Posts

DHYAAYAT IPSITA SIDHDHAYAET-04

Image
  ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-04 ******************************  ఆలోచనలలో మునిగియున్న నన్ను మరొక సందేహము ముందర నిలిచి,సతమతము చేస్తున్నది నా దినచర్యను ఒక సిధ్ధాంతముగా మారుస్తు.  వాటి సంగతి సరే.మరి నా సంగతి ఏమిటి? నిన్న రాళ్ళ ఉప్పు పట్టుకుని వస్తున్నప్పుడు నా ఇంద్రియములైన కళ్ళు-స్పర్శ దానిని ఉప్పుగా గుర్తించి నాకు చెప్పినవి.తెచ్చి గిన్నెలో వేసి అవతలికి వెళ్ళానో లేదో తిరిగివచ్చేటప్పటికి నా కళ్ళు ఉప్పును చూడలేమంటున్నవి.నా స్పర్శ కూడా ఆ నీళ్ళలో ఉప్పు ఉన్నదో/లేదో తాను చెప్పలేనంటున్నది.అంతలో నా జిహ్వ నేను చెప్పగలను అంటు రుచి చూసి ఉప్పు నీళ్ళలో కలిసినదని చెప్పినది.దృష్టి-స్పర్శ తమ శక్తిని ప్రదర్శించినపుడు జిహ్వ తన ప్రభావమును దాచివేసినది. అవి నిస్సహాయములైనపుడు తన శక్తిని ప్రకటించి చేతనునకు తోడైనది.  నిన్న మామిడిపండు కూడా తన రంగుతో నా దృష్ని,సువాసనతో నా నాసికను చైతన్యవంతము చేసి,నేను దానిని తినుటకు తాము సహాయపడలేమన్నవి. అప్పుడు నాలుక తన చాకచక్యముతో అద్భుతరుచులను అనుభవములోనికి తెచ్చినది.  నాకు సహాయపడుటలోనే కాదు.ఇతరుల ప్రతిభను గుర్తించుటలో కూడ సమర్థవంతములు కావు.  కనుకనే వే...

DHYAYAET IPSITA SIDHDHAYAET-03

Image
   ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-03  ***************************  నన్ను వెంటాడుతు,నాతో ఆడుకుంటున్న ఆలోచనలను అర్థము చేసుకోవడము ఎలా?  పూలలోనికి రంగులు ఎందుకు/ఎలా వస్తున్నాయి? వచ్చినవి నిలవకుండ ఎందుకు వాడిపోతున్నాయి?   పూలకే కాదు పండ్లకు-సకలమునకు రంగురూపులను అందిస్తూ,వాటిని కొనసాగనీయకుండా హరించివేస్తున్నది ఎవరు?      పసికందుగా కదలలేని కాళ్ళు-అవయములు (కొందరిలో మాత్రమే) అద్భుత నాట్య భంగిమలను ప్రదర్శింపకలుగుతున్నవి.కాని కొంతకాలము మాత్రమే.గట్టిగా వస్తువును పట్టుకోలేని చేతులు పెద్ద పెద్ద బరువులను ఎత్తుతు బహుళజనాదరణను పొందుతు ప్రస్తుతింపబడుతున్నవి.అద్భుత చిత్రలేఖనమును,శిల్పకళా వైభవమును ఇలా ఎన్నెన్నో అద్భుతముకను అందించగలుగుతున్నాయి.ఒకరిలో కంఠము గొప్ప ప్రాభవమును (గానము-మిమిక్రి -గాత్ర దానము)ప్రదర్శించగలిగితే,మరొకరిలో వేరొక ఇంద్రియ పత్యేకత.అరవైనాలుగు కళల అద్భుతములు ప్రదర్శించు శక్తి వారికి కాలపరిమితిని నిర్దేశించి,ఆ తరువాత తాను వారిని వీడిపోతుందా?లేక వారే దానిని కూఇ యుండలేక పోతున్నారా?   క్రమముగా అభివృధ్ధిని చెందుతు క్షణక్షణముగా అవి ఎందుకు క్షీణిస్తున్న...

