Posts

NA RUDRO RUDRAMARCHAYAET-02( SIVAANAMDALAHARI)

Image
 గళంతీ శంభో త్వత్-చరిత-సరితః కిల్బిష -రజో దళంతీ ధీకుల్యా- సరణిషు పతంతీ విజయతామ్ దిశంతీ సంసార-భ్రమణ-పరితాప-ఉపశమనం వసంతీ మత్-చేతో-హృదభువి శివానంద-లహరీ   మొదటి శ్లోకములో పార్వతీపరమేశ్వరులు అస్తోక సమస్తభువనములకు శుభములందించువారిగా స్తుతిస్తూ,మనకు వారి సర్వవ్యాపకత్వమును తెలియచేశారు.    కాని మనము ఉన్న (అందరు కాదు) ఉన్న ప్రస్తుత పరిస్థిని గ్రహించి వారు ఎక్కడున్నారో తెలియక కాలమును వృధా చేస్తామన్న తలపుతో, వారుండే స్థానమును/అదియును మనకు అత్యంత సమీపముగా /మనము చేరి గుర్తించదగినదానిని సూచిస్తున్నారు.    "విజయతాం దిశంతీం"  మనకు విజయమార్గమును చూపించుటకై,వారు చేయు ప్రయాణము,తొలగించు అడ్దంకులను,కలిగించు శుభములను వివరిస్తున్నారు నాలుగు రమ్యమైన క్రియాపదములతో.  1.గలంతీ-ప్రవహిస్తూ,  2.దళంతీ-ప్రక్షాళిస్తూ  3.పశంతీ-పడగొట్టివేస్తూ  4.దిశంతీ-దిశను చూపిస్తూ    మనలను అనవరతము కాపాడుటకు ఇక్కడే మన చేతో హ్రదము-చైతన్యముతో నుండిన  హ్రదము-సరసు నందు కొలువై యున్నారు.  దీనినే రుద్రము, " నమః పార్యాయచా-వార్యాయచ"  పారము అనగా నదికి(సంసారమనే) అవ...

NARUDRO RUDRAMARCHAYAET-01(SIVAANAMDALAHARI)1

Image
కలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః- ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే | శివాభ్యాం-అస్తోక-త్రిభువన శివాభ్యాం హృది పునర్- భవాభ్యాం ఆనంద స్ఫుర-దనుభవాభ్యాం నతిరియమ్ ‖ ******  ఇయం-ఏ అద్భుతశక్తి,బహుముఖములుగా ప్రకటిత మగుచు,ప్రకాశించుచున్నదో దానికి నేను నమస్కరించుచున్నాను అంటున్నారు శ్రీ జగద్గురువులు.  ఆ శక్తియే, 1.శివాభ్యాం-శివము/శుభములను-సంతోషము అనుగ్రహించుటకు,తద్వారా 2.స్పురత్-తలచినంత మాత్రముననే 3.ఆనంద అనుభవాభ్యాం-మనకు ఆనందానుభూతిని కలుగచేయుటకు,   ఇక్కడ మనమొక విషయమును గమనించాలి. ఆనందము అన్న పదము సంతోషమునకన్న భిన్నమా లేక సమానమా?  సంతోషము లౌకికము.అది మనలో జనించిన కోరిక తీరునపుడు జనిస్తుంది.క్రమముగా ఆ వస్తువుపైగాని.కోరికపై గాని మోజు తీరన వెంటనే అది తెచ్చిన సంతోషము కూడా మసకబారి /కనుమరుగైపోతుంది.తాత్కాలికమైన సంతోషముకన్న ఆనందము విభిన్నముగా మనము భావిస్తే కాలాతీత,గుణాతీత,దేశాతీత మనలోని మనను తెలుసుకొనినప్పుడు కలిగే నిర్వికార నిశ్చల నిర్గుణ నిస్తులతత్త్వము ఆనందము.  ఏ మహద్శక్తి అనిర్వచనీయానందమును అనుగ్రహించకలదో దాని, స్వరూపము-శివాభ్యాం స్వభావము-శివాభ్యాం సాక్షాత్కా...

NA RUDRO RUDRAMARCHAYAET-INTRODUCTION. (SIVAANAMDALAHARI)

Image
పరమపావనమైన పార్వతీపరమేశ్వర తత్త్వమును ప్రసాదించిన,శ్రీశైలక్షేత్రమునజగద్గురువులైన శ్రీ శంకరభగవత్పాదుల చే ప్రస్తావించబడిన "శివానంద-లహరి స్తోత్రమును"  పరిచయము చేసుకునే ప్రయత్నము ఇది.అనందము అదియును అనవరతము.దేనిగురించి తెలుసుకునే ప్రయత్నము లో సంభవించుచున్నది,దేని అనుగ్రహముగా కటాక్షించుచున్నది అన్న సందేహమునకు "పరస్పర తపః ఫలాభ్యాం" అంటున్నారు ఆదిశంకరులు.  తపము వలన లభించిన ఫలము ఎంతవరకు వ్యాపిస్తున్నది అనుకుంటే "అస్తోకాం" అంటున్నారు.  నిశ్శేషముగా/సంపూర్ణముగా సమస్తమును అనుగ్రహిస్తుంది అంటున్నారు.   సంపూర్ణముగా మాత్రమే కాదు  పునః భవాబ్యాం-అంటున్నారు  ఒక్కసారి మాత్రమే కాదు పునః పునః తిరిగి/తిరిగి నిరంతరము అనుగ్రహిస్తూనే ఉంటుందట.  ఆ కరుణనే మనము ప్రేమతో శివాభ్యాం అంటున్నాము.  అంటే శివ-పార్వతి రూపములో నున్న ప్రకృతి-పురుషులు.   వారి స్మరనము వలన మనకు "ఆనంద స్పురణము అనుభవాభ్యాం" ఆనందము అనుభవములోనికి వస్తుంది.మనము దానిని ఆస్వాదిస్తూనే ఉంటామట.  ఇంకెందుకు ఆలస్యము?  కొంతైన ఆవిష్కరించుకోవటానికి వారి అనుగ్రహముతో.    సర్వం శివాభ్యాం  .పాదార్ప...

PAAHIMAAM SREE RAAJARAJESVARI-KRPAAKARI SANKARI.

Image
  పాహిమాం-పాహిమాం-పాహి పాహి పరమేశ్వరి  *********************************  " అజితానామ పాశ్వేతు-దక్షిణేచ అపరాజితా    శిఖామాద్యోజనీ రక్షత్-ఉమాముద్నిర్ వ్యవస్థితా    మాలాధరి లలాటేచ-భృవౌ రక్షతు యశస్విని    త్రినేత్రంచ భృవోర్మధ్యే-యమఘంటాచ నాసికే    శంఖిణి చక్షుసోర్మధ్యే-శ్రోత్రయోద్వారవాసిని    కపోలో కాళికా రక్షేత్-కర్ణమూలేతు శాంకరి    నాసికాయాం సుగంధాచ-ఉత్తరోష్ఠోచ చండికాం    అధరేచ అమృతకళా-జిహ్వాయాంచ సరస్వతీ    దంతాం రక్షతు కౌమారీ-కంఠదేశేతు చండికా     ఘంటికా(కంఠము) చిత్రఘంటాచ-మహామాయంచ తాలుకే    కామాక్షీ చుబుకం రక్షేత్-వాచం మే సర్వ మ0గళా అంటూ   బ్రహ్మప్రోక్త దేవీకవచమును భక్తితో పఠిస్తున్న దేవతలను చూసి,పరమేశ్వరి ప్రసన్నయై ఇట్లనెను.   "రక్షాంసి యత్రోగ్ర విషాశ్చ నాగా    యత్రారయో దస్యు బలాని యత్రః"   ఎక్కడెక్కడ రక్కసులు,,విషసర్పములు,శత్రువులు,దొంగలుజనించెదరో,దావానలము జనించునో అప్పుడు నేను కొత్తవతారములతో ప్రకటితమయి కాపాడెదను.  అంతేకాదు.శ్రద్ధతో వినుడు. ...

PAAHIMAAM SUMBHA-NISUMBHA SUDINI-PARAMESVARI

Image
 పాహిమాం శుంభ-నిశుంభదైత్య దమని-పరమేశ్వరి. ************************************   దుర్గాం!  వందే దుర్గతి నాశిని  అనర్గళానందాయినీ జననీ  భర్గాది దేవ వరదాం అభయదాం  సర్గాదికృత్యమోదాం నిర్మదాం  స్వర్గాది సౌఖ్యప్రదాం శుభదాం  అపవార్గాది ఫలదాం భవపారదాం: దుర్గాం:    కరవాల హస్తాం కరుణాలవాలాం    వరశరన్నవరాత్రమహితాం అమలాం    పరమహంస్యాదర్చితాం నిష్కళంకాం     పరమాద్వైత శీలాం "దుర్గాం వందే దుర్గతి నాశిని."  అమ్మవారిని స్తుతిస్తూ,  కరవాల హస్తాం-కరుణాలయాం అని రెండు విభిన్న తత్త్వములను వినిపిస్తున్నారు.అమ్మవారు మన చర్మచక్షువులకు క్రవాల హస్తము తో మాత్రమే కనిపిస్తున్నది .( మాయపొర తొలగనంతవరకు.)  శుంభ-నిశుంభులు అమ్మను పొందుటకై రణమొనరించుచున్నారు.ఇది బాహ్యము.   నిజమే.వారికి కావలిసినది అమ్మరూపము కాదు.అమ్మ దయాంతరంగము.జీవన్ముక్తి.  అమ్మ కథలను చదువుచున్నప్పుడు మొదటి కథలో మథుకైటభులను సంహరించుతకు  తాను ఆకాసమునుండి వెలువడి హరి యోగనిద్రను వీడునట్లు చేసినది.మన చివరి కథయైన శుంభనిశుంభులను సంస్కరించుటకు ...

PAAHIMAAM PARAMESVARI-PRANATOSMI SADAAMAHAM.

Image
 పాహిమాం పరమానుగ్రదాయిని పరమేశ్వరి  ******************************  " ధ్యాయేత్ కాళీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీం    చతుర్భుజాం లలజ్జిహ్వం పూర్ణచంద్రనిభాననాం    నీలోత్పలదళ శ్యామాం శత్రుసంఘవిదారిణీం    నరముందం తథాఖడ్గం కమలంచ వరంతథా."  అంటు సుమేథ మహర్షి సూరథ-సమాథులకు ఈ విధముగా చెప్పసాగెను.  " ఏభిఃహతైజగదుపైతి సుఖం తథైతే    కుర్వంతునామ నరకాయ చిరాయ పాపం    సంగ్రామ మృత్యుమధిగమ్య దివం ప్రయాంతు    మత్వేతి సూనమహితాన్ వినిహంసి దేవి"    అసురులందరు పాపములను చేయుచు ఫలితముగా నరకమునకు పోవలసిన వారలే అయినను తల్లి వారిని తన కరుణతో పుణ్యలోకప్రాప్తిని కలిగించుటకా యన్నట్లు,  ఆ రణభూమిలో  బ్రహ్మాణి తన కమందలములోని జలమును చున్నది.రాక్షబలమును/రాక్షస గణములను/గుణములను తగ్గించుచున్నది.మాహేశ్వరి త్రిశూలముతోను,వైష్ణవి చక్రముతోను,కౌమారి శక్తితోను,ఐంద్రి వజ్రాయుధముతోను,తమ విధులను నిర్వర్తించుచుండగా,  ప్రక్షిప్తము-నిక్షిప్తము తన కనుసన్నలైన అంబిక   రక్తబీజుని వెటకారమునకు సమాధానముగా సప్తమాతృకలను నిక్ష...

PAAHIMAAM SIVADUTI-

Image
పాహిమాం శివదూతి-శివంకరీ-శ్రీమత్ సింహాసనేశ్వరీ **************************************  " బాలసూర్య ప్రతీకాశాం బంధుక ప్రసవారుణాం    విధి విష్ణు శివస్తుత్యాం దేవగంధర్వ సేవితాం    రక్తారవింద సంకాశం సర్వాభరణ భూషితాం    "శివదూతీం" నమస్యామి రత్నసింహాసన స్థితాం"    ఉదయభానుని ప్రకాశముతో ఎర్రని అరవింద పుష్పముల ప్రభలుకలిగిన ఆభరణములతో అనవరము బ్రహ్మ-విష్ణు-రుద్రాదులచే ,దేవ-గంధర్వులాదులచే స్తుతింపబడుతు రత్నసింహాసనమున ఆసీనురాలైన శివదూతి మాత మనలను అనుగ్రహించుగాక.  ఇక్కడ రక్తబీజుడు అనురక్తితో తన శరీరమునుండి కారుచు నేలపై బడుచున్న రక్తబిందువులచే అనేకానేక రక్తబీజులను వరప్రభావముతో సృష్టిస్తూ,తమ సైన్యములను పెంపొందించుకుంటు అమ్మను చూస్తూ,హేలనగా మాట్లాడుతున్నాడు.  అదే సమయములో వాని సంస్కరించదలచినదేమో అమ్మ అన్నట్లుగా అమ్మ ముందు శివుడు ప్రత్యక్షమై, "తతః ప్రతివృతాస్తాభిరీశానో దేవశక్తిభిః  హన్యంతాం అసురాః శీఘ్రం మమప్రీత్య... హ చండికాం" ఓ చండికా! నేను సంతసించురీతిగా ఈ రాక్షసులందరిని త్వరగా సంహరింపుము.అని పలుకగానే  అనగానే తల్లి అసలే  "శివా స్వాధీన వ...