Posts

BHAVANAAMAATRA SAMTUSHUTAA-PRAKATAYOGINULU

Image
 ప్రకటయోగినులుగా 28 శక్తిదేవతలు కీర్తింపబడుతారు.వీరుండు స్థానమును త్రైలోక్యమోహనచక్రము అని అంటారు.మూడు ఊహా చతురస్త్రాకారాములుగా విభజింపబడినది.ఈ మూడు విభాగములను భూపురములు అంటారు.   మూడవ భూపురములో ప్రాప్తి-సర్వకామ అను రెండు ప్రత్యేకసిధ్ధులతోపాటుగా అణిమ-గరిమ-లఘిమ మొదలగు అష్టసిద్ధులు వెరసి 10 శక్తులు పరిపాలిస్తుంటాయి.   మూలాధారమునకు సంబంధించిన శక్తులు చర్మచక్షువులు గుర్తించగలవు.     రెండవ భూపురములో మహాలక్ష్మి అను ప్రత్యేక స్థితితోపాటుగా బ్రాహ్మీ-మాహేశ్వరి-కౌమారీ-వైష్ణవీ మొదలగు మానసిక స్థితులు కొలువై ఉంటాయి.   సాధకునకు తనయొక్క మూలమును తెలుసుకోవాలనే తపనను కలిగించి అనువైన అన్వేషణ మార్గమును చూపిస్తాయి.   వీరినే అరిషడ్వర్హ సమూహముగాను,సప్తధాతు సమాహారముగాను మరొక కోణములో భావిస్తారు.     మొదటి భూపురములో సంక్షోభిణి,విద్రావిణి,ఆకర్షిణి,వశంకరి మొదలైన ముద్రాశక్తులు సహాయపడి సాధకునిలోని జడత్వమును తొలగించి,చైతన్యవంతుని చేయుటకు తనను తాను తెలుసుకోవటానికి సర్వాశాపరిపూరక చక్రమును పరిచయము చేస్తాయి.   

BHAVANAMATRA SAMTUSHTAA-ATIRAHASYA YOGINULU

Image
   భావనామాత్ర సంతుష్టా-అతిరహస్యయోగినులు  ***************************  సర్వసిద్ధిప్రద చక్రముగా కీర్తింపబడు పాపిట స్థానములో నున్న నాలుగు ఆయుధశక్తులను,అవస్థలను నియంత్రించు మూడు శక్తులను అతిరహస్య యోగినులుగా ప్రస్తుతిస్తారు.ఊహా చతుర్స్రములో దాగిన  త్రికోణములోని   మూడు బిందువులను జాగ్రత్-స్వప్న-సుషుప్తులను సమన్వయ పరచి,సాధకునకు సహాయపడు మహాకామేశ్వరి-మహావజ్రేశ్వరి-మహాభగమాలిని నామములతో స్తుతిస్తారు.త్రికోణ మూడు కోణములలో నున్న బిందువులుగా భావిస్తారు.చతురస్ర నాలుగు బిందువులను చాపిని-బాణిని-పాశిని-అంకుశిని అను నాలుగు శక్తులుగా,వాటి స్థానములను చతురస్ర నాలుగు మూలల బిందువులుగాను భావిస్తారు.  సాధకుని మనసనే ధనువు సంధించే జ్ఞానేంద్రియ బాణములను కళ్ళెములు లేని గుర్రములవలె పరుగెత్తనీయకుండా పాశమనే సక్తిదయతో,అంకుశమనే విచక్షణను కలిగించి,జడత్వమును నిర్మూలించి శుద్ధచైతన్యము దర్శించు పాత్రతను కలిగించును. వీరినే అశ్వారూఢా,సింధురవ్రజా,వారాహి రూపములుగాను భావిస్తారు.ఇవన్నీ  ఆ శక్తుల సంకేత నామములు.సర్వశుభంకరములు.

BHAVANAAMAATRA SAMTUSHTAA-RAHASYA YOGINULU

Image
   భావనామాత్ర సంతుష్టా-రహస్య యోగినులు *******************************  లలాటస్థాన నివాసినులైన వశిని మొదలగు ఎనిమిది సక్తులను రహస్య యోగినులుగా కీర్తిస్తారు.వీరినే వాగ్దేవతలని కూడా సంబోధిస్తారు.సనాతన ధర్మ ప్రకారము వీరిచే శ్రీలలితాసహస్రనామములు ప్రకటింపబడినవని విశ్వసిస్తారు.  వీరిలో వశిని-కామేశ్వరి అను రెండు శక్తులు శీతోష్ణములను సమన్వయపరుస్తు సాధకునికి సహకరిస్తుంటాయి.శబ్ద-స్పర్శలను సైతము నియంత్రిస్తుంటాయి.    మోదినీ విమల అను రెండు శక్తులను సుఖ-దుఃఖ దాయకములగాను భావిస్తారు.  జయిని కామేశ్వరి కౌళిని సత్వరజతమోగుణములను సమన్వయపరిచే శక్తులు.మనస్సును మనసులో జనించే రాగద్వేషములను సర్దుబాటు చస్తూ,మూడు అవస్థలలోను సాధకునికి చైతన్యప్రాప్తిని పొందుటకు సహాయపడుతుంటారు 

BHAVANAAMAATRA SAMTUSHTAA-GUPTATARA YOGINULU

Image
  భావనా మాత్ర సంతుష్టా-గుప్తతర యోగినులు  ********************************  సర్వాశాపరిపూరకచక్రములోని 16 గుప్తయోగినులు పంచేద్రియములను పంచభూతములతో కర్మేంద్రియములను పంచతన్మాత్రలతో అనుసంధానముచేసి ఆత్మసాక్షాత్కారమునకు సిధ్ధముచేస్తుంటే,మరికొంచము ముందుకు సాధకుని సాధనను జరుపుతూ,8 మంది గుప్తతర యోగినులు సర్వసంక్షోభచక్రములో అనంగులై మానసిక పరిపక్వతకై పాటుపడుతుంటారు.ఆకర్షణ శక్తులైన గుప్తయోగినులు ఉపాధిని సిధ్ధము చసిన తరువాత,అనంగ శక్తులు అనగా శరీరమునకు సంబంధములేని ,మనసుతో శరీరమును సైతము నియంత్రించగలిగిన మహిమాన్వితములు.  అనంగ కుసుమా  అనంగమేఖలా  అనంగ మదనా  అనంగ మదనాతురా  అనంగ రేఖా  అనగవేగినీ  అనంగాంకుశా    అను ఈ మానసికశక్తులు మంచిభావములను సాధకుని మనసులో కలుగచేస్తూ,ధర్మబధ్ధ ప్రవర్తనను పెంపొందింప చేస్తాయి.అనంగ వేగినీ కొత్త కొత్త ఆలోచనలకు ప్రవృత్తిగా,దురాలోచనలకు నివృత్తిగా అనంగాంకుసినీ శక్తి సహాయపడుతుంటే,అనంగమాలిని శక్తి తటస్థ భావమును కలిగిస్తూ,అనవసర భావనలకు దూరముగా ఉంచుతుంది.  అనంగదేవతలు సాధకుని అంతరంగములో కుసుమే ఒక సంకల్పమును పుష్పింపచేయుశక్...

BHAAVANAAMAATRA SAMTUSHTAA-GUPTAYOGINULU

Image
   భావనామాత్ర సంతుష్టా-గుప్తయోగినులు  ***************************   త్రైలోక్య మోహన చక్రమును దాటిన తరువాత నున్న రెండవ ఆవరణమును "సర్వాశాపూరక చక్రము"గా కీర్తిస్తారు.ఇక్కడ పదహారు శక్తులు /ఆకర్షణ శక్తులు మనలను మనచుట్టునున్న ప్రకృతితో అనుసంధానమును చేసి సాధకుని ఇంద్రియములను శుభ్రపరుస్తుంటాయి.  కామాకర్షిణి,బుధ్ధ్యాకర్షిణి,శబ్దాకర్షిణి,రసాకర్షిణి,గంధాకర్ష్ణి,రూపాకర్షిణి,స్పర్శాకర్షిణి అను పంచతన్మాత్రలను,వాటికి మూలకారనమైన పంచభూతములను, మనలోని పంచ జ్ఞానేంద్రియ-కర్మేంద్రియములతో సమన్వయ పరచి మనకు సహాయపడుతుంటాయి.  మనకు  గుడ్డితనము,మూగతనము,అవిటితనము మొదలగు ఇంద్రియ రుగ్మతలను నివారించుచు మనలను కాపాడుతుంటాయి.   కామాకర్షిణి ధర్మబధ్ధమైన కోరిక సర్వేజనా సుఖినో భవంతు అనేలా బుధ్ధిని సన్మార్గమువైపు నడిపిస్తూ,ఆత్మతత్త్వమనే అహంకారమును వివరిస్తూ స్వయంప్రకాశమును దర్శింపచేయుటకు సహాయపడుతుంటాయి.   

BHAVANAA MAATRA SAMTUSHUTAA-NIGARBHAYOGINULU

Image
   భావనామాత్ర సంతుష్టా-నిగర్భయోగినులు  ****************************  సర్వరక్షాకరచక్రములో ఉండే 10 అద్భుత శక్తులను "నిగర్భయోగినులు"గా కీర్తిస్తారు.  మనలను గర్భస్థశిశువులుగా ఉన్నప్పటినుంచి మనలను రక్షించుచున్న మహిమాన్వితశక్తులు వీరు.సర్వ ఉపసర్గతోకూడిన వీరిని, 1.సర్జే 2.సర్వశక్తే 3.సర్వైశ్వర్యప్రదాయిని 4.సర్వజ్ఞానమయి 5.సర్వవ్యాధివినాశిని 6.సర్వధారాస్వరూపే 7.సర్వపాపహరే 8.సర్వానందమయీ 9.సర్వరక్షాకరీ 10.సర్వఈప్సితఫలప్రదే    అను దివ్యనామములచే సంకీర్తింపబడతారు వీరు.  వీరు సర్వమునకు ఆధారభూతులు.అంతేకాదు శక్తిమంతులు.శక్తిని ఏవిధముగా ఉపయోగించుకోవాలో తెలియచేసే జ్ఞాన సంపన్నులు.కనుకనే మన కోరికలను తీరుస్తూ,మనకు ఆనందమును అందించగలుగుతున్నారు.అంటే మన కోరికలను ధర్మబధ్ధముగా ఉండేటట్లు విచక్షన అను సంపదను  ప్రసాదిస్తున్నారు.   ఆ సంపద మనలను సర్వవేళలను రక్షిస్తోంది.   శారీరక పరముగా అన్వయించుకుంటే నిగర్భయోగినులు జీర్ణవ్యవస్థను సక్రమముగా పనిచేయిస్తుంటారు.దానికి అవసరమైన పది వాయువులను సమపాళ్ళలో ప్రసరింపచేస్తుంటారు.  అంతర్దశార శక్తులైన వీరు భక్ష్య-భోజ్య-చోష్య-ల...

BHAAVANAAMAATRA SAMTUSHTAA-SAMPADAAYA YOGINULU

Image
   భావనామాత్ర సంతుష్టా-సంప్రదాయ యోగినులు  ********************************  14 మంది సంప్రదాయ యోగినులు హృదయస్థానమైన సర్వసౌభాగ్యప్రద చక్రమునందు విరాజిల్లుతు సాధకుని మార్గమును సుగమము చేస్తుంటారు.వీరు నాడీ మండలమును పరిరక్షించుచుండుటయే కాక భావోద్వేగములను క్రమబధ్ధీకరిస్తు అనుగ్రహిస్తుంటారు.  సంక్షోభిణి,విద్రావిణి,ఆకర్షిణి,ఆహ్లాదిని,సమ్మోహిని,జృంభిణి,స్తంభిని,,రంజనీ,ఉన్మాదిని,సర్వార్థసాధిని,సర్వసంపత్తిపూరిణి,మంత్రమయి,ముఖ్యముగా ద్వంద్వ క్షయంకరి/సర్వద్వంద్వక్షయంకరీ.   నేను అనే దేహము నాలో దాగిని చైతన్యము రెండుగా నున్నవి అన్న భావనను పోగొట్టే పరమకరుణామయి సంప్రదాయయోగినులుగా మనలోని చిత్తభావములకు అదే మనోప్రవృత్తులకు వాటిని తొలగించే నివృత్తులకు ప్రతీకలు.  మన్వస్రం గా కీర్తింపబడే ఈ చక్రమును పదునాలుగు లోక విశేషములుగాను కీర్తిస్తారు.  నాడీమండలపరముగా కనుక సమన్వయించుకుంటే మానవ సరీరములోని 72000 నాడులను చైతన్యవంతముచేసే యోగినులు.  పరదేవతయొక్క జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు,బుధ్ధి,చిత్తము,అహంకారము అను అంతఃకరణములుగాను కీర్తిస్తారు.  ఇక్కడ మనమొక విషయమును ...