DHYAAYAET IPSITA SIDHDHAYAET-02

Image
   ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-02  ****************************   అలా ఆలోచనలతో తోటలోకి అడుగులు కదిపానో లేదో నా దృష్టి నిన్న నన్ను స్వాగతించిన గులాబీల మీద పడింది.  అంతే వేగముగా నన్ను అంతర్మథనములోనికి తోసివేసింది.   మొన్నటి రోజున అవి మొగ్గలు.అంతకు ముందు అవి చెట్టు లోపల ఎక్కడ దాగి ఉన్నాయో,వాటికి,వానిని దాచుకున్న ఆ గులాబీ మొక్కకే తెలియాలి.    నిన్న అరవిచ్చిన రేకులతో,విరబూసిన సోకులతో,రంగుల హంగును సింగారించుకొని,మురిసిపోతు విరిసినాయి.  ఎంతటి ఆస్వాదనీయము వాటి సౌందర్యము.  ఎంతటి ఆఘ్రాణనీయము వాటి పరిమళము.   ఒకేసారి తమ పరిపూర్ణతతో కన్నులను,పరిమళముతో మనసును ఆహ్లాదపరిచాయి.  ఇంతలోనే ఎంతమార్పు?    రేకులతో పాటు సోకులు నేలరాలినవి.  ఎక్కడికి పోయినది వాటి ప్రత్యేకతలైన రంగు-రూపు-పరిమళములతో కూడిన ఆకర్షణ?  మార్పుకు కారణమైన కూర్పును చేసినదెవరు?    వాటి అవస్థలను బట్టి లేత మొగ్గ,మొగ్గ,విసనమునకు సిధ్ధముగా నున్న మొగ్గ,అరవిరిసిన పువ్వు,వాడిన పువ్వు,నేలరాలిన పువ్వు గా నిర్మించి,నిర్ధారించినది ఏవరు?     వాటిని వాటికి ఇచ...

DHYAAYAET IPSITA SIDHDHAYAET-01

Image
  ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్  ********************   హోరెత్తిన సముద్రపు అలలవలె అరసెకను ఆగకుండ నాలో ఆలోచనలు జోరుమీద ఉన్నాయి.మనసును జారకున్నాయి.    ఎంత విచిత్రము ఈ మానవ ఉపాధి.నిత్య నిరంతర సంఘర్షణలతో  దొరకని స్థిమితమనే దరిచేరుకోవాలని ఉబలాటపడుతుంది.  చిన్ని బుడగ తల్లిగర్భములో ఎన్నో సంఘర్షనలను ఎదుర్కుంటు ఒక ఉపాధిని సంతరించుకొని,ఒక్క ఏడుపును మాత్రమే తనతో వెంటబెట్టుకుని ,చంటి పాపగా ఏదో సాధించేయాలని,ఎందరో తన ఉనికిని మెచ్చుకోవాలని ఉవ్విళ్ళూరుతు అమ్మ ఒడిని చేరుతుంది ఆశల రాశియై.  ఏమి చూసుకొని దానికంత ఉత్సాహము? వెన్నెముక నిలబడలేనంటుంది.పొరలతో కప్పియున్న కన్నులు.కదలలేని తనము.అన్నిటికి ఒకటేఆసరా.అదే ఏదుపు. ఎంత విచిత్రమీ సందర్భము.   ఎంత నిజమీ ఉపాధి సందిగ్ధము.    ఎవరు మంత్రము వేస్తారో కాలక్రమముగా ఇంద్రియములు స్వశక్తిని సంపాదించుకుంటున్నాయి.సర్వాంగ సుందరత్వమును సంతరించుకుంటుంది అదే ఉపాధి.దానితో పాటుగా సర్వ సమర్థత్వమును పొందాననుకుని సత్వగుణమును సద్దుమణగమంటుంది.అదీ ఒక తరలిపోయే తమాషా అని గమనించనీయదు తెరలుతెరలుగా కప్పుకొనియున్న తమోగుణము.  ఏముంది చివర...

