Posts

ANAYA NAYANAR

బ్రహ్మ మస్తకావళీ నిబధ్ధతే నమః శివాయ జిహ్మగేంద్ర కుండల ప్రసిధ్ధతే నమః శివాయ బ్రహ్మణే ప్రణీత వేద పధ్ధతే నమః శివాయ జిహ్మకాల దేహదత్త పధ్ధతే నమః శివాయ నమః శివాయ ఆదిశేషువే కుండలములైన వానికి దండాలు శివా ఆ కాలునే కాలదన్నినవానికి దండాలు శివా వేదములే శిరములైన వానికి దండాలు శివా వేదార్థములే తానైన వానికి దండాలు శివా. " ఆ నయ గో సం రక్షక" నాయనారు తిరుమంగళములో గోకులమున జన్మించెను.క్షత్ర వాసన ఏమో వేణుగానముతో పున్నమి వెన్నెల నిండిన బిల్వనంబున సామవేదేశ్వర నాదార్చనముతో సకలజగములలో సుఖశాంతులను నెలకొల్పినాడు. నామరూప భేదమేకాని నాదార్చనలో లోపములేదు.మనోలయమొనరిచే మహాద్భుత మురళీగానము భక్తుని శబ్దమును భగవంతుని చెవికి చేరుస్తూపరవశిస్తున్నది.భగవత్ప్రసాదమైన ఊపిరిని భగవత్సేవకు కైంకర్యమొనరించుచు,కులవృత్తిని గౌరవించుచు , శిశుర్వేత్తి-పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అన్న నానుడిని నిజము చేస్తూ,గోవులు మేతమీద ధ్యాసను మరల్చుటలేదు.దూదలు తల్లిపాలకై పరుగులు తీయుట లేదు.ఉరుములు తమ నిశ్సబ్దములైనవి.వేడి గాలుల జాడ లేదు. ప్రకృతి సమస్తము ప్రశాంతముగా పరవశిస్తున్నది.పరమాత్మ తత్త్వము...

TIRUNEELAKANtHA NAYANAR.

వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ హేమ మేదినీ ధరేంద్ర చాపతే నమః శివాయ నామ మాత్ర దగ్ధ సర్వ పాపతే నమః శివాయ కామనైకతాన హృద్దురాపతే నమః శివాయ ఆశాపాశమునకు అందనివానికి దండాలు శివా ఆకాశము కేశములైన వానికి దండాలు శివా పర్వతమును విల్లుగ మలచిన వానికి దండాలు శివా పాపములు దహించు స్మరణనామికి దండాలు శివా చింతలు తీర్చే చిదంబరమున కుమ్మరి కులములో జన్మించినాడు తిరు నీలకంఠ నాయనారు.సారెతో కుండను మలచిన రీతితో,సాంబశివుని కృపతో తన నిండు జీవితమును సద్భక్తునిగా మలచుకొని సంతుష్టిని పొందుచుండెను. కాలము మాయాజాలమేమో కాని కామునికాల్చిన కామేశుడు వానిని కనికరించుటకు,వాని భక్తిని లోకవిదితము చేయుటకు వానినే పరికరముగా మలచి పంపాడు. శివభక్తులకు భిక్షాపాత్రలనొసగి పరవశించుటకు బదులు స్త్రీల కదగంటి చూపు భిక్షకై వేశ్యాగృహములకు తరలినాడు.కాని పనులు చేసినాడు.భార్య ముందు కాదనలేక పోయినాడు. అంతటితో ఆగలేదు ఆదిదేవుని పరీక్ష.ఆలించే తనను తాకిన నీలకంఠేశుని పై ఆన అని అభ్యంతరమును చెప్పించాడు. తప్పు తెలిసికొనిన నాయనారు తన భార్యను మాత్రమేకాదు,తక్కిన స్త్రీలను సైతము మాతృమూర్తులుగా భావిస్తూ,తాను బ్రహ్మ...

AMARANEEDI NAYANAR

ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమః శివాయ దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమః శివాయ సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమః శివాయ అష్టమూర్తయే వృషేంద్ర కేతవే నమః శివాయ ఋషివందిత ఋషభవాహనునకు దండాలు శివా ధర్మపు వంతెన సృష్టిరక్షకునకు దండాలు శివా దుష్టుల శిక్షించు ధూమకేతనునకు దండాలు శివా ఇష్టవస్తు ప్రదాత అష్టమూర్తికి దండాలు శివా. అశాశ్వత ఉపాధిని నడిపించుచున్న శాశ్వత /అమర శక్తివి నీవే అని పరమాత్మ తత్త్వమును తెలిసిన సార్థక నామధేయుడు అమరనీతి నాయనారు. వృత్తి-ప్రవృత్తులు విరుధ్ధములైనప్పటికిని ,వాటిని తన సంస్కారముతో సమర్థవంతములుగా మలచుకొనిన వాడు.పళైయర్ లో వైశ్యకులములో జన్మించిన అమరనీతి ఇహమునకు సంబంధించిన భోగలాలసను పెంపొందించు పట్టు వస్త్రములను.సువర్ణ-నవరత్నములను కులవృత్తిగా విక్రయించుచున్నప్పటికిని,బురద తాకని తామరవలె,వైరాగ్య సంపన్నుడై అత్యంత భక్తి శ్రధ్ధలతో నటరాజ భక్తులైన శివయోగులకు ,వైరాగ్య సంకేతమైన కౌపీనములను దానము చేయు దీక్షాపరుడిగా శివార్చనలను చేయుచుండెడి వాడు. తన సంపాదనతో శివభక్తుల వసతికై ఎన్నో మఠములను కట్టించాడు.పరవశిస్తూ శివభక్తుల పాదములను (పాద్యముతో) పరమేశులే అంటూ కడ...

-SEKKILAR-PERIYAKATHALU.

Image
ప్రియ శివస్వరూపులారా,నమస్కారములు. పాహిమాం హర హర మహాదేవ శంభో శంకర-పాహి-పాహి ************************************************************ పంచభూత సమమిళితము ప్రపంచము.నింగి-నేల-నిప్పు-నీరు-గాలి అను పంచభూతములు(ఐదు ప్రధానంసములు) పరోపకార ఫలితమే మన పర్యావరణము. చాంద్రమాన ప్రకారము చంద్రుడు కృత్తిక నక్షత్ర నివాసముచేయు మాసము కార్తిక మాసము.చంద్రునకు గల మరో పేరు సోముడు.పరమేశ్వరుని అర్థనారీశ్వర శక్తి ఉమ,తల్లి ఉమను కూడియున్న పరమేశ్వరుని సోముడు అని కీర్తిస్తారు. కార్తిక మాసములో పంచభూతములైన నింగి శరత్కాల వెన్నెలతో ఔషధములను అందించుచు ఆరోగ్య వంతులను చేస్తుంటుంది.నేల ఔషధులను ఉత్పత్తి చేస్తుంటుంది.నీరు వర్షపునీటిలోని ఔషధములను స్వీకరించి పరిశుభ్రమై పరిపుష్టినిచ్చుటకు సిద్ధముగా ఉంటుంది కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము కనుక నిప్పును సర్వరోగములను దహిస్తూ,సర్వజనుల శ్రేయస్సుకు కారణమవుతుంటుంది.గాలి పచ్చదనములోని ప్రాణవాయువును అందిస్తూ ప్రపంచ సౌభాగ్యమునకు ప్రధాన కారణముగా పనిచేస్తుంటుంది.కనుక ఈ మాసములో స్నానము,జపము,తపము,ఉపాసనము.దీపము,ధ్యానము,దానము సదాశివునికి సంతోషదాయకము.(మన లోపలి-బయటి ప్రపంచమునకు.) " న కా...

AMMA KAAMAAKSHI TAAYI-11

శ్రీ మాత్రే నమః ******************* ఎత్తనై జననం ఎడుత్తేనో తెరియాదు ఇబ్బూమి తన్నిలమ్మా ఇనియాకిలుం కృపై వైతెన్ని రక్షియుం ఇని జననం ఎడుత్తిదామల్ ముక్తితర వేణుమేన్ ఉన్నయో తొళుదునాన్ ముక్కాలం నంబినేనే మున్ను పిణం తోణాదా మణితరై పోలనీ ముళితిరుక్కదేయమ్మా వెట్రిపెర ఉన్మీదిల్ భక్తియాయ్ సొన్నకవి విరుత్తంగళ్ పడినుండ్రియుం విరుప్పముడ నీకేట్టి అళిదుడుం శెల్వత్తె విమలనార్ ఏసపోరార్ అత్తరిడ వాగత్తె విట్టువందెన్నరుం కురైగళై తీరునమ్మా అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. ****************** 11ఎన్నెన్ని జన్మలు నన్ను రాపాడినవో ఈ భూమిపై తెలియదమ్మా ఇప్పటికైనను మరుజన్మ లేకుండ నన్ను రక్షించవమ్మా ముక్తిదాయినివనుచు ముక్కాలములు నిన్ను భక్తితో కొలిచినానే ముందెన్నడు నిన్ను చూడలేదనుచు నను మందభాగ్యుని చేయకమ్మా భక్తులకు కామాక్షి విరుత్తానుగ్రహము సర్వతోముఖ విజయము ఒప్పుకొన నీకిట్టి బెట్టుసరి శర్వాణి విభుని విడి బ్రోవవమ్మా అక్షయంబైన నీ వీక్షణముతో మా ఆపదలుకడతేరునమ్మా అవ్యాజకరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ క...

amma kamakhi umaye-10

శ్రీ మాత్రే నమః ************** పారదని ఉళ్ళళవుం బాగియత్తోడెన్నై పాంగుడని రక్షిక్కవుం భక్తియాయ్ ఉన్ పాదం నిత్తము దరిశిత్త బాలరుక్కరుళ్ పురియవుం శీర్పెట్రిదేగతి శిరుపిడిగిలను గామ శెంగలియ అనుగామలం సేయనిడ బాగియం శెల్వంగళైతల్లి జయంపెట్రు వాళ్వి వరవుం పేర్పెట్ర కాలనై పిన్ తొడర ఒట్టామల్ పిరియమాయ్ కాతిదమ్మా పిరియమాయ్ ఉన్మీదు సిరియ నాళ్ సొన్నకవి పిళ్లైగళై పొరుదు రక్షి ఆరదనిల్ మనల్ కువిదు అరియపూజై సేత ఎన్నమ్మ ఏకాంబరి నీయే అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే , అమ్మ కామాక్షి ఉమయే . ******************* 10.తారకము నీవని నమ్మినట్టి నన్ను సరగున రక్షించవే భక్తితో నీపాద నిత్యదర్శనముల భాగ్యమే కడురమ్యము దేహదోషంబులను చెంతరానీయనను అభయహస్తము నీయుమా భక్తితో స్తుతియించు భాగ్యమ్ముతో పాటు జయములను వర్షించుమా యమునిపాశము నన్ను దరిచేరలేని కడుప్రేమతో బ్రోవవమ్మా పటుతరము కాని నా స్తుతిదోషమెంచక "చుట్టు శ్రీరామ రక్ష" సైకత మహదేవుని మనసార కొలిచిన మాతల్లి ఏకాంబరియు నీవే అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి...

AMMA KAAMAAKSHI UMAYE-09

శ్రీ మాత్రే నమః *************** ఎందనైపోలవే జననం ఎడుత్తోర్గల్ ఇంబమాయ్ వాళ్దిరిక్క యాన్ సెయిద పావమో ఇత్తనై వరుమయిల్ ఉన్నడియె తవిపదమ్మా ఉన్నయాయ్ తుళ ఎండు ఉరుదియాయ్ నంబినేన్ ఉన్ పాద సాక్షియాగ ఉన్న ఎడి వేరుతునై ఇని యూరయుం కాని ఉలగం తనిల్ నెందనెక్క పిన్న ఎండ్రెండ్రు నీ సొల్లామల్ ఎన్ వరుమయె పోకడిదు ఎన్నై రక్షి బూలోగం మెచ్చవే బాలమార్కండ పోల్ పిరియమాయ్ కాతిదమ్మా అన్నయె ఇన్ను మున్ అడియేనె రక్షిక్క అడ్డి సేయాదే అమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే, అమ్మ కామాక్షి ఉమయే. ********************* ఎందరో నావలె జన్మమెత్తిన గాని ఆనందమొసగినావే నా పూర్వ పాపమే తరుముతు వచ్చినది నీ చరణమె శరణమమ్మా నీవె నా అభయమని నెరనమ్మినానమ్మ నీ పాదమె సాక్షి కాగా నిన్ను మించినవారు వేరెవరు కనరారు ఎన్ని లోకములు గాలించినా సమయమిది కాదని నువు జాలమే చేసినచో దీనునికి రక్ష ఎవరు? భువనములు కీర్తించ బాలమార్కండేయుని బ్రతికించినట్లుగానే ఇప్పుడైనను వచ్చి నన్ను రక్షింపగ బెట్టు నీకేలనమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే, **************** పరిణితి చెంద...