుందన్ వయల్శూల్  తిరుపెరుం తురైయురై శివపెరుమానే  ఇప్పిరప్ప అరుందెమ్మై ఆండరుపురియుం  ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందళురాయ్.   గిరిజాసమేత మహాదేవాయపోట్రి   *******************************  గౌరి కళ్యాణ వైభోగమే-మహదేవ కళ్యాణ సౌభాగ్యమే,  తిరు మాణిక్యవాచగరు మనకు ఈ పాశురములోశివ-శక్తుల పరిణయము-శుభకరపరిణామములను నర్మగర్భముగా తెలియచేస్తూ,అర్థనారీశ్వర తత్త్వ పరమార్థమును ప్రస్తుతిస్తున్నారు.  నమః పార్వతీ పతియే హరహర మహాదేవ శంభో.  స్వామి మీరు మా మైపురు కణ్ణియ-లేడికన్నుల వంటి కన్నులు కలిగిన పార్వతీదేవికి,  మానుదత్తి ఇయల్బి-తగిన వరుడు.  ఇది నిస్సందేహము.  ఈ సందర్భములో మనకు పోతన మహాకవిదర్శించిన,  "తగునీచక్రి విదర్భరాజ సుతకున్   తథ్యంబు వైదర్భియున్ తగు నీ చక్రికి"  మన మాణిక్యవాచగరు గిరిజ-గిరీశ...

TIRUVEMBAVAY-25

Image
     తిరువెంబావాయ్-25 ***************** పూదంగల్ దోరుం  ఎన్రాయిన్ అల్లాల్ పోక్కిలన్ వరవిలన్ ఎననినై పులవోర్ గీదంగళ్ పాడోదల్ అడుదల్ అల్లాల్ కేట్టరియో ఉన్నై కణ్దరి వారై   శీదనంకోల్ వయిల్ తిరువ్ పెరుంతురై మన్నార్ శిందనక్క అరియాయ్  యేంగన్ మున్ వందు ఏదంగళ్ అరుత్తు ఎమ్మై  ఆండరు పురియుం ఎంపెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె   పంచభూత/సర్వభూత స్వరూపా పోట్రి   ********************************  వ్యూహ-అర్చా మూర్తి తత్త్వమును ఈ పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు అందించుచున్నారు.  1.పోక్కిలన్ వరవిలన్ ఎననినై పులవోర్     స్వామి జగద్రక్షణ కోసము నీవు నిరాకార-సాకార స్థితులకు రాకపోకలు చేస్తావు.  స్వామి రాకపోకలు జరుపుతాడా? అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానమును విజ్ఞులు చెబుతారు.  నిరాకార-నిర్గుణ-నిరంజన-నిస్తుల-నిశ్చలస్థితి పరమాత్మ స్వస్వరూపము.  అయినప్పటికిని సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను జరుపుటకు స్వామి  సాకార-సద్గుణ-సమ్రక్షణ-అను గుణములతో-స్వప్రకాశ దివ్య మంగళ స్వరూపముతో మనలకు అందుబాటులోనికి వస్తు,ఆశీర్వదిస్తూ-అ...

TIRUVEMBAVAY-24

Image
    తిరువెంబావాయ్-24  *************   ఇన్నిశయ వీణయన్ యాళినర్ ఒరుపాల్   ఇరుక్కొదు తోత్తిరం ఇయంబినర్ ఒరుపాల్   తున్నియ పిణై మలర్ కయ్యనార్ ఒరుపాల్   తొళి కయ్యర్ అళుకయ్యర్ కువల్ కయ్యర్ ఒరుపాల్   చెన్నియ అంజలి కుప్పినార్ ఒరుపాల్   తిరుప్పెరున్ తురై యురై శివపెరుమానే  ఎన్నయు అండుకొండు ఇన్నరుళ్ పురియుం  ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె  అత్మనాథస్వామి తిరు వడిగలే పోట్రి  ***************************   తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో భగవదనుగ్రహము-భగవదారాధన,  ఏ విధముగా బహు ముఖములైభాసించుచున్నవో వివరించుచున్నారు.  భగవదనుగ్రహము ఆధారమైతే దానిని ఆలంబనము చేసుకొని అర్చించుచున్నభగవద్భక్తి ఆధేయము.  స్వామి, అండుంకొండుం-అనేకానేకములైన/అనేకవిధములైన/ఈ తీరుననే అని నిర్ణయించలేనిదైన,  నీ అనుగ్రహ ఆశీర్వచనము ఎన్ని విధములుగా ప్రకటింపబడుతున్నదో,  పురియం-నాకు పరిచయముకావింప బడుతున్నదో,పరమ సంతోషాంతరంగముతో నీకు నివేదిస్తాను. ఈ పక్క-ఒరుపాల్,ఆ పక్క అనికాదు.ఎటు పక్క చూసినను నీ అర్చనావిధానము,అతి రమణీయమై అలరారు చున్నది.  మొదటిది...