Posts

PAAHIMAAM PARAMESVARI-PRANATOSMI SADAAMAHAM.

Image
 పాహిమాం పరమానుగ్రదాయిని పరమేశ్వరి  ******************************  " ధ్యాయేత్ కాళీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీం    చతుర్భుజాం లలజ్జిహ్వం పూర్ణచంద్రనిభాననాం    నీలోత్పలదళ శ్యామాం శత్రుసంఘవిదారిణీం    నరముందం తథాఖడ్గం కమలంచ వరంతథా."  అంటు సుమేథ మహర్షి సూరథ-సమాథులకు ఈ విధముగా చెప్పసాగెను.  " ఏభిఃహతైజగదుపైతి సుఖం తథైతే    కుర్వంతునామ నరకాయ చిరాయ పాపం    సంగ్రామ మృత్యుమధిగమ్య దివం ప్రయాంతు    మత్వేతి సూనమహితాన్ వినిహంసి దేవి"    అసురులందరు పాపములను చేయుచు ఫలితముగా నరకమునకు పోవలసిన వారలే అయినను తల్లి వారిని తన కరుణతో పుణ్యలోకప్రాప్తిని కలిగించుటకా యన్నట్లు,  ఆ రణభూమిలో  బ్రహ్మాణి తన కమందలములోని జలమును చున్నది.రాక్షబలమును/రాక్షస గణములను/గుణములను తగ్గించుచున్నది.మాహేశ్వరి త్రిశూలముతోను,వైష్ణవి చక్రముతోను,కౌమారి శక్తితోను,ఐంద్రి వజ్రాయుధముతోను,తమ విధులను నిర్వర్తించుచుండగా,  ప్రక్షిప్తము-నిక్షిప్తము తన కనుసన్నలైన అంబిక   రక్తబీజుని వెటకారమునకు సమాధానముగా సప్తమాతృకలను నిక్ష...

PAAHIMAAM SIVADUTI-

Image
పాహిమాం శివదూతి-శివంకరీ-శ్రీమత్ సింహాసనేశ్వరీ **************************************  " బాలసూర్య ప్రతీకాశాం బంధుక ప్రసవారుణాం    విధి విష్ణు శివస్తుత్యాం దేవగంధర్వ సేవితాం    రక్తారవింద సంకాశం సర్వాభరణ భూషితాం    "శివదూతీం" నమస్యామి రత్నసింహాసన స్థితాం"    ఉదయభానుని ప్రకాశముతో ఎర్రని అరవింద పుష్పముల ప్రభలుకలిగిన ఆభరణములతో అనవరము బ్రహ్మ-విష్ణు-రుద్రాదులచే ,దేవ-గంధర్వులాదులచే స్తుతింపబడుతు రత్నసింహాసనమున ఆసీనురాలైన శివదూతి మాత మనలను అనుగ్రహించుగాక.  ఇక్కడ రక్తబీజుడు అనురక్తితో తన శరీరమునుండి కారుచు నేలపై బడుచున్న రక్తబిందువులచే అనేకానేక రక్తబీజులను వరప్రభావముతో సృష్టిస్తూ,తమ సైన్యములను పెంపొందించుకుంటు అమ్మను చూస్తూ,హేలనగా మాట్లాడుతున్నాడు.  అదే సమయములో వాని సంస్కరించదలచినదేమో అమ్మ అన్నట్లుగా అమ్మ ముందు శివుడు ప్రత్యక్షమై, "తతః ప్రతివృతాస్తాభిరీశానో దేవశక్తిభిః  హన్యంతాం అసురాః శీఘ్రం మమప్రీత్య... హ చండికాం" ఓ చండికా! నేను సంతసించురీతిగా ఈ రాక్షసులందరిని త్వరగా సంహరింపుము.అని పలుకగానే  అనగానే తల్లి అసలే  "శివా స్వాధీన వ...

PAAHIMAAM RAKTABEEJA NIHAMTRI-RAJARAJESVARI SAILASUTE

Image
 

SAPTAMATRKAA SAMSTHITA-SAILAPUTRI NAMOSTUTE

Image
   పాహిమాం సప్తమాతృకా సంస్థిత-రమ్యకపర్దిని శైలసుతే  ***************************************  "తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై   అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి."    అని శ్రీదేవి స్తుతిమాలలో చెప్పబడినది.   శ్రీదేవిఖడ్గమాలగా ప్రసిద్ధికెక్కిన స్తోత్రములో వీరి ప్రస్తావన వస్తుంది.   "బ్రాహ్మీ-మాహేశ్వరీ-కౌమారీ-వైష్ణవీ-వారాహీ-మాహేంద్రీ-చాముండే-అనునవి పరోక్షముగా బ్రహ్మ-మహేశ్వరుడు-కుమారస్వామి-విష్ణుమూర్తి-వరాహస్వామి-మహేంద్రుడు మొదలగువారి శక్తుల యొక్క స్త్రీరూపములు.  సమరమున  చండ-ముండులు సమసిపోవుట తెలుసుకొని,రెట్టించిన క్రోధముతో శుంభుడు తనదగ్గరనున్న అనేకానేక దైతేయులను-ధౌమ్రులను-కాలకులను-కాలకేయులను దేవిపై దండెత్తుటకు రక్తబీజుని ఆజ్ఞాపించెను. నిజమునకు ఇక్కడ జరుగుచున్న సమరము చంచల మానవస్వభావమునకు-అచంచల దైవత్వమునకు సంకేతముగా చెప్పబడుచున్నది.  అనేకానేక తామసగుణ అవిరామ స్వైరవిహారము ఒకవైపు-ఏకత్వం జగత్యత్ర ద్వితీయం కం? మరొకవైపు.  దానిని గుర్తించలేని తామసమే తల్లిని బంధించుటకు చేయుచున్న నిష్ఫల ప్రయత్నములు.   తన నైజమును మార్చు...

