Posts

PASURAM-16

Image
నూతన సంవత్సర శుభాకాంక్షలు ------------------------------ తిరు చిట్రంబలం-పాశురం-16 ************************** మున్ ఇక్కడలి చురుక్కి ఎళందుడియాళ్ ఎన్న తిగలైదెమ్మ ఆరుడయాల్ ఇట్టడియన్ మిన్ని పొళందె ఎం పిరాట్టి తిరువడిమేల్ పొన్నం చిలంబర్ చిలంబర్ తిరుప్పురవం ఎన్న శిలై కులవి నందమ్మై ఆరుడయాళ్ తన్నిల్ పిరవళా ఎణ్ కోమణ్ అంబర్క్ మున్ని అవళ్ నమక్కు మును శురుకు ఇన్నరుళే ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్ ----- " ఆనందామృతాకర్షిణి-అమృత వర్షిణి హరాది పూజితే శివే భవాని పోట్రి" సలిలం వర్షయ వర్షయ "ఒరురకాల్" పాశురములో తనను తాను ఆవిష్కరించుకొనుటకు అంతర్ముఖమైన చెలి,అమ్మ అనుగ్రహముతో అమృతాకర్షిణియై-ఆనందామృత వృష్టిలో మునిగి పులకించినదై,తాను పొందిన దివ్యానుభవమును తన చెలులకు సైతమును అందింపచేయుతకై బహిర్ముఖమైనట్లున్నది. కనకనేతన చెలులతో చెలులారా! రండి రండి.మనమందరము, ఎన్నపొళయాయ్ ఎన్నగలేని/ఎంచలేని మళయేలో-వర్షములో రెంబావాయ్-మునకలు వేస్తూ/మునిగితేలుదాము అంటూ పిలిచినది. బయట నున్న చెలి బాహ్యములోని బహిరాకాశమును చూస్తూ తన అనుభూతిని వివరిస్తున్నది. బాహ...

PASURAMU-15

తిరు చిట్రంబలం-పాశురం-15 ************************* తిరువెంబావాయ్-15 *************** ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్ శీరోరుకాల్ వాయోంవాళ్ శిత్తం కళికూర నీరొర్కాల్ ఓవా నెడందారై కణ్ పణిప్పన్ పారోర్కాల్ వందనయాల్ విణ్ణోరై తాం పణియాన్ పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు ఆరోరువార్ ఇవ్వణం ఆట్కోళం విత్తకర్తాళ్ వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి ఏరురురువం పూం పునల్ పాయింద్ ఆడేలో రెంబావాయ్ ...... ' పరా భక్త్యా యత్ ప్రాప్య న కించిత్ వాంఛతి- న శోచతి ఆత్మారామోభవతి ************ అంతః బహిః యత్ సర్వం వ్యాప్త పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం. ................................................ తిరుమాణిక్యవాచగరు మనకు ఇప్పటివరకు అందించిన 13 పాశురములలో మనకు అగుపించిన పాత్రలు,పరిస్థితులు-పరిసరములు మానవ శరీర వివిధ అవస్థలను మనలను మనము ఉధ్ధరించుటకు సహాయపడుటకు ు సహకారములుగా నున్న బాహ్య సంకేతములు. కాదారై కుడై యాడ అంటూ కుండలముల ప్రసక్తితో ప్రారంభించిన పాశురములో ఆట-పాట ,పట్టు-విడుపులను చెబుతూ,ఒకదానిని పట్తుకొనవలె నంటేఏ విధ...

paasuram-14

Image
తిరు చిట్రంబలం-పాశురం-14 ***************************** కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ కోదై కురళాడ వండిన్ కులామాడా సీద పునలాడి చిట్రంబలం పాడి వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి ఆది తిరం పాడి అందం ఆమా పాడి పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్ పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్. ....... "నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం." యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో, ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు. కృత యుగములో పాటించబడిన కఠోర నియమములను కొంతవరకు మినహాయించి,త్రేతయుగములలో యజ్ఞ-యాగాదులతో కఠిన నిబధ్ధతతో భగవదనుగ్రహమును పొందిన మహాత్ములగురించి మనకు వివరించబడినది. అదే భగవదనుగ్రహము ద్వాపర యుగమునకు అన్వయించుకుంటే వారు భగవంతుని చెలికానిగా /సఖునిగా భావిస్తూ ఆడుతూ-పాడుతూ,చల్దులారగిస్తూ,ఛలోక్తులను విసురుకుంటూ చరణసేవా సౌభాగ్యమును పొందిరనుటకు ఉదాహరణము మనకు లభించుచున్నవి. కాని కలిపురుషుని ప్రభావ...

PASURAM-14

తిరు చిట్రంబలం-పాశురం-14 ***************************** కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ కోదై కురళాడ వండిన్ కులామాడా సీద పునలాడి చిట్రంబలం పాడి వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి ఆది తిరం పాడి అందం ఆమా పాడి పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్ పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్. ....... నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం. యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో, ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు. కృత యుగములో పాటించబడిన కఠోర నియమములను కొంతవరకు మినహాయించి,త్రేతయుగములలో యజ్ఞ-యాగాదులతో కఠిన నిబధ్ధతతో భగవదనుగ్రహమును పొందిన మహాత్ములగురించి మనకు వివరించబడినది. అదే భగవదనుగ్రహము ద్వాపర యుగమునకు అన్వయించుకుంటే వారు భగవంతుని చెలికానిగా /సఖునిగా భావిస్తూ ఆడుతూ-పాడుతూ,చల్దులారగిస్తూ,ఛలోక్తులను విసురుకుంటూ చరణసేవా సౌభాగ్యమును పొందిరనుటకు ఉదాహరనము మ్నకు లభించుచున్నవి. కాని కలిపురుషుని ప్రభావమేమని చెప్పగలము...

