Posts

NA RUDRO RUDRAMARCHAYAET-05 (SIVAANAMDALAHARI)

Image
 స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే ష్చతురః కథం రాజ్నాం ప్రీతి ర్భవతి మయి కో2హం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో  సర్వస్య శరణాగతిని సూచిస్తున్నారు ఆదిశంకరులు ప్రస్తుత శ్లోకములో.  చతుషష్ట్యుపచారాఢ్యా-చతుషష్టి కళామయి  అని అమ్మవారిని సంకీర్తిస్తున్నది లలితాసహస్రనామము.  షోడశ కళానిధికి షోడశోపచారములు అని సంకీర్తించి తరించాడు అన్నమయ్య.  నాల్గవ శ్లోకములో ఆదిశంకరులు విబుధా క్షుద్రఫలదా న మనయె-అని సాకారులైన విబుధులు/దేవతలు అనంతముగా నున్నప్పటికిని,నేను కలలోనైన వారిని సేవించి,వారనుగ్రహమునకై పాకులాడను అన్నారు.  ఆ విషయమును సమర్థిస్తూ దానికి కారణము తన పశుత్వమే అంటున్నారు.  ఓ సర్జ-సమస్తము నీవైన శంభో  నను-పశుం మ ' పశ్యతీతి పశుః' చూడగలుగునది పశువు.కాని చూసినదాని మర్మమును మనసులో ముద్రించుకొనలేనిది.చూసినదృశ్యమును అర్థము చేసుకొనలేని అసమర్థ ను రక్షించగలిగినది కేవలము పశుపతి మాత్రమే.  ఎందుకంటే స్వస్వరూపమును అర్థముచేసుకొనలేని,సకల్శాస్త్ర పరిజ్ఞానముతో వాటిని అనగా శృతి-స్మృతి-పురాణ-సకల కళల సారమును సమన్వ...

NA RUDRO RUDRAMARCHAYAET-04(SIVAANAMDALAHARI)

Image
  సహస్రం వర్తంతే జగతి విబుధాః క్శుద్ర-ఫలదా న మన్యే స్వప్నే వా తద్-అనుసరణం తత్-కృత-ఫలం హరి-బ్రహ్మాదీనాం-అపి నికట-భాజాం-అసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ-భజనం    మూడవ శ్లోకములో వేదములను పరతత్త్వమును తెలుసుకొనుటకు సాధకములుగా చూపించిన శ్రీ శంకరులు ప్రస్తుత శ్లోకములో జీవి వస్థలయొక్క ప్రభావమును,మనము కోరుకోవలసిన/చేరుకొవలసిన తురీయమును గురించి,న మన్యే స్వప్నేవా అంటూ స్వప్నావస్థలో సైతము కోరుకోను/కలలోనైనా ఊహించను ప్రభో అని మనలను చైతన్యవంతులను చేస్తున్నారు.  ఎందుకంటే మనకు కావలిసినది అతి దగ్గరగా ఉండి సేవిస్తున్న హరి,బ్రహ్మ,ఇంద్రాదులకు సైతము సులభము కానిది.  వారికి లభ్యము కాని తురీయస్థితి కేవలము నీచే మాత్రమే పొందగలిగిన దానిని అనుగ్రహించగలవారెవరు కలరు?   ఒకవేళ బుధులు అనుగ్రహించదలచినను అవి శాశ్వతానందమునీయగల సామర్థ్యమును కలిగియుండలేవు.  కనుక విభో నేను కోరుకునేది నీ పాదపద్మ నిత్య సంసేవనము.దానికి నన్ను నేనెట్లు మలచుకోవలెనో తెలియచేయుము కరుణతో అని ప్రార్థిస్తున్నారు.  స్వప్నావస్థలోనైనా కోరుకోను వారిని(విబుధులను/దేవతలను) అదియును అనేకానేకములుగా నున్న వారిని అన్నద...

NA RUDRO RUDRAMARCHAYAET-03 (sIVAANAMDALAHARI)

Image
 త్రయీ-వేద్యం హృద్యం త్రి-పుర-హరం ఆద్యం త్రి-నయనం జటా-భారోదారం చలత్-ఉరగ-హారం మృగ ధరమ్ మహా-దేవం దేవం మయి సదయ-భావం పశు-పతిం చిత్-ఆలంబం సాంబం శివమ్-అతి-విడంబం హృది భజే 3  మూడవ శ్లోకములో ఆదిశంకరులు వారి నివాసము మన హృదయస్థానము అని తెలియచేసి,దానిని గుర్తించుటకు కావలిసిన త్రినేత్రము/జ్ఞాన నేత్రము కేవలము త్రయీవేద్యం అని సులభమార్గమును అందిస్తున్నారు.నీ చర్మచక్షువులు కానిలేని ఆ, 1.చిత్-ఆలంబం-తేజో స్తంభము-అరుణాచలేశ్వరుడు 2.త్రిపురహరం-త్రిగుణములను అసురులను మట్టుబెట్టి తురీయస్థితికి చేర్చగలవానిని 3.జటభార ఉదారం-ఉదారతతో తన జటాభారములో గంగను బంధించి లోకహితము చేసినవానిని 4.చలత్ ఉరగహారం-భయకంపితమైన(వాసుకిని) తన మెడలో ధరించినవానిని,  సంసారవిషసర్పములను చూచినను నిశ్చలత్వమును కలిగియుండు ధైర్యమును ప్రసాదించువానిని 5.మృగధరం-అని క్షణము/అశాశ్వతమైన ప్రాణరక్షణకు/ఉపాధిని రక్షించుకొనుటకు పరుగులు తీయు జీవులకు నిశ్చలత్వమును తన రక్షణలో అనుగ్రహించువానికి  ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటిని అలంకారముగా భావించి మోసపోకుసుమా.ఇవన్నియు మన చంచలస్వభావాలే సుమా.  మనకు కనువిప్పు కలిగించుటకు మాత్రమే కనువిందుగా కనిపి...

NA RUDRO RUDRAMARCHAYAET-02( SIVAANAMDALAHARI)

Image
 గళంతీ శంభో త్వత్-చరిత-సరితః కిల్బిష -రజో దళంతీ ధీకుల్యా- సరణిషు పతంతీ విజయతామ్ దిశంతీ సంసార-భ్రమణ-పరితాప-ఉపశమనం వసంతీ మత్-చేతో-హృదభువి శివానంద-లహరీ   మొదటి శ్లోకములో పార్వతీపరమేశ్వరులు అస్తోక సమస్తభువనములకు శుభములందించువారిగా స్తుతిస్తూ,మనకు వారి సర్వవ్యాపకత్వమును తెలియచేశారు.    కాని మనము ఉన్న (అందరు కాదు) ఉన్న ప్రస్తుత పరిస్థిని గ్రహించి వారు ఎక్కడున్నారో తెలియక కాలమును వృధా చేస్తామన్న తలపుతో, వారుండే స్థానమును/అదియును మనకు అత్యంత సమీపముగా /మనము చేరి గుర్తించదగినదానిని సూచిస్తున్నారు.    "విజయతాం దిశంతీం"  మనకు విజయమార్గమును చూపించుటకై,వారు చేయు ప్రయాణము,తొలగించు అడ్దంకులను,కలిగించు శుభములను వివరిస్తున్నారు నాలుగు రమ్యమైన క్రియాపదములతో.  1.గలంతీ-ప్రవహిస్తూ,  2.దళంతీ-ప్రక్షాళిస్తూ  3.పశంతీ-పడగొట్టివేస్తూ  4.దిశంతీ-దిశను చూపిస్తూ    మనలను అనవరతము కాపాడుటకు ఇక్కడే మన చేతో హ్రదము-చైతన్యముతో నుండిన  హ్రదము-సరసు నందు కొలువై యున్నారు.  దీనినే రుద్రము, " నమః పార్యాయచా-వార్యాయచ"  పారము అనగా నదికి(సంసారమనే) అవ...

NARUDRO RUDRAMARCHAYAET-01(SIVAANAMDALAHARI)1

Image
కలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః- ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే | శివాభ్యాం-అస్తోక-త్రిభువన శివాభ్యాం హృది పునర్- భవాభ్యాం ఆనంద స్ఫుర-దనుభవాభ్యాం నతిరియమ్ ‖ ******  ఇయం-ఏ అద్భుతశక్తి,బహుముఖములుగా ప్రకటిత మగుచు,ప్రకాశించుచున్నదో దానికి నేను నమస్కరించుచున్నాను అంటున్నారు శ్రీ జగద్గురువులు.  ఆ శక్తియే, 1.శివాభ్యాం-శివము/శుభములను-సంతోషము అనుగ్రహించుటకు,తద్వారా 2.స్పురత్-తలచినంత మాత్రముననే 3.ఆనంద అనుభవాభ్యాం-మనకు ఆనందానుభూతిని కలుగచేయుటకు,   ఇక్కడ మనమొక విషయమును గమనించాలి. ఆనందము అన్న పదము సంతోషమునకన్న భిన్నమా లేక సమానమా?  సంతోషము లౌకికము.అది మనలో జనించిన కోరిక తీరునపుడు జనిస్తుంది.క్రమముగా ఆ వస్తువుపైగాని.కోరికపై గాని మోజు తీరన వెంటనే అది తెచ్చిన సంతోషము కూడా మసకబారి /కనుమరుగైపోతుంది.తాత్కాలికమైన సంతోషముకన్న ఆనందము విభిన్నముగా మనము భావిస్తే కాలాతీత,గుణాతీత,దేశాతీత మనలోని మనను తెలుసుకొనినప్పుడు కలిగే నిర్వికార నిశ్చల నిర్గుణ నిస్తులతత్త్వము ఆనందము.  ఏ మహద్శక్తి అనిర్వచనీయానందమును అనుగ్రహించకలదో దాని, స్వరూపము-శివాభ్యాం స్వభావము-శివాభ్యాం సాక్షాత్కా...

NA RUDRO RUDRAMARCHAYAET-INTRODUCTION. (SIVAANAMDALAHARI)

Image
పరమపావనమైన పార్వతీపరమేశ్వర తత్త్వమును ప్రసాదించిన,శ్రీశైలక్షేత్రమునజగద్గురువులైన శ్రీ శంకరభగవత్పాదుల చే ప్రస్తావించబడిన "శివానంద-లహరి స్తోత్రమును"  పరిచయము చేసుకునే ప్రయత్నము ఇది.అనందము అదియును అనవరతము.దేనిగురించి తెలుసుకునే ప్రయత్నము లో సంభవించుచున్నది,దేని అనుగ్రహముగా కటాక్షించుచున్నది అన్న సందేహమునకు "పరస్పర తపః ఫలాభ్యాం" అంటున్నారు ఆదిశంకరులు.  తపము వలన లభించిన ఫలము ఎంతవరకు వ్యాపిస్తున్నది అనుకుంటే "అస్తోకాం" అంటున్నారు.  నిశ్శేషముగా/సంపూర్ణముగా సమస్తమును అనుగ్రహిస్తుంది అంటున్నారు.   సంపూర్ణముగా మాత్రమే కాదు  పునః భవాబ్యాం-అంటున్నారు  ఒక్కసారి మాత్రమే కాదు పునః పునః తిరిగి/తిరిగి నిరంతరము అనుగ్రహిస్తూనే ఉంటుందట.  ఆ కరుణనే మనము ప్రేమతో శివాభ్యాం అంటున్నాము.  అంటే శివ-పార్వతి రూపములో నున్న ప్రకృతి-పురుషులు.   వారి స్మరనము వలన మనకు "ఆనంద స్పురణము అనుభవాభ్యాం" ఆనందము అనుభవములోనికి వస్తుంది.మనము దానిని ఆస్వాదిస్తూనే ఉంటామట.  ఇంకెందుకు ఆలస్యము?  కొంతైన ఆవిష్కరించుకోవటానికి వారి అనుగ్రహముతో.    సర్వం శివాభ్యాం  .పాదార్ప...

PAAHIMAAM SREE RAAJARAJESVARI-KRPAAKARI SANKARI.

Image
  పాహిమాం-పాహిమాం-పాహి పాహి పరమేశ్వరి  *********************************  " అజితానామ పాశ్వేతు-దక్షిణేచ అపరాజితా    శిఖామాద్యోజనీ రక్షత్-ఉమాముద్నిర్ వ్యవస్థితా    మాలాధరి లలాటేచ-భృవౌ రక్షతు యశస్విని    త్రినేత్రంచ భృవోర్మధ్యే-యమఘంటాచ నాసికే    శంఖిణి చక్షుసోర్మధ్యే-శ్రోత్రయోద్వారవాసిని    కపోలో కాళికా రక్షేత్-కర్ణమూలేతు శాంకరి    నాసికాయాం సుగంధాచ-ఉత్తరోష్ఠోచ చండికాం    అధరేచ అమృతకళా-జిహ్వాయాంచ సరస్వతీ    దంతాం రక్షతు కౌమారీ-కంఠదేశేతు చండికా     ఘంటికా(కంఠము) చిత్రఘంటాచ-మహామాయంచ తాలుకే    కామాక్షీ చుబుకం రక్షేత్-వాచం మే సర్వ మ0గళా అంటూ   బ్రహ్మప్రోక్త దేవీకవచమును భక్తితో పఠిస్తున్న దేవతలను చూసి,పరమేశ్వరి ప్రసన్నయై ఇట్లనెను.   "రక్షాంసి యత్రోగ్ర విషాశ్చ నాగా    యత్రారయో దస్యు బలాని యత్రః"   ఎక్కడెక్కడ రక్కసులు,,విషసర్పములు,శత్రువులు,దొంగలుజనించెదరో,దావానలము జనించునో అప్పుడు నేను కొత్తవతారములతో ప్రకటితమయి కాపాడెదను.  అంతేకాదు.శ్రద్ధతో వినుడు. ...