Posts

PASURAMU-13

Image
తిరుచిట్రంబలం-పాశురం-13 ********************** పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదార్ అంగం కురుగినత్తార్ పిన్నుం అరవత్తార్ తంగళ్ మనం కళవు వార్వందు సార్ధనినాల్ ఎంగళ్ పిరాట్టియుం ఎం కోన్రుం సోర్నిశెయింగ పొంగు మడువీర్ పుగప్పొందు పాయిందు శంగం శిలంబ శిలంబు కలందార్ప కొంగకళపొంగ కుడైయుం పునల్పొంగాన్ పంగయుం పూం పునల్ పాయిండేలో రెంబావాయ్ ఘనాఘనసుందర పోట్రి ********************* తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో మన మానవనేత్రములు అతిసామాన్యముగా భావించే ప్రకృతి లోని కొలను ,కొలనులోని నీలికలువలు,కెందామరలు,పులుగు జంటలు,పాములు,మొదలగు వానిని కనుక మనము కొంచము లోతుగా పరిశీలిస్తేఅవి అన్నియును మనకు భగవత్స్వరూపమును -సద్గుణములను వర్ణించుచున్న ధన్యజీవులే. భలే భలే అందాలు సృష్టించావు అంటు మనము భగవంతుని కీర్తించవలసినదే. ప్రస్తుత పాశురములో జలరూపముగా స్వామి దర్శనమిస్తున్న మడుగు/పొయిగై , తరులు-గిరులు-విరులు-ఝరులు నిరతము నీ పాద ధ్యానమే- నిరతము నీ పాద గానమే అన్నట్లుగా, స్వామి పాదములను అర్చించుటకు మడుగులోని కార్మలరార్-నీలికలువలు,అందులోను పైంగుమళై-సుకుమారమైన న...

PASURAM-13

తిరుచిట్రంబలం-పాశురం-13 ********************** పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదార్ అంగం కురుగినత్తార్ పిన్నుం అరవత్తార్ తంగళ్ మనం కళౌ వార్వందు సార్ధనినాల్ ఎంగళ్ పిరాట్టియుం ఎం కోన్రుం సోర్నిశెయింగ పొంగు మడువీర్ పుగప్పొందు పాయిందు శంగం శిలంబ శిలంబు కలందార్ప కొంగకళపొంగ కుడైయుం పునల్పొంగాన్ పంగయుం పూం పునల్ పాయిండేలో రెంబావాయ్ ఘనాఘనసుందర పోట్రి ********************* తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో మన మానవనేత్రములు అతిసామాన్యముగా భావించే ప్రకృతి లోని కొలను ,కొలనులోని నీలికలువలు,కెందామరలు,పులుగు జంటలు,పాములు,మొదలగు వానిని కనుక మనము కొంచము లోతుగా పరిశీలితే అవి అన్నియును మనకు భగవ్త్స్వరూపమును-సద్గునములను వర్ణించుచున్న ధన్యజీవులే. భలే భలే అందాలు సృష్టించావు అంటు మనము భగవంతుని కీర్తించవలసినదే. ప్రస్తుత పాశురములో జలరూపముగా స్వామి దర్సనమిస్తున్న మడుగు/పొయిగై , తరులు-గిరులు-విరులు-ఝరులు నిరతము నీ పాద ధ్యానమే- నిరతము నీ పాద గానమే అన్నట్లుగా, స్వామి పాదములను అర్చించుటకు మడుగులోని కార్మలరార్-నీలికలువలు,అందులోను పైంగుమళై-సుకుమారమైన నీలిక...