PASURAMU-13

Image
తిరుచిట్రంబలం-పాశురం-13 ********************** పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదార్ అంగం కురుగినత్తార్ పిన్నుం అరవత్తార్ తంగళ్ మనం కళవు వార్వందు సార్ధనినాల్ ఎంగళ్ పిరాట్టియుం ఎం కోన్రుం సోర్నిశెయింగ పొంగు మడువీర్ పుగప్పొందు పాయిందు శంగం శిలంబ శిలంబు కలందార్ప కొంగకళపొంగ కుడైయుం పునల్పొంగాన్ పంగయుం పూం పునల్ పాయిండేలో రెంబావాయ్ ఘనాఘనసుందర పోట్రి ********************* తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో మన మానవనేత్రములు అతిసామాన్యముగా భావించే ప్రకృతి లోని కొలను ,కొలనులోని నీలికలువలు,కెందామరలు,పులుగు జంటలు,పాములు,మొదలగు వానిని కనుక మనము కొంచము లోతుగా పరిశీలిస్తేఅవి అన్నియును మనకు భగవత్స్వరూపమును -సద్గుణములను వర్ణించుచున్న ధన్యజీవులే. భలే భలే అందాలు సృష్టించావు అంటు మనము భగవంతుని కీర్తించవలసినదే. ప్రస్తుత పాశురములో జలరూపముగా స్వామి దర్శనమిస్తున్న మడుగు/పొయిగై , తరులు-గిరులు-విరులు-ఝరులు నిరతము నీ పాద ధ్యానమే- నిరతము నీ పాద గానమే అన్నట్లుగా, స్వామి పాదములను అర్చించుటకు మడుగులోని కార్మలరార్-నీలికలువలు,అందులోను పైంగుమళై-సుకుమారమైన న...

PASURAM-13

తిరుచిట్రంబలం-పాశురం-13 ********************** పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదార్ అంగం కురుగినత్తార్ పిన్నుం అరవత్తార్ తంగళ్ మనం కళౌ వార్వందు సార్ధనినాల్ ఎంగళ్ పిరాట్టియుం ఎం కోన్రుం సోర్నిశెయింగ పొంగు మడువీర్ పుగప్పొందు పాయిందు శంగం శిలంబ శిలంబు కలందార్ప కొంగకళపొంగ కుడైయుం పునల్పొంగాన్ పంగయుం పూం పునల్ పాయిండేలో రెంబావాయ్ ఘనాఘనసుందర పోట్రి ********************* తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో మన మానవనేత్రములు అతిసామాన్యముగా భావించే ప్రకృతి లోని కొలను ,కొలనులోని నీలికలువలు,కెందామరలు,పులుగు జంటలు,పాములు,మొదలగు వానిని కనుక మనము కొంచము లోతుగా పరిశీలితే అవి అన్నియును మనకు భగవ్త్స్వరూపమును-సద్గునములను వర్ణించుచున్న ధన్యజీవులే. భలే భలే అందాలు సృష్టించావు అంటు మనము భగవంతుని కీర్తించవలసినదే. ప్రస్తుత పాశురములో జలరూపముగా స్వామి దర్సనమిస్తున్న మడుగు/పొయిగై , తరులు-గిరులు-విరులు-ఝరులు నిరతము నీ పాద ధ్యానమే- నిరతము నీ పాద గానమే అన్నట్లుగా, స్వామి పాదములను అర్చించుటకు మడుగులోని కార్మలరార్-నీలికలువలు,అందులోను పైంగుమళై-సుకుమారమైన నీలిక...

PASURAM-12

Image
తిరుచిట్రంబలం-పాశురం-12 ************************ ఆర్తా పిరవి తుయిర్కెడ నామార్తాడుం తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం కూత్తం ఇవ్వానం కువలతుం ఎల్లోముం కాత్తు పడైత్తు కరందు విళయాడి వార్తయుం పేశి వలై శిలంబ వారళైగళ్ ఆర్పరవం సెయ్య అణుకుణల్ మేల్ వండార్ప పూత్తిగణుం పొయిగై కుడైదుడై యాన్ పొర్పాదం ఏత్తి ఇరుంచులై నీరాడేలో రెంబావాయ్ ***** ఆర్తా విషణ్ణా శిధిలాస్చ భీతా ఘోరేషుచ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఖః సుఖినో భవంతు భగవన్నామ సంకీర్తనమే భవరోగమును హరింపచేయగల ఔషధము.భవరాశి యనుగడ్డివాములను దహింపచేయగల అగ్నికనము.భవసాగరమును సులభముగా దాటింపగల నావ.భవతారకము. జీవులకు ఆర్తిని కలిగించుచున్న కలతలను పెంచుచున్న కష్టములను కనుక మనము గుర్తించగలిగితే అవి శ్రీ అదిసంకరులు భజగోవిందములో వచించినట్లు, పునరపి జననం-పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే పిరవి-తిరిగి తిరిగి, తుయిర్ కెడ-బాధలలో మునిగి సంసారమనే జలధిలో బంధములనే మొసలిచే పట్తుకొనబడి,దానిని విడిపించుకొనలేక/చేతకాక మనలను...