DHYAAYAET IPSITA SIDHDHAYAET-01

Image
 

DHYAAYAET iPSITA SIDHDHAYAET-INTRODUCTION

Image
 ఓం నమః శివాయ  ******************  పరమేశ్వర నిర్హేతుక కృపాకటాక్ష తార్కాణమే నన్ను పరికరముగా మలచుకొని మనకు అందించ నున్న,  "ధ్యాయేత్ - ఈప్సిత సిధ్ధయేత్." అను శీర్షిక.  ఆద్యంతరహిత అనుగ్రహ విశేషమే ఈప్సితప్రదము.అది ధ్యాతకు ధ్యానముచే ప్రాప్తించుటమరొక విశేషము.  ఈప్సితము అనగా అభీష్టము-కోరిక.దాత-గ్రహీత,అభ్యర్థన-అనుగ్రహము,సాధన-సిధ్ధి అను రెండింటికిని వారధిగా నిలిచి,అనుసంధానమును చేస్తు,అనుగ్రహమును అందించుటలో ప్రధానమైనది ఈప్సితము.  ధ్యాత పరముగా ఆలోచిస్తే అది యుక్తాయుక్తములను కలిగియుండవచ్చును/లేకపోవచ్చును.అర్హమైనది కావచ్చును/కాకపోవచ్చును.ధ్యాతలు అనేకానేకములు.వారి ధ్యేయములు అనేకానేకములు.  కాని పరమాత్మ/పరతత్త్వము/అమృతత్త్వము,అనుగ్రహము ఒక్కటే.దానితో సమానమైనదియును/దానికన్న అధికమైనదియును లేనేలేదు.అదియే సర్వకాల ప్రామాణికము.కనుక ఈప్సితము పరమాత్మ అనుగ్రహమునకు నోచుకొనినదై యుండుట దాని సంస్కారము.  ఎప్పుడైతేజీవి తన అత్యంత స్వల్పత్వమును గ్రహించి,దానిని నిస్సంకోచముగా అత్యంత బృహత్తునకు సమర్పించగలుగు ప్రయత్నము మొదటిమెట్టు.దానిని పరమాత్మ వద్దకు చేర్చగలుగు శక్తియే మన నమ్మకమ...

TIRUVEMBAVAY-30

Image
      తిరువెంబావాయ్-30  *************   బువనయిర్ పోయ్ ప్పెర వామైయిన్ నాళాం   పోక్కుకిన్రోం అవమే ఇంద బూమి బూమి   శివన్ ఉయ్యర్ కొల్కిన్ర వారెన్రు నోక్కిత్   తిరుపెరుం తురైయురై వాయ్ తిరుమాలాం   అవన్ విరుప్ పెయిదవుం మలర్వన ఆశై   పాడవుం ఇన్ అలర్దామయె కరుణయు నీయుం   అవనియర్ పుగుందెమ్మై ఆట్కోళ్ళ వల్లాయ్   ఆరముదే  పళ్ళి ఎరుందరుళాయ్  పరంజ్యోతియే పోట్రి  *********************   మహాదేవుని సాన్నిధ్యమును పొందుటకు మానవజన్మను మించిన మార్గములేదని తెలుసుకున్నాము.దీనిని వ్యర్థము చేయకుండా.ఆరముదే-అసలైన పరమార్థమునకు పాదదాసులమగుదాము.బ్రహ్మ-విష్ణులకు సైతము లభించలేని భాగ్యమును మనకందించుటకై స్వామి పెరుంతురైకు విచ్చేసి కరుణామృత వర్షముతో మనలను అనుగ్రహించుచున్నాడు.దేవతలు సైతము స్వామిని సేవించుకొనుటకు   భూలోకమునకు పయనమగుచున్నారు.తరలి రండి స్వామి సేవకు.తరించండి స్వామి కృపాకటాక్షములో.  తిరు అవుడియార్ అరుళ ఇది  యోగాంబ తిరువడిగలే పోట్రి.    ప్రియ మిత్రులారా! మీరందించినప్రోత్సాహమే "తిరువెంబాయ్" అను దివ్య స్తోత్ర...