PASURAM-12

Image
తిరుచిట్రంబలం-పాశురం-12 ************************ ఆర్తా పిరవి తుయిర్కెడ నామార్తాడుం తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం కూత్తం ఇవ్వానం కువలతుం ఎల్లోముం కాత్తు పడైత్తు కరందు విళయాడి వార్తయుం పేశి వలై శిలంబ వారళైగళ్ ఆర్పరవం సెయ్య అణుకుణల్ మేల్ వండార్ప పూత్తిగణుం పొయిగై కుడైదుడై యాన్ పొర్పాదం ఏత్తి ఇరుంచులై నీరాడేలో రెంబావాయ్ ***** ఆర్తా విషణ్ణా శిధిలాస్చ భీతా ఘోరేషుచ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఖః సుఖినో భవంతు భగవన్నామ సంకీర్తనమే భవరోగమును హరింపచేయగల ఔషధము.భవరాశి యనుగడ్డివాములను దహింపచేయగల అగ్నికనము.భవసాగరమును సులభముగా దాటింపగల నావ.భవతారకము. జీవులకు ఆర్తిని కలిగించుచున్న కలతలను పెంచుచున్న కష్టములను కనుక మనము గుర్తించగలిగితే అవి శ్రీ అదిసంకరులు భజగోవిందములో వచించినట్లు, పునరపి జననం-పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే పిరవి-తిరిగి తిరిగి, తుయిర్ కెడ-బాధలలో మునిగి సంసారమనే జలధిలో బంధములనే మొసలిచే పట్తుకొనబడి,దానిని విడిపించుకొనలేక/చేతకాక మనలను...

PAASURAMU-11

Image
తిరుచిట్రంబలం-పాశురం-11 *********************** ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్ పాడి అయ్యా వళి అడియో వాళ్దోంకాణ్ ఆరళ్ పోర్ శయ్యా వెణ్ణిరాడి శెల్వా శిరు మరుంగుల్ మయ్యార్ తడంగన్ మడందై మణవాలా అయ్యా నీరాట్కొండ అరుళుం విడయాట్రిన్ ఉయివార్గళ్ ఉయ్యాం వగయెల్లాం ఉయందోళిదోం ఎయ్యామల్ కాప్పై ఎమై ఏలో రెంబావాయ్ తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో పుణ్యతీర్థ స్నానము మహిమ గురించి కీర్తిస్తున్నారు. " అపవిత్రో పవిత్రావ సర్వస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం సః బాహ్య-అభ్యంతరః శుచిః" వశిష్ట ముని జనక మహారాజునకు చెప్పిన విధముగా సర్వదేవతాశక్తులును సత్వగుణసోభను సంతరించుకొని ద్రవరూపమై జలావాసమును చేయుచున్న సమయమున జీవుని పాప-పుణ్యములతో సంబంధములేక వేసిన మునక కల్మహములను హరించివేసి,సన్మార్గమును చూపి,సద్గతిని ప్రసాదిస్తుందని ఆర్యోక్తి. ప్రస్తుత పాశురములో వెణ్ణిరాడై ప్రాభవము ప్రస్తుతింపబడుచున్నది. వెణ్-తెల్లని నీర్-ఆడి-జలములో స్నానముచేసి శెల్వన్-ఐశ్వ్ర్య వంతులైన వారిని చెబుతున్నారు. తెల్లని జలములో స్నానము చేసి భగవంతుడు-భక...

PASURAM-10

Image
తిరువెంబావాయ్-10 ***************** పాదాళం ఏళినుంకేళ్ శొర్కళియు పాదమలర్ పోదార్ పునైముడియం ఎల్లా పొరుల్ ముడివే పేదై ఒరుప్పాల్ తిరుమేని ఒన్రల్లన్ వేదముదల్ విణ్ణోరం మణ్ణుం తుదితాళం ఓద ఉళవ ఒరుతోళన్ తొండరుళున్ కోదిల్ కులత్తరంతన్ కోయిర్ పిణ్పిళ్ళైగళ్ ఏదవన్ ఊర్ ఏదవన్ పేర్ ఉట్రార్ అయళార్ ఏదవనై పాడుం పరిశేలో రెంబావాయ్. విశ్వరూపాయ పోట్రి *************** ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్పురత్ జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపాన్ ధ్యాయేత్ ఈప్సితసిధ్ధయే ధృవపదం విప్రోభిషించే శివం. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా పోట్రి ****************************************** ప్రస్తుత పాశురములో తిరు మాణిక్యవాచగరు స్వామిని,బహువిధములుగా దర్శించి ప్రస్తుతిస్తున్నారు. స్వామి వేదస్వరూపుడు. వేదమేక గుణం జస్త్వా తదహ్నైవ విశుధ్ధ్యతే వేదం అంటే నాదం.దీనినే వేదం అణువణువున నాదం అంటు భక్తులు కీర్తిస్తారు స్వామిని.అంటే స్వామి శబ్దము ద్వారా ప్రకటింపబడుతున్నాడు/ప్రస్తుతింపబడుతున్నాడు/ప్రసన్నమగుతున్నాడు. స్వా...