PAHIMAAM CHAMUMDESVARI -RAMYAKAPARFINI SAILASUTE

Image
 పాహిమాం చాముండేశ్వరి-చల్లని తల్లి శైలసుతే  ************************************  జయస్వదేవి చాముండె-జయభూతాపహారిణి  జయసర్వగతేదేవి-కాలరాత్రి నమోస్తుతే  విశ్వమూర్తి యుతేశుద్ధే-విరూపాక్షి త్రిలోచని  భీమరూపే శివే విద్యే-మహామాయె మహోదరె  మనోజయె-మనోదుర్గే-భీమాక్షి క్షుభితక్షయే  మహామారి విచిత్రాంగి-గీతనృత్యప్రియే శుభే  వికరాళిమహాకాళి-కాళికే పాపహారిణి  పాశహస్తే-దందహస్తే-భీమహస్తే భయానకే  చాముండే జ్వాలామాలస్యే-తీక్ష్ణ దంష్ట్రే మహాబలే  అన్న స్తుతిని వింటున్నప్పుడు అప్రయత్నముగా మనోవీధిలో చాముండా దేవి దర్శనమిస్తుంది కరుణతో.  ఇప్పటివరకు మధుకైటభ సంహారము విష్ణువు ద్వారా అమ్మ పరోక్షసక్తిగా చేయించింది.  మహిషాసురుని సమిష్టి శక్తిగా మారి సంహరించింది.    దైవకార్య నిమిత్తము పార్వతి కౌశికి అను శక్తిని తన శరీరమునుండి ప్రకటింపచేసి,కాళిగా తాను హిమాచలమునకు మరలినది.   శుంభ-నిశుంభులను సంహరించుతకు వచ్చిన కౌశికి/అంబిక ,చండముండులకు ముక్తిని ప్రసాదించుతకై "కాళి" అను మరొక శక్తిని తన భృకుటినుండి ప్రభవింపచేసినది.  వారి మాటలు వినిన శుంభ...

paahimaam paramesvari kausiki-Sumbhanishudini sailasutae

Image
పాహిమాం కృపాకరి కౌశికి-రమ్యకపర్దిని శైలసుతే  ***********************************  " ఓం ఘంటా శూల హలాని శంఖ ముసలే చక్రం ధనుః సాయకం    హస్తాబ్జైః దధతీం ఘనాంత విలసత్ శీతాంశు తుల్యప్రభాం   గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా   పూర్వామత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్ధినీం."   ఒకసారి గంగాతీరమునందు సకలదేవతలు శరణార్థులై, " నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః   నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం"     అని ప్రార్థించుచుండగా, " భావనామాత్ర సంతుష్ట హృదయ" యైన భవాని గంగా జలములలో స్నానమాచరించుటకు అటుగా పోవుచు,వారిని చూసి,  మీరు ఎవెరిగురించి స్తోత్రములు చేయుచున్నారని అడిగెను.   వారు సమాధానమును ఇవ్వలేని దీనస్థితిలోనుండుట గమనించి,  పార్వతి శరీర కోశమునుండి ఒక దివ్యసుందర శక్తి ప్రకటింపబడి,తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానముగా,   వీరందరు శుంభ-నిశుంభులచే రాజ్యమునుండి తరుమవేయబడి,కనీసము హవిస్సులను సైతము పొందలేక జగన్మాతవైన నీ పదకమలముల శరణు కోరుతున్నారనెను.   ఇది సమరమునకు ఒకవైపునున్న ప్రకటనము.   మరొకవైపు?  ఎవరా శుంభ-నిశ...

PAAHIMAAM MAHISHAASURAMARDINI-RAMYAKAPARDINI-02

Image
  "శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి  చిదగ్నికుండ సంభూతా-దేవకార్య  సము సముద్యతా"  అని శ్రీలలితాసహస్ర రహస్యనామము నుతించుచున్నది.   అమ్మ చిత్ అగ్ని కుండమునుండి ఉదయిస్తున్న అసంఖ్యేయ సూర్య కాంతుల ప్రకాశముతో ఆవిర్భవించినది.శివుని త్రినయనమునుండి ప్రజ్వలింపచేసిన యజ్ఞకుండమునుండి అమ్మ అత్యంత ప్రకాశవంతముగా ఆవిర్భవించినది.సర్వదేవతా శక్తులకు  తన స్పర్శచే ,,సామర్థ్యమును ప్రసాదించినది.ముచ్చటగా తిరిగి వారిచ్చిన శక్తులను లాంఛనముగా తాను స్వీకరించినది.  అంతా అమ్మ లీలా వైభవము  ఇక్కడ అసురీశక్తులు-అద్వితీయముతో పోరాడుటకుసన్నిద్ధమగుచున్నవి.  " నాదం తనుమనిశం శంకరం"-శుభప్రదమైన ఓంకారము ఒక పక్కన "ఓంకార పంజరశుకీ "గా దర్శనమిస్తుంటే,  ప్రత్యర్థిగా   "నాదం తమసనిశం భీకరం" అంటూ విచక్షణతను మరచిన హుంకారము,    హుంకారము-ఓంకారముతో చేయు యుద్ధము,    అంతేకాదు  కన్నుపొడుచుకున్న కానరాని చీకటి-ఉదయిస్తున్న అనంత సూర్య బింబములతో చేయబోవుతున్న సమరము అమరమే కదా    ." మహిషాసుర నిర్ణాశి  భక్తానాం సుఖదే నమః  రూపం ద...