Posts

MURUGA NAYANARU

మురుగ/మురుగర్ నాయనార్ ********* " యోపాం పుష్పం వేద - పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాం వా అపాం పుష్పం- పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద - యోపాం ఆయతనం వేద- ఆయతనవాం భవతి. మంత్రపుష్పము. పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నిండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే. ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే, " పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు. సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన పరమాత్మ మహాశక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సంహరణము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరావృతముచేయుచున్న అవ్యక్తమే పుష్పము...

KOTTALI NAYANAR

" అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః." చిదానందరూపా-కోట్టలి నాయనారు కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా శివునకు ధాన్య నివేదనము శ్రీకరమనుకొను కోట్టలి గుడులలో ధాన్యవితరణము సేవను సైన్యపు నెచ్చెలి నియమములోనె సదాశివుని సందర్శించును ఎల్లవేళల తనవారిని పంపమనె తాను ఊరిలో లేనివేళల శివ సంకల్పము ఏమో ధాన్యము వారి ఇంటను భోజనమాయెను వికలముచేసెను మనసును కోట్టలి హంతకుడాయెను తల్లి-తండ్రి-బంధువుల తప్పిదము సహించనిదాయెగ భక్తుని ఆగ్రహమే భవబంధ విముక్తుని చేయగ కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారము ఆత్మ నుండి ఆకాశము,ఆకాసము నుండి వాయువు,వాయువు నుండి అగ్ని,అగ్ని నుండి నీరు,నీటి నుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నము సంభవించినది కనుక " అన్నం పరబ్రహ్మ స్వరూపము" అంటారు. అన్న వైశిష్ట్యమును తెలుసుకొనిన కోట్టలి పరమ శివ భక్తుడుచోళదేశ సైన్యాధికారి యైన నాయనారు,ధాన్య నివేదనము-ధ్యాన నివేదనము అను రెండు పాదముల అడుగులత...

SOMASIRA NAYANAR

" జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ | సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే- చ్చండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ" చిదానందరూపా--సోమశిర నాయనారు *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా పావన సోమయజ్ఞమును పాయక చేసెడివాడు తిరువెంబూరులోని శివభక్తుడు సోమసి మార నాయనారు పురహితమును కోరువంశమున పుట్టిన బాపడు పరహితమును కోరు అనిశమును పూజను మానడు గురువని తలచెను సుందరారును,తిరువూరును చేరెను భుజియింపగ యాగ హవిస్సును శివునే కోరెను చండిక తోడుగ శివుడు చండాలుడిగ వచ్చెగా సదాశివుని కరుణను పొందగ సమానత్వమే కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక . యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము. ఒకసారి ఆది శంకరాచార్యులవారికి ఎదురైన పంచమ కులజుడు,వారిచే పవిత్ర మనీష పంచకమునే ప్రసాదింపచేసినాడ...

ERIPATTA NAAYANAARU

ఎరిపత్త నాయనారు *************** "నీరాట వనాటములకు బోరాటంబెట్టు కలిగె పురుషోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్". గజేంద్రమోక్షము. హరిగా ఒక అహంకారమును విడిచిన గజమును రక్షించుట-హరుని భక్తునిగా ఒక మత్త గజమును శిక్షించుట ,చిద్విలాసము కాక మరేమిటి? మన నాయనారుల జన్మనామము కన్నా వారి సత్కర్మ సంకేత నామములే సత్కీర్తిని పొందినవి. ఎరిపత్త అన్న పదమునకు ఒక నియమము/తీర్పు/విధానము అను అర్థమును తమిళభాష ప్రకారము మన నాయనారు, చేత ఒక గండ్రగొడ్డలిని పట్టుకుని,ఎక్కడైనా/ఎవరికైనా/ఎప్పుడైన /ఏదైనా శివపూజా నిర్వహణకు ఆటంకము కలిగించిన,తత్ క్షణమే తనదైన తీర్పుగా వారిని /శివాపరాధమును శిక్షించేవాడు. ఋతువులతో పాటుగా ,శివుని అనుమతులను సైతము ప్రకటిస్తూ కాలము జరుగుచున్నది.మదమునకు ఉదాహరణముగా చెప్పబడు కరి అన్నిరూపములు తానైన వాని కనుసన్నలలో నడచుటకు సిధ్ధమైనది ఎంతో మోదముతో. భక్తుని ఉధ్ధరించాలనే శివకామ మనోహరుని ఆనగా శివగామి ఆండార్ పూలునిండిన సజ్జతో నడుస్తున్నాడు ఆమోదముతో. ఇద్దరు స్వామి లీలా ప్రదర్శనమునకు పాత్రధారులు.ఒకరికి అది పూజాసమయము.మరొకరిక...

MURUGA NAYANAR

మురుగ/మురుగర్ నాయనార్ ************************ " యోపాం పుష్పం వేద - పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాం వా అపాం పుష్పం- పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద - యోపాం ఆయతనం వేద- ఆయతనవాం భవతి. మంత్రపుష్పము. పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నుండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే. ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే, " పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు. సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన పరమాత్మ మహాసక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సమ్హరనము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరా...

NESA NAYANAR

నేశ నాయనారు **** హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబుజనాభా హరి నీ నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా! (నృసింహకవి) పరమాత్మ యొక్క శబ్ద స్వరూపము నామము. హనుమ రామనామ మహిమ స్వామినే ఎదిరించినది.నామికి-నామమునకు కల అభేదమును వివరించినది.పిబరే రామ రసం అంటూ ఎందరినో రామనామామృతమును గ్రోలుతూ,ధన్యులను చేసినది.శివ నామమునకు కూడా జపించిన వారిని అనుగ్రహించుటలో ఏమీ మినహాయింపు లేదు అని తెలియచేసే అనుగ్రహవీక్షణమే , నేశనాయనారు దివ్య చరితము. " పంచాక్షరీ శివ వేదేన విభాతి నిత్యం రుద్రస్తయా స్పురతి తేన చతుర్థ కాండః కాండేన తేన యజురేవ విభాతి నిత్యం ఋక్సామమధ్య మణినాచ విభాంతి వేదాః" శివా నీనామమునకు స్థానమై ,రుద్రాధ్యాయముచే తైత్తరీయ సంహిత చతుర్థకాండము మహిమాన్వితముగా ప్రకాశించుచున్నది. నేశన్-నేతగాడు/ప్రభువు అని రెండు అర్థములను మనము కనుక అన్వయించుకుంటే, శివనేశ నాయనారు కర్ణాటక రాష్ట్రకంపిలి గ్రామములో జన్మించినప్పటికిని,బాల్యములోనే వారి కుటుంబము తమిళనాడులోని కురైనాడునకు వలస వెళ్ళినది. మగ్గముపై దారములను సర్దుతూ వస్త్రములను నేయుట వృత్తి. మ...

TIRU NAVUKKU ARASAR APPAAR NAAYANAAR

తిరునవుక్కు అరసర్ నాయనారు/అప్పార్ నాయనార్ **************************** "పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే" వైదిక ధర్మమునకు గ్లాని సంభవించుచున్నవేళ దానిని పునరుధ్ధరించుట్కు పరమాత్మ ప్రత్యేక నామరూపములతో ప్రకటితమవుతాడు అని తెలియచేస్తునది శ్రీమద్భగవద్గీత. నాయనారుకుగల మరో పేరు అప్పర్/తండ్రి. జ్ఞానసరస్వతీదేవి నాయనారును కాళిదాసును శ్యామలాదేవి అనుగ్రహించినట్లు బీజాక్షరములతో అనుగ్రహించినది కనుక, తిరు పవిత్రమైన నవుక్కు-మాటలకు అరసర్-అధిపతి. నామములకు అధిపతి కనుక నవుక్కు అరసర్ అనియు,నామములు పవిత్రమైనవి కనుక తిరు నవుక్కు అరసర్ గా నాయనారు కీర్తింపబడుతున్నాడు. కొన్నివర్గముల వారి అభిప్రాయము ప్రకారము రావణాసుర రుద్రవీణాగానమునకు సహాయము చేసిన వాగీశ్వర్ అను మునియే శాపవశమున నవుక్కు అరసర్ గా జన్మించాడని నమ్ముతారు. అప్పర్ని-అతని అక్కయైన తిలకవతిని వేదాధ్యన సంపన్నులను చేశారు వారి తండ్రి అప్పటి మతవిద్వేషములు చేయుచున్న మారణకాండలను దృష్టిలో నుంచుకొని.వేదధ్యయనందు తన పిల్లలకు ఆసక్తిని కలిగించారు.ఆకర్షితులను చేసారు.కాని, ...