PAASURAM-09

Image
తిరుచిట్రంబలం-పాశురం-09 *************************** తిరువెంబావాయ్-09 ************ మున్నై పళం పొరుక్కుం మున్నై పళం పొరుళై పిన్నై పుదుమైక్కుం పేత్తుం ప్పెట్రియెనె ఉన్నై పిరానాగ పెట్రవుం శీరడియో ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపాంగావో అణ్ణవరె ఎణకణవర్ ఆవార్ అవర ఉగందు శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్ ఎన్న కురయుం ఇలో మేలోరెంబావాయ్ ఉన్నడియార్ తొళుంబాయ్ పోట్రి ************************* భాగవత సేవా ప్రీత్యాయా పోట్రి తిరుమాణిక్యవాచగర్ భగవదనుగ్రహమును పొందుటకు సులభమార్గమును ప్రస్తుత పాశురములో మనకు అనుగ్రహించుచున్నారు . ఎనిమిదవ పాశురము వరకు నిదురించుచున్న చెలులను మేల్కొలుపుతున్నట్లుగా బాహ్యమునకు /చేతనవంతులుగా మార్చుటకు ఆంతర్యములో జరిగిన ప్రయత్నమును వివరించినారు. ప్రస్తుత పాశురములో శివనోమునకు సిధ్ధపడుచున్న చెలులు తమోనిద్రను వీ డి జాగరూకులుగా నున్నవారే. భగవదనుగ్రహమును భక్తితో పొందగోరుచున్నవారే. దానికి కావలిసిన /చేయవలసిన కార్యాచరణమును అన్వేషించుచున్నవారే.. " శ్రవణం కీర్తనం విష్...

PASURAMU-08

Image
తిరుచిట్రంబలం-పాశురం-08 **************************** తిరువెంబావాయ్-008 ****************** కోళి శిలంబ చిలంబుం కురుగెంగు ఎళిలియంబ ఇయంబువేన్ శణ్గెంగుం కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై కేళిల్ విళుప్పోరుల్కళ్ పాడినో కేట్టిలైయో వాళియదెన్న ఉరక్కుమో వాయ్ తిరవాయ్ ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై ఏలై పంగళనయే పాడేరేలొ రెంబావాయ్. ప్రళయ సాక్షియే పోట్రి అర్థనారీశ్వరయే పోట్రి *************** తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో ప్రళయసాక్షిగా నున్న ఒకే ఒకడుగా మిగిలిన పరమాత్మ గుఇంచి ప్రస్తావిస్తూనే,మనలను చైతన్యవంతులుగా మలుచుతకు సులభమైన ఉదాహరనలతో, " అజాయ మాన బహుధా విజాయతే" అన్న సూక్తిని ప్రవేశపెట్టి నిద్వందమైన -ఒరువన్ ఒక్కటిగా గల పరమాద్భుతమును ముందు ద్వంద్వములుగా మనకు పరిచయము చేసినారు. ఇప్పటివరకు నిదురించుచున్న చెలులను మేల్కొలుపునపుడు ఉషోదయమును గురించి ప్రస్తావించలేదు. కాని ప్రస్తుత పాశురములో మన్ము వాటికన్న ఎంతో గొప్పవాళ్లమనుకొనే భావనలో నున్న మనలను చైతన్యపరచుటకు, కోళి శిలంబ-తెల్లవారుచున్నదన్న విషయమును తెల్లబరచుటకై కోడి కూయుచున్నది